మునక్కాయ లేదా మునక్కాడ అనేది మానవజాతి చరిత్రలో విస్తృతంగా ఉపయోగించే మొక్కలు ఒకటి. మునక్కాయ యొక్క విశిష్టత ఏంటి అంటే నీటి లోటు పరిస్థితులలో కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది జాగ్రత్త అవసరం లేకుండానే అవసరమైన పోషకాలు, ఖనిజాలు, మరియు విటమిన్లు ఇచ్చే ఒక గొప్ప వనరుగా ఉంది. వాస్తవానికి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పండితులు దీనిని సూపర్ ఫుడ్ గా (ఉత్తమ ఆహరంగా) భావిస్తారు. పరిశోధనా అభివృద్ధితో, ఈ మొక్క యొక్క ఆరోగ్య లాభాల గురించి మరింత మంది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఆహారంగా మాత్రమే ఉపయోగించడం కాకుండా,మునక్కాయ మొక్కను ఇంధనం కోసం, పశువుల పెంపకం, ఎరువులు మరియు సౌందర్యసాధనాలు మరియు సుగంధద్రవ్యాలలో ఉపయోగిస్తారు.
ఇది ఈరోజు ఒక అద్భుతమైన చెట్టు, కానీ ఇది ఆధునిక ఆవిష్కరణ కాదు. మునగ చెట్టును మానవులు 150 బి.సి. లోనే ఉపయోగించారు. కొందరు చరిత్రకారుల ప్రకారం, మౌర్య సైన్యం యొక్క ప్రధాన పోషక పదార్ధంగా మునక్కాయ ఉంది, అదే అలెగ్జాండర్ సైన్యాన్ని ఓడించిందని ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదం ప్రకారం, కనీసం 300 మానవ వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం మునక్కడకు ఉంది. కేవలం మునగాకులే వాటి అద్భుతమైన వైద్యం సంభావ్యత కోసం ప్రసిద్ది చెందాయి. మునక్కాయ చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అన్ని తెలుస్తే, మనం దాన్ని ఒక అద్భుతమైన చెట్టు అని తెలుసుకుంటాము.
మునగ చెట్టు గురించి కొన్ని ప్రాధిమిక నిజాలు
- శాస్త్రీయ నామము: మొరింగా ఒలిఫెర (Moringa oleifera)
- కుటుంబం: ఫెబెసీ (Fabaceae)
- సాధారణ నామాలు: మునగచెట్టు, సాహిజన్, డ్రమ్ స్టిక్ ట్రీ, హార్స్రాడిష్ ట్రీ, బెన్ ఆయిల్ ట్రీ
- సంసృత నామము: శోభంజాన, డన్సషముల, శీఘ్ర శోభంజాన
- ఉపయోగించే భాగాలూ: వేర్లు, బెరడు, కాయలు, ఆకులు, పువ్వులు, పసరు.
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: మునగ చెట్టు ఉత్తర భారత దేశానికి చెందినది కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండలములు, ఉప ఉష్ణమండలములలో పెరుగుతుంది.
- శక్తి శాస్త్రం: వేడి