పనసపండును, ఆంగ్లంలో జాక్ఫ్రూట్ (Jackfruit) అని పిలుస్తారు, ఇది మొరాసి కుటుంబానికి చెందిన చెట్టు. ఈ చెట్టు యొక్క పండు ఉష్ణమండల వాతావరణంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఇది పండినప్పుడు తీపి రుచిని కలిగి ఉంటుంది మరియు లోపలి భాగం కండ కలిగి ఉంటుంది. కండకలిగిన భాగాన్ని బల్బ్ అని కూడా పిలుస్తారు, దీనిని అలాగే తినవచ్చు లేదా వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు. పనసకాయ ఇంకా ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు, అంటే ఇంకా ముగ్గనప్పుడు కోడి మాంసపు ఆకృతిని పోలి ఉంటుంది, ఇది పనసకాయను శాఖాహారులకు మాంసం ప్రత్యామ్నాయంగా చేస్తుంది. పనసను ఉప్పునీరు ద్రావణంలో కలిపి కేండ్ (canned) ఆహరంగా కూడా తయారు చేస్తారు, దీనిని కొన్నిసార్లు కూరగాయ మాంసం అని కూడా పిలుస్తారు.
ఈ పండు సాంప్రదాయ చైనీస్ ఔషధ విధానంలో వివిధ ప్రయోజనాల కోసం ప్రసిద్ది చెందింది.
పనస చెట్టు 50 నుండి 60 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది మరియు దీర్ఘ ఆయుష్షును కలిగి ఉంటుంది, సాధారణంగా 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. ఇది మే మరియు ఆగస్టు నెలల మధ్య వర్షాకాలంలో ఫలాలను ఇస్తుంది. బాగా పెరిగిన ఒక పనస చెట్టు సీజన్‌లో 100 నుండి 200 పండ్లను ఉత్పత్తి చేస్తుంది. పనస చెట్టు పండ్లు చెట్లలో కాసే అతి పెద్ద పండ్లు మరియు ఇవి 55 కిలోల వరకు బరువు పెరుగుతాయి.
పనస చెట్టు పెరగడానికి అనువైన ప్రదేశాలు ఉష్ణమండల లోతట్టు ప్రాంతాలు. ఈ చెట్టు ప్రపంచంలోని అన్ని ఉష్ణమండల ప్రాంతాలలో విస్తృతంగా సాగు చేయబడుతున్న మరియు ప్రసిద్ధ చెందిన ఆహార పదార్థం. పనస దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియా వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే ఒక పదార్థం. ఇది శ్రీలంక మరియు బంగ్లాదేశ్ దేశాల యొక్క జాతీయ పండు.
భారతదేశంలోని కేరళ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధికంగా పనసపండ్లను ఉత్పత్తి చేస్తుంది.
పనసపండు (జాక్‌ఫ్రూట్) గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- శాస్త్రీయ నామం: ఆర్టోకార్పస్ హెటిరోఫిల్లస్ (Artocarpus heterophyllus)
- కుటుంబం: మొరాసి (Moraceae)
- సాధారణ పేర్లు: పనసకాయ/పండు జాక్ ట్రీ, ఫెన్నే, జాక్ ఫ్రూట్,
- సంస్కృత నామం: కథల్
- ఉపయోగించే భాగాలు: పండ్లు, విత్తనాలు, కండకలిగిన పూల రేకులు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తిర్ణం: ఉష్ణమండల ప్రాంతాలకు, ముఖ్యంగా దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందినవి