భారతీయ ఉపఖండంలోని ఉప-హిమాలయన్ మైదానాలలో పండిస్తున్న అధిక పోషక-సమృద్ధమైన పండ్లలో “మామిడి” ఒకటి. మామిడి పండు ప్రత్యేకమైన కమ్మదనాన్ని, రుచిని మరియు సువాసనని కల్గి ఉంటుంది. మరి ఇలాంటి అద్భుతమైన పండును తర తరాల నుండి దాదాపు ప్రతి భారతీయుడు ఇష్టంగా తిని ఆస్వాదిస్తున్నారు. వేసవి కాలంలో భారతదేశంలో మామిడి లేదా మామిడిపండ్ల రసాన్ని ఎవరు ఇష్టపడరు చెప్పండి? వాస్తవానికి, మామిడి యొక్క అద్భుతమైన పరలోక రుచి (heavenly taste) కారణంగా దాన్ని'దేవతల ఆహారంగా' పిలువడం జరుగుతోంది. మామిడిని ప్రాచీన కాలం నుండి సాగు చేయడం జరుగుతోంది. ప్రసిద్ధ కవి, కాళిదాస మామిడిపండ్ల రుచిని తన పురాణగ్రంథాల్లో పొగిడారని తెలుస్తోంది. అలాగే, మొఘల్ పాలకుడు, అక్బర్ చక్రవర్తి, ఆధునిక బీహార్ లో ‘దర్భంగా’ అని పిలువబడే ప్రదేశంలో 1,00,000 మామిడి చెట్లను నాటారు అని నమ్మడం జరుగుతోంది.
కానీ, మామిడిలో దాని రసభరితమైన (జ్యుసి) రుచి, కమ్మదనం కంటే అది అందించే లాభాలు ఎన్నో ఉన్నాయి. మామిడి పండులో విటమిన్లు, పాలీ ఫెనోలిక్ ఫ్లేవానోయిడ్ అనామ్లజనకాలు, ప్రీబయోటిక్ డైటరీ పీచుపదార్థాలు, మరియు ఖనిజాలు ఉంటాయి. దీనిలో విటమిన్ A, C మరియు D వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి, ఇది మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మామిడిపండ్లను పండుగా లేదా రసాలను తీసి జ్యూస్ గా/షేక్స్ లాగా సేవించవచ్చు, ఎలా తిన్నా కూడా మీరు దాని ఆరోగ్య ప్రోత్సహక లక్షణాల ఫలితాన్ని పొందుతారు. మామిడిపండులో ఉండే ఈ రెండింతల ప్రయోజనాలవల్లే బహుశా దానికి "పండ్ల రాజు" అనే కీర్తి దక్కిందనొచ్చు.
మామిడి ఎక్కువగా ఉష్ణమండల దేశాల్లో పెరుగుతుంది, అయితే మామిడి ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదేశం. ఎందుకు కాకూడదు? మామిడి భారతదేశం యొక్క జాతీయ పండు కూడా. కొండ ప్రాంతాల మినహా, మామిడి భారతదేశం యొక్క దాదాపు అన్ని ప్రాంతాలలో సాగు చేస్తారు. ఒక్క భారతదేశంలోనే వంద రకాలకు పైగా మామిడి రకాలు ఉన్నాయని తెలిస్తే మీకెంతో ఎంతో ఆనందం కలిగక మానదు. మామిడిపండ్లు వివిధ ఆకారాలు, పరిమాణాలు మరియు రంగుల్లో వస్తాయి. భారతదేశంలో లభిచే మామిడిపండ్ల ప్రసిద్ధ రకాలు కొన్నిఏవంటేలాంగ్రా (Langra), బంగినపల్లి , చౌసా (Chausa), తోతాపురి (totaapuri), సఫేదా (Safeda), ఆల్ఫోన్సో మామిడిపండ్లు మొదలైనవి
మామిడి సాధారణంగా అండాకారంలో ఉండి మీగడవంటి గుజ్జును మరియు కండను కలిగిఉంటుంది. వృక్షశాస్త్రజ్ఞులు మామిడిని టెంక (జీడు) గల్గిన కాయ (drupe) లేక రాతిపండు అని వర్ణించారు, లోపల విత్తనంకల్గిన టెంక (pit or stone)ను ఇది కల్గి ఉంటుంది. ఒక షెల్ (పిట్ లేదా రాయి) పరిసరాల్లో ఉన్న ఒక విత్తనాలతో చుట్టబడిన ఒక ప్రత్యేకమైన బయటి కండర భాగం కలిగి ఉంటుంది. శప్తాలుపండు (peach)కు మరియు అనానస్ (పైనాపిల్) పండుకు మధ్యన ఉండే రుచిని మామిడిపండు కల్గి ఉంటుందని ఆహారప్రియులు వర్ణిస్తారు.
