సోయ్‌బీన్ లేదా సోయాబీన్ అన్నది తినదగిన విత్తనం, అది బఠానీ కుటుంబానికి చెందినది. ఈ విత్తనాలు సోయాబీన్ మొక్కనుండి ఉత్పత్తి అవుతాయి, ఈ మొక్కలు చిన్న పాడ్లను కలిగిఉంటాయి, ఆ పాడ్లలో  ఈ విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలు గోళాకార ఆకారం‌లో ఉంటాయి మరియు ఇవి తాజాగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండి, అవి ఎండిపోయినప్పుడు పసుపు మరియు గోధుమ రంగులోనికి మారుతూ ఉంటాయి.        

సోయాబీన్స్ ఆగ్నేయ ఆసియా, ప్రత్యేకంగా చైనాలో పుట్టాయని నమ్ముచున్నారు. అవి నెమ్మదిగా జపాన్ మరియు ప్రపంచం‌లోని ఇతర భాగాల్లోనికి వ్యాపించాయి. ప్రస్తుతం, సోయాబీన్‌ అన్నిచోట్ల పండించ బడుతుంది. ప్రపంచం‌లో సోయాబీన్‌ను ఉత్పత్తి చేసే దేశాల్లో యునైటెడ్ స్టేట్స్ అగ్రదేశంగా ఉంది. వీటి తర్వాత బ్రెజిల్, అర్జెంటీనా మరియు చైనా ఉన్నాయి. భారతదేశంలో, అత్యధికంగా సోయాబీ‌న్స్‌ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలుగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు రాజస్థాన్ ఉన్నాయి.      

సోయా పాలు మరియు టోఫు వంటి వివిధ సోయా-ఆధారిత ఆహారపదార్థాలు తయారుచేసేందుకు సోయాబీ‌న్స్‌ను ఉపయోగిస్తారు. వివిధ మాంసం మరియు పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా కూడా దీనిని ఉపయోగిస్తారు. ఆసియా దేశాల్లో, సోయా సాస్, టెంఫె, పులియబెట్టిన బీన్ పేస్ట్, మరియు మిసో వంటి పులియబెట్టిన ఆహారపదార్థాలలో ప్రధాన భాగంగా సోయాను ఉపయోగిస్తారు. సోయాబీన్ ఆయిల్‌ను సేకరించేందుకు కూడా సోయాబీ‌న్స్‌ను ఉపయోగిస్తారు. ఒకసారి, సోయాబీన్ ఆయిల్ సేకరించిన తర్వాత, మిగిలిన దానిని సోయాబీన్ భోజనం అని పిలుస్తారు, ఇది ప్రొటీన్లను అధికంగా కలిగిఉంటుంది, దీనిని సోయా ప్రొటీన్ ఉత్పత్తిచేయడానికి ఉపయోగిస్తారు లేదా పశువులకు దాణాగా ఉపయోగిస్తారు.

వివిధ విటమిన్లు, ఖనిజాలు మరియు ప్రొటీన్లను కలిగిఉండడం వల్ల సోయాబీ‌న్స్ అత్యంత పోషకమైనది. అవి మధుమేహం నియంత్రణకు, బరువు తగ్గించేందుకు మరియు గుండె ఆరోగ్య నిర్వహణకు సహాయంచేస్తాయి. నిద్ర రుగ్మతలు నిరోధించేందుకు మరియు జీర్ణక్రియ మెరుగుపరిచేందుకు కూడా సోయాబీ‌న్స్‌ను ఉపయోగిస్తారు. వండకుండా సోయాబీన్స్‌ తిన్నప్పుడు అవి విషపూరితమైనవి. కాబట్టి, వాటిని తినేందుకు ముందుగా సక్రమంగా తప్పక వండాలి.     
సోయాబీన్స్ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

