గుమ్మడికాయ గింజలవల్ల మన శరీరానికి ఏమి ప్రయోజనం కల్గించగలవని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి భారతీయ వంటగదిలో ఒక సాధారణ కూరగాయ మరియు ఒక సాధారణ ఆహార పదార్ధం-గుమ్మడికాయ (కడ్డూ). కొంచెం తీపిగా లేదా ఒకింత కారంగా గుమ్మడికాయను వండుకోవాలనుకున్నారా? పండిన గుమ్మడికాయ గుజ్జు ఇందుకు బాగా పనికొస్తుంది. ఈ గుమ్మడి పండులోనిగుజ్జు మాత్రమే ఆరోగ్యకరమైన అంశం కాదు, పెద్ద గోళంవంటి గుమ్మడికాయ మధ్యలో ఉండే విత్తనాలు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ముఖం అందాన్ని ఇనