గింజలు మీ రోజువారీ వంటకాలకు కరకరమనే రుచిని జోడించడానికి ఉత్తమమైన వాటిలో ఒకటి. పోషకత్వం మాత్రమే కాకుండా, అవి వైద్యం మరియు ఆరోగ్య మెరుగుదలలో సహాయపడే అధిక జీవక్రియ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి. మరియు ఆక్రోటులందు వైవిధ్యం ఉండదు. మెదడు మరియు గుండె కోసం ఆక్రోటు యొక్క ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి బాగా తెలుసు. కానీ ఈ గింజలు మీకు ఆరోగ్యాన్ని అందించడానికి వివిధ విదానాలో ఉపయోగపడతాయి.
అవి ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు అసంతృప్త కొవ్వుల ఒక మంచి సోర్స్‌ని అందిస్తాయి, ఇది మీ ఆహారంలో ఆరోగ్యవంతమైన అదనాన్ని చేర్చుటలో ఒకటిగా పని చేస్తుంది. ఇది ఆహారం, ఔషధం, నివాసం, రంగు మరియు దీపం చమురు వంటివి తయారీలో ఉపయోగించబడతాయి. ఆక్రోటులు పచ్చి వాటిని లేదా వేయించిన వాటిని తినవచ్చు మరియు వీటిని ఊరగాయలు లేదా ఆక్రోటు వెన్న తయారీలో ఉపయోగిస్తారు. ఆక్ర్తోటులను బ్రౌనీస్, కేకులు, పై, ఐస్ క్ర్రీమ్, టాపింగ్స్ మరియు కొన్ని వంటలలో గ్యార్నిష్ చేయుటకు కూడా పేరొందినవి. అక్రోట్లను కలిగి ఉండే మరొక విధానం ఆక్రోటు పాలను తయారు చేయడం, ఇది స్మూతీస్ కోసం ఒక క్రీమ్ బేస్‌గా కూడా ఉపయోగించబడుతుంది.
ఆక్రోటు చెట్లు క్రీ.శ. 700 బి.సి. నాటి నుండి ఉన్నట్లు నమ్ముతారు. ఆక్రోటులు 4వ శతాబ్దంలో, ప్రాచీన రోమన్లు అనేక యూరోపియన్ దేశాలకు పరిచయం చేయబడ్డాయి, అయితే అక్కడ ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉన్నాయి. నేడు వాణిజ్యపరంగా మనం ఉపయోగించే ఆక్రోటులు భారతదేశం మరియు కాస్పియన్ సముద్రం చుట్టూ ప్రాంతాలకు చెందినవి. ఆంగ్ల ఆక్రోటు అనేవి ప్రపంచ వ్యాప్తంగా వర్తకం నిర్వహించిన ఆంగ్ల వర్తకులచే పేరు పెట్టబడినవి. ఉత్తర అమెరికాకు చెందిన ప్రత్యేకమైన మరొక రకపు ఆక్ర్తోటు, అది నల్ల ఆక్రోటు అని పిలువబడుతుంది. ఆక్రోట్లు ఇప్పుడు చైనా, ఇరాన్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కాలిఫోర్నియా మరియు అరిజోనాలో సాగు చేయబడుచున్నాయి.
మీకు తెలుసా?
ఇతర గింజల మాదిరిగా కాకుండా అక్రోట్లు నిజంగా గింజలు కావు, కాని ఇవి గుండ్రంగా, ఒకే గింజ కలిగి ఎలాంటి పెంకు లేని మెత్తనివిగా ఉంటాయి, వీటిని ఆక్రోటు చెట్టు నుండి పొందడం జరుగుతుంది. మనకు తెలిసిన అక్రోట్లను వాస్తవానికి రెండు భాగాలుగా వేరుచేయబడిన ఆక్రోటు పండు నుండి విత్తనాలను పొందవచ్చు.
ఆక్రోటుల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- బొటానికల్ పేరు: జుగ్లన్స్ రెజియా (ఇంగ్లీష్ ఆక్రోటు)
- కుటుంబము: జుగ్లండేషియా.
- సాధారణ పేరు: వాల్నట్, అక్రోట్
- వాడిన భాగాలు: ఆక్రోటు యొక్క కెర్నల్ ఎక్కువగా వాడబడుతుంది. అయినప్పటికీ, షెల్ మరియు ఆకులు కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: ఒకప్పుడు అక్రోట్లు భారతదేశం మరియు ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు చెందినప్పటికీ, అవి ఇప్పుడు చైనా, ఇరాన్, టర్కీ, మెక్సికో, ఉక్రెయిన్, చిలీ, మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో వాణిజ్యపరంగా సాగు చేయబడుతున్నాయి. అక్రోట్లను ప్రపంచంలో అత్యధికంగా చైనా ఉత్పత్తి చేస్తుంది. 2016-17 సంవత్సరానికి చైనా మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో 50% వాటాను కలిగి ఉంది. భారతదేశంలో ఉత్తర మరియు ఈశాన్య రాష్ట్రాలు అయిన జమ్మూ & కాశ్మీర్, ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లలో ఆక్రోట్లు ఉత్పత్తి చేయబడుతున్నాయి. భారతదేశంలో ఆక్రోట్ల సాగులో జమ్మూ & కాశ్మీర్ అతిపెద్ద ఉత్పత్తిదారు.
- ఆసక్తికరమైన నిజాలు: ప్రారంభ రోమన్ కాలంలో ఆక్రోట్లను దేవుళ్ళకు ఆహారంగా ఇవ్వబడినట్లుగా భావిస్తారు, మరియు ఇవి జూపిటర్ పేరు పెట్టబడినవి – అందుకే వాటి శాస్త్రీయ పేరు జుగ్లన్స్ రిజియా.