వెల్లుల్లిని “తెల్లగడ్డ” “ఎల్లిగడ్డ” అని కూడా అంటారు. వెల్లుల్లికున్న పలు ఔషధ గుణాలు మరియు ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దాన్ని “పాకహర్షం”గా వర్ణించవచ్చు. దీనికున్నఓ ప్రత్యేకమైన కారం, లేదా ఘాటైన రుచి, ఆహారాలకు ఓ ప్రత్యేకమైన రుచిని, ఇంపును సంతరింపజేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉండే వంటనిపుణులు వెల్లుల్లిని చాలా ఇష్టపడతారు. వెల్లుల్లి మధ్య ఆసియాకు చెందినదే కానీ దీనికి వంటల వాడకంలోను మరియు ఔషధ వినియోగంలోను విస్తారమైన చరిత్ర ఉంది. అమెరికా వ్యవసాయశాఖ-USDA (యునైటెడ్ స్టేట్స్ డిపార్టుమెంటు అఫ్ అగ్రికల్చర్) ప్రకారం, వెల్లుల్లి సాగు చేస్తున్న పురాతనమైన పంటలలో ఒకటి.

వెల్లుల్లిని 2100 BC నాటికే సుమేరియన్లు ఖాద్యవస్తువుగా ఉపయోగించేవారు.  వెల్లుల్లికున్న ఆకలి కల్గించే గుణం మరియు ఔషధ లక్షణాల కారణంగా దీన్ని పురాతన భారతీయులు కూడా ఉపయోగించారు. గ్రీస్ దేశం లోని కొన్ని దేవతలకు వెల్లుల్లిని నైవేద్యంగా సమర్పిస్తారంటే మీకు ఆశ్చర్యం కల్గుతుంది కదూ! కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, పురాతన గ్రీస్ దేశంలోని ఒలింపిక్ ఆటగాళ్ళు తమ పనితీరును మెరుగుపర్చుకునేందుకు వెల్లుల్లిని సేవిస్తారు.

ఇరాన్, టిబెట్, ఇజ్రాయెల్, పెర్షియన్లు, బాబిలోనియన్లుతో పాటు ప్రపంచంలోని అన్ని ప్రధాన నాగరికతలలోనూ వెల్లుల్లి వాడకం మరియు ఔషధ ప్రయోజనాల గురించిన చరిత్రలు కనిపిస్తాయి. నిజానికి, వెల్లుల్లికున్న  వైద్యప్రయోజనాల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణుల దీనిని పలు విధాలుగా వర్ణించారు. "సహజ యాంటీబయోటిక్," "ప్లాంట్ టాలిస్మాన్," మరియు "రష్యన్ పెన్సిలిన్" వంటి పేర్లతో ఆరోగ్య నిపుణులు వెల్లుల్లిని పొగిడారు. వెల్లుల్లికున్న ఆరోగ్యసంరక్షక ప్రయోజనాలకుగాను ఈజిప్ట్ దేశస్థులు వెల్లుల్లికి అత్యంత విలువైన స్థానాన్నిచ్చినారు. వాస్తవానికి, ప్రాచీన ఈజిప్టులోని పిరమిడ్లను నిర్మించిన బానిసలకు పోషకాహార పదార్ధం వలె వెల్లుల్లిని వడ్డించినట్లు శిలా శాసనాలపై పేర్కొనబడింది. ఈ విషయం కొన్ని ఈజిప్ట్ టాబులెట్ల (egyptian tablets) ద్వారా తెలియవచ్చింది. బానిసలందరికీ తగినంత ప్రమాణంలో వెల్లుల్లిని సేకరించేందుకు ఈజిప్షియన్లు పెద్ద మొత్తంలోనే సంపదను ఖర్చు చేశారు.

మీకు తెలుసా? 

ఆయుర్వేదంలో పేర్కొన్న ఆరు రుచులలో (షడ్రుచులు) ఐదు రుచుల్ని వెల్లుల్లి తనలో నింపుకుంది. వెల్లుల్లి కల్గిన ఆ ఐదు రుచులేవంటే-ఒకలాంటి తీక్షణమైన కారం, లవణం అంటే ఉప్పదనం, తీపి, చేదు మరియు ఒగరు. ఆయుర్వేదం పేర్కొన్న షడ్రుచులలో ఒకటైన పుల్లని రుచి మాత్రం వెల్లుల్లిలో లేదు.   

వెల్లుల్లి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు

  • ఓషధీశాస్త్రం (బొటానికల్) పేరు: అల్లియం సాటివమ్ (Allium sativum)  
  • కుటుంబం: అల్లైసియే / అమర్యాలిడేస్యే (లిలియాసియా)
  • సాధారణ పేరు: వెల్లుల్లి, లెహ్సున్
  • సంస్కృత నామం: లసున
  • ఉపయోగించే భాగాలు: గడ్డలు, లేత రెమ్మలు (వంట కోసం)
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: వెల్లుల్లి మొక్కకు  ఆసియానే పుట్టినిల్లు/సొంత ఊరు. ఇది భారతదేశంలో, చైనాలో, ఈజిప్టులో, యూరోప్, ఇరాన్ మరియు మెక్సికో లలో గోచరిస్తుంది/లభిస్తుంది.  
  • శక్తిశాస్త్రం: ఉష్ణం కలుగజేస్తుంది
  1. వెల్లుల్లిలో రకాలు మరియు వెల్లుల్లి యొక్క వైవిధ్యాలు - Types and Varieties of Garlic in Telugu
  2. వెల్లుల్లి పోషక వాస్తవాలు - Garlic Nutrional Facts in Telugu
  3. వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు - Garlic health benefits in Telugu
  4. వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి - How to use garlic in Telugu
  5. వెల్లుల్లిని నిత్యం ఎంత తీసుకోవచ్చు - How much garlic can be taken everyday in Telugu
  6. వెల్లుల్లి దుష్ప్రభావాలు - Garlic side effects in Telugu

