ఆహారాన్ని జీర్ణం కావించడమనేది శరీరం అన్నివేళల్లోనూ నిర్వహించే ప్రాధమిక విధి. ఈ జీర్ణక్రియ మనిషి నిద్రలో ఉన్నప్పటికంటే మేలుకొని ఉన్నప్పుడే ఎక్కువగా జరుగుతుంది. జీర్ణక్రియ అనేది ఆహారాన్ని నమలడం నుండి ప్రారంభమై వ్యర్థాల విసర్జన (మలవిసర్జన) తో ముగుస్తుంది. కానీ, ఈ ప్రక్రియ శాశ్వతమైనది, జీర్ణక్రియ అన్ని సమయాల్లో వివిధ దశల్లో జరుగుతుంది.
ఆహారము నుండి మనం పొందిన శక్తిని శరీరానికి అందించేందుకు తోడ్పడేదే జీర్ణక్రియ. శరీర అవయవాలు మరియు కణజాలాలకు పోషణను అందించడంలో జీర్ణక్రియ సహాయపడుతుంది. జీర్ణక్రియ లోపాలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియ అనేది మొత్తం ఆరోగ్యం యొక్క ఒక ముఖ్యమైన అంశంగా ఉన్నందున, పేలవమైన జీర్ణక్రియ ఖచ్చితంగా వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది మరి మీరు జీర్ణక్రియాపట్ల జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం.
పీచుపదార్థాలతో కూడిన కొన్ని ఆహారాలను మనం తినే ఆహారంతోపాటు సేవించడం మరియు సమయానికి సరిగా భోంచేయడం ద్వారా జీర్ణశక్తిని సమర్థవంతంగా పరిరక్షించుకోవచ్చు. జీర్ణశక్తిని పెంచేందుకు తినాల్సిన ఆహారాల గురించి మరియు త్యజించాల్సిన ఆహారాల గురించి మరియు జీర్ణశక్తిని పెంచే ఇతర చిట్కాల గురించి ఈవ్యాసంలో వివరంగా చర్చించడమైంది.