మామిడి చెట్టు ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో పెద్ద చెట్టుగా, అటుపై మానుగా ఆకులతో కూడుకుని బాగా పెరుగుతుంది, ఇది సతతహరితమైన మాను (ప్రతి సంవత్సరం నాటాల్సిన అవసరం లేదు). మామిడి పండ్ల చర్మం రంగులో భిన్నంగా ఉంటుంది, అంటే రకరకాల మామిడిపండ్లు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. సాధారణంగా, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు మరియు నారింజ రంగుల్లో మామిళ్ళు వస్తాయి. కానీ మామిడి పండు యొక్క అంతర్గత రసభరిత గుజ్జు మాత్రం సాధారణంగా బంగారు-పసుపు రంగులోనే ఉంటుంది. ఇంకా మాగని (పండని) మామిడికాయ పైన తొక్క (చర్మం) నునుపుగా మరియు ఆకుపచ్చగా ఉంటుంది, కానీ అది పండే వృక్షాన్ని బట్టి బంగారు పసుపు, పసుపు, క్రిమ్సన్ ఎరుపు, లేదా నారింజ-ఎరుపు వర్ణాలు మామిడి పండుకు రావడం జరుగుతుంది. మామిడి పండ్లు సాధారణంగా ఫిబ్రవరి మరియు ఆగస్టు నెలల మధ్య పండుతాయి. పండిన మామిడి సాధారణంగా తియ్యగా ఉంటుంది, కానీ వాటిలో కొన్ని మాగి పండైనా కూడా ఇంకా పుల్లని రుచినే కలిగి ఉంటాయి.
మామిడిని తాజాగానే తింటారు. లేదా చట్నీ, ఎండిన మామిడి ఉత్పత్తులు, పురీ, ఊరగాయలు, కూరలు, మామిడితేనె మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డబ్బాల్లో భద్రపరిచే (క్యాన్డ్) ఘనీభవించిన మామిడి ముక్కలుగా తయారు చేయబడుతుంది. మనం పచ్చి మామిడికాయలనుండి “ఆమ్ పన్నా” మరియు పండిన మామిడి నుండి మామిడి మిల్క్ షేక్ (mango milkshake), మామిడి రసం (ఆమ్ రష్) చేసుకుంటాం. మామిడి కుల్ఫీ, (mango kulfi), సోర్బెట్లు (sorbets) మరియు మామిడి ఐస్ స్క్రీముల్ని పండిన మామిడి గుజ్జు నుండి తయారు చేయవచ్చు. మామిడి జాంలను ఎలా మర్చిపోగలం చెప్పండి! మామిడి జామ్ అంటే పిల్లలకు చాలా ఇష్టం.
పచ్చి మామిడి కాయని ముక్కలుగా కోసుకుని ఉప్పు -కారంతో తింటారు, చాలా రుచిగా ఉంటుంది.
మీకు తెలుసా?
పూర్తిగా పండిన మామిడిపండు సంపదను సూచిస్తుంది. నిజానికి, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి మామిడి పండే!
మామిడి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: మాంగిఫెరా ఇండికా (Mangifera indica)
- కుటుంబము: అనకార్డియేసి (Anacardiaceae).
- సాధారణ పేరు: మామిడి, ఆమ్
- సంస్కృత నామం: అమ్రాం
- ఉపయోగించే భాగాలు: చక్కెరవ్యాధి (మధుమేహం) చికిత్స కోసం మామిడి ఆకులు చాలా ఉపయోగపడతాయి. భారతదేశంలో పవిత్రమైన సందర్భాలలో లేదా పండుగ రోజులలో ప్రతి ఇంట్లోను తమ ముంగిటి తలుపులకు తోరణాల్ని కట్టడానికి మామిడాకులనే ఉపయోగిస్తారు. మామిడి విత్తనాలను చమురు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. మామిడి పండును అందరూ ఇష్టపడతారు.
- స్థానికత మరియు భౌగోళిక విస్తీర్ణం: మామిడి దక్షిణ ఆసియాకు చెందినది. దక్షిణ ఆసియాలో మామిడి సాగుచేయబడుతోంది, ప్రశంసించబడుతోంది మరియు పురాతన కాలం నుంచి తన మాతృభూమిలో అందరిచేత ఇష్టంగా చూడబడుతోంది, ఆరాధింపబడుతోంది. పెర్షియన్లు దీనిని క్రీ.శ 10 వ శతాబ్దంలో తూర్పు ఆఫ్రికాకు తీసుకువెళ్లారు అని చెప్పబడింది. 1833 లో మామిడిని యుకాటన్ నుండి కేప్ సబలే కు డాక్టర్ హెన్రీ పెరిన్ టెంకల నుండి మొలకెత్తిన మామిడి మొక్కల్ని రవాణా చేయబడ్డాయి కానీ అతను భారతీయులచే చంపబడిన తరువాత ఆ మామిడి మొక్కలన్నీ బతకలేదు. 1862 లేదా 1863 లో డాక్టర్ ఫ్లెచర్ చే మామిడి విత్తనాలు వెస్ట్ ఇండీస్ నుండి మయామి లోకి దిగుమతి చేసుకోబడ్డాయి. బౌద్ధ సన్యాసులు మలయా మరియు తూర్పు ఆసియా ప్రాంతాల్లో మామిడిని కీ.పూ 4 వ మరియు 5 వ శతాబ్దం లో తీసుకువచ్చారని నమ్ముతారు. మామిడి 1782 లో జమైకాకు చేరుకుంది, మరియు 19 వ శతాబ్దం ప్రారంభంలో ఇది ఫిలిప్పీన్స్ మరియు వెస్టిండీస్ నుండి మెక్సికోకు చేరుకుంది.
- మామిడి గురించిన తమాషా వాస్తవాలు (ఫన్ ఫాక్ట్స్): 1. ఒకరు మరొకరికి ఓ బుట్ట నిండా మామిడి పండ్లను కానుకగా ఇవ్వడాన్ని స్నేహానికి గుర్తుగా భావిస్తారు.
2. మామిడి ఆకుల్ని తరచుగా వివాహ సందర్భాల్లో ఉపయోగిస్తారు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటకు అనేకమంది పిల్లలు కలగాలని ఆకాంక్షిస్తూ మామిడాకుల్ని ఉపయోగిస్తారు.