  • వృక్ష శాస్త్రీయ నామం: గ్లైసిన్ మాక్స్
  • జాతి: ఫాబేసి
  • వ్యవహారిక నామం: సోయాబీ‌న్స్, సోయా
  • సంస్కృత నామం: సోయామాష్ (సోయామాసా)
  • ఉపయోగించే భాగాలు: సోయాబీ‌న్స్ యొక్క బాహ్య షెల్ తినదగినది కాదు, కాబట్టి వాటి లోపలి నుండి బీన్స్ తీసుకోవడానికి పెంకు తీసివేస్తారు.  
  • జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: భారతదేశం‌లో వేగంగా పెరుగుతున్న పంటల్లో సోయాబీన్ ఒకటి మరియు ఇది ఒక ఖరీఫ్ పంటగా పండించబడుతుంది. భారతదేశంలో బోపాల్ సోయాబీన్స్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది.   
  • ఆసక్తికర విషయం: సివిల్ యుద్ధ సమయంలో, ప్రజలకు కొరత ఏర్పడినప్పుడు, కాఫీ విత్తనాలకు బదులుగా సోయాబీ‌న్స్ ను వారు ఉపయోగించారు. 
  1. సోయాబీ‌న్ పోషక విలువలు - Soybean nutrition facts in Telugu
  2. సోయాబీన్ ఆరోగ్య ప్రయోజనాలు - Soybean health benefits in Telugu
  3. సోయాబీన్స్ యొక్క దుష్ప్రభావాలు - Side effects of soybeans in Telugu
  4. టేక్‌అవే - Takeaway in Telugu

సోయాబీన్ అధిక పోషకమైనది. ఇది అధికంగా ప్రోటీన్లు, మరియు కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజాలు, మరియు విటమిన్ ఎ, బి1, బి2, బి3 మరియు బి9 వంటి విటమిన్లు కలిగిఉంది. శాకాహారులకు సోయాబీన్ అన్నది ప్రోటీన్లు కలిగిన శ్రేష్టమైన ఆధారంగా ఉంది. ఇది అధికంగా పీచు పదార్థాన్ని కూడా కలిగిఉంది.    

యుఎస్‌డిఎ పోషక విలువల డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల ఆకుపచ్చ సోయాబీ‌న్స్ క్రింద ఇవ్వబడిన విలువల్ని కలిగిఉంటాయి:

పోషక పదార్థం 100 గ్రా.ల్లో వాటి విలువ
నీరు 67.50 గ్రా.
శక్తి 147 కి.కేలరీలు
ప్రొటీన్ 12.95 గ్రా.
క్రొవ్వులు 6.80 గ్రా.
కార్బోహైడ్రేట్ 11.05 గ్రా.
ఫైబర్ 4.2 గ్రా.
ఖనిజాలు  
కాల్షియం 197 మి.గ్రా.
ఇనుము 3.55 గ్రా.
మెగ్నీషియం 65 మి.గ్రా.
ఫాస్ఫరస్ 194 మి.గ్రా.
పొటాషియం 620 మి.గ్రా.
సోడియం 15 మి.గ్రా.
జింక్ 0.99 మి.గ్రా.
విటమి‌న్లు  
విటమిన్ ఎ 9 µగ్రా.
విటమిన్ బి1 0.435 మి.గ్రా.
విటమిన్ బి2 0.175 మి.గ్రా.
విటమిన్ బి3 1.650 మి.గ్రా.
విటమిన్ బి6 0.065 మి.గ్రా.
విటమిన్ బి9 165 µగ్రా.
కొవ్వులు/ కొవ్వు ఆమ్లాలు  
సంతృప్త కొవ్వు ఆమ్లం 0.786 గ్రా.
మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లం 1.284 గ్రా.
బహు అసంతృప్త కొవ్వు ఆమ్లం 3.200 గ్రా.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

నిస్సందేహంగా సోయాబీన్ ఒక పోషకమైన ఆహార ఉత్పత్తి, అయితే దాని ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మనం పరిశీలిద్దాము.

