వాము ఈజిప్టుకు చెందిన సుగంధ ద్రవ్యం, కానీ ఇది భారత ఉపఖండంలో అత్యంత సాధారణ మసాలా దినుసులలో ఒకటిగా మారింది. వాము యొక్క చేదు రుచి సాధారణంగా థైమ్ (ఒక రకమైన వాము జాతికి చెందిన మొక్క)తో పోల్చబడుతుంది. ఈ రెండు మూలికలు థైమోల్ అని పిలువబడే ఒక రసాయన పదార్ధాన్నికలిగి ఉంటాయి. మీరు రెండు మూలికలను పోల్చి చూస్తే, వాము యొక్క సువాసన థైమ్ కంటే చాలా ఎక్కువ మీరు కనుగొంటారు. ఏమైనప్పటికీ, ఈ రెండు మూలికలు వంటగదిలోకి చేరాయి.
ఒకవేళ మీకు సొంతంగా గృహ నివారణలను తయారుచెయ్యడం ఇష్టం ఐతే, ఇప్పటికే మీకు వాముకు ఇంపైన రుచి మాత్రమే కాక,చాలా ఔషధ గుణాలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. సాంప్రదాయకంగా, వాము గ్యాస్, ఆమ్లత్వం (acidity), మరియు కడుపు నొప్పి వంటి అత్యంత సాధారణ జీర్ణాశయ సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాము నీరు ఒక తెలిసిన స్తన్యవృద్ధ్యౌషధము (galactagogue) (పాలు ఇచ్చే తల్లులలో పాల స్రావం మెరుగుపరుస్తుంది) మరియు బరువు తగ్గడానికి ప్రసిద్ధి చెందిన చిట్కా.
వాము మొక్క ఒక వార్షిక మొక్క, అంటే దీనిని ప్రతి సంవత్సరం తిరిగి భూమిలో నాటాలి. ఈ మొక్క యొక్క సగటు ఎత్తు 60 నుండి 90 మీటర్లు.వాము మొక్క కొమ్మల మీద పొడవైన గీతలు వుంటాయి మరియు వాము ఆకులు ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటాయి. వాము పుష్పాలు చిన్నగా, తెల్లగా ఉండి శాఖల కొనపై సమూహాలుగా పెరుగుతాయి.
వాము గింజలు ఆకుపచ్చ నుండి గోధుమ రంగులో ఉంటాయి మరియు వాటి పైభాగం మీద స్పష్టమైన గీతలు కలిగి ఉంటాయి.
మీకు తెలుసా ?
కొన్ని జానపద సంప్రదాయాలలో వామును కుడా ఉంచుకోవడం వల్ల జీవితంలో అదృష్టం కలిసి వస్తుందని నమ్ముతారు.
వాము గురించి కొన్ని ప్రాధిమిక నిజాలు:
- శాస్త్రీయ నామము: ట్రేకీస్పెర్ముమ్ ఎమ్మీ (Trachyspermum ammi)
- కుటుంబం: ఏపియసి
- సాధారణ నామం: వాము, కెరొమ్ సీడ్స్
- సంసృత నామం: అజమోదా,యామిని
- వినియోగించే భాగాలు: విత్తనాలు
- స్థానిక ప్రాంతము మరియు భౌగోళిక విస్టీర్ణం: వాము ఈజిప్ట్ కు చెందినది కానీ ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్ మరియు ఇరాన్ దేశాలలో కూడా లభిస్తుంది. భారత దేశంలో వామును ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్, రాజస్థాన్,మహారాష్ట్ర రాష్ట్రాలలో పెంచుతారు.
- శక్తి శాస్త్రం: వేడి