బార్లీని సాధారణంగా హిందీలో “జౌ” అని పిలుస్తారు. బార్లీ పశుగ్రాసం (బార్లీ గడ్డి) స్వేదన (distilled) పానీయాలలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ పదార్థం. ఇంకా, బీర్ ఉత్పత్తికి పులియబెట్టిన పదార్థానికి మూలం ఇది. అయితే, బార్లీలో ఆరోగ్యానికి ఉపకరించే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా?
సూప్‌లు మరియు వంటకాల తయారీలో మరియు వివిధ సంస్కృతులలో బార్లీ రొట్టెల తయారీకి బార్లీని విస్తృతంగా ఉపయోగిస్తారు. సంప్రదాయిక మరియు పురాతన తయారీ పద్ధతిలో, బార్లీ ధాన్యాలు సాధారణంగా మాల్ట్‌గా తయారవుతాయి, తరువాత దీనిని బీర్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.
ఆయుర్వేద ఔషధాల్లో కఫదోషాన్ని నిర్వహించడానికి (ఎముకల నిర్మాణం మరియు వాటి కదలికలకు సరళతను నిర్వహించడం) మరియు శీతలీకరణ మూత్రవిసర్జనకు బార్లీని ఒక మంచి ధాన్యంగా ఉపయోగిస్తారు.
అదనంగా, జీర్ణక్రియను ప్రోత్సహించడానికి బార్లీ నీటిని ఉపయోగిస్తారు మరియు ఇది చైనావాళ్ళు మూలిక మందులు, మూలికావైద్యంలో ఉపయోగించే ఓ ముఖ్యమైన మసాలా దినుసు. వాస్తవానికి, బార్లీ గడ్డిని దాని వైవిధ్యమైన ఉపయోగాలకు ‘తృణధాన్యాల రాజు’ అని పిలుస్తారు.
ఈ వ్యాసం బార్లీ నీళ్ల యొక్క వివిధ ప్రయోజనాలు, తయారీ పద్ధతులు మరియు బార్లీ నీటి వల్ల కలిగే దుష్ప్రభావాలను చర్చిస్తుంది.
బార్లీ గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు
బార్లీ ప్రపంచంలో నాల్గవ అతి ముఖ్యమైన ధాన్యపు పంట. ఇది గడ్డి కుటుంబానికి చెందినది మరియు మొదటి సాగు ధాన్యాలలో ఒకటి. దీనిని మొదట యూరప్ మరియు ఆసియాలో 10,000 సంవత్సరాల క్రితం సాగు చేశారు.
- వృక్షశాస్త్ర నామం (బొటానికల్ పేరు): హోర్డియం వల్గారే (Hordeum vulgare)
- కుటుంబం: పోయేసీ (Poaceae)
- సాధారణ పేరు: జౌ, బార్లీ
- సంస్కృత నామం: యవ
- ఉపయోగించే భాగాలు: ధాన్యాలు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: సమశీతోష్ణ వాతావరణంలో స్థానికంగా పండించబడుతుంది.