  • బరువు తగ్గేందుకు ప్రోత్సహిస్తుంది: ప్రొటీన్లు అధికంగా కలిగిన వనరులలో సోయాబీ‌న్స్ ఒకటి, ఇందులో ఉండే ఒక సూక్ష్మ పోషక పదార్థం, బరువు తగ్గుటకు ప్రోత్సహిస్తుంది మరియు కండరాల బరువును వృద్ధిచేస్తుంది. సోయాబీన్ వాడకం శరీర బరువును మరియు మొత్తం కొవ్వు స్థాయిల్ని తగ్గించేందుకు దారితీస్తుందని ఇప్పుడు శాస్త్రీయంగా నిరూపించబడింది.       
  • ఎముకల్ని బలపరుస్తుంది: సోయాబీన్ యొక్క ఈస్ట్రోజెన్-వంటి ప్రభావాల కారణంగా సోయాబీన్స్ ఎముకలను సంరక్షించే చర్యను కలిగిఉందని పరిశోధనా సాక్ష్యాలు చెబుతున్నాయి. క్రమంగా సోయాబీ‌న్స్ వాడడం వల్ల ముందుగా మరియు తర్వాత ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలలో ఎముకల బలం పెరగడానికి ప్రత్యేకంగా ప్రభావం చూపిస్తుంది. 
  • నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది: క్లినికల్ అధ్యయనంలో, సోయాబీన్ వాడకం నిద్ర-మేల్కొలిపే చక్రం నియంత్రణతో పాటు నిద్ర యొక్క నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందని కనుగొనబడింది. ఇది నిద్ర సమయం పెరగడానికి కూడా సహాయపడుతుంది.    
  • యాంటి-డయాబెటిక్: చక్కెర వ్యాధి నిర్వహణలో సహాయం చేసే కొన్ని సమ్మేళనాల క్రమాన్ని సోయాబీ‌న్స్ కలిగిఉన్నాయి. ఇ‌న్సులిన్ నిరోధకత మరియు రక్త గ్లూకోజ్ స్థాయిల్లో పోస్ట్‌ ప్రా‌న్డియల్ స్పైక్ (పోస్ట్-మీల్) తగ్గించేందుకు ఇది నిరూపించబడింది.   
  • ఋతుక్రమం ఆగిన మహిళలకు ప్రయోజనాలు: పోస్ట్ మరియు ప్రీమెనోపాజల్ లక్షణాలు మెరుగుపడేందుకు సోయాబీన్ వాడకం సూచించబడింది. మెనోపాజ్ సమయంలో తీవ్రంగా  మరియు తరచుగా బయటకు వచ్చే వేడి నీటి బహిష్కరణలు తగ్గించేందుకు ఇది ముఖ్యమైన సాక్ష్యంగా ఉంది.  
  • రక్తహీనతను నిరోధిస్తుంది: జంతు నమూనాల్లో హిమోగ్లోబిన్ మరియు ఆర్‌బిసి స్థాయిల్ని మెరుగుపరిచేందుకు సోయాబీన్ వాడకం సూచించబడింది. ఇది సోయాబీ‌న్స్ యొక్క ఫెరిటిన్ కంటెంట్‌కు ఆపాదించబడింది, అవసరమైనప్పుడు ఇనుమును నిల్వచేసే మరియు విడుదలచేసే ఒక ప్రొటీన్. 

బరువు తగ్గుట కోసం సోయాబీ‌న్స్ - Soybeans for weight loss in Telugu

మధుమేహం, అధిక రక్తపోటు మరియు గుండె రక్తనాళాల వ్యాధి వంటి దీర్ఘకాల పరిస్థితులకు ఊబకాయం ప్రధాన ప్రమాద కారకంగా చెప్పవచ్చు. ఊబకాయం నియంత్రణకు సోయాబీ‌న్స్ సహాయం చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.   

ప్రొటీన్లు అధికంగా కలిగిన ఆహారపదార్థాలు కడుపునిండిన భావనను ప్రోత్సహిస్తాయనే విషయం బాగా-నిర్ధారించబడిన వాస్తవంగా ఉంది. ఇది అనారోగ్య అహారం పైన తక్కువ ఆసక్తి ఏర్పడేలా మిమ్మల్ని తయారుచేస్తుంది. తర్వాత, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారం కొవ్వు తగ్గించడంలో మరియు కండరాల కణజాలం వృద్ధిపొందడం‌లో మీకు సహాయం చేస్తుంది. ప్రొటీన్లు అధికంగా గల వనరుగా, సోయాబీ‌న్స్ మీకు ఈ ప్రయోజనాల్ని సమకూరుస్తుంది.

ఒబేసి అంశాల పైన చేసిన క్లినికల్ ట్రయల్స్‌లో, మాంసకృత్తుల ఆహారం అధికంగా తీసుకోవడం, బరువు తగ్గడానికి మరియు శరీరంలోని కొవ్వు తగ్గడానికి దారితీస్తుంది.  

ప్రొటీన్ మరింత ఎక్కువగా తీసుకున్నప్పుడు, హార్మోన్‌ పెఫ్టైడ్ YY లో పెరుగుదల ఉంటుంది, కడుపు నిండిన భావన కలిగేలా చేయడానికి ఇది బాధ్యత వహిస్తుంది అని పరిశోధకులు చెబుతున్నారు.   

