హిందీలో కాలి మిర్చ్ అని పిలవబడే మిరియాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన మసాలాలలో ఒకటి. ఇది ఆహారాలకు ఒక ఘాటు రుచిని ఇస్తుంది అది చాలా మందికి ఇష్టమైన రుచి. ఎండబెట్టి పొడి చేసిన మిరియాలు యూరోప్ వంటలో ముఖ్యముగా వాడే సాధారణ మాసాలలో ఒకటి. భోజనంలో మొదటి రకం (సూప్స్, స్టార్టర్స్ వంటివి) నుంచి మెయిన్ కోర్స్ (ప్రధాన మీల్) నుంచి డెజర్ట్స్ (స్వీట్) వరకు, ఇది ప్రతి వంటకంలో ఉపయోగపడుతుంది. మిరియాల యొక్క ఘాటు దానిలో ఉండే పెప్పరైన్ (piperine) అనే రసాయనం వలన వస్తుంది ఇది జీర్ణాశయ వ్యవస్థకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అద్భుతమైన స్టొమకాక్ (stomachic, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది) మాత్రమే కాక, ఇది ఒక శక్తివంతమైన యాంటీయాక్సిడెంట్గా కూడా ఉంటుంది. కాబట్టి, ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చెయ్యడంలో సహాయపడడం మరియు ఆహారాన్ని సరిగ్గా గ్రహించేలా/శోషించేలా చెయ్యడమే కాక శరీర జీవక్రియ (మెటబాలిజం) వలన ఉత్పన్నమైన ఆక్సీకరణ ఒత్తిడితో వ్యవహరించడంలో సహాయపడుతుంది. మిరియాలు యొక్క వంటకాల మరియు ఆరోగ్య ప్రయోజనాలు అన్ని కలిపి వీటికి "మాసాలలో రాజు" (King of Spices) అనే పేరును తెచ్చి పెట్టాయి.
వాణిజ్యపరంగా ఉపయోగించే మిరియాలు ఉష్ణమండల ప్రాంతాలలో, సంవత్సరం పొడవునా కాసే తీగ మొక్కైన పైపర్ నైగ్రం ఎల్ (Piper Nigrum L.) కు కాసే పక్వానికి చెంది ఎండిన కాయలు. ఈ మొక్క పైపర్సియే కుటుంబానికి చెందినది. మిరియాలు భారతదేశంలోని దక్షిణ పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా పెరుగుతాయి, కేరళ రాష్ట్రంలో మరియు మైసూరు, తమిళనాడు మరియు గోవాలోని కొన్ని ప్రాంతాలలో వీటి సాగు జరుగుతుంది. ఆసక్తికరంగా, ఒకప్పుడు మొత్తం మిరియాలు మలబార్ అని పిలవబడే ప్రాంతంలో మాత్రమే పండేవి, ఇది ప్రస్తుతం కేరళగా పిలువబడుతుంది. పురాతన కాలం నుండి మలబార్ తీరం మిరియాలు యొక్క సాగు మరియు దిగుమతి-ఎగుమతికి ప్రసిద్ది చెందింది. ఇక్కడ నుండే మిరియాలు ఇండోనేషియా, మలేషియాలకు ఎగుమతి చేయబడ్డాయి మరియు తరువాత అవి మిరియాలు పండగల దేశాలకు వ్యాపించాయి.
మిరియాలు వాటి యొక్క ప్రత్యేకమైన రుచి మరియు ఆరోగ్య లక్షణాల వలన అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువగలవిగా ఉన్నాయి . సాధారణంగా "పెప్పర్ " గా పిలవబడే మిరియాల పొడి , ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా ప్రతి డైనింగ్ టేబుల్స్ దగ్గర చూడవచ్చు, సాధారణంగా చాలా రెస్టారెంట్లలో టేబుల్ మీద ఉప్పుతో పాటుగా దీనిని కూడా ఉంచుతారు.
మిరియాల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: పైపర్ నైగ్రం (Piper nigrum)
- కుటుంబం: పైపర్సియే (Piperaceae)
- సాధారణ నామం: మిరియాలు, పెప్పర్
- సాధారణ హిందీ మరియు సంస్కృత నామం: కాలి మిర్చ్
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్టీర్ణం: మిరియాలు ప్రధానంగా దక్షిణ భారతదేశానికి చెందినవి. రోమన్ యుగంలో, మిరియాలు భారతదేశంలోని నౌకాశ్రయాల నుండి ఎర్ర సముద్రం (రెడ్ సి) ప్రాంతానికి దిగుమతి చేయబడ్డాయి మరియు తర్వాత ఇది తూర్పు ఉష్ణమండల ప్రాంతాలుకు విస్తరించింది. మిరియాలు ప్రపంచ మసాలాదినుసుల వాణిజ్యంలో ఒక పురాతన పదార్థంగా పరిగణించబడుతున్నాయి. దక్షిణ భారతదేశంలో మరియు చైనాలో మిరియాలను సాగు చేస్తారు; అలాగే ఈస్ట్ మరియు వెస్ట్ ఇండీస్, మాలే పెనిన్సుల, మాలే అర్కోపీలాగో, సియామ్, మలబార్, వియత్నాం, బ్రెజిల్, ఇండోనేషియా మొదలైన దేశాలలో కూడా ఇవి సాగు చేయబడుతున్నాయి.
- సరదా విషయం: యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుతం అత్యధికంగా పరిమాణంలో మిరియాలను దిగుమతి చేసుకుంటోంది, ఈ దేశం 2009 లో 671 మిలియన్ డాలర్ల మిరియాలను దిగుమతి చేసుకుంది. ఇది ప్రపంచ మిరియాల దిగుమతిలో దాదాపు 18%.
మిరియాలు రెస్టారెంట్ యొక్క వాడకంలో 50% వాటాను కాన బరుస్తుంది.
మధ్య యుగాలలో, బరువు పరంగా మిరియాల కంకులు వెండి కంటే ఎక్కువ ధర పలికేవి.