వెల్లుల్లిలో రకాలు

వెల్లుల్లి 1 మీటర్ ఎత్తు వరకు పెరిగే గుల్మకాండం. అంటే దీనికి ఘనమైన లేక బలమైన కాండం ఉండదు, తొర్రకల్గిన కాండం లేక “కాడ” ఉంటుంది. ఇది బోలు కాండాలతో (అంటే లోపల తొర్ర కల్గి ఉంటుంది) ఉండే ఒక గుల్మక మొక్క. బల్బు ఆకారంలో ఉండే వెల్లుల్లి భూగర్భంలో పెరుగుతుంది. సాధారణంగా గడ్డలన్నీ భూమిలోనే పెరుగుతాయి. పైగా వెల్లుల్లి తెల్లగా ఉంటుంది కనుకనే తెలుగులో దీన్ని “తెల్లగడ్డ” అని కూడా అంటారు. వెల్లుల్లి చిన్న చిన్న పాయలు/పేయలు (small bulbils) గా విభజింపబడి ఉంటుంది, వీటినే “వెల్లుల్లి పేయలు” తెల్లపాయలు (garlic cloves) అని అంటారు. ఈ పేయల్ని ‘చిన్న వెల్లుల్లి’గా కూడా పిలుస్తారు. వీటినే సాధారణంగా “వెల్లుల్లి లవంగాలు” అని కూడా పిలువడం జరుగుతోంది. భౌతిక నిర్మాణం ఆధారంగా, వెల్లుల్లి రెండు రకాలుగా ఉంటుంది.

  • గట్టి-మెడ వెల్లుల్లి:
    ఈ వెల్లుల్లి, (బల్బ్ మధ్యలో) మధ్యలో ఒక కాండం ఉంటుంది, దాని చుట్టూ వెల్లుల్లిపాయలుంటాయి. వెల్లుల్లి అతి చల్లని శీతాకాలాల్లో బాగా వృద్ధి చెందుతుంది. ఒక్కో వెల్లుల్లి గడ్డలో లేదా ఒక్క వెల్లుల్లి బల్బ్ లో, తక్కువ పాయలుంటాయి.

  • మెత్తని-మెడ వెల్లుల్లి:
    ఈ వెల్లుల్లి బల్బ్ లోపల ఎలాంటి కాండం ఉండదు. ప్రతి వెల్లుల్లి బల్బులోను చాలా ఎక్కువ పాయలు/లవంగాలు ఉంటాయి (20 వరకూ ఉండవచ్చు.) ఇది తక్కువ చలి కల్గిన శీతాకాలం పరిస్థితులలో పెరుగుతుంది. గట్టి-మెడ వెల్లుల్లితో పోల్చినప్పుడు ఇది తక్కువస్థాయి రుచిని కల్గి ఉంటుంది.

వెల్లుల్లి రకాలు: పచ్చి వెల్లుల్లి (green garlic) మరియు వెల్లుల్లి కాడలు - varieties of Garlic: Green garlic and garlic scapes   

తరచుగా వెల్లుల్లి గురించి మాట్లాడుతున్నప్పుడు, పచ్చి వెల్లుల్లి మరియు వెల్లుల్లి కాడల్ని పరస్పరం సమానార్థంలో వాడతారు. కానీ, రెండింటి మధ్య కొంచెం వ్యత్యాసం ఉంది.

అదే వెల్లుల్లి మొక్క నుండి వచ్చినవే ఈ రెండూ-పచ్చి వెల్లుల్లి మరియు వెల్లుల్లికాడలు. రెండున్నూ వంటలో ఉపయోగించదగ్గవే. కాని, వాటిని వెల్లుల్లి పంట నుండి వివిధ దశలలో సంగ్రహించి/సేకరించి తేవడం జరుగుతుంది. సం ప్రదాయకంగా, పచ్చి వెల్లుల్లి ఇంకా అభివృద్ధి చెందని చిన్న చిన్న వెల్లుల్లి గడ్డలు. మరోవైపు, వెల్లుల్లి కాడలు అనేవి వెల్లుల్లి మొక్కల రెమ్మలు లేదా మోసులు లేదా కాండలు. వీటిని అంటే ఈ కాడల్ని కూరల్లో వండుకునేందుకు ఎప్పుడు కోస్తారు అంటే మొక్కలో వెల్లుల్లి పాయలు ఏర్పడిన తర్వాత అవి ఇంకా లేతగా ఉన్నపుడే. అంటే వెల్లుల్లి కాడల్ని వెల్లుల్లిపాయలు గడ్డలో ముదిరి పగలక ముందు కోసుకుని వంటోలోకి ఉపయోగిస్తారు. పండిన వెల్లుల్లి (పంట) కోతకొచ్చింది (పంట వడాపకానికి) అని తెలిసేది ఎలాగంటే, ఆ వెల్లుల్లి గడ్డలు పగిలినపుడే. 

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

100 గ్రామూల ముడి వెల్లుల్లి గడ్డల యొక్క పోషక విలువ క్రింది విధంగా ఉంటుంది

వివరములు పరిమాణం
నీరు 58.6 గ్రా
పిండిపదార్ధాలు 33 గ్రా
ఫైబర్ 2g
ప్రోటీన్ 6.4 గ్రా
కాల్షియం 181mg

100 గ్రాకి శక్తి: 149 కిలో కేలరీలు

వెల్లుల్లి మానవ శరీరానికి అవసరమైన అనేక ఔషధగుణాల్ని కలిగి ఉంది. ముఖ్యంగా, వెల్లుల్లి సూక్ష్మజీవనాశిని, అనామ్లజనకం మరియు అద్భుతమైన నొప్పి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్న కారణంగానే వెల్లుల్లి ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్యప్రదాయిని మరియు రోగాల్ని నయం చేసే దివ్య ఔషధంగా పేరుగాంచింది. ఇపుడు వెల్లుల్లి యొక్క కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి పరిశీలిద్దాం.

  • గుండెకండరాల ఆరోగ్య ప్రయోజనాలు: వెల్లుల్లి దాని హృదయ ప్రయోజనాలకు బాగా ప్రసిద్ధి చెందింది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడం ద్వారా గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తం గడ్డకట్టడం నివారించి మరియు గుండె కండరాలను బలపరుస్తుంది.
  • యాంటీ డయాబెటిక్: వెల్లుల్లి సాంప్రదాయకంగా యాంటీ డయాబెటిక్ ఏజెంట్గా ఉపయోగించబడుతుంది. క్లినికల్ అధ్యయనాలు వెల్లుల్లి క్రమమైన వినియోగం మధుమేహా వ్యక్తులలో  వ్యక్తులలోని రక్తం లోని చెక్కెర స్థాయిలను నిర్వహిస్తుందని కనుగొన్నారు.
  • బరువు తగ్గుదలను ప్రోత్సహిస్తుంది: వెల్లుల్లి శరీరం లో అధిక కొవ్వు కరిగించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వెల్లుల్లి వినియోగం 24 రోజుల్లో  శరీర బరువు తగ్గింపుకు దారితీస్తుందని వైద్యపరంగా నిరూపించబడింది.
  • సాధారణ జలుబుకు ఉపశమనం: వెల్లుల్లి శరీరంలో వెచ్చదన ప్రభావాలను కలిగి ఉంటుంది మరియు ఇది సాధారణ జలుబు లక్షణాలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
  • చర్మ ప్రయోజనాలు: వెల్లుల్లి సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది మరియు చర్మ పునరుత్పత్తి పెంచుతుంది, యవనమైన  మరియు ప్రకాశవంతంగా కనిపించే చర్మానికి దారితీస్తుంది. ఇది  చర్మ సమస్యలను  మోటిమలు, సోరియాసిస్ మరియు తామరను కూడా నిరోధిస్తుంది.
  • నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: వెల్లుల్లి ఒక అద్భుతమైన యాంటీమైక్రోబయల్, ఇది నోటిలోని మైక్రోఫ్లోరాను సమతుల్యం చేస్తుంది, ఇది నోటి సంక్రమణలు మరియు దంత క్షయాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • రుతువిరతి (menopause) లక్షణాలు తగ్గిస్తుంది:  వెల్లుల్లి ఒక అద్భుతమైన యాంటీఆక్సిడెంట్ అవడం వల్ల, ఇది ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది మరియు చిరాకు వంటి రుతువిరతి లక్షణాలు తగ్గిస్తుంది.

పైన తెలిపిన ప్రయోజనాలే కాకుండా, వెల్లుల్లి వాపు ఉపశమనం మరియు క్యాన్సర్ కణ పెరుగుదలను నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ మొక్క నుండి గరిష్ట లాభాలను పొందేందుకు అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయి.

నోటి ఆరోగ్యానికి వెల్లుల్లి - Garlic for oral health

నోటిపూత, చిగుళ్లబాధలు వంటి (ఓరల్ ఇన్ఫెక్షన్లు) సంక్రమణ సమస్యలు, దంతాలు మరియు చిగుళ్ల ఆరోగ్యానికి ఒక ఉపద్రవంగా తయారవుతాయి. దంతవైద్యుల ప్రకారం, నోటిలో ఉండే మంచి మరియు చెడు బ్యాక్టీరియాల్లో కలిగే అసమతుల్యత వల్లనే నోటి-సంబంధమైన పూత, చిగుళ్ల-దంతాల సమస్యలు సంభవిస్తాయి. ఈ సమస్యలకు సూక్ష్మ విషక్రిమినాశిని అయిన వెల్లుల్లిని ఓ అద్భుత ఆహారంగా దంతవైద్యులు సూచిస్తారు. మంచి బాక్టీరియాను నోటిలో ఉండనిస్తూనే హానికరమైన బ్యాక్టీరియాను మాత్రం చంపేస్తుంది. అందువల్ల మొత్తం చిగుళ్ళ మరియు పళ్ళ ఆరోగ్యాన్ని వెల్లుల్లి మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి పదార్ధాలతో చిన్నపిల్లల చిగుళ్ళసమస్యలకు చేసే చికిత్స వారి నోటిలోని మొత్తం హారికారక సూఖ్మజీవుల్ని గణనీయంగా తగ్గిస్తుందని పాలపళ్ళు వచ్చే వయసు పిల్లల దంత సమస్యలపై జరయినా ఓ అధ్యయనం సూచిస్తోంది. ది ఇండియన్ జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్ లో ప్రచురించబడిన ఓ పరిశోధనావ్యాసం  ప్రకారం, నోటి కుహరంలో ఉన్న స్ట్రెప్టోకోకస్, సూడోమోనాస్ మరియు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియ వంటి సంక్రమణ-కారణమైన బ్యాక్టీరియాను చంపడానికి వెల్లుల్లి పదార్దాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే, వయోజన ఆధారిత వైద్య అధ్యయనాలు లేకపోవడంతో, పళ్ళు మరియు చిగుళ్ళపై వెల్లుల్లి యొక్క ప్రభావాలను అర్థం చేసుకోవడానికి మీ దంతవైద్యుడిని అడగడమే ఉత్తమం.

(మరింత సమాచారం: పంటి నొప్పి)

క్యాన్సర్ నిరోధక మందుగా వెల్లుల్లి - Garlic as an anti-cancer agent

పాత వెల్లుల్లి గడ్డల్లోని గంధక సమ్మేళన పదార్థాలకు శరీరంలోని గడ్డల్ని నివారించగల సామర్థ్యాలని కలిగి ఉంటాయని జంతువులపై జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. వెల్లుల్లిలోని అనామ్లజనక గుణాలు మరియు కణితి/గడ్డల పెరుగుదలను నిరోధించే స్వభావం కారణంగా ఇది క్యాన్సర్-వ్యతిరేక లక్షణాలను ప్రదర్శిస్తోందని శాత్రవేత్తలు అనుమానిస్తున్నారు. అయినా ఈ విషయమై ఖచ్చితమైన నిరూపణ ఇంకా  జరగనందున మరియు వెల్లుల్లి గురించిన అధ్యయనాలు మనుషులపైన నిర్వహించనందున, కాన్సర్ నివారణకు వెల్లుల్లిని సేవించాలని మీరు భావిస్తే, మీ ఆయుర్వేద డాక్టర్తో మాట్లాడి, ఆపైన వెల్లుల్లిని సేవించడం మంచిది.

(మరింత సమాచారం: క్యాన్సర్ చికిత్స)

దగ్గు-జలుబులకు వెల్లుల్లి - Garlic for cough and cold

ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఉష్ణప్రేరకంగా (శరీరంలో వేడిని ప్రేరేపించే  ఆహారంగా) పరిగణించబడుతుంది, అంటే శరీరంలో వేడిని పెంచుతుంది. వెల్లుల్లిసేవనం జలుబు నివారణకు ఒక ప్రసిద్ధమైన పరిష్కారం. వైద్య అధ్యయనాలు కూడా వెల్లుల్లిని జలుబు-దగ్గులకు వ్యతిరేకంగా పోరాడే  ప్రభావవంతమైన మందోస్తువై ఉండవచ్చు అని సూచిస్తున్నాయి. కానీ, ఈ అధ్యయనాలకు వ్యతిరేకంగా చాలా వివాదాస్పద ప్రశ్నలూ, వాదాలూ కూడా ఉన్నాయి.

(మరింత సమాచారం: సాధారణ జలుబు చికిత్స)

జుట్టు ప్రయోజనాలకు వెల్లుల్లి - Garlic benefits for hair

దిన నిత్య ఆహార వస్తువు మరియు మందొస్తువు కూడా అయిన వెల్లుల్లిని సేవించడం, దాన్నే పైపూతగా కూడా వాడడం వల్ల ఆరోగ్యకరమైన, బలమైన మరియు మెరిసే జుట్టు మీ స్వంతమవుతుంది. అంతే కాదు, తలమీద వచ్చే చిన్న చిన్న బట్టతల మచ్చల (bald spots) నివారణకు వెల్లుల్లి ఓ సమర్థవంతమైన ముందుగా పని చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి, వెల్లుల్లిని తలపైన అంటుకుంటే (పైపూతగా) మరెన్నో ప్రయోజనాలున్నాయి. ఇది కేశ సంవర్ధినిగా మంచి ప్రభావాన్ని కల్గి ఉంది. వెల్లుల్లి అనామ్లజనకమవడం (యాంటీఆక్సిడెంట్), వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. వెల్లుల్లితో తలకంటుకుంటే మీ వెంట్రుకలకు బలాన్నిస్తుంది. వెల్లుల్లితో మరో ముఖ్య ప్రయోజనం ఏమంటే ఇది ఒక ప్రసిద్ధమైన  విషక్రిమినాశిని (యాంటీమైక్రోబయల్) అవటం వల్ల మీరు వెల్లుల్లితో తలంటుకుంటే, తలమీది చర్మంలో ఉండే ప్రమాదకరమైన, హానికరమైన సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది.

చర్మ ప్రయోజనాలకు వెల్లుల్లి - Garlic benefits for skin

సంప్రదాయ వైద్య పద్ధతులు మరియు జానపద ఔషధ విధానాలు వెల్లుల్లిని  గాయాలు, మరియు పుండ్లు మానేటందుకు, ఇంకా ఎన్నో చర్మ ప్రయోజనాల కోసం ఉపయోగించడం జరుగుతోంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో వెల్లుల్లి యొక్క పనితనం మరియు సమర్థతను పరీక్షించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. జంతువులపైనా మరియు మనుషుల పైన కూడా జరిపిన అధ్యయనాలు వెల్లుల్లి యొక్క చర్మం వైద్య ప్రయోజనాలను  నిర్ధారించాయి. వెల్లుల్లి చూర్ణం/పొడి సేవనం కారణంగా మన చర్మంలో 55% రక్త ప్రసరణ పెరుగుతుంది. శరీరంలో మంచి రక్త ప్రసరణ ఉంది అంటే దానర్థం ఆరోగ్యకరమైన కండర కణజాలం ఉన్నట్లే లెక్క. అదనంగా, వెల్లుల్లి నిరూపితమైన ఓ సూక్ష్మవిషక్రిమినాశిని (యాంటీమైక్రోబయాల్).
కనుక, వెల్లుల్లి సోరియాసిస్, కార్న్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మరియు ఇతర చర్మ సమస్యలకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ అధ్యయనాల్లో వెల్లుల్లి జెల్, చమురు, వెల్లుల్లి పొడి మరియు వెల్లుల్లి పదార్దాలను పరీక్షలకుగాను వాడినారు. అంతేకాకుండా, వెల్లుల్లి యొక్క అనామ్లజనక (యాంటీ ఆక్సిడెంట్) ప్రభావాలు శరీరంలో కలిగే ఆక్సీకరణ ఒత్తిడి శరీరానికి హాని కలిగించకుండా చేస్తాయి మరియు అకాల వృద్ధాప్య సంకేతాలు దాపురించకుండా కాపాడుతుంది. వయసు కారణంగా కానీ లేదా జీవనశైలి కారణంగా శరీరంలో హానికర ఆక్సిజన్ అధికమవడం కారణంగా “ఆక్సీకరణ ఒత్తిడి” అనేది సంభవిస్తుంది. “ఫైబ్రోబ్లాస్ట్ల”నే చర్మ కణాలను పెంచి చర్మాన్ని యౌవనయుతంగా ఉంచడంలో వెల్లుల్లి ప్రభావశాలి, అని అధ్యయనాలు తెలుపుతున్నాయి. వెల్లుల్లిని చర్మలేపనంగా వాడటం వల్ల, మీ చర్మ తత్త్వం కారణంగా చక్కెరవ్యాధి ప్రభావాలేమైనా శరీరంలో ఉద్భవిస్తాయేమోనన్న సంగతిని మీ ఆయుర్వేద వైద్యుడిని అడిగి తెలుసుకొమ్మని మీకు సూచించడమైంది.

మహిళలకు వెల్లుల్లి సేవనంతో లాభాలు - Garlic benefits for women

మహిళల ఆరోగ్యవిషయానికి వస్తే వెల్లుల్లి బాగా పనిచేస్తుంది, ముఖ్యంగా దాన్లోని అనామ్లజనిక లక్షణాలు ఆడవారి ఆరోగ్యానికి తోడ్పడతాయి. రుతువిరతి (అంటే ముట్లు నిలిచిపోవడం) అనేది 50 ఏళ్ళకు పైబడిన ఆడవారు ఎదుర్కొనే  అత్యంత ముఖ్యమైన సమస్యలలో ఒకటి. వైద్యుల ప్రకారం, ముట్లడగడం (మెనోపాజ్/రుతువిరతి) అనేది స్త్రీలలో పునరుత్పాదక దశకు ముగింపు మాత్రమే కాదు, ఆ దశలో మహిళల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. రుతువిరతి లక్షణాలైన చికాకు, మానసిక కల్లోలం, యోని పొడిబారడం మొదలైనవి మహిళల్లో తగ్గిపోయిన ఆక్సిజన్ మరియు  ఈస్ట్రోజెన్ (మహిళల శరీరం యొక్క సహజ ఆమ్లజనకం)ల వల్ల ఏర్పడ్డ దుష్ప్రభావాలు. ఋతుక్రమం ఆగిపోయిన 30 మంది మహిళలతో కూడిన ఓ బృందంపై జరిపిన అధ్యయనంలో వెల్లడైందేమంటే వెల్లుల్లి సేవనం ఆడవారి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది, తద్వారా, రుతువిరతివల్ల వచ్చిన కొన్ని లక్షణాలను తగ్గించడానికి తోడ్పడుతుంది.