క్రమంగా సోయాబీన్స్‌ను తీసుకోవడం శరీర బరువును తగ్గించడంతో పాటు,  చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డి‌ఎల్) తగ్గడానికి మరియు మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలు (టిసి) తగ్గడానికి దారితీస్తుందని అనేక ప్రిక్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

సోయా ప్రొటీన్ తీసుకోవడం కూడా శరీరంలో కొవ్వు పేరుకుపోయిన స్థాయిని తగ్గిస్తుంది. ఇది పిత్త అమ్లాల విసర్జనకు దారితీస్తుంది మరియు కాలేయంలో పెరిగిన కొవ్వును తగ్గించడానికి దారి తీస్తుంది.

కాబట్టి, సోయాబీ‌న్స్ మీకు అనేక విధానాలు ద్వారా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది మరియు ఇది  ఆరోగ్యకరంగా బరువు తగ్గే ఒక ప్రత్యామ్నాయంగా ఉంది. 

మధుమేహ నియంత్రణ కోసం సోయాబీ‌న్స్ - Soybeans for diabetes control in Telugu

గ్లూకోజ్ జీవక్రియల్లో అసమానతల కారణంగా అధిక రక్త చక్కెర స్థాయిల ద్వారా మధుమేహం అన్నది దీర్ఘకాలిక పరిస్థితిగా గుర్తించబడింది. వారి శరీరం తగినంత ఇ‌న్సులిన్ ఉత్పత్తి చేయని కారణంగా వ్యక్తులు మధుమేహ గ్రస్తులుగా మారుతున్నారు, ఈ ఇ‌న్సులిన్ గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు బాధ్యత వహిస్తుంది లేదా క్లోమం ద్వారా ఉత్పత్తి చేయబడ్డ ఇన్సులిన్‌ను శరీరం సమర్థవంతంగా ఉపయోగించుకోలేదు. ఇ‌న్సులిన్ నిరోధకత కారణంగా తర్వాత ఏర్పడినది, ఊబకాయం కారణంగా కలుగుతుంది.      

ఊబకాయంతో పోరాడడం ద్వారా ఇ‌న్సు‌లిన్ నిరోధకతను తగ్గించడంలో సోయాబీన్ వాడకం సహాయపడుతుందని పరిశోధకులు నిరూపించారు.  

భోజనానికి 60 నిమిషాల ముందు సోయాబీన్‌ను  తీసుకోవడం, బోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిని (భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయి) నియంత్రించేందుకు సహాయం చేస్తుందని ఒక క్లినికల్ అధ్యయనం సూచించింది.   

తియ్యగాలేని సోయా పదార్థాలను తీసుకోవడం వ్యాధి ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయం చేస్తుందని 43176 చైనీస్ అంశాల పైన చేసిన మరొక అధ్యయనం తెలియజేసింది. సోయా ఐసోఫ్లేవో‌న్స్ మరియు ఫైబర్, పాలిశాచరైడ్లు, ఫైటోస్టెరాల్ మరియు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వంటి ఇతర కాంపొనెంట్స్, సోయా ఆహారం యొక్క అధిక వినియోగం మరియు మధుమేహం యొక్క ప్రమాదాన్ని తగ్గించడం మధ్య ఉండే ఈ విలోమ సంబంధానికి బాధ్యత వహిస్తాయి.       

రక్తహీనత నివారణ కోసం సోయాబీ‌న్స్ - Soybeans for anaemia prevention in Telugu

శరీరంలో ఎర్ర రక్త కణాల (హిమోగ్లోబిన్) సంఖ్య తగ్గిపోవడం జరిగినప్పుడు, రక్తహీనత అనే పరిస్థితి ఏర్పడుతుంది. రక్తహీనతకు అనేక కారణాలు ఉండవచ్చు, అయితే అత్యంత సాధారణ కారణం ఇనుము లోపంగా ఉంది.   

ఐరన్ లోపం గల అనీమియా పైన సోయాబీన్ ఒక సానుకూల ప్రభావం కలిగి ఉందని పరిశోధన సూచిస్తుంది. సోయాబీన్ భర్తీ అన్నది ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుదలకు దారితీసిందని మరియు హిమోగ్లోబిన్ విలువల్లో మెరుగుదలకు దారితీసిందని రక్తహీనత ప్రేరిత జంతు నమూనాల పైన చేసిన అధ్యయనం సూచించింది.   

అవసరమైనప్పుడు ఇనుమును నిల్వచేసి మరియు విడుదల చేసే ఒక రకమైన ప్రొటీన్‌గా ఫెర్రిటిన్ ఉంది. కొంత మొత్తంలో ఫెర్రిటిన్ అన్నది సోయాబీన్‌లో ఇప్పటికే ఉంది, ఇది ఇనుమును నిల్వ చేసేందుకు సహాయంచేస్తుంది. ఫెర్రిటిన్‌తో బయోఫోర్టిఫికేషన్ ప్రక్రియ ఈ విలువను మెరుగుపరిచేందుకు మరింత సహాయం చేస్తుంది మరియు రక్తహీనత నివారణకు దారితీస్తుంది.   

గుండె కోసం సోయా‌బీ‌న్స్ - Soybeans for the heart in Telugu

గుండె రక్తనాళాల వ్యాధులు (సివిడిలు) గుండె మరియు రక్త నాళాల పనితీరును ప్రభావితం చేస్తాయి. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు మరియు మధుమేహం అన్నవి హృదయ సంబంధ వ్యాధులకు ముఖ్యమైన ప్రమాద కారకాలు.   

చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల యొక్క నివారణలో సోయా ప్రొటీన్ మరియు ఐసోఫ్లేవో‌న్స్ ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తాయని కొంతమంది పరిశోధకులు వాదిస్తున్నారు.   

అయితే, సోయాబీ‌న్స్ యొక్క అధిక ఫైబర్, విటమిన్, ఖనిజం మరియు బహుళ అసంతృప్త కొవ్వు పదార్థం గుండె ఆరోగ్యంలో మెరుగుదల కోసం బాధ్యత వహిస్తాయని మరొక పరిశోధన గుంపు రుజువు చేసింది.     

ప్రక్రియ ఏమైనా కావచ్చు, సోయా‌బీ‌న్స్ మీ గుండె ఆరోగ్యానికి అనుకూలమైనదని నిర్ధారణచేయబడింది. 

ఎముకల ఆరోగ్యం కోసం సోయా‌బీ‌న్స్ - Soybeans for bone health in Telugu

ఎముకలు శరీరం యొక్క సహాయక నిర్మాణాలు మరియు అంతర్గత అవయవాల యొక్క కదలిక, పని మరియు సంరక్షణలో సహాయం చేస్తాయి. అవసరమైన ఖనిజాలను నిల్వ చేయడం మరియు ఇతర శరీర పనులకు ఈ ఖనిజాలు అవసరమైనప్పుడు వాటిని విడుదల చేయడంలో కూడా ఇవి బాధ్యత వహిస్తాయి. ఇతర అవయవాలు గాయాల బారిన పడకుండా కూడా ఇవి రక్షిస్తాయి.    

ఎముకల్ని బలంగా ఉంచటానికి సోయాబీ‌న్స్ సహాయం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సోయాబీన్స్ అన్నవి సమ్మేళన ఐసోఫ్లేవో‌న్స్ కు గొప్ప ఆధారం, ఇది ఈస్ట్రోజెనిక్ కార్యాచరణలు కలిగిన  ఒక రకమైన రసాయన సమ్మేళనం మరియు ఇది బోలు ఎముకల వ్యాధి చికిత్సకు ఉపయోగించే మందుల నిర్మాణాన్ని పోలిన నిర్మాణమును కలిగిఉంటుంది. ఎముక నిర్మాణానికి రక్షణగా ఎస్ట్రోజెన్ ఉంది మరియు ఈస్ట్రోజెన్ వంటి సమ్మేళనాలను అధికంగా కలిగిఉంది, ఎముక బలాన్ని కాపాడేందుకు సంపూర్ణమైన ఆహారంగా సోయాబీ‌న్స్ ఉంది. సోయాబీన్ ఐసోఫ్లేవోన్లు స్త్రీల మెనోపాజ్‌కు ముందు మరియు తర్వాత స్త్రీలలో ఎముక సాంద్రతను పెంచుతాయి. ఎముక ఆరోగ్యం మెరుగుపడడం కోసం సోయాబీన్ ‌ను వారి ఆహారంలో చేర్చాలని పరిశోధనలు బలమైన సిఫార్సులు చేస్తున్నాయి.         

నిద్ర రుగ్మతల కోసం సోయాబీ‌న్స్ - Soybeans for sleep disorders in Telugu

నిద్ర రుగ్మతలు నిద్ర పద్దతుల్లో మార్పులను కలుగజేస్తాయి, ఇవి శరీరంపైన ప్రతికూల ప్రభావాన్ని కలిగిఉంటాయి. నిద్రలేమి, అలసట, ఆందోళన మరియు రోజు అంతా నిద్రపోవాలనే బలమైన కోరికను కలిగి ఉండడం వంటివి నిద్ర రుగ్మతల యొక్క కొన్ని సాధారణ లక్షణాలు.  

అధ్యయనం ప్రకారం, సోయాబీన్‌లో ఉండే ఐసోఫ్లేవో‌న్స్ నిద్ర నాణ్యతను మెరుగుపరిచేందుకు సహాయపడతాయి. ఐసోఫ్లేవోన్ అన్నది ఒక రకమైన ఫైటోఈస్ట్రోజెన్, ఇది మానవ శరీరంలో కనిపించే ఈస్ట్రోజెన్ నిర్మాణముతో పోల్చదగిన సరిసమానమైన నిర్మాణమును కలిగిఉంటుంది. నిద్రపోవడం-మేల్కొనడం చక్రాన్ని క్రమబద్దీకరించేందుకు ఈస్ట్రోజెన్ బాధ్యత వహిస్తుంది.      

ఐసోఫ్లేవో‌న్స్ అధికంగా తీసుకోవడం నిద్ర యొక్క వ్యవధిని నియంత్రించేందుకు సహాయపడుతుంది, అదేవిధంగా నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుందని 1076 మంది పెద్ద వయస్సుగల వారిపైన జరిగిన ఒక క్లినికల్ అధ్యయనం సూచించింది.

ఐసోఫ్లేవోన్స్ మంచి నిద్ర నాణ్యతతో సంబంధం కలిగిఉంటాయని 169 మంది ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీల పైన జరిగిన మరొక పరిశోధన తెలియజేసింది.   

కాబట్టి, మంచిగా నిద్రపోవడానికి ఒక గిన్నెలో రుచికరమైన సోయాబీ‌న్స్‌ను ముంచి తీసుకొనండి.   

ఇర్రిటబుల్ బవల్ సిండ్రోమ్ చికిత్స కోసం సోయాబీ‌న్స్ - Soybeans to treat irritable bowel syndrome in Telugu

ఇర్రిటబుల్ బవల్ సిండ్రోమ్ (ఐ‌బి‌ఎస్) అన్నది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ప్రేగు పనితీరులో మార్పులతో పాటు కడుపు తిమ్మిర్లు, మలబద్ధకం, అతిసారం మరియు ఉబ్బరం వంటి జీర్ణక్రియ లక్షణాల చేత ఇది వివరించబడుతుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంగా ఉన్నప్పటికీ, మీ ఆహారం మరియు జీవనశైలి నిర్వహణ ద్వారా దీనిని నియంత్రణలో ఉంచవచ్చు.    

ఆహారంలో సోయాబీ‌న్స్‌ ను ఉపయోగించి జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడం ద్వారా ఐబిఎస్ నియంత్రణకు సహాయపడుతుందని పరిశోధన సూచిస్తుంది. అయినప్పటికీ, దీనిని అధ్యయనం చేసే సమయంలో వీటి లక్షణాలలో మెరుగుదలకు ఇది ఏవిధమైన హామీ ఇవ్వడం లేదు.     

ఐసోఫ్లేవో‌న్స్ మరియు వాటి పదార్థాలైన డైడ్జిన్ మరియు జెనిస్టీన్ అన్నవి పేగు అవరోధం యొక్క పనితీరును మెరుగుపరుస్తాయని అధ్యయనం పేర్కొంది. ఐసోఫ్లేవో‌న్స్ యొక్క యాంటిఆక్సిడంట్ లక్షణాల కారణంగా ఇది ప్రేగుల్ని కూడా కాపాడుతుంది.    

సోయా ఐసోఫ్లేవో‌న్స్ అన్నవి ప్రేగు సైటోకైన్ల నుండి ప్రేగు అంత్రమును కాపాడుతాయని మరలా పేర్కొనబడింది, ఇది ప్రకోప ప్రేగు సిండ్రో‌మ్ ప్రారంభానికి దారితీస్తుంది.   

కేన్సర్ నివారణకు సోయాబీన్స్ - Soybeans for cancer prevention in Telugu

అత్యంత భయంకరమైన వ్యాధుల్లో కేన్సర్ ఒకటి. అసాధారణమైన కణం పెరుగుదల వల్ల ఇది ఏర్పడుతుంది మరియు స్థూలకాయం, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, పర్యావరణ మార్పులు, పొగత్రాగడం మరియు దీర్ఘకాలిక మంట అన్నవి కే‌న్సర్ యొక్క ప్రమాద కారకాలుగా ఉన్నవి.  

యాంటిఆక్సిడంట్ లక్షణాలు కలిగిన సోయా ఉత్పత్తులు మరియు సోయా ప్రొటీన్ కే‌న్సర్ యొక్క నివారణలో సహాయం చేస్తాయని పరిశోధన తెలియజేస్తుంది. వాటిలో ఉండే పాలీఫినోలిక్ సమ్మేళనాల ఉనికి కారణంగా ఇవి కేన్సర్‌ను నివారిస్తాయి. ఐసోఫ్లేవో‌న్స్, క్లోరోజెనిక్ ఆమ్లం, కెఫెయిక్ ఆమ్లం మరియు ఫెరోలిక్ ఆమ్లం వంటి వాటిని ఈ సమ్మేళనాలు కలిగిఉంటాయి.      

రొమ్ము కేన్సర్ కలిగిన 6000 మంది కంటే ఎక్కువ మంది స్త్రీల పైన చేసిన ఒక క్లినికల్ అధ్యయనం ప్రకారం, ఐసోఫ్లేవో‌న్లు అధికంగా ఉండే సోయా ఆహారపదార్థాల్ని తీసుకోవడం, వ్యాధి కారణంగా సంభవించే మరణాల ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలియజేసింది.  

ఋతుక్రమం ఆగిపోయిన లక్షణాలు గల వారి కోసం సోయాబీ‌న్స్ - Soybeans for menopausal symptoms in Telugu

పునరుత్పత్తి హార్మోన్ల క్షీణత కారణంగా ఒక స్త్రీ తన పీరియడ్లు పొందే కాలం ఆగిపోయే పరిస్థితికి రావడాన్ని మెనోపాజ్ అంటారు. ఒక స్త్రీ 40-50 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఇది సాధారణంగా ఏర్పడుతుంది. సాధారణంగా ఋతుక్రమం ఆగిన వారిలో వేడి సెగలు (వెచ్చగా ఉండే భావన కలిగిఉండడం), నిద్ర ఆటంకాలు, ఆందోళన మరియు మానసిక రుగ్మతలు వంటి కొన్ని లక్షణాలు ఉంటాయి.     

పరిశోధన ప్రకారం, మెనోపాజ్ యొక్క ప్రారంభం మరియు ముగింపు లక్షణాలను తగ్గించడానికి సోయాబీ‌న్స్ సహాయంచేస్తాయి.

దీనితోపాటు, సోయాలో ఉండే ఐసోఫ్లేవోన్లు స్త్రీలలో తరచుగా మరియు తీవ్రంగా వచ్చే వేడి సెగలను తగ్గించేందుకు సహాయం చేస్తాయని సూచించబడింది.  

  • అలెర్జీ ప్రతిచర్యలు: సోయా అలెర్జీ సాధారణంగా చిన్నతనం‌లో ఏర్పడుతుంది. చర్మంపై దురద మంట మరియు ప్రేగుల యొక్క మరియు పెద్దప్రేగు యొక్క మంట (చిన్న ప్రేగు మంట) వంటి లక్షణాలు ఉంటాయి. ఆవుపాల యొక్క అలెర్జీకి గురయ్యే వ్యక్తులు తరచుగా సోయా అలెర్జీకి గురవుతారు.  
  • కడుపు ఉబ్బటం: జీర్ణవ్యవస్థలో గ్యాస్ చేరడాన్ని కడుపు ఉబ్బరం అంటారు. సోయాలోని కొన్ని ట్రైసాచురైడ్లు, టెట్రాసాచురైడ్లు మరియు ఒలిగోసాచురైడ్లు కడుపు ఉబ్బరానికి కారణమని పరిశోధనలు సూచిస్తున్నాయి. నానబెట్టిన సోయా తినడానికి ముందు మొలకెత్తేలా చేసినప్పుడు, అది సోయా కారణంగా వచ్చిన కడుపు ఉబ్బరాన్ని నివారించేందుకు సహాయపడుతుంది.   
  • ఇదేకాకుండా, సోయాబీ‌న్సును అధికంగా తీసుకోవడం బరువు పెరిగేందుకు, అతిసార రోగం, కడుపు తిమ్మిరికి దారితీస్తుంది. సోయాబీన్ ఐసోఫ్లావోనాయిడ్స్ యొక్క అదనపు వినియోగం గర్భాశయ అసాధారణ పెరుగుదలకు దారితీస్తుంది (గర్భాశయం యొక్క గర్భాశయ లోపలి పొర గట్టిపడటం).      

శరీరానికి కావలసిన ప్రొటీన్, విటమి‌న్స్ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను అందించే అద్భుతమైన వనరుగా సోయాబీ‌న్స్ ఉన్నాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఐసోఫ్లేవో‌న్ల యొక్క గొప్ప వనరుగా ఇవి ఉన్నాయి. సోయాబీన్ల యొక్క యాంటిఆక్సిడంట్ లక్షణాల కారణంగా వీటి యొక్క క్రమమైన వినియోగం కే‌న్సర్ నివారణకు సహాయపడుతుంది. ఋతుక్రమం ఆగిన లక్షణాలు, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, ఇనుము లోపం కలిగిన అనీమియా నివారించడానికి కూడా సోయాబీన్లు సహాయపడతాయి మరియు గుండెను కాపాడతాయి. అయితే, కొంతమంది ప్రజలు సోయాబీన్లు మరియు సోయా ఉత్పత్తులకు అలెర్జిక్‌గా ఉండవచ్చు మరియు కొంతమందిలో ఇది కడుపు ఉబ్బరానికి కారణం కావచ్చు. అందువల్ల, సోయాబీన్లను వినియోగించే ముందు అలెర్జీ ఉన్నది, లేనిది తెలుసుకోవడం మంచిది మరియు అప్పుడు కూడా మితంగా తగిన మోతాదులో తినడం మంచిది.        


Medicines / Products that contain Soybean

వనరులు

  1. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 11450, Soybeans, green, raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  2. Manuel T. Velasquez, Sam J. Bhathena. Role of Dietary Soy Protein in Obesity Int J Med Sci. 2007; 4(2): 72–82. PMID: 17396158
  3. Kang MJ, Kim JI, Yoon SY, Kim JC, Cha IJ. Pinitol from soybeans reduces postprandial blood glucose in patients with type 2 diabetes mellitus. J Med Food. 2006 Summer;9(2):182-6. PMID: 16822203
  4. Noel T. Mueller et al. Soy intake and risk of type 2 diabetes mellitus in Chinese Singaporeans. Eur J Nutr. 2012 Dec; 51(8): 1033–1040. PMID: 22094581
  5. Messina M, Messina V. Soyfoods, soybean isoflavones, and bone health: a brief overview. J Ren Nutr. 2000 Apr;10(2):63-8. PMID: 10757817
  6. Yufei Cui et al. Relationship between daily isoflavone intake and sleep in Japanese adults: a cross-sectional study. Nutr J. 2015; 14: 127. PMID: 26715160
  7. Mahsa Jalili et al. Soy Isoflavones Supplementation for Patients with Irritable Bowel Syndrome: A Randomized Double Blind Clinical Trial Middle East J Dig Dis. 2015 Jul; 7: 170–176. PMID: 26396720
  8. Database of Abstracts of Reviews of Effects (DARE): Quality-assessed Reviews [Internet]. York (UK): Centre for Reviews and Dissemination (UK); 1995-. Extracted or synthesized soybean isoflavones reduce menopausal hot flash frequency and severity: systematic review and meta-analysis of randomized controlled trials. 2012.
  9. J.J. RACKIS. Flatulence Caused. by Soya and Its Control through Processing. TEE JOl'RNAL OF THE AMERICAN OIL CHDlISTS' SOCIETY, Vol. 58, No, 3, Pages: 503-510 (1981), United States Department of Agriculture
  10. National Center for Complementary and Integrative Health [Internet] Bethesda, Maryland; Soy
Read on app