భారతదేశం భూమధ్యరేఖకు చేరువలో ఉన్నందున, భారతీయులకు ఎండ/సూర్యరశ్మి సంవత్సరం పొడుగునా దండిగా లభిస్తుంది. అయితే సూర్యరశ్మిని సరైన పరిమాణంలో పొందడానికి, తద్వారా, మీ చర్మం విటమిన్ D ని ఉత్పత్తి చేయడానికి మీరు కొన్ని వాస్తవాలను జాగ్రత్తగా గమనించాలి.
విటమిన్ D ని పొందదానికి చాలా సహజమైన మార్గం ఏదంటే ఆఛ్చాదన లేని మీ చర్మాన్ని ఎండ వేడికి తగిలేట్టుగా చేయడం. శరీరంపై నిండుగా దుస్తులు ధరించి ఉన్నపుడు ఎండకు తగలని చర్మం విటమిన్ D ని సంశ్లేషణ చేయటానికి సూర్యరశ్మి సరిపోదు. మీ శరీరంలో శోషించిన విటమిన్ D మొత్తం గణన మీరు ఎంతసేపు (అంటే వ్యవధి) ఎండ మీ శరీరానికి తగిలేలా ఎండలో ఉన్నారు, ఎండలో ఏ కోణంలో నిల్చున్నారు (angulation), మీ చర్మం యొక్క రంగు మరియు మీ చర్మం యొక్క ఏ ప్రాంతంపై ఎండ పడేట్టుగా నిల్చున్నారు అనేవాటిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీ శరీరంలో ఎక్కువ భాగాన్ని ఎండ తగిలేట్టుగా చేయడం. అంటే మీ ముఖం మరియు చేతులకు బదులుగా మీ వీపును (శరీరంలో ఎక్కువభాగం) ఎండకు బహిర్గతం చేయడం వల్ల ఎక్కువ ప్రమాణంలో శరీరం సూర్యరశ్మిని గ్రహించేందుకు వీలవుతుంది, తద్వారా దాన్ని విటమిన్ D గా మార్చగలదు. గంటల తరబడి ఎండలో పడి ఎండాల్సిన పని లేదు, బాధ పడాల్సిన పనిలేదు. పగటిపూట బాగా ఎండ ఉన్న సమయంలో కేవలం 15 నిమిషాల (లేదా అంతకన్నా ఎక్కువ) పాటు మీరు ఎండలో (పని చేయడమో, ఆటలాడడమో చేస్తూ) ఉన్నట్లయితే చాలు. పగిటిపూట సరైన సమయం అంటే ఎండ ఎంత ఎక్కువగా లభిస్తుందనేది ముఖ్యం. ఇది ఆయా సీజన్లను బట్టి, మరియు ప్రాంతాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది.
విటమిన్ Dకి సంబంధించి జరిపిన అనేక పరిశోధనల ప్రకారం, మీరు భారతదేశంలో నివసిస్తుంటే, విటమిన్ D ని గ్రహించేందుకు అన్ని మాసాల్లోనూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎండలో గడపడం ఉత్తమం. కానీ వేసవి రోజులలో, UV కిరణాలు చాలా తీక్షణంగా, తీవ్రంగా ఉన్నప్పుడు, ఎండలో నిలబడకుండా మీ చర్మాన్ని చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదం నుండి రక్షించుకోవడం చాలా అవసరం. కాబట్టి, వేసవి సమయాల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎండలో గడపొచ్చని, ఇది సురక్షితమని పరిశోధన సూచిస్తోంది. అంతేకాక, మీరు భూమధ్యరేఖకు దగ్గరగా ఉంటారు, భూమధ్యరేఖకు అతి సమీపంలో నివసించేవాళ్ళంతా ఏడాది పొడవునా ఈ D విటమిన్ను పొందడం సులభం.
భారతదేశ ఉత్తరాది ప్రాంతంలో అత్యధికంగా UV (అల్ట్రావైయోలెట్) కిరణాలు లభిస్తాయని మరియు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అత్యంత కనీసంగా UV కిరణాల లభ్యత ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. దీనర్థం ఈశాన్య ప్రాంతాల్లో విటమిన్ D యొక్క లభ్యత కోసం ఎండలో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరముంటుంది. ఎండలో గడపాల్సిన సమయం కూడా మీ చర్మం రంగుపై ఆధారపడి ఉంటుంది. తెల్లని రంగు గల్గిన (ఫైరర్) చర్మం గల వాళ్ళు నలుపు రంగు లేదా ముదురు రంగున్నవారికంటే ఎక్కువ సూర్యకాంతిని గ్రహిస్టార్. చాలా తెల్లని రంగు గలవాళ్ళు ఎండలో 15 నిమిషాలు గడిపినా చాలు. అదే నల్లని చర్మం, ముదురు రంగు చర్మం ఉన్నవాళ్లు అయితే 45 నిమిషాల నుండి గంట ఎండలో గడిపితే 10,000 నుండి 25,000 IU ల ప్రమాణంలో విటమిన్ D ని పొందగలరని పరిశోధకులు సూచించారు. ఎండలో గడిపేటప్పుడు జాగ్రత్త వహించండి, ఎందుకంటే విటమిన్ D ని పొందేందుకు ఎండలో మీరు గడిపేటప్పుడు ఎండవల్ల బొబ్బలు, మరియు ఇతర చర్మ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి.