తిప్పతీగ లేదా టినోస్పోరా అనేది ఒక ఆకురాల్చు పొద, ఇది భారతదేశంలోని అడవి ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఆయుర్వేద మరియు జానపద ఔషధ వ్యవస్థ దాని యొక్క అనేక వైద్య మరియు ఆరోగ్య ప్రయోజనాల వలన దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. వాస్తవానికి, ఆయుర్వేదలో దీనిని "రసాయన" అని పిలుస్తారు ఎందుకంటే ఇది శరీరం యొక్క పూర్తి పనితీరును మెరుగుపరుస్తుంది. సంస్కృతంలో అది "అమృత" అని పిలవబడుతుంది అంటే "చావు లేకుండా చేసేది " అని అర్ధం. ఈ మూలికల యొక్క అద్భుతమైన ప్రభావాలను చుస్తే, తిప్పతీగను నిజంగా అమృతం తో సమానమైనది అని చెప్పవచ్చు. ఎందుకంటే అమృతం దేవతలను ఎల్లపుడు యవ్వనంగా మరియు ఆరోగ్యగా ఉంచుతుంది.

తిప్పతీగ ప్రధానంగా ఒక బలహీనమైన ఊటగల (succulent)కాండాలున్న, తీగ మొక్క. కాండం తెలుపు నుండి బూడిద రంగులో ఉంటుంది మరియు ఇది 1-5 సెం.మీ. మందంతో పెరుగుతుంది. తిప్పతీగ ఆకులు హృదయ ఆకారంలో ఉండి సన్ననివి పొరలుగా ఉంటాయి. ఇది వేసవి మాసంలో ఆకుపచ్చ పసుపు పువ్వులను పుష్పిస్తుంది, అయితే తిప్పతీగ పండ్లు సాధారణంగా శీతాకాలంలో కనిపిస్తాయి. తిప్పతీగకు ఆకుపచ్చని టెంక ఉండే పళ్ళు కాస్తాయి, ఇవి పక్వనికి చేరినప్పుడు ఎరుపుగా మారతాయి. తిప్పతీగ యొక్క ఔషధ ప్రయోజనాలు చాలా వరకు దాని కాండం లోనే ఉంటాయి, కానీ ఆకులు, పండ్లు, మరియు వేర్లను కూడా కొంత మేరకు ఉపయోగిస్తారు.

తిప్పతీగ గురించి కొన్ని ప్రాధమిక నిజాలు:

  • శాస్త్రీయ నామము: టీనోస్పోరా కోర్డిఫోలియా (Tinospora cardifolia)
  • కుటుంబం: మేనిస్పెర్మేసి
  • సాధారణ నామాలు: తిప్పతీగ,గుడూచి, హార్ట్ లీవ్డ్ మూన్ సీడ్,టినొస్పోరా
  • సంస్కృత నామాలు: అమృత, తాంత్రిక, కుండలిని, చక్రలాక్షిని
  • ఉపయోగించే భాగాలు: కాండం, ఆకులు
  • స్థానిక ప్రాంతము మరియు భౌగోళిక విస్టీర్ణం: తిప్పతీగ భారత ఉపఖండానికి చెందినది కానీ చైనా లో కుడా కనిపిస్తుంది
  • శక్తిశాస్త్రం: వేడి
  1. తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు - Giloy benefits for health in Telugu
  2. తిప్పతీగను ఎలా ఉపయోగిస్తారు - How giloy is used in Telugu
  3. తిప్పతీగ మోతాదు - Giloy dosage in Telugu
  4. తిప్పతీగ దుష్ప్రభావాలు - Giloy side effects in Telugu
తిప్పతీగ ప్రయోగానాలు, ఉపయోగాలు, దుష్ప్రభావాలు మరియు మోతాదు వైద్యులు

తిప్పతీగ ఒక ప్రముఖమైన ఆయుర్వేద మూలిక. దాని కాండం ఒక రసాయన లాగా ఒక అద్భుతమైన స్వస్థ పరచే కార్తె కాక, శరీర అవయవాలని ప్రభావవంతంగా పనిచేసేలా చేస్తుంది. దాని యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోగానాల గురించి తెలుసుకుందాం.

  • బరువు తగ్గడానికి తిప్పతీగ: తిప్పతీగ హైపోలిపిడెమిక్ చర్యలను కలిగి ఉంటుంది, దీనిని  క్రమముగా వినియోగిస్తే బరువు తగ్గుదలలో అద్భుతముగా పనిచేస్తుంది. ఇది జీర్ణాశయ  ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు కాలేయాన్ని రక్షిస్తుంది.
  • జ్వరం కోసం తిప్పతీగ: తిప్పతీగలో రోగ నిరోధక చర్యలు మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది డెంగ్యూ జ్వరము వంటి సాధారణ సూక్ష్మజీవుల కారణంగా వచ్చే  అంటువ్యాధుల నుండి రక్షిస్తుంది.
  • డయాబెటీస్ కోసం తిప్పతీగ: తిప్పతీగ మధుమేహం కోసం ప్రభావవంతమైనది ఎందుకంటే ఇది ఇన్సులిన్ నిరోధకత మెరుగుపరచడం ద్వారా రక్తంలో గ్లూకోస్ స్థాయిలను తగ్గించడంలో    సహాయపడుతుంది.
  • శ్వాసకోశ వ్యాధులకు తిప్పతీగ: దీర్ఘకాలిక దగ్గు, అలెర్జిక్ రినిటిస్ చికిత్సలో తిప్పతీగ ప్రభావవంతమైనదిగా గుర్తించారు మరియు ఉబ్బసం యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడవచ్చు.
  • మహిళలకు తిప్పతీగ: దాని రోగనిరోధక-పెంచే లక్షణాల కారణంగా, ఋతుక్రమం ఆగిపోయిన మహిళలకు తిప్పతీగ ఒక గొప్ప ఉపయోగకరమైన మూలిక. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.
  • పురుషుల కోసం తిప్పతీగ: తిప్పతీగ యొక్క ఉపయోగం లైంగిక పనితీరును మెరుగుపరుస్తుంది మరియు పురుషులలో లైంగిక కోరికను పెంచుతుంది.
  • క్యాన్సర్కు తిప్పతీగ: కొన్ని అధ్యయనాలు దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాల వల్ల క్యాన్సర్ చికిత్సలో తిప్పతీగ వాడకాన్ని ప్రతిపాదించారు.
  • మానసిక ఆరోగ్యానికి తిప్పతీగ: తిప్పతీగను సాధారణంగా ఆందోళన, నిరాశ మరియు ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితుల నిర్వహణకు ఉపయోగిస్తారు.

ఉబ్బసం కోసం తిప్పతీగ - Giloy for asthma in Telugu

ఆయుర్వేదంలో, దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా మరియు ఉబ్బసం-అనుబంధ లక్షణాలను తగ్గించడంలో తిప్పతీగ యొక్క ప్రయోజనాలను విస్తృతంగా ఉపయోగిస్తారు. ఉబ్బసంతో ముడిపడిన సున్నితత్వం మరియు అలెర్జీ ప్రతిస్పందనలను తగ్గించడంలో జిలోయ్ సారం చాలా ప్రభావవంతమైనదని జంతు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఫార్మకోగ్నోసీ సమీక్షల్లో ప్రచురించబడిన సమీక్షా వ్యాసం తిప్పతీగ ఒక శక్తివంతమైన యాంటి-ఆస్మాటిక్ మూలిక అని పేర్కొంది. ఏదేమైనప్పటికీ, ఆస్తమా రోగులపై తిప్పతీగ యొక్క జీవక్రియ మరియు ప్రభావాన్ని పరీక్షించడానికి మానవ అధ్యయనాలు ఏవీ లేవు. కాబట్టి, తిప్పతీగ యొక్క యాంటి-ఆస్మాటిక్ ప్రభావం గురించి మరింత తెలుసుకవాడానికి మీ ఆయుర్వేద వైద్యునితో మాట్లాడడం మంచిది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

బరువు తగ్గుదల కోసం తిప్పతీగ - Giloy for weight loss in Telugu

తిప్పతీగ తన అద్భుతమైన బరువు తగ్గుదల ప్రయోజనాలతో ఆయుర్వేద ఔషధాల ప్రపంచాన్ని విప్లవాత్మకంగా చేసింది. మీకు సాంప్రదాయ లేదా సంపూర్ణ వైద్యంలో ఆసక్తి ఉంటే, మీరు ఇప్పటికే తిప్పతీగ వల్ల బరువు తగ్గవచ్చు అని వినివుంటారు. తిప్పతీగ బరువు తగ్గుదల లాభాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేయలేదు. కానీ, అధ్యయనాలు ఈ మూలిక ఒక అద్భుతమైన హైపోలిపిడమిక్ (hypolipidemic) మరియు హెపటోప్రొటెక్టీవ్ (hepatoprotective) అని సూచిస్తున్నాయి. తిప్పతీగ యొక్క క్రమమైన వినియోగం మీ శరీరంలో హానికరమైన కొవ్వులు తగ్గించడం మాత్రమే కాక మీ ఆహారాన్ని మరింత సమర్థవంతంగా జీర్ణం చేయవచ్చు కాబట్టి కాలేయాన్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి సహాయపడుతుంది. సరైన మోతాదు కోసం ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది. (మరింత సమాచారం: ఊబకాయం చికిత్స)

తిప్పతీగ కన్సర్ వ్యతిరేక లక్షణాలు - Giloy anticancer properties in Telugu

తిప్పతీగ యొక్క కన్సర్ వ్యతిరేక లక్షణాలు రొమ్ము క్యాన్సర్, చర్మ క్యాన్సర్, మరియు మెదడు కణితులు (brain tumors) సహా వివిధ రకాల క్యాన్సర్లలో అధ్యయనం చేయబడ్డాయి. ఇన్ వివో అధ్యయనాలు అన్ని, తిప్పతీగ సారాలు క్యాన్సర్-వ్యతిరేక కర్తగా సంభావ్యతను కలిగి ఉన్నాయని పేర్కొన్నాయి. తిప్పతీగలో ఉన్న పాల్మేటైన్ ఆల్కలీయిడ్(palmatine alkaloid) దాని క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలకు బాధ్యత వహిస్తుందని సూచించారు. ఏమైనప్పటికీ, మానవ అధ్యయనాలు లేకపోవటం వలన ఈ మూలిక యొక్క కాన్సర్ వ్యతిరేక సంభావ్యత గురించి మరింత తెలుసుకునేందుకు మీ ఆయుర్వేద వైద్యునితో మాట్లాడటం మంచిది. 

రుతువిరతి కోసం తిప్పతీగ - Giloy for menopause in Telugu

రుతువిరతి మహిళల్లో పునరుత్పత్తి దశ ముగింపును మాత్రమే సూచించదు, అది కొన్ని ఇబ్బంది కరమైన సహజ సంకేతాలు మరియు లక్షణాలు కూడా చూపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో యాంటీబాడీస్ (antibodies) మరియు ఇతర సంబంధిత కణాల యొక్క తక్కువ స్థాయిలు ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. దీని ఫలితంగా, తరువాతి దశలలో మహిళలు వ్యాధులు మరియు అంటురోగాలకు గురికావచ్చు. అదృష్టవశాత్తూ, ఋతుక్రమం ఆగిపోయిన మహిళలకు ఒక అద్భుతమైన రోగనిరోధకశక్తిని పెంచే దానిగా తిప్పతీగ చెప్పబడింది. 200 మంది ఋతుక్రమం ఆగిపోయిన మహిళలతో కూడిన క్లినికల్ అధ్యయనంలో, 100 మందికి తిప్పతీగ జల సారం ఇవ్వబడింది, మిగిలిన 100 మందికి ప్లేసిబో (మందు లేని గొట్టం) ఇవ్వబడింది. ఆరు నెలల కాలంలో శరీర పరామితులు (parameters) మరియు రోగనిరోధక కణాలలో మార్పులను గమనించి, ఈ చికిత్స యొక్క ప్రభావం అధ్యయనం చేయబడింది. ఈ అధ్యయనం చివరలో, తిప్పతీగను తీసుకున్న స్త్రీలు ప్లేస్బోను తీసుకున్న మహిళల కంటే మెరుగైన రోగనిరోధక పనితీరును కలిగి ఉన్నారు. కాబట్టి, రోగనిరోధక వ్యవస్థలో మెనోపాజ్-సంబంధిత మార్పులను ఆలస్యం చేయడంలో తిప్పతీగకు ఖచ్చితంగా అవకాశం ఉంది.

ఆందోళన మరియు కుంగుబాటు కోసం తిప్పతీగ - Giloy for anxiety and depression in Telugu

భారతదేశంలో జరిపిన ఒక అధ్యయనంలో పేర్కొన్న విధంగా తిప్పతీగకు మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులలో ఆందోళన మరియు నిరాశను తగ్గించడంలో గొప్ప సామర్ధ్యం ఉన్నది అని తెలుస్తుంది. సాధారణంగా ఉపయోగించే కొన్నియాంటీ-అంజైటీ (anti anxiety) మందుల వాలే తిప్పతీగ సమర్థవంతంగా పనిచేస్తుందని అని ఇన్ వివో అధ్యయనాలు సూచించాయి. అయితే, మానవ నమూనాలపై పరిశోధన ఇంకా నిర్థారించబడలేదు. ఆయుర్వేద వైద్యులు చెప్పినదాని ప్రకారం,తిప్పతీగ జ్ఞాపకశక్తి పెరుగుదల సూత్రీకరణలో ఉపయోగించే మూలికలలో ఒకటి.

కొలెస్ట్రాల్ కోసం తిప్పతీగ - Giloy for cholesterol in Telugu

ప్రీ క్లినికల్ అధ్యయనాలు తిప్పతీగ యొక్క సాధారణ ఉపయోగం అనేది శరీరంలో ఆరోగ్యవంతమైన లిపిడ్ ప్రొఫైల్ని సమర్ధవంతంగా నిర్వహిస్తుందని సూచిస్తున్నాయి.తిప్పతీగను శరీరానికి ఇవ్వడం వలన తక్కువ సాంద్రత కలిగిన కొవ్వుల (చెడు కొలెస్ట్రాల్) మరియు ఉచిత కొవ్వు ఆమ్లాల (free fatty acids) స్థాయిని గణనీయంగా తగ్గించింది. అయినప్పటికీ, మానవ అధ్యయనాలు లేనందువల్ల, కొలెస్టరాల్ తగ్గింపుకు ఏ రూపంలో అయినా తిప్పతీగను తీసుకొనేముందు ముందు ఆయుర్వేద వైద్యునితో తనిఖీ చేసుకోవడం మంచిది.

చర్మ గాయాలకు తిప్పతీగ - Giloy for skin wounds in Telugu

అనేక జంతు అధ్యయనాలు తిప్పతీగ గాయానికి వైద్యం చేసే ఒక ప్రభావవంతమైన కర్త అని సూచించాయి. తిప్పతీగ యొక్క సమయోచిత పూత వేగంగా గాయాలను నయం చేయడమే కాక, గాయపడిన ప్రదేశ అనుసంధాన కణజాలం యొక్క మరింత సమర్థవంతమైన అభివృద్ధికి దారితీస్తుందని సూచించారు. దురదృష్టవశాత్తు, ఈ మూలిక యొక్క గాయ వైద్యం యొక్క సంభావ్యతను నిర్ధారించడానికి మానవ నమూనాలు అందుబాటులో లేవు.

తిప్పతీగ లైంగికశక్తిని పెంచుతుంది - Giloy boosts libido in Telugu

ఇన్ వివో అధ్యయనాలు తిప్పతీగ ఒక అద్భుతమైన కామోద్దీపనకం అని సూచించాయి. సంభోగం చర్యలో మెరుగుదల, లైంగిక శక్తి, మరియు స్ఖలనంలో మార్పులు వంటివి జంతు నమూనాలలో గమనించబడ్డాయి. అయితే, మానవులపై లైంగిక అధ్యయనాలు ఇంకా పురోగతిలో ఉన్నాయి.

పుండ్ల కోసం తిప్పతీగ - Giloy for ulcers in Telugu

తిప్పతీగని ఆయుర్వేదంలో అజీర్ణం, అపానవాయువు మరియు కడుపు ఉబ్బడం కోసం ఒక ఔషధంగా ఉపయోగిస్తారు. అన్ని ప్రయోగశాల ఆధారిత అధ్యయనాలు తిప్పతీగ సారాలు గ్యాస్ట్రిక్ అల్సర్ లక్షణాలను తగ్గించడంలో అలాగే కడుపు pH పెరుగుదల మరియు తగ్గుతున్న ఆమ్లతను సమతుకుల్యం చెయ్యడంలో చాలా సమర్థవంతంగా ఉన్నాయని పేర్కొంది. కానీ, మానవ ఆధారిత అధ్యయనాలు లేనందున, యాంటీ అల్సర్(anti-ulcer) చికిత్సలలో ఈ మూలిక యొక్క ప్రభావాలను నిర్ధారించడం కష్టం. ఏ రూపంలోనైనా తిప్పతీగను తీసుకోవటానికి ముందు మీ వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.

తిప్పతీగ యాంటీఆక్సిడెంట్ లక్షణాలు - Giloy antioxidant properties in Telugu

యాంటీఆక్సిడెంట్లు శరీర స్వేచ్ఛారాశుల(free radicles) (రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు)పై వ్యతిరేకంగా ప్రాధమిక రక్షణగా ఉంటాయి. ఈ స్వేచ్ఛా రాశులు శరీరం యొక్క వివిధ జీవక్రియ చర్యల ఫలితంగా ఏర్పడతాయి. కానీ జీవనశైలి పరిస్థితులు లేదా ఒత్తిడి శరీరంలో యాంటీఆక్సిడెంట్లు మరియు స్వేచ్ఛారాశులు మధ్య అసమతుల్యత సృష్టించవచ్చు. ఇది ఆక్సిడెటివ్ ఒత్తిడి అని పిలువబడే ఒక పరిస్థితిని సృష్టిస్తుంది. నిరంతర ఆక్సీకరణ ఒత్తిడిలో ఉన్న శరీరం దాని సాధారణ పనితీరులో క్రమంగా క్షీణతను చూపుతుంది. కాలక్రమేణా, ఇది అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు దారి తీస్తుంది. వృద్ధాప్యం యొక్క ప్రారంభ సంకేతాలు కూడా ఆక్సీకరణ ఒత్తిడితో ముడిపడివున్నాయి. అధ్యయనాలు తిప్పతీగ ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ అని సూచించాయి. ఇతర అధ్యయనాలు తిప్పతీగలో ఉన్న ఫెనోలిక్ శాతం దాని యాంటీఆక్సిడెంట్ గుణానికి బాధ్యత వహిస్తుందని తెలిపింది. పరిశోధకుల ప్రకారం, శరీరంలోని యాంటీఆక్సిడెంట్ల మంచి మొత్తం గుండె పోటు మరియు మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలవు, అంతేకాక మీ శరీరం యొక్క మొత్తం సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో కూడా ఇది సహాయపడుతుంది.

అలెర్జీ రినైటిస్ కోసం తిప్పతీగ - Giloy for allergic rhinitis in Telugu

ప్రత్యేకంగా అలెర్జీ రినైటిస్ విషయంలో తిప్పతీగ అద్భుతమైన అలెర్జీ ప్రతికూల లక్షణాలను కలిగి ఉందని క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. భారతదేశంలో జరిపిన ఒక అధ్యయనంలో, 75 మందికి 8 వారాల పాటు తిప్పతీగ మరియు ప్లేసిబో(ఏ మందు లేని గొట్టం) ఇవ్వబడింది. ఈ అధ్యయనంలో తిప్పతీగ ఇచ్చిన సమూహంలోని రినైటిస్ లక్షణాలు అన్ని గణనీయంగా తగ్గిపోయాయి. అదనంగా, ఇసినోఫిల్ మరియు న్యూట్రాఫిల్(తెల్ల రక్త కణాల రకాలు) శాతాలు కూడా గణనీయంగా తగ్గాయి. కాబట్టి, తిప్పతీగకు వ్యతిరేక అలెర్జీ (యాంటీ అలెర్జీ) చికిత్సల్లో కొన్ని ఉపయోగాలు కలిగి ఉండవచ్చు.

తిప్పతీగ ఒక యాంటీబయాటిక్ - Giloy as an antibiotic in Telugu

ఇన్ విట్రో, ప్రయోగశాల అధ్యయనాలు తిప్పతీగ కాండం సారాలకు అనేక వ్యాధికార బాక్టీరియాలపై వ్యతిరేకంగా పనిచేసే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని సూచించారు. ఇంకా ఈ అధ్యయనం తిప్పతీగ, సూడోమోనాస్ జాతులపై (pseudomonas spp) అత్యంత ప్రభావితం అయినదని అని,క్లేబ్సియేలా (Klebsiella) మరియు ప్రోటీయస్ (proteus)లపై ఒక మోస్తరు ప్రభావితం చూపిస్తుందని పేర్కొంది. ప్రీక్లినికల్ అధ్యయనాలు తిప్పతీగ అనేది ఎరిచేరియా కోలి (Escherichia coli ) వల్ల వచ్చే పెరిటోనిటిస్ (ఉదరం అంతర్గత గోడల యొక్క వాపు)కు వ్యతిరేకంగా ఒక అద్భుతమైన యాంటీమైక్రోబియాల్ ఏజెంట్ అని సూచించాయి. అయితే, మానవ అధ్యయనాలు లేకపోవటంతో, ఈ మూలిక యొక్క యాంటీమైక్రోబయాల్ కారకాల గురించి ఎక్కువగా ధృవీకరించబడలేదు.

జ్వరానికి తిప్పతీగ - Giloy for fever in Telugu

దీర్ఘకాలిక జ్వరాల చికిత్స కోసం సాంప్రదాయ వైద్యంలో తిప్పతీగను ఉపయోగిస్తారు. జంతు నమూనాలు తిప్పతీగ యొక్క సమర్ధవంతమైన వ్యతిరేకజ్వర (antipyretic) చర్యను సూచిస్తున్నాయి. కొన్ని క్లినికల్ అధ్యయనాల్లో, డెంగ్యూజ్వరాలలో, తిప్పతీగ యొక్క సమర్ధతలో గుర్తించదగిన తగ్గింపు గుర్తించబడింది. కానీ ఏ ఆధారాలు శరీర ఉష్ణోగ్రతల ప్రభావంపై ఈ మూలిక యొక్క చర్యను సూచించలేదు. కాబట్టి, మీ ఆయుర్వేద వైద్యుడిని తిప్పతీగ యొక్క యాంటిపైరెటిక్ ప్రభావాలు గురించి మరింత తెలుసుకోవడం ఉత్తమం.

కాలేయం కోసం తిప్పతీగ - Giloy for liver in Telugu

ఆయుర్వేదంలో, తిప్పతీగ అత్యంత ముఖ్యమైన హెపాటోప్రొటెక్టివ్ (కాలేయాన్ని రక్షించేది) మూలికలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఆయుర్వేద వైద్యులు కామెర్లు వంటి వాటి నివారణ కోసం తిప్పతెగను సూచిస్తారు. ఇటీవలి ప్రయోగశాల మరియు జంతువుల ఆధారిత అధ్యయనాలు, తిప్పతీగ సారం (ఆకు, బెరడు, కాండం) గమనించదగ్గ హెపాటోప్రొటెక్టివ్ చర్యలను చూపిందని సూచించాయి.సూపరాక్సైడ్ డిస్మ్యుటేస్ (superoxide dismutase) స్థాయిలను పెంచి అలాగే అమినోట్రాన్స్ఫెరెస్ (aminotransferase), అలానిన్ అమినోట్రాన్స్ఫేరెస్ (alanine aminotraferase) వంటి వివిధ కాలేయ జీవరసాయనాల యొక్క స్రావం తగ్గించిందని పేర్కొన్నారు. వైద్యుల ప్రకారం, ఈ ఎంజైమ్లు ఆరోగ్యకరమైన కాలేయం ద్వారా చిన్న మోతాదులో స్రవిస్థాయి, అయితే దెబ్బతిన్న సందర్భంలో లేదా సమస్యాత్మకకాలేయంలో, ఈ ఎంజైమ్లు చాలా ఎక్కువ మొత్తంలో స్రవిస్తాయి. అప్పుడు అది శరీరంలో కాలేయ-ఆధారిత విషతూల్యానికి కారణమవుతుంది. లాబ్ అధ్యయనాలు తిప్పతీగలో ఉన్న టినోస్పొరైన్ (tinosporine) మరియు టినొస్పోనోన్ (tinosponone) ప్రస్తుతం హెపటైటిస్ బి మరియు E. కి వ్యతిరేకంగా పనిచేయడంలో చాలా ఉపయోగకరంగా ఉన్నాయని సూచించాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ లో ప్రచురించిన ఒక సమీక్ష వ్యాసం ప్రకారం, తిప్పతీగ యొక్క హెపాటోప్రొటెక్టివ్ సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఒక క్లినికల్ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం, 20 హెపటైటిస్ రోగులకు 4 తిప్పతీగ మాత్రలు 4 వారాల పాటు రోజుకు మూడు సార్లు ఇవ్వబడ్డాయి. అప్పుడు వారు కాలేయ నష్టం మరియు హెపటైటిస్ లక్షణాలలో గణనీయమైన తగ్గింపును గమనించారు. అయినప్పటికీ, మీరు ఏవైనా కాలేయ రుగ్మతతో బాధపడుతుంటే, ఏ రూపంలోనైనా తిప్పతీగను తీసుకోవడానికి ముందు మీ ఆయుర్వేద వైద్యునితో తనిఖీ చేసుకోవడం ఉత్తమం.

కీళ్ళవాపుకు తిప్పతీగ - Giloy for arthritis in Telugu

కీళ్ళ వాపు మరియు ఎముక నష్టాన్ని తగ్గించడానికి తిప్పతీగ ఒక అద్భుతమైన కర్త అని ప్రీక్లినల్ ట్రయల్స్ సూచిస్తున్నాయి. శరీరం యొక్క వాపులకు ప్రధానంగా బాధ్యత వహిస్తున్న కొన్ని సైటోకైన్స్ (శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థచే స్రవించబడుతుంది, ఒక రకమైన ప్రోటీన్లు) మరియు T కణాలు (ఒక రకమైన యాంటిబాడీ కణాలు) యొక్క కార్యకలాపాలను అణచివేయడం ద్వారా తిప్పతీగ వాపును తగ్గిస్తుంది. అంతేకాకుండా,ఎముకల పునశ్శోషణం (resorption) మరియు పునర్నిర్మాణంలో (remodelling) బాధ్యత వహిస్తున్న ఎయిస్టోక్లాస్ట్ కణాలా కార్యకలాపాలను కూడా తిప్పతీగ తగ్గిస్తుంది. అయితే, క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికీ ఈ రంగంలో పెండింగ్లో ఉన్నాయి. ఒకవేళా మీరు కీళ్ళ వాపుతో బాధపడుతుంటే, మీ ఆయుర్వేద వైద్యునితో మాట్లాడడం మంచిది. (మరింత సమాచారం: కీళ్లవాపు రకాలు)

మధుమేహం కోసం తిప్పతీగ - Giloy for diabetes in Telugu

సాంప్రదాయ మరియు జానపద వైద్య వ్యవస్థలలో హైపోగ్లైసెమిక్ (రక్త చక్కెరను తగ్గిస్తుంది) కర్తగా తిప్పతీగను వాడుతున్నారు. డయాబెటిస్ పై తిప్పతీగ యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి అనేక జంతు మరియు ప్రయోగశాల ఆధారిత అధ్యయనాలు చేయబడ్డాయి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో తిప్పతీగ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ మూలిక ఇన్సులిన్ సూక్ష్మగ్రాహ్యత్యాత(sensitivity)ని పెంచడం మరియు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా దాని హైపోగ్లైసిమిక్ చర్యను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదనంగా, తిప్పతీగ గ్లూకోస్ జీవక్రియ (metabolism) (గ్లూకోనియోజెనెసిస్ మరియు గ్లైకోజెనోలైసిస్)లో కొన్ని కీలకమైన చర్యలలో కూడా జోక్యం చేసుకుంటుంది, ఇది మొత్తానికి రక్తంలో గ్లూకోజ్ స్థాయిల తగ్గుదలకు దారి తీస్తుంది. వాస్తవానికి, ది కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మరియు నేషనల్ బోటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇండియా వారు సంయుక్తంగా విడుదల చేసిన ఒక బహుమూలిక (ఒకటి కంటే ఎక్కువ మూలికలు) ఉత్పత్తిలో తిప్పతీగ ఒక ప్రధానమైన పదార్థం. CSIR ప్రకారం, ఈ ఔషధం రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఒక ఆయుర్వేద ఔషధంగా ప్రారంభించబడింది మరియు ఇది సాధారణ యాంటీ-డయాబెటిస్ మందులతో వచ్చే ఎటువంటి దుష్ప్రభావాలను కలిగించదు. ఏదైనా మందు లేదా మూలికను తీసుకునే ముందు మీ వైద్యునితో మాట్లాడటం ఎల్లప్పుడూ మంచిది. (మరింత సమాచారం: చెక్కెర వ్యాధి చికిత్స)

డెంగ్యూ కోసం తిప్పతీగ - Giloy for Dengue In Telugu

డెంగ్యూ ప్రారంభ లక్షణాల నివారణ కోసం ఆయుర్వేద వైద్యులు తిప్పతీగ రసాన్నీ సూచిస్తారు. ద ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ రిసెర్చ్లో పేర్కొన్న ఒక రోగి అధ్యయనం ప్రకారం, డెంగ్యూ సోకిన ఆడ రోగికి 15 రోజుల పాటు రోజుకు రెండుసార్లు 40 మి.లీ.తిప్పతీగ రసాన్ని ఎక్కించారు. 15 రోజుల ముగింపులో, జ్వరం మరియు దద్దుర్లు తగ్గడంతో పాటు ప్లేట్లెట్ స్థాయిలలో మెరుగైన పెరుగుదల కనిపించింది.దుష్ప్రభావాలు కనిపించిన రుజువులు లేవు. మరొక అధ్యయనంలో, తక్కువ ప్లేట్లెట్ సంఖ్య కలిగిన 200 మందికి 5 రోజులు బొప్పాయి మరియు తిప్పతీగ సారాల 5 మి.లీ. మిశ్రమాన్ని ఇచ్చారు. ప్లేట్లెట్ స్థాయిలో గణనీయమైన పెరుగుదల అందరి రోగులలో గమనించబడింది. కాబట్టి, తిప్పతీగ ప్రారంభ చికిత్సల్లో డెంగ్యూకు వ్యతిరేకంగా సామర్థ్యాన్ని కలిగి ఉంది అని సురక్షితంగా చెప్పవచ్చు.

తిప్పతీగ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది - Giloy boosts immunity in Telugu

తిప్పతీగ దాని సాంక్రమిక రోగనిరోధకత (immunomodulating ) (రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది) ప్రయోజనాల వలన సాంప్రదాయిక వైద్య వ్యవస్థలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఆయుర్వేద వైద్యులు తిప్పతీగను రోగనిరోధక శక్తిని పెంపొందించే ఔషధలాల్లో ప్రధానమైనదిగా భావిస్తారు. ఉజ్జాయింపుగా జరిపిన వైద్య అధ్యయనాలలో, 68 HIV ఉన్న రోగులను రెండు సమూహాలుగా విభజించారు. ఒక సమూహానికి తిప్పతీగ ఇవ్వబడింది, మిగిలిన సమూహం ఒక ఆరు నెలలు పాటు ప్లాసిబో (చికిత్సా ప్రభావం లేని ఒక పదార్ధం)లో ఉంది.ఆ అధ్యాయన సమయ ముగింపులో, తిప్పతీగ తీసుకున్న సమూహం వ్యాధి లక్షణాలలో మొత్తం తగ్గడంతో పాటు వారి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. జర్నల్ అఫ్ ఎథ్నోఫార్మాకాలజీ (Ethnopharmacology) వాళ్ళు ప్రచురించిన ఒక వ్యాసం ప్రకారం,తిప్పతీగ లేదా టినోస్పోరా యొక్క సహజమైన జీవరసాయనికాల (biochemicals) బ్యాండ్ ఈ మూలిక యొక్క సాంక్రమిక రోగనిరోధకత ప్రభావానికి బాధ్యత వహిస్తుంది. అదనపు అధ్యయనాలు సాంక్రమిక రోగనిరోధకత శరీరంలో ఫాగోసైట్స్ (రోగ నిరోధక కణాలు)ను ప్రేరేపించడం వలన కావచ్చునని సూచిస్తున్నాయి.

తిప్పతీగ కాండం లేదా ఆకును కషాయము రూపంలో తీసుకోవచ్చు కానీ సాధారణంగా దీనిని పొడి రూపంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యుడు సూచించినట్లయితే తిప్పతీగ మాత్రలు, క్యాప్సుల్స్, మరియు తిప్పతీగ రసం వంటి ఇతర ఉత్పత్తులు తీసుకోవచ్చు. మీరు ఈ మూలిక యొక్క రుచిని ఇష్టపడకపోతే, దానిని మూలికల టీ రూపంలో కొనుగోలు చేయవచ్చు.

ఆయుర్వేద వైద్యుల ప్రకారం, 1-2 గ్రా తిప్పతీగ కాండం లేదా ఆకు పొడి మరియు 5 మి.లీ. వరకు తిప్పతీగ కాండం లేదా ఆకు రసాన్ని దాని దుష్ప్రభావాల గురించి చాలా చింతించకుండా తీసుకోవచ్చు. ఏమైనప్పటికీ, ఆరోగ్య ఔషధంగా తిప్పతీగను తీసుకోవటానికి ముందు ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించడం మంచిది.

  • తిప్పతీగ ఒక సమర్థవంతమైన హైపోగ్లైసిమిక్ ఏజెంట్ (రక్త చక్కెర తగ్గింపు), కాబట్టి మీరు ఔషధాలు వాడుతున్న డయాబెటిక్ వ్యక్తి అయితే, ఏ రూపంలో ఐన తిప్పతీగను తీసుకోవటానికి ముందు మీ వైద్యుడిని తనిఖీ చేయడమే మంచిది.
  • గర్భం ధరించినా లేదా చనుబాలిచ్చు సమయంలో తిప్పతీగ యొక్క సంభావ్య ప్రభావాలు గురించి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి గర్భిణీ మరియు చనుబాలిచ్చు స్త్రీలు ఏ రూపంలోనూతిప్పతీగను ఉపయోగించటానికి ముందు వారి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించాలి
  • తిప్పతీగ మీ రోగనిరోధక వ్యవస్థను మరింత చురుకుగా పనిచేయటానికి ఉద్దీపన చేయగల ఒక అద్భుతమైన రోగనిరోధక సూత్రం. కాబట్టి, మీరు ఆటోఇమ్యూన్(autoimmune) వ్యాధితో బాధపడుతున్నట్లయితే, తిప్పతీగను తీసుకునే ముందు తీసుకోవాలా లేదా అని మీ వైద్యుడిని అడగండి.
Dr. Harshaprabha Katole

Dr. Harshaprabha Katole

Ayurveda
7 Years of Experience

Dr. Dhruviben C.Patel

Dr. Dhruviben C.Patel

Ayurveda
4 Years of Experience

Dr Prashant Kumar

Dr Prashant Kumar

Ayurveda
2 Years of Experience

Dr Rudra Gosai

Dr Rudra Gosai

Ayurveda
1 Years of Experience


Medicines / Products that contain Giloy

వనరులు

  1. M.V. Kalikar et al. Immunomodulatory effect of Tinospora cordifolia extract in human immuno-deficiency virus positive patients. Indian J Pharmacol. 2008 Jun; 40(3): 107–110. PMID: 20040936
  2. Sharma U, Bala M, Kumar N, Singh B, Munshi RK, Bhalerao S. Immunomodulatory active compounds from Tinospora cordifolia. J Ethnopharmacol. 2012 Jun 14;141(3):918-26. PMID: 22472109
  3. Soham Saha, Shyamasree Ghosh. Tinospora cordifolia: One plant, many roles. Anc Sci Life. 2012 Apr-Jun; 31(4): 151–159. PMID: 23661861
  4. Sannegowda KM, Venkatesha SH, Moudgil KD. Tinospora cordifolia inhibits autoimmune arthritis by regulating key immune mediators of inflammation and bone damage. Int J Immunopathol Pharmacol. 2015 Dec;28(4):521-31. PMID: 26467057
  5. V. Sharma, D. Pandey. Protective Role of Tinospora cordifolia against Lead-induced Hepatotoxicity. Toxicol Int. 2010 Jan-Jun; 17(1): 12–17. PMID: 21042467
  6. B. T. Kavitha, S. D. Shruthi, S. Padmalatha Rai, Y. L. Ramachandra1. Phytochemical analysis and hepatoprotective properties of Tinospora cordifolia against carbon tetrachloride-induced hepatic damage in rats. J Basic Clin Pharm. June 2011-August 2011; 2(3): 139–142. PMID: 24826014
  7. Hussain L, Akash MS, Ain NU, Rehman K, Ibrahim M. The Analgesic, Anti-Inflammatory and Anti-Pyretic Activities of Tinospora cordifolia. Adv Clin Exp Med. 2015 Nov-Dec;24(6):957-64. PMID: 26771966
  8. B. K. Ashok, B. Ravishankar, P. K. Prajapati, Savitha D. Bhat. Antipyretic activity of Guduchi Ghrita formulations in albino rats. Ayu. 2010 Jul-Sep; 31(3): 367–370. PMID: 22131741
  9. Thatte UM, Kulkarni MR, Dahanukar SA. Immunotherapeutic modification of Escherichia coli peritonitis and bacteremia by Tinospora cordifolia. J Postgrad Med. 1992 Jan-Mar;38(1):13-5. PMID: 1512717
  10. Tiwari M, Dwivedi UN, Kakkar P. Tinospora cordifolia extract modulates COX-2, iNOS, ICAM-1, pro-inflammatory cytokines and redox status in murine model of asthma. J Ethnopharmacol. 2014 Apr 28;153(2):326-37. PMID: 24556222
  11. Badar VA et al. Efficacy of Tinospora cordifolia in allergic rhinitis. J Ethnopharmacol. 2005 Jan 15;96(3):445-9. Epub 2004 Nov 23. PMID: 15619563
  12. Mohanjit Kaur, Amarjeet Singh, Bimlesh Kumar. Comparative antidiarrheal and antiulcer effect of the aqueous and ethanolic stem bark extracts of Tinospora cordifolia in rats. J Adv Pharm Technol Res. 2014 Jul-Sep; 5(3): 122–128. PMID: 25126533
  13. Stanely Mainzen Prince P, Menon VP, Gunasekaran G. Hypolipidaemic action of Tinospora cordifolia roots in alloxan diabetic rats. J Ethnopharmacol. 1999 Jan;64(1):53-7. PMID: 10075122
  14. Gameiro CM, Romão F, Castelo-Branco C. Menopause and aging: changes in the immune system--a review. Maturitas. 2010 Dec;67(4):316-20. PMID: 20813470
  15. Singh N, Singh SM, Shrivastava P. Effect of Tinospora cordifolia on the antitumor activity of tumor-associated macrophages-derived dendritic cells. Immunopharmacol Immunotoxicol. 2005;27(1):1-14. PMID: 15803856
Read on app