జీడిపప్పులు బ్రెజిల్ దేశానికీ చెందినవి మరియు తరాల నుండి ఇవి వాటి రుచి వలన ప్రసిద్ధిగా చూడబడతాయి. ఇటీవలి కాలంలో, జీడిపప్పులు వాటి సున్నితమైన రుచి మరియు ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాల వలన ప్రపంచం అంతటా ప్రసిద్ధి చెందాయి.అయితే, ఉత్పాదకులు జీడిపప్పును ఎప్పుడూ జీడిపిక్క (జీడిపిక్క లోపల జీడిపప్పు ఉంటుంది) రోపంలో విక్రయిస్తారు, జీడిపిక్కలో ఉండే ఒక భాగం రెసిన్ (resin)ను కలిగి ఉంటుంది, ఇది వినియోగానికి హానికరమైనది. పచ్చి మరియు వేయించిన జీడిపప్పులు అలాగే రుచికోసం అనేక ఫ్లేవర్లు జోడించిన జీడిపప్పులు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని చిరుతిండిగా తినవచ్చు, సలాడ్లు, స్మూతీస్ మరియు ఇతర ఆహారపదార్దాలతో కలిపి తీసుకోవచ్చు. మీరు ఇతర గింజలు/పప్పుల ప్రయోజనాల కంటే వేరుగా ఉండే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను జీడిపప్పు నుండి పొందవచ్చు.
ఇది భారతీయ వంటకాలలో ఉపయోగించే ఒక ప్రముఖ మూలపదార్థం. జీడి చెట్టు బాగా ఎత్తుగా పెరుగుతుంది మరియు ఒక క్రమములేని కాండమును కలిగి ఉంటుంది. పెద్ద రసముగల జీడిమామిడి కాయలు కొమ్మలకు వ్రేలాడి ఉంటాయి మరియు ఈ కాయ యొక్క దిగువ భాగంలో జీడిపిక్క అంటుకుని ఉంటుంది. ఇది ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది మరియు దాని అధిక జీవితకాలం (shelf life) కారణంగా, ఇది ఎక్కువ కాలం పాటు నిల్వ చేయబడి, భద్రపరచబడుతుంది. పప్పు మరియు అలాగే పండు రెండింటికి వివిధ ఉపయోగాలున్నాయి. జీడిపప్పు పేదవాడి తోటగా పిలువబడుతుంది, అయితే అది ఇప్పుడు అధిక ధరలకు విక్రయించబడుతుంది. సంచార జీవుల (nomads) కాలంలో వీటిని ఎలా తినాలో తెలియక, గింజ దూరంగా విసిరివేసి, పండును మాత్రమే తినేవారు.
జీడిపప్పు మొక్క/ జీడిమామిడి మొక్క గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- శాస్త్రీయ నామము: అనాకార్డియం ఓక్సిడెంటలే (Anacardium Occidentale)
- కుటుంబము: అనాకార్డియేసి (Anacardiaceae)
- సాధారణ నామము: జీడిపప్పు, కజు (హిందీ)
- సంస్కృత నామము: భళాతక
- ఉపయోగించే భాగాలు: జీడిమామిడి చెట్టు యొక్క దాదాపు అన్ని భాగాలు ఔషధ గుణాలు ఉంటాయి. జీడిపప్పు, జీడిమామిడి కాయలు/పళ్ళు మరియు ఆకులు తినదగినవి.
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళికవిస్టీర్ణం: జీడిమామిడి చెట్లు ఈశాన్య బ్రెజిల్లో పుట్టాయి అవి దక్షిణ మరియు మధ్య అమెరికాలకు విస్తరించాయి. పోర్చుగీసు వారు దానిని భారతదేశం మరియు తూర్పు ఆఫ్రికాకు తీసుకువచ్చారు, తరువాత ఇది శ్రీలంక, ఇండోనేషియా మరియు మలేషియాలకు వ్యాపించింది. 17 వ శతాబ్దంలో, స్పానిష్ వారు దీనిని ఫిలిప్పీన్స్ కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం అనేక ఉష్ణమండల దేశాల్లో జీడిపప్పును సాగు చేస్తున్నారు; దీని ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు బ్రెజిల్, ఇండియా, వియత్నాం, మొజాంబిక్ మరియు టాంజానియా దేశాలు.
- ఆసక్తికరమైన నిజాలు: జీడిపిక్క యొక్క రెసిన్ పెయింట్లు వంటి పారిశ్రామిక ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది. ఇది బ్రేక్ లైనర్లలో ఉపయోగించడం వలన ఇది కారులలో కూడా దీనిని గమనించవచ్చు.