దానిమ్మ అనేది లెథరేసీ (Lythraceae) కుటుంబానికి చెందిన ఉపఉష్ణమండల పండు. సాధారణంగా హిందీలో అనార్ అని పిలుస్తారు, దానిమ్మపండు దాని రాసాలూరే రుచి వలన బాగా ప్రసిద్ధి పొందింది. కానీ ఈ పండు కేవలం రుచిని మాత్రమే అందించదు. దానిమ్మలో పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి మరియు ఫైబర్ యొక్క ఒక అద్భుతమైన వనరు. దానిమ్మపండు యొక్క తాజా రసంలో అధిక మొత్తంలో పాలిఫేనోల్స్ ఉంటాయి ఇది ఒక ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్, దీనిలో అంథోసయనిన్లు, ఎల్లాగిక్ యాసిడ్ మరియు టానిన్లు వంటి పాలిఫేనోల్స్ ఉంటాయి. ఈ బయోఆక్టివ్ పదార్థాలన్నీ కలిపి దానిమ్మను పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధంగా చెప్పగల ఒక "సూపర్ ఫుడ్" గా తయారుచేసాయి. ఇది కడుపు నొప్పి, కండ్లకలక, మోనోపాస్ వలన కలిగే వేడి ఆవిర్లు, ఆస్టియోఆర్థరైటిస్ మరియు హేమోరాయిడ్స్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అదనంగా, ఇది చాలా ప్రభావవంతమైన వాపు నిరోధక (యాంటీ-ఇన్ఫలమేటరి) మరియు ఇమ్యునోమోడలింగ్ (రోగనిరోధక శక్తిని పెంచే) ఏజెంట్. వాస్తవానికి, ఇది ఆరోగ్యానికి అందించే అనేక ప్రయోజనాల వలన దీనిని "అనేక విత్తనాలు కలిగిన ఆపిల్" గా పిలుస్తారు.
దానిమ్మపండు దాని తలపై కిరీటంతో కెంపు వంటి ఎరుపు రంగులో ఉంటుంది. తేమతో కూడిన ఉష్ణమండలలో మరియు మధ్యదార ప్రాంతాలలో దానిమ్మ చెట్టు సులభంగా పెరుగుతుంది మరియు పండు సరిగా పరిపక్వం (ముగ్గడానికి) చెందటానికి ఎక్కువ కాలం పాటు ఉండే ఎండాకాలం అవసరం. ఇది లోతైన బంక నేలలో పెరుగుతుంది, కానీ వివిధ రకాల నేలలను కూడా తట్టుకోగలదు. ఇవి భూమి ఉత్తర భాగంలో సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు మరియు దక్షిణ భాగంలో మార్చి నుండి మే నెలల వరకు అందుబాటులో ఉంటాయి. దానిమ్మపండు పండు లోపల అనేక చిన్న ముత్యాల వంటి తినదగిన విత్తనాలు ఉంటాయి, అవి ఒక ప్రత్యేకమైన క్రంచ్ (తినేటప్పుడు కరకరమనే) ను మరియు తీపి కలిగి ఉంటాయి. స్మూతీలు, వైన్లు, కాక్టెయిల్లు, సలాడ్లు, ఆహార పదార్దాల అలంకారాలలోనూ (గార్నిష్), కేకులు మరియు రసాలు వంటి తీపి మరియు రుచికరమైన వంటకాల్లో వీటిని వాడతారు.
పురాతన నాగరికతలలో దానిమ్మపండు యొక్క తొక్కలతో తోలు(leather)లకు రంగు వేసేవారని మరియు దానిమ్మపండు పూవ్వులతో ఎరుపు రంగును తయారు చేసేవారని తెలిస్తే మనకు ఆశ్చర్యం కలుగక మానదు. దీనిని కొన్ని వర్గాల వారు పవిత్రమైన పండుగా భావించేవారు మరియు కొంతమంది గ్రీకు దేవతలకు ప్రత్యేకంగా సమర్పించేవారు. హిందూమతంలో, దానిమ్మ విత్తనాలను సమృద్దైన సంతానానికి చిహ్నంగా భావిస్తారు. ఇది కేవలం వారి విశ్వాసం మాత్రమే కాకపోవచ్చు, బహుశా వారికీ ఈ చిన్న గింజలు యొక్క అద్భుతాలు తెలిసి ఉండవచ్చు.
దానిమ్మపండు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: ప్యూనికా గ్రానేటం (Punica granatum)
- కుటుంబం: లెథరేసీ (Lythraceae)
- సాధారణ నామం: అనార్, దానిమ్మ
- సంస్కృత నామం: దాడిమ్ (Dāḍimaṁ)
- ఉపయోగించే భాగాలు: బెరడు, కాండము, పండ్లు, పువ్వులు మరియు ఆకులు దానిమ్మపండు చెట్టు యొక్క అన్ని భాగాలు ఉపయోగకరంగా ఉంటాయి
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: దానిమ్మపండు ఇరాన్ నుంచి ఉత్తర భారతదేశంలో హిమాలయాలకు వచ్చింది మరియు పురాతన కాలం నుండి మధ్యధరా ప్రాంతం మొత్తంలో సాగుచేయబడుతుంది. ఇది భారతదేశం అంతటా విస్తృతంగా సాగుచేయబడుతుంది మరియు దీనిని ఆగ్నేయ ఆసియా, ఈస్ట్ ఇండీస్, మలయా, మరియు ఉష్ణమండల ఆఫ్రికా యొక్క పొడి భాగాలలో సాగు చేస్తారు. 1769 లో, స్పానిష్ సెటిలర్లు ఈ చెట్టును కాలిఫోర్నియాలోకి ప్రవేశపెట్టారు. యునైటెడ్ స్టేట్స్ లో, ఇది ప్రధానంగా కాలిఫోర్నియా మరియు అరిజోనాలోని పొడి భాగాలలో సాగుచేయబడుతుంది . చైనా, బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్తాన్, జపాన్, ఈజిప్టు, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఆఫ్గనిస్తాన్, బర్మా మరియు సౌదీ అరేబియా దేశాలు దీనిని ప్రధానంగా సాగుచేస్తున్నారు.
- ఆసక్తికరమైన నిజాలు: రిఫ్రిజిరేటర్ లో రెండు నెలల వరకు దానిమ్మలను నిల్వ చేయవచ్చు.
దానిమ్మ చెట్లు 200 సంవత్సరాలకు పైగా నివసిస్తాయి.