నీలవేము, కొన్ని ప్రదేశాలలో చేదు తీగ అని కూడా పిలువబడుతుంది ఒక అంతరించిపోతున్న మూలికా మొక్క, ఇది హిమాలయల యొక్క ఉప ఉష్ణ ప్రాంతాలలో అధిక ఎత్తుల వద్ద పెరుగుతుంది. ఇది ప్రధానంగా కాశ్మీర్ నుండి భూటాన్ వరకు ఉండే 1200 మరియు 2100 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. సులువైన మాటల్లో చెప్పాలంటే, నీలవేము అనేది ఔషధాలను తయారు చేసేందుకు ప్రజలు ఉపయోగించే ఒక మూలిక. సాధారణంగా, నీలవేము మొక్క యొక్క భూమి పైభాగంలో ఉండే భాగాలను ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఈ మూలిక సంప్రదాయ వైద్య వ్యవస్థలో దాని యొక్క వివిధ ఔషధ గుణాలకు బాగా ప్రసిద్ది చెందింది. చారకా సంహిత వంటి వేద గ్రంధాలలో ఈ మొక్క యొక్క ప్రత్యేక లక్షణాలను పేర్కొన్నట్లు చెబుతారు.
నీలవేము మొక్క చల్లటి పర్వత ప్రాంతాలలో పెరుగుతుంది మరియు దానికి నీలపు ఊదా రంగు పువ్వులు పూస్తాయి. దాని చేదు రుచికి ఇది ప్రసిద్ధి చెందింది దానిలో ఉన్న వివిధ బయోలాక్టివ్ సమ్మేళనాలు ఈ చేదు రుచిని ప్రేరేపిస్తాయి. వివిధ ప్రాంతాల్లో నీలవేము కు వివిధ పేర్లున్నాయి. ఉదాహరణకు, సంస్కృతంలో, నీలవేమును అనర్యతిత్క, భునింబా, చిరాతిత్క మరియు కైరాట అని పిలుస్తారు. అరబిక్ మరియు ఫార్సీలలో దీనిని ఖసబ్జుజరిరా అని పిలుస్తారు. ఉర్దూ భాషలో, ఇది చైరావత, బర్మా భాషలో , సేఖగి మరియు నేపాల్ భాషలో, చిరాటో లేదా చిరైతా అని అంటారు. ఇది నేపాల్ వేపంగా కూడా పిలువబడుతుంది, ఎందుకంటే ఇది సాధారణంగా నేపాల్ అడవులలో పెరుగుతుంది.
సాంప్రదాయ ఆయుర్వేదిక మూలికగా, నీలవేము చాలా కాలంగా వైద్య రంగంలో ఉపయోగించబడుతుంది. జ్వరం, మలేరియా, కాలేయ రుగ్మతలు, హెపటైటిస్, మలబద్ధకం, పుండ్లు/పూతల, చర్మ వ్యాధులు, ఎపిలెప్సీ, ఉబ్బసం, మధుమేహం మరియు కొన్ని రకాల మానసిక రుగ్మతల వంటి అనేక రకాల వ్యాధుల చికిత్సలో దీని ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. ఈ మొక్కకు యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీమలైరియల్, యాంటిఏజింగ్ మరియు యాంటిడైయేరియాల్ లక్షణాలు ఉంటాయి.
నీలవేమును ఆల్కహాలిక్ మరియు నాన్ ఆల్కహాలిక్ పానీయాల తయారీలో కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా నీలవేము క్యాప్సుల్స్ ను తేనెతో పాటుగా తీసుకోవాలని సిఫార్సు చేయబడింది, అందువలన దాని చేదు కొంత వరకు తొలగించబడుతుంది.
నీలవేము గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- శాస్త్రీయ నామం: స్వర్టియా చిరాత (Swertia Chirata)
- కుటుంబం: జెంటినేసియా (Gentianaceae)
- సాధారణ నామం: చిరాయిత/చిరైత
- సంస్కృత నామం: కటునిక్త, అనర్యతిత్క, భునింబా, చిరాతిత్క మరియు కైరత
- ఉపయోగించే భాగాలు: నీలవేము మొక్క యొక్క అన్ని భాగాలు ఉపయోగించబడతాయి కానీ దాని వేర్లలో బయోఆక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
- జాతీయ ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: నీలవేము మొక్క భారతదేశ చల్లని పర్వత ప్రాంతాలైన హిమాలయాలు, కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ లలో పెరుగుతుంది; భూటాన్ మరియు నేపాల్ లో కూడా పెరుగుతుంది.
- ఆసక్తికరమైన విషయం: ఈ మొక్క యొక్క అధిక వినియోగం మరియు అటవీ నిర్మూలన మరియు ఇతర కార్యకలాపాలు కారణంగా సంఖ్య తగ్గిపోయింది. ఈ మొక్క అంతరించే దశకు చేరుకుంది.