రాతి ఉప్పు (rock salt) అనేది ‘హాలైట్’ లేదా సోడియం క్లోరైడ్ (NaCl)కు మరో పేరు. భారతదేశంలో, ఈ రాతి ఉప్పును ‘హిమాలయన్ క్రిస్టల్ సాల్ట్’ లేదా ‘హిమాలయన్ ఉప్పు’ అని కూడా పిలువడం జరుగుతోంది. ఈ రాతి ఉప్పు హిమాలయ పర్వత ప్రాంతంలో సాధారణంగా లభిస్తుంది. రాతి ఉప్పును హిందీలో ‘సెంధానమక్’ అని పిలుస్తారు మరియు సంస్కృతంలో ‘సైంధవ లవణ’ అని పిలుస్తారు. రాతి ఉప్పును ఉప్పు గనుల నుండి తేమ లేకుండా పొడి (dry) గా గాని లేదా ద్రావణం ప్రక్రియ ద్వారా గాని సేకరించే వారు. స్వఛ్చమైన రాతి ఉప్పు (ప్యూర్ రాక్ సాల్ట్) సాధారణంగా రంగు లేకుండా ఉంటుంది లేదా తెలుపు రంగులో ఉంటుంది. రాతి ఉప్పు దాని రకం మరియు దానిలో ఇమిడిఉన్న మలినాల పరిమాణం కారణంగా లేత నీలం, ముదురు నీలం, ఊదా రంగు, గులాబీ, నారింజ, ఎరుపు, పసుపు లేదా బూడిద రంగుల్లో కూడా లభిస్తుంది. హిమాలయన్ (రాతి) ఉప్పుయొక్క ఉత్తమాంశం ఏమంటే అది ప్రకృతిసిద్ధంగా ఎలాంటి రసాయనిక పదార్థాల కల్తీ లేకుండా స్వచ్ఛంగా లభిస్తుంది. ఇతర సాధారణ తినే ఉప్పులైతే రసాయనిక పదార్థాలతో మాలినమై ఉండేందుకు అవకాశాలున్నాయి. వాస్తవానికి, ఆయుర్వేద వైద్యం ప్రకారం, మనకు లభించే అన్ని లవణాలలో రాతి ఉప్పు ఉత్తమమైంది.