“బీట్రూట్” అని ప్రసిధ్ధంగా పిలువబడే “బీట్ దుంప” అమరంతాసేయ్ కుటుంబానికి చెందిన మొక్క. కూరగాయల్ని కొనడానికెళ్ళినపుడు ముదురు ఎరుపు రంగులో ఉండే బీట్రూట్ గడ్డను కొనకుండా పోవడం అసాధ్యం అనే చెప్పవచ్చు. దీన్ని అలాగే పచ్చి గడ్డలా తింటారు, సలాడ్ చేసుకుని తింటారు. లేదా సూప్/చారు రూపంలో ఆస్వాదిస్తారు. ఇంకా, బీట్రూట్ తో జ్యూస్ లేదా తీపి వంటకాలైనా (smoothies) వండుకోవచ్చు. కేవలం తన ఆకర్షణీయమైన రంగు వల్లనే కాకుండా దానికున్న ఔషధగుణాలు మరియు ఆరోగ్యసంరక్షణా లక్షణాల కారణంగా కూడా బీట్రూట్ దుంప ఒక “సూపర్ఫుడ్” అనే ప్రశంసను సొంతం చేసుకుని అత్యధిక జనాదరణను పొందింది. జ్యూస్ (రసం) నుండి సలాడ్లు వరకు బీట్రూట్ దాదాపు ప్రతి వంటలోను చోటు చేసుకుని తన స్థానాన్ని పదిలం చేసుకుంటోంది. అంతే కాదు, బీట్రూటు మంచి రంగు, అనామ్లజనకాలు మరియు రుచుల మేళవింపును కల్గి ఉంది గనుకనే దీన్ని ప్రతి వంటలోనూ వాడవచ్చు.
బీట్రూట్ మొట్టమొదట రోమన్ దేశస్థులచే సాగు చేయబడిందని చెప్పబడుతోంది. అయితే, అప్పుడు ఇది జంతువుల మేతగా మాత్రమే రోమన్లచే ఉపయోగించబడింది. 6 వ శతాబ్దం తర్వాత దుంపలు మానవ వినియోగానికి ప్రసిద్ధి చెందాయి. 19 వ శతాబ్దం మధ్యకాలంలో, బీట్రూటు రసాన్ని తరచుగా వైన్లలో ఆ పానీయానికి రంగును కలుగజేసే ఏజెంట్ గా ఉపయోగించబడింది.
పండించిన బీట్రూట్ ను ఆ మొక్క వేరు నుండి మొక్క పైన ఉండే శిఖ (లేక మోసు) వరకూ గడ్డ అన్నిభాగాల్ని తినవచ్చు. ఫలవంతమైన ఈ గడ్డ కూరగాయను పలువిధాలుగా వండుకుని తినొచ్చు. అందుకే దీనికి అంత ప్రజాదరణ లభించింది. దీన్ని ఉడికించి, వేయించి, ఊరవేసి, ప్రెషర్ కకర్లో వండి తినొచ్చు. లేదా రసం తీసి జ్యూస్ లాగా లేదా సలాడ్ వలె ముడిగడ్డను అలాగే తింటారు.
బీట్రూట్ గడ్డలు శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉండే వివిధ పోషకాలు మరియు అనామ్లజనకాలతో కూడిన శక్తిని కలిగి ఉంటాయి. బీట్రూట్లను నిత్యం వంటల్లోను లేదా విడిగా అయినా తినడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది, మలబద్ధకం, క్యాన్సర్ వ్యాధిని నిరోధిస్తుంది. మరియు కాలేయాన్ని కాపాడడానికి కూడా బీట్రూట్ సేవనం సహాయపడుతుంది. బీట్రూట్ శరీరంలో నిర్విషీకరణ ప్రక్రియలో సహాయపడుతుంది. ఏ విధంగా అంటే, మన శరీరంలో ఉండే విష పదార్థాలను మూత్ర మార్గము ద్వారా బయటకు తొలగిస్తూ బీట్రూట్ గడ్డ మనకు ఆరోగ్యాన్నందిస్తుంది.
బీట్రూట్ గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: బీటా వల్గారిస్
- కుటుంబము: అమరంతాసేయ్.
- సాధారణ పేరు: బీట్ దుంప
- సంస్కృత నామం: పాలంగ్ షాక్
- ఉపయోగించే భాగాలు: గడ్డలు (మూలాలు) మరియు ఆకులు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: బీట్రూట్ జర్మనీ లేదా ఇటలీలో ఉద్భవించి నార్త్ ఐరోపాకు విస్తరించిందని నమ్ముతారు. భారతదేశంలో, ప్రధానంగా హర్యానా, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు మహారాష్ట్రలలో బీట్రూట్ ని సాగు చేస్తారు.
- ఫన్ ఫాక్ట్ (తమాషా సంగతి) : అపోలో-సోయుజ్ టెస్ట్ ప్రాజెక్ట్ సమయంలో అపోలో 18 వ్యోమగాములకు బీట్రూత్ సూప్ (బ్యాంక్వెట్ ఆఫ్ బోర్క్చ్) ను ఒక స్వాగత పానీయంగా సర్వ్ చేశారు (వడ్డించారు).