పురుషులకు వెల్లుల్లి లాభాలు - Garlic benefits for men

పురుషుల లైంగిక కార్యకలాపాల్ని వృద్ధి చేయడంలో వెల్లుల్లి యొక్క సామర్ధ్యం విషయానికి వస్తే ఓ బలమైన వివాదం ఉంది. వెల్లుల్లి సేవనం వల్ల మగవారిలోని వీర్యకణాల సంఖ్య మరియు వృషణాల్లోని “టెస్టోస్టెరాన్” హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయని కొన్ని అధ్యయనాలువాదించాయి. అయితే మరికొన్ని ఆధ్యయనాలు తద్విరుద్ధంగా వాదిస్తూ, వెల్లుల్లి ఒక శక్తివంతమైన వీర్యకణానాశిని (స్పెర్మిసిడల్) అని పేర్కొన్నారు, అంటే వెల్లుల్లి వీర్యకణాల్ని చంపుతుంది అని. అంతే కాదు, మగవారి లైంగిక చర్యలపై వెల్లుల్లి ప్రతికూల ప్రభావం చూపుతుందని ఇంకొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాబట్టి, మీరు మీ లైంగిక ఆరోగ్యానికిగాను ఓ పూరక ఆహారంగా వెల్లుల్లిని తీసుకోవాలని అనుకుంటే, మొదట మీ ఆయుర్వేద డాక్టర్తో మాట్లాడి సలహా తీసుకోవడం  ఎల్లప్పుడూ మంచిది.

కీళ్ళనొప్పుల నివారణకు వెల్లుల్లి - Garlic for arthritis

సంప్రదాయ వైద్యాలు మరియు జానపద ఔషధ పద్ధతుల్లో వెల్లుల్లిని నొప్పినివారిణిగా ఉపయోగించారు. అదీ ముఖ్యంగా కీళ్ళవాపు-నొప్పి  సమస్యలకు వెల్లుల్లి విరివిగా ఉపయోగించబడుతోంది. జంతువులపై జరిపిన అనేక అధ్యయనాల ప్రకారం, కీళ్ళనొప్పులు మరియు వాపు చికిత్సలలో నొప్పి నివారణా ఏజెంట్ గా వెల్లుల్లిని సూచించాయి. ప్రయోగశాల అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే వెల్లుల్లిలోని “అల్లీస్,” అనే ఒక సహజ పదార్థ సమ్మేళనం జీవుల శరీరాల్లో నొప్పిని మంటను తగ్గిస్తుంది. మనుషులపై వెల్లుల్లి గురించిన అధ్యయనాలు ఇంకా జరగకపోవటం వలన, కీళ్ళనొప్పులు వంటి నొప్పి నివారణ సమస్యలకు వెల్లుల్లిని ఓ  ఔషధంగా తీసుకునేందుకు ముందు మీ ఆయుర్వేద డాక్టర్తో సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.

(మరింత సమాచారం: కీళ్లవాపు చికిత్స)

బరువు కోల్పోయేటందుకు వెల్లుల్లి - Garlic for weight loss

ఊబకాయం మరియు అధిక బరువు సమస్యలు నేడు ప్రపంచవ్యాప్తంగా  ఆందోళన కల్గిస్తున్నాయి. ఊబకాయం ప్రధానంగా ఆహారం నుండి అధిక వినియోగించడం కారణంగా సంభవిస్తుంది అని పరిశోధకులు నమ్ముతారు. కాలేయంలో అధిక క్రొవ్వు నిక్షేపాలు ఏర్పడడమనేది అధిక బరువు కలిగిన వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్న ఒక సమస్య. ఈ కొవ్వు నిక్షేపం కాలేయ పనితీరు యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మరియు తగ్గిన కాలేయ సామర్ధ్యం జీర్ణక్రియ విధానాన్ని మాత్రమే గాక మొత్తం శరీరం యొక్క పనితీరు మీద హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. సంప్రదాయకంగా, వెల్లుల్లిని సేవించడం మొత్తం శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లిలో ఉన్న సహజ-సమ్మేళనం “S-ఆల్లైల్మెర్కోప్లోస్టీన్ను” కాలేయంలో ఏర్పడే కొవ్వును వ్యతిరేకంగా ప్రభావం చూపుతుందని జంతువులపై జరిపియాన్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. వెల్లుల్లి మాత్రలు సేవించడం వల్ల  మొత్తం శరీరం బరువును మరియు శరీరం లోని కొవ్వును మొత్తం తగ్గించేందుకు సహాయపడుతుందని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరొక అధ్యయనంలో, 210 మంది వ్యక్తులకు వెల్లుల్లిని 24 రోజులపాటు సేవింపజేయగా, ఈ వ్యవధిలో వారి శరీర బరువులో గణనీయమైన తగ్గుదలను చూపించింది. “జర్నల్ ఆఫ్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్” లో ప్రచురించబడిన ఒక సమీక్షా వ్యాసం ప్రకారం వెల్లుల్లి ఒక శక్తివంతమైన కొవ్వును తగ్గించే “హైపోలియోపిడెమిక్” (కొలెస్ట్రాల్ ను తగ్గించే మందు)గాను, మరియు ఊబకాయాన్ని తగ్గించే ప్రభావాల్ని కల్గి ఉంది.

(మరింత సమాచారం: బరువు తగ్గుదల ఆహార విధాన పట్టిక)

సూక్ష్మ విషక్రిమినాశినిగా వెల్లుల్లి - Garlic as an antibiotic

సూక్ష్మ విషక్రిమినాశినిగా (యాంటీమైక్రోబయాల్ గా) వెల్లుల్లి యొక్క ప్రభావాన్ని పరీక్షించడానికి అనేక అధ్యయనాలు చేయబడ్డాయి. ఈ అధ్యయనాల్లో అధికభాగం వెల్లుల్లిలో అనేక శక్తివంతమైన విషక్రిమినాశక (యాంటీమైక్రోబయల్) సమ్మేళన పదార్థాలున్నాయని పేర్కొన్నాయి. కనుక వెల్లుల్లి బ్యాక్టీరియా, ఫంగల్ మరియు వైరల్ కారకాలవల్ల దాపురించే అంటురోగాల (సంక్రమణల)కు వ్యతిరేకంగా పోరాడి మనకు ఆరోగ్యం చేకూరుస్తుంది.  భారతదేశంలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, E.coli మరియు Staphylococcus aureus యొక్క యాంటీబయాటిక్-నిరోధక జాతులకి వ్యతిరేకంగా వెల్లుల్లిలోని పదార్థాలు పోరాడుతాయి ది జర్నల్ ఆఫ్ ఫార్మాకోవైజిలన్స్ లో ప్రచురించబడిన మరో పరిశోధనా వ్యాసం, పైన పేర్కొన్న రెండు యాంటీబయాటిక్-నిరోధక బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా వెల్లుల్లిలోని పదార్ధాల ప్రభావాన్ని నిర్ధారించింది. వెల్లుల్లిలో సహజంగా వెలువడే “అల్సిన్” వంటి పదార్థాల సమ్మేళనం దాన్ని ఓ విషక్రిమినాశినిగా  (యాంటీమైక్రోబయాల్ లక్షణాలకు) పని చేసేలా చేస్తుందని ఆ అధ్యయనం పేర్కొంది. అదనంగా, వెల్లుల్లిలోని పదార్దాలు కాండిడా అల్బికాన్స్ మరియు ఆస్పెరిల్లస్ వంటి కొన్ని శిలీంధ్రాలపై మరియు కొన్ని వైరస్లకు వ్యతిరేకంగా శక్తివంతమైన విషక్రిమినాశక (యాంటీమైక్రోబయల్) ప్రభావాలను చూపించాయి. అయినప్పటికీ, వెల్లుల్లి ఒక ఔషధంగా ఎటువంటి సంభావ్య ప్రభావాలను కల్గివుందో పరీక్షించడానికి ఇంకా, మనుషులపై ఎటువంటి అధ్యయనాలు నిర్వహించలేదు. కాబట్టి, వెల్లుల్లి యొక్క సూక్ష్మవిషక్రిమినాశక (యాంటీమైక్రోబయాల్) లక్షణాల గురించి మరింత తెలుసుకోవడానికి మీ ఆయుర్వేద వైద్యుడితో సంప్రదింపులు చేసుకోవడం మంచిది.

గుండె ప్రయోజనాలకు వెల్లుల్లి - Garlic for heart

గుండె-సంబంధ వ్యాధులు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిల వల్ల, స్వేచ్ఛా రాశులు, మరియు ముఖ్యమైన ధమనులలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యల కారణంగా దాపురిస్తాయి. అనామ్లజనక గుణం (యాంటీఆక్సిడెంట్), రక్తంలో కొలెస్ట్రాల్ ని తగ్గించే తత్త్వం, నరాల్లో గడ్డ కట్టిన రక్తాన్ని కరిగించడమనే (యాంటీ క్లాక్టింగ్) శక్తిని వెల్లుల్లి కల్గిఉన్న కారణంగా ఇది గుండె సమస్యలకు ఒక దివ్యమైన  ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లి గుండెకు ఒక టానిక్ వంటిదని ఆయుర్వేదం వర్ణించింది. వెల్లుల్లి రెబ్బల్ని నిరంతరం సేవిస్తే రక్త పీడనాన్ని తగ్గిస్తుంది మరియు నరాల్లో రక్తం గడ్డకట్టడాన్ని, హృదయాఘాతాల్ని మరియు గుండె పోటు వంటి ప్రమాదకర జబ్బుల్ని తగ్గిస్తుంది. “ది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్” లో ప్రచురించబడిన సమీక్ష వ్యాసం ప్రకారం, వెల్లుల్లి యొక్క ఆరోగ్య ప్రయోజనాలను పరీక్షించడానికి అనేక అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. వ్యాసం పేర్కొన్న కనీసం 44% వైద్య అధ్యయనాలు వెల్లుల్లి సాధారణ సేవనం మూలంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం, నరాల్లో ప్లేట్లెట్లు పేరుకుపోయి రక్తం గడ్డ కట్టడాన్ని   తగ్గించడం జరుగుతుందని వివరించాయి. అయినప్పటికీ, మీరు గుండె జబ్బుతో బాధపడుతున్నట్లయితే, మీ ఆహారంలో వెల్లుల్లిని ఓ మందుగా తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోవడం మంచిది.

కొలెస్ట్రాల్ నియంత్రణకు వెల్లుల్లి - Garlic for cholesterol

శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు హానికరమైన కొవ్వులు అధిక స్థాయిలో పేరుకుని పొతే అది గుండె సంబంధిత వ్యాధులు మరియు అథెరోస్క్లెరోసిస్ (నరాల్లో లేక ధమనులలో కొవ్వు నిక్షేపాలు పేరుకుపోవడం) ప్రమాదాలకు ప్రధాన కారణం. రక్తం ప్రసరించే నరాల్లో కొవ్వు నిల్వలు జమవడమనేది జీవనశైలి మరియు వయసుకు సంబంధించిన సమస్యలు. నేడు ఈసమస్యలు ప్రపంచంలోని గుండె-సంబంధ ప్రమాదాలకు, తత్సంబంధ మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటి. మంచి ఆహార పదార్ధాలు తినడం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అలవర్చుకోవడం వల్ల అటువంటి గుండె-సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచవచ్చు. ఇందుకు ఇదే ఉత్తమ పరిష్కారం కూడా. మన శరీరాల్లో కొవ్వు (కొలెస్ట్రాల్) స్థాయిలను నిర్వహించడం మరియు గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడం లాంటి ప్రయోజనాల కోసం ఆయుర్వేదలో వెల్లుల్లిని వాడడం జరుగుతూనే ఉంది. 50 మంది ఆరోగ్యకరమైన వ్యక్తుల సమూహం (పురుషులు మరియు మహిళలు) పై నిర్వహించిన ఇటీవలి అధ్యయనాలు ఆయుర్వేదం యొక్క ఈ వాదనను నిర్ధారించాయి. 90 రోజులు గడిచిన తర్వాత, పచ్చి వెల్లుల్లి సేవనం రక్త కొలెస్ట్రాల్ స్థాయిలలో గణనీయమైన తగ్గుదలను చూపించింది. నిరంతర వెల్లుల్లి సేవనం అధిక సాంద్రత కొవ్వుల్ని, అంటే మంచి కొలెస్ట్రాల్ ను,  పెంచుతుందని, తక్కువ సాంద్రత (చెడు) కొలెస్ట్రాల్ను తగ్గిస్తుందని అధ్యయనకారులు సూచించారు. ఇలా మన శరీరంలో కొవ్వుల సంతులనం కొనసాగితే ధమనులలో కొవ్వు నిక్షేపాలు తగ్గిపోతాయి మరియు గుండెపోటు, మరియు గుండె-జబ్బులకు కారణమయ్యే “కార్డియోవాస్కులర్” సమస్యలు మన జోలికి రాకుండా ఉంటాయి మరియు మనం ఆరోగ్యాంగా ఉంటాం.

చక్కెరవ్యాధికి వెల్లుల్లి - Garlic for diabetes

వెల్లుల్లి చక్కెరవ్యాధికి పని చేసే మందొస్తువుగా సంప్రదాయ వైద్య పద్ధతుల్లో చాలా ప్రజాదరణ పొందింది. చక్కెరవ్యాధితో బాధపడుతున్న రోగులపై జరిపిన ఇటీవలి వైద్య అధ్యయనాలు సూచించేదేమంటే వెల్లుల్లి చక్కెర స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతమైనదని. ఈ అధ్యయనంలో రెండు సమూహాల వ్యక్తులు పాల్గొన్నారు. అక్కడ ఒక సమూహం సభ్యులకు వేర్వేరు రోజులలో 0.05g నుండి 1.5g వరకు ఉండే మోతాదులలో వెల్లుల్లి ఇవ్వబడింది. వెల్లుల్లి ఇవ్వని వ్యక్తులతో పోల్చితే, వెల్లుల్లిని నిరంతరంగా తీసుకున్నవారి రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గినట్లు గుర్తించారు. వెల్లుల్లి లాంటి ఓ ఆహారపదార్థంలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఒకే సమయంలో లభించడం ఎంత మంచిది కదూ? మరొక అధ్యయనంలో, 126 mg /dl స్థాయిలో చక్కెరవ్యాధి కల్గిన రెండు గుంపుల వ్యక్తుల్లో ఒక గుంపుకు మాత్రం వెల్లుల్లి క్యాప్సూల్స్ ను, దానితో బాటు రక్తంలో చక్కెరస్థాయిని తగ్గించే మందు-మెట్ఫార్మిన్  (హైపోగ్లైసెమిక్) ను కూడా సేవింపజేసి వారిలో కలిగే ప్రభావాలు పరీక్షించబడ్డాయి. 24 రోజుల తర్వాత వెల్లడించిన ఫలితాలను పరిశీలించారు. వెల్లుల్లి మరియు మెట్ఫార్మిన్ రెండింటినీ సేవించిన సమూహం సభ్యుల రక్తంలో చక్కెర స్థాయిలలో (సుమారు 3%) గుర్తించదగ్గ తగ్గుదలను చూపించాయి, మరి మెట్ఫార్మిన్ మాత్రమే సేవించిన వారి రక్తంలో చక్కర స్థాయిలు 0.5% మాత్రమే తగ్గింది. చక్కెరవ్యాధికి వెల్లుల్లి పని చేస్తుందనేందుకిది ఒక రుజువే మరి. వెల్లుల్లి కేవలం ఒంక ఆహార పదార్థమే గాక చక్కెరవ్యాధికి పని చేసే ఓ మంచి మందు కూడా. ఔషధ ప్రయోజనాలను ఆశించి ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు దాన్ని మితంగానే సేవించడం ఎల్లప్పుడూ మంచిది.

(మరింత సమాచారం: చెక్కెరవ్యాధి చికిత్స)

ముడి వెల్లుల్లిని విస్తృతంగా మసాలా దినుసులు, సలాడ్లు, సాస్, రొట్టె వంటి వంటకాలకు సువాసన ను అందించేందుకు బాగా వాడబడుతోంది. ఇది చాలా ఇటాలియన్ వంటలలో ప్రత్యేకమైన ఆహార పదార్థాలకు తీక్షణమైన రుచిని  అందిస్తుంది. పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. వెల్లుల్లి నూనెను ఆహారాల తయారీలో సువాసనను మంచి రుచిని కలుగజేసేందుకు మరియు జుట్టు ఆరోగ్యం కోసం తలంటుగా కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి మాత్రలు, కాప్సుల్స్, మరియు పౌడర్ రూపంలో వెల్లుల్లి అందుబాటులో ఉంది. మీరు మూలికా మందుల ప్రియులైతే గనుక, మీరు కూడా వెల్లుల్లి టీ, టింక్చర్ (వెల్లుల్లిలోని మద్యం వంటి పదార్ధం) మరియు “కాంప్రెస్” అనే బ్యాండ్-ఎయిడ్ రూపంలో ఉండే వెల్లుల్లి పేస్ట్ ఉత్పత్తులను మార్కెట్లో కొనుక్కోవచ్చు.

వెల్లుల్లిని ఎలా నిల్వ చేయచ్చు

చీకటి కల్గిన పొడి వాతావరణంలో వెల్లుల్లి చాలాకాలం నిల్వ ఉంటుంది. ఒలిచిపెట్టిన వెల్లుల్లి రెబ్బలు ఒక వారం మించి తాజాగా ఉండవు. కాబట్టి వెల్లుల్లిని ఎక్కువకాలం నిల్వ చేయాలనుకుంటే వెల్లుల్లి గడ్డల్ని గడ్డల్లాగే (ఒలవకుండా) అలాగే ఉంచడం మంచిది.

రెండు గ్రాముల నుండి ఐదు గ్రాముల ప్రమాణంలో తాజా వెల్లుల్లిని మరియు 1 గ్రాము వెల్లుల్లి పొడిని సేవిస్తే సాధారణంగా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.  కానీ, మీరు సేవించే వెల్లుల్లి రకం మీద, మీ శరీర తత్త్వం, మీ సహనశక్తి , మరియు లక్షణాల మీద వెల్లుల్లి మోతాదు ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ఆరోగ్యపూరకమైన బలవర్దక ఆహారంగా వెల్లుల్లిని తీసుకోవాలనుకుంటే, మీ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించండి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW
  • రక్తాన్ని పలుచబరిచే ఓ సహజ ఆహార వస్తువు వెల్లుల్లి. కాబట్టి మీరు ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచేందుకు మందులు వాడుతున్నట్లైనా, లేదా శస్త్రచికిత్స చేయించుకోవాలనుకుంటే వెల్లుల్లిని పూరకాహారంగా లేదా ముందుగా తీసుకోకపోవడం ఉత్తమం.
  • మీరు ఏవైనా వైద్యుడు సూచించిన ఔషదాల సేవనంలో ఉంటే, వెల్లుల్లిని ముందుగానే లేక పూరకాహారంగానో తీసుకోవాలనుకుంటే ముందు మీ డాక్టర్తో సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.
  • ముడి వెల్లుల్లిని మీరు దీర్ఘకాలికంగా పైపూతగా రాసుకుంటున్నట్లైతే అది కొన్ని సందర్భాలలో చర్మం పై మంటను, దద్దురు-మచ్చల్ని కలుగజేసేందుకు కారణం అవచ్చు. కాబట్టి, మీరు సహజంగా సున్నితమైన చర్మం కల్గి ఉన్నట్లయితే వెల్లుల్లి పైపూతను నిలిపివేయడం మంచిది.
  • రక్తంలో చక్కెరస్థాయిల్ని తగ్గించగల ఒక సహజమైన మందు (హైపోగ్లైసిమిక్) వెల్లుల్లి. ఒకవేళ మీరు చక్కెరవ్యాధికి మందులు సేవిస్తున్నట్లైతే వెల్లుల్లిని కూడా పూరక ఔషధంగా తీసుకోవాలని మీరనుకుంటే, ముందు మీ డాక్టర్ తో సంప్రదించి వారి సలాయా తీసుకోవడం ఉత్తమం.
  • మీరు అల్ప రక్తపోటు వలన బాధపడుతుంటే, వెల్లుల్లిని తీసుకోక పోవడమే  సురక్షితతం. ఎందుకంటే వెల్లుల్లికి రక్త ఒత్తిడిని తగ్గించే మందొస్తువుగా పేరుంది.
  • గర్భధారణ సమయంలో వెల్లుల్లిసేవనం సురక్షితం కాదని భావిస్తారు. గర్భిణీ స్త్రీలు వెల్లుల్లిని తినేటప్పుడు అతి తక్కువ ప్రమాణాల్లో తీసుకోవడం మంచిది. వెల్లుల్లి సేవనం మీకు, మీ కడుపులోని బిడ్డకు మంచిదేనా అన్న విషయాన్ని మీ వైద్యుడిని అడిగి తెలుసుకుని ఆ ప్రకారం మసలుకోండి.

Medicines / Products that contain Garlic

వనరులు

  1. Peyman Mikaili et al. Therapeutic Uses and Pharmacological Properties of Garlic, Shallot, and Their Biologically Active Compounds. Iran J Basic Med Sci. 2013 Oct; 16(10): 1031–1048. PMID: 24379960
  2. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 11215, Garlic, raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  3. Biljana Bauer Petrovska, Svetlana Cekovska. Extracts from the history and medical properties of garlic. Pharmacogn Rev. 2010 Jan-Jun; 4(7): 106–110. PMID: 22228949
  4. United States Department of Agriculture Agricultural Research Service. The origins and distribution of garlic: How many garlics are there?. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  5. Majewski M. Allium sativum: facts and myths regarding human health. Rocz Panstw Zakl Hig. 2014;65(1):1-8. PMID: 24964572
  6. Ayaz E1, Alpsoy HC. [Garlic (Allium sativum) and traditional medicine]. Turkiye Parazitol Derg. 2007;31(2):145-9. PMID: 17594659
  7. Juan Wang, Xiuming Zhang, Haili Lan, Weijia Wang. Effect of garlic supplement in the management of type 2 diabetes mellitus (T2DM): a meta-analysis of randomized controlled trials. Food Nutr Res. 2017; 61(1): 1377571. PMID: 29056888
  8. Eidi A, Eidi M, Esmaeili E. Antidiabetic effect of garlic (Allium sativum L.) in normal and streptozotocin-induced diabetic rats. Phytomedicine. 2006 Nov;13(9-10):624-9. Epub 2005 Nov 2. PMID: 17085291
  9. Ashraf R, Khan RA, Ashraf I. Garlic (Allium sativum) supplementation with standard antidiabetic agent provides better diabetic control in type 2 diabetes patients. Pak J Pharm Sci. 2011 Oct;24(4):565-70. PMID: 21959822
  10. Hassan I El-Sayyad, Amoura M Abou-El-Naga, Abdelalim A Gadallah, Iman H Bakr. Protective effects of Allium sativum against defects of hypercholesterolemia on pregnant rats and their offspring. Int J Clin Exp Med. 2010; 3(2): 152–163. PMID: 20607041
  11. Ginter E, Simko V. Garlic (Allium sativum L.) and cardiovascular diseases. Bratisl Lek Listy. 2010;111(8):452-6. PMID: 21033626
  12. Yadav RK, Verma NS. Effects of garlic (Allium sativum) extract on the heart rate, rhythm and force of contraction in frog: a dose-dependent study.. Indian J Exp Biol. 2004 Jun;42(6):628-31. PMID: 15260118
  13. Shukry Gamal Mohammad, Kusai Baroudi. Bacteriological evaluation of Allium sativum oil as a new medicament for pulpotomy of primary teeth. J Int Soc Prev Community Dent. 2015 Mar-Apr; 5(2): 125–130. PMID: 25992338
  14. H. T. Ajay Rao, Sham S. Bhat, Sundeep Hegde, Vikram Jhamb. Efficacy of garlic extract and chlorhexidine mouthwash in reduction of oral salivary microorganisms, an in vitro study. Anc Sci Life. 2014 Oct-Dec; 34(2): 85–88. PMID: 25861142
  15. Ankri S, Mirelman D. Antimicrobial properties of allicin from garlic. Microbes Infect. 1999 Feb;1(2):125-9. PMID: 10594976
  16. Davood Soleimani, Zamzam Paknahad, Gholamreza Askari, Bijan Iraj, Awat Feizi. Effect of garlic powder consumption on body composition in patients with nonalcoholic fatty liver disease: A randomized, double-blind, placebo-controlled trial. Adv Biomed Res. 2016; 5: 2. PMID: 26955623
  17. Mouna Moutia et al. Allium sativum L. regulates in vitro IL-17 gene expression in human peripheral blood mononuclear cells. BMC Complement Altern Med. 2016; 16: 377. PMID: 27681382
  18. Thomson M, Ali M. Garlic [Allium sativum]: a review of its potential use as an anti-cancer agent. Curr Cancer Drug Targets. 2003 Feb;3(1):67-81. PMID: 12570662
Read on app