ఉసిరి (నెల్లికాయ) అనేది ఇంటింటా వినిపించే ఓ ప్రసిద్ధమైన పేరు. మెరిసే ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా కనిపించే ఉసిరి గురించి తెలియని వ్యక్తి ఈ దేశంలో ఉండరు. తెలుగువారు మరియు కన్నడిగులు ఉసిరిని “నెల్లికాయ” అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలోని పురాతన ఆయుర్వేద వైద్యం మందులలో ఉసిరి కూడా ఒకటి. “ఇండియన్ గూస్బెర్రీస్” “ఆమ్లా”గా పేరు పొందిన ఉసిరిని ప్రపంచమంతా ఉపయోగిస్తారు.
మీరు గనుక మూలికావైద్యం, గృహవైద్యం మందుల పట్ల మక్కువ గలవారైతే మీరు ఇప్పటికే పలు స్వస్థతా గుణాలున్న ఉసిరి యొక్క ప్రయోజనాల్ని పొందే ఉంటారు. సూక్ష్మజీవనాశక (యాంటీబయోటిక్) గుణాలు మరియు మంచి పోషక విలువలున్న ఉసిరి మనకు అందుబాటులో (అంటే మన పెరట్లోనే) ఉంటే దీన్ని వాడకుండా ఉండడం చాలా కష్టం. అనామ్లజనకాలు (antioxidants) మరియు పోషకవిలువల్ని ఉసిరి దండిగా కల్గి ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. సంస్కృతంలో ఉసిరికి “ఆమ్లాకి” మరియు “ధాత్రీఫలం” అనే పేర్లున్నాయి. వాస్తవానికి, ఆమ్లాకి అంటే "తల్లి" అని ఒక అర్థం, “మాన్పు” అని మరో అర్థం. అంటే అనేక మాన్పుడు గుణాలున్న ఉసిరికకు ఈ పేర్లు సముచితం.
అత్యంత ముఖ్యమైన ఆయుర్వేద గ్రంథాలలో “చరక సంహిత” మరియు “శుశ్రుత సంహిత”లనేవి రెండు. ఉసిరిని ఈ రెండు గ్రంథాలు “పునర్జీవమిచ్చే” మూలికగా పేర్కొన్నాయి. ఇంతే కాదు, ఉసిరి భారత పురాణంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ఉసిరిని విష్ణుదేవుని యొక్క కన్నీటి బిందువుగా భారతపురాణం అభివర్ణించింది. భారతదేశంలో శైవులకు రుద్రాక్ష ఎంత పవిత్రమో వైష్ణవులకు వారి సంప్రదాయాల్లో ఉసిరి కాయకి కూడా అంతే పవిత్రత మరియు అంతే సమాన ప్రాముఖ్యతను కల్గి ఉంది. ఇంతటి పవిత్రత ఉండబట్టే ఉసిరికాయచెట్టు మరియు ఉసిరిపండ్లు భారతదేశంలో పవిత్రంగా పూజించబడుతున్నాయి. పాత సంప్రదాయాలు మరియు మూఢనమ్మకాల సంగతి పక్కన బెడితే ఉసిరికి ఉన్న ప్రయోజనాలు మరియు మంచి లక్షణాలను పరిగణలోకి తీసుకుని ఆలోచించడం మంచిది గదా!
ఉసిరి (Amla) గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- ఔషధశాస్త్ర నామం/బొటానికల్ పేరు: ఫిలంథస్ ఎమ్బ్లికా లేదా ఎమ్బ్లికా అఫిసినాలిస్
- కుటుంబం: ఫిలంథస్యే (Phyllanthaceae); యుఫోర్బిఎసే
- సాధారణ పేరు: ఇండియన్ గూస్బెర్రీ, ఆమ్లా
- సంస్కృతపేరు: ధత్రీ, అమలకా, అమలకి
- ఉపయోగించే భాగాలు: ఫ్రూట్ (తాజా మరియు ఎండబెట్టిన), విత్తనాలు, బెరడు, ఆకులు, పువ్వులు.
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: ఆమ్లా భారతదేశానికి చెందినది, కానీ ఇది చైనా మరియు మలేషియాలో కూడా పెరుగుతుంది.
- శక్తిశాస్త్రం: ఉసిరి కఫ, పిత్త మరియు వాత అనే మూడు దోషాలను సమతుల్యము చేస్తుందని నమ్ముతారు. అయితే, ఆయుర్వేద వైద్యులు అది ఖచ్చితమైన శీతలీకరణ చర్యను కలిగి ఉందని, దానిని తిన్నపుడు కడుపులో తేలికగా ఉంటుందని చెప్తారు.