కార్బోహైడ్రేట్లు మనం ప్రతిరోజూ తినే దాదాపు అన్ని ఆహారాలలోనూ ఉంటాయి, పండ్లు మరియు కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాల నుండి ఫ్రైస్ లేదా చిప్స్ ప్యాకెట్ లేదా ఒక పిజ్జా ముక్క వరకు అన్నింటిలోనూ ఇవి ఉంటాయి. కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ప్రధాన శక్తి వనరులు, మరియు వాటికున్న ‘చెడ్డ పేరు’కు వ్యతిరేకంగా మన ఆహారం మరియు శక్తి అవసరాలకు ఇవి చాలా అవసరం.
ఇవి ఒక సమతుల్య ఆహారంలో 45 నుండి 65% వరకు ఉంటాయి మరియు శరీర రోజువారీ పనితీరుకు అవసరానికి సమానమైన కేలరీలను అందిస్తాయి. అయితే, ఈ సంఖ్య శరీర బరువు మరియు నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా మారుతుంది, అనగా, ఒక ఎక్కువ కదలని వ్యక్తితో పోల్చినప్పుడు తీవ్రమైన శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వక్తి ఎక్కువ కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయి. కానీ, దాని ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి సరైన రకమైన కార్బోహైడ్రేట్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
కార్బోహైడ్రేట్ల యొక్క కొన్ని ఆహార వనరులు మరియు ప్రయోజనాలను చూద్దాం మరియు మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఏమిటో కూడా తెలుసుకుందాం.