రాగుల్ని మనం రాగి పంట పండించడం ద్వారా పొందుతాం. ఆంగ్లంలో రాగిని “ఫింగర్ మిల్లెట్స్” అని పిలుస్తారు. రాగి పైరును ‘ఎలుస్సైన్ కరాకన’ (Eleusine Coracana) అని కూడా పిలుస్తారు. రాగి తృణధాన్యం పంట. భారతదేశంలో మరియు ఆఫ్రికాలో తినే అత్యంత సాధారణ మరియు పురాతనమైన తృణధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగి పిండి (రాగుల పిండి-finger millet powder) ఈ తృణధాన్యం యొక్క ఒక ముఖ్యమైన ఆహార స్వరూపం. ఆహారంపట్ల శ్రద్ధ వహించే నేటితరంలో రాగిపిండి చాలా ప్రసిద్ధిని పొందింది. రాగులతో గంజి, రాగి రొట్టె మరియు ఇతర వేపుడు పదార్ధాలను చేయడానికి ఉపయోగించబడుతుంది. ‘మిల్క్ షేక్స్’ మరియు ఐస్ క్రీమ్ లకు వాటిని మరింత పోషకమైనవి మరియు ఆరోగ్యకరమైన తినుబండారాలుగా చేయడానికి రాగిపిండిని కలుపుతారు. వాస్తవానికి, భారతదేశంలోని కొన్ని భాగాలలోని ప్రజలకు రాగులు ఓ ప్రధానమైన ఆహారం(staple food). రాగి సంకటి (ఆంధ్రప్రదేశ్), రాగి ముద్ద (కర్ణాటక) రాగి రొట్టె ఆహారాలు దక్షిణభారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన (staple) ఆహారం.
రాగులు తినడంవల్ల మనం పొందుతున్న ఆరోగ్య ప్రయోజనాలకుగాను ఆ కీర్తి (క్రెడిట్) రాగుల్లోని ఆహార పీచుపదార్థాలు (dietary fibre) మరియు పోలీఫెనాల్ (polyphenol) పదార్థాలకు దక్కుతుంది. కానీ రాగుల్లో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే అనేక ఇతర ఆహారపోషకాదుల్ని కలిగి ఉంది. రాగుల్లో ఇతర తృణధాన్యాలలో కంటే ఎక్కువ అధిక ఖనిజ పదార్థాలున్నాయి. శాకాహారులకు అవసరమైన ప్రోటీన్ యొక్క ఖచ్చితమైన మూలం రాగులే. రాగిలో అత్యధిక పొటాషియం మరియు కాల్షియం ఉన్నాయి; రాగుల్లో ఇనుము అధికంగా ఉండడం మూలంగా రక్తంలో హిమోగ్లోబిన్ యొక్క తక్కువ స్థాయి కలిగిన వ్యక్తులకు రాగి ఒక ముఖ్యమైన తరుణోపాయమవుతుంది. అదనంగా, రాగులు గ్లూటెన్ (బంక పదార్ధం) రహితంగా ఉంటాయి మరియు తక్కువ కొవ్వు పదార్థాల్ని మాత్రమే కల్గి ఉంటాయి. కాబట్టి, సులభంగా జీర్ణమవుతుంది మరియు గ్లూటెన్-అసహనాన్ని కలిగినవారికి రాగులతో చేసిన ఆహారం సురక్షితంగా ఉంటుంది. రాగుల గంజి (లేక రాగి సరి)ని పసి పిల్లలకు వారి మొట్టమొదటి ఆహారంగా తినిపించబడుతుంది, ఎందుకంటే, రాగిలో ఉన్న పోషకాల నాణ్యతే అందుక్కారణం.
రాగుల్ని తినడానికి ఉపయోగించేందుకు ముందుగా బాగా కడిగి శుభ్రం చేయడం ఉత్తమం. రాగి పిండి కొట్టడానికి ముందుగా రాగుల్ని సాధారణంగా ఎండలో సుమారు 5 నుండి 8 గంటలు వరకూ ఎండబెట్టడం జరుగుతుంది.
రాగులు గురించిన ప్రాథమిక వాస్తవాలు:
- వృక్షశాస్త్రనామం: ఎలుసైనే కొరానా
- కుటుంబం: గడ్డి (గ్రాస్) కుటుంబం
- సాధారణ పేరు: రాగి, హిందీలో రాగిని ‘మందువా’ అంటారు
- సంస్కృత నామం: నందిముఖి, మధులీ
- స్థానిక ప్రాంతం: భారతదేశంలో, రాగిని ఆంధ్రప్రదేశ్, బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో పండిస్తారు. కర్ణాటక మరియు తమిళనాడు రాగుల్ని ప్రాధమికంగా పండిస్తున్న రెండు రాష్ట్రాలు. భారతదేశంతో పాటు ఆఫ్రికా, శ్రీలంక, చైనా, మడగాస్కర్, మలేషియా మరియు జపాన్ వంటి ఉపఉష్ణమండల మరియు ఉష్ణమండల ప్రాంతాల్లో , రాగుల్ని విస్తృతంగా సాగు చేస్తారు.
- రాగుల గురించిన ఆసక్తికరమైన విషయాలు:
రాగుల పంట ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మరియు దక్షిణ భారతదేశంలోని పొడి ప్రాంతాలలో పండించే ముఖ్యమైన తృణధాన్యం.
తక్కువ వర్షపాతం మరియు తీవ్రమైన కరువు ప్రాంతాల్లో రాగుల పంటను పండించొచ్చు.
ఒండ్రు మట్టి నేలలు, నల్లరేగడి నేలలు లేదా ఎరుపురంగు నేలల్లో రాగిపంట బాగా పండుతుంది. 50 నుంచి 100 సెం.మీ. వర్షపాతం ప్రాంతాల్లో రాగులు పండుతాయి. రాగులు పండటానికి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు అవసరం ఉంటుంది.