పుచ్చకాయ అనేది ఒక పువ్వులు పూసే మొక్క, ఇది ఆఫ్రికాలో పుట్టిందని నమ్ముతారు. ప్రపంచంలోని పొడి ప్రాంతాలలో పెరిగే చాలా పండ్లలాగే, పుచ్చకాయ కూడా చాలా హైడ్రేటింగ్ పండు మరియు కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి, అదనపు బరువు పెరగకుండా పుచ్చకాయలును అధికంగా తినవచ్చు.
పుచ్చకాయల ప్రాధమిక ప్రయోజనం వాటి అధిక నీటి శాతంలో ఉంటుంది. అయితే, ఈ పండులో ఇతర అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు కూడా ఉంటాయి అవి వ్యాధులను నిరోధిస్తాయి మరియు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
వివిధ రకాలైన పుచ్చకాయలను ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. అవి పెరిగిన వాతావరణం మరియు నిర్దిష్ట రకాలు మరియు జన్యువులపై ఆధారపడి లోపలి గుజ్జు యొక్క రంగు కూడా మారుతుంది. ఎర్ర రంగు గుజ్జు ఉన్న పుచ్చకాయల రుచి ఉత్తమముగా ఉంటుందని అని నమ్ముతారు.
పుచ్చకాయలకు మంచి వైద్యం చేసే ఏజెంట్గా గొప్ప చరిత్ర ఉందని తెలిస్తే మనకి ఆశ్చర్యం కలుగవచ్చు. పుచ్చకాయల సాగు యొక్క మొదటి రికార్డులు ఈజిప్టు సమాధులలో గుర్తించబడ్డాయి అవి దాదాపు 4000 సంవత్సరాలకు ముందరి సమాధులు. అక్కడక్కడా ఉన్న ఆధారాల ప్రకారం గ్రీస్ మరియు రోమ్లలో పుచ్చకాయను 1వ శతాబ్దం BCE లో ఉపయోగించినట్లు తెలుస్తుంది. బైబిల్లో కూడా పుచ్చకాయ గురించి ప్రస్తావించబడింది. డియోస్కోరైడ్స్, ఒక ప్రసిద్ధ గ్రీకు వైద్యుని ప్రకారం, పుచ్చకాయలను మూత్రవిసర్జనకారిగా వాడవచ్చు మరియు వడ దెబ్బ (హీట్ స్ట్రోక్) లక్షణాలను తగ్గించడం కోసం పుచ్చకాయ యొక్క మందముగా ఉండే పై తొక్కను తలపై మీద పెట్టుకోవచ్చు.
ఈరోజుల్లో, ఈ పండు యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారు చైనా. భారతదేశంలో, అనేక రాష్ట్రాల్లో పుచ్చకాయలు సాగు చేయబడుతున్నాయి, అయితే ఉత్తరప్రదేశ్, కర్నాటక మరియు పశ్చిమ బెంగాల్ భారతదేశంలో పుచ్చకాయల మొత్తం ఉత్పత్తిలో 50% వాటాను కలిగి ఉన్నాయి.
పుచ్చకాయల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: సిట్రూలస్ లానాటస్ (Citrullus lanatus)
- కుటుంబం: కుకుర్బిటేసే (Cucurbitaceae)
- సాధారణ నామం: వాటర్ మీలోన్, తర్బుజ్
- ఉపయోగించే భాగాలు: గుజ్జు, తొక్క, విత్తనాలు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: పుచ్చకాయలు ఆఫ్రికాకు చెందినవి, కానీ అవి ప్రపంచవ్యాప్తంగా వేడిగా ఉండే వాతావరణాల్లో పెరుగుతాయి.
- శక్తి శాస్త్రం: శీతలీకరణ