ముల్తానీ మట్టి ఏమిటి?
ముల్తానీ మట్టి లేదా ఫుల్లర్స్ ఎర్త్ (fuller's earth) పాకిస్థాన్ లోని ముల్తాన్ నుండి వస్తుంది. భారతదేశంలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తునప్పటికీ, మనలో చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ముల్తానీ మట్టి నిజానికి బెంటోనైట్ క్లే (అగ్నిపర్వతం నుండి వచ్చే బూడిద నుండి ఏర్పడిన మట్టి), దీనిని కాల్షియం బెంటోనైట్ అంటారు. ఇది చాలా ఖరీదైన కాస్మెటిక్ ఉత్పత్తులలో ఒక ముఖ్యమైన భాగం.
శాస్త్రీయంగా చెప్పాలంటే, ఫుల్లర్స్ ఎర్త్ అనేది అల్యూమినియం సిలికేట్తో తయారు చేయబడిన ఒక రకమైన మట్టి, దీనిలో కాల్షియం, సోడియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. అయినప్పటికీ, యూ.యస్ (U.S) డిపార్ట్మెంట్ అఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం, ముల్తానీ మట్టి యొక్క కణాలు బంకమట్టి కణాల కంటే చిన్నగా ఉంటాయి మరియు సరిగ్గా బంకమట్టిలా మెత్తగా ఉండవు. ముల్తానీ మట్టి వేరే ఇతర బంకమట్టిల కంటే ఎక్కువ నీరును నిలుపుకుంటుంది మరియు అందువలన అది హైడ్రేటింగ్ మరియు మాయిశ్చరైజింగ్ ఏజెంట్గా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
పురాతన కాలం నుంచి ముల్తానీ మట్టి గురించి మరియు ముల్తానీ మట్టి యొక్క అద్భుత లక్షణాల గురించి మానవులకు తెలుసు. గ్రీస్ మరియు సైప్రస్ దేశస్తులు ఈ మట్టిని బట్టలు కోసం బ్లీచింగ్ ఏజెంట్గా వాడినట్లు మొట్టమొదటి రికార్డులు ఉన్నాయి, ఇది ఇక్కడ సుమారుగా 5000 సంవత్సరాల క్రితం ఉపయోగించబడింది. "ఫుల్లర్స్" అనే పేరు లాటిన్ పదం "ఫులో" నుంచి వచ్చింది, అంటే "బట్టలు నుండి నూనె మరకలను తొలగించే పని చెయ్యడం" అని అర్ధం. పురాతన బాబిలోనియాలో పలు సౌందర్య మరియు వైద్య చికిత్సలతోని మందుల తయారీలో ఇది ఉపయోగించబడింది.
ఈ రోజు, ముల్తానీ మట్టి దాదాపు ప్రతి పరిశ్రమలో చోటును సంపాదించింది, ఉదాహరణకు కాస్మెటిక్ పరిశ్రమ, కాగితపు పరిశ్రమ, వ్యవసాయం, డ్రై క్లీనింగ్, డైయింగ్ (డైలు తయారు చేయడం), నీటి శుద్దీకరణ, కర్మాగారాలు లేదా ఫార్మాస్యూటికల్ పరిశ్రమ.
మీకు తెలుసా?
ఫుల్లర్స్ ఎర్త్ ని బ్లీచింగ్ ఏజెంట్గా మాత్రమే కాకుండా, బంకమట్టి పాత్రలు (పింగాణీ) మరియు సౌందర్య సాధనాల తయారీలో కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. దీనిని మట్టి స్నానం (mud bath) కొరకు కొంతమంది ఆదిమవాసులు కూడా వాడుతుంటారు, ఇది ఒక డిటాక్స్ ఏజెంట్ లా మాత్రమే శరీరరీనికి ఉపశమనాన్ని కూడా చేసురుస్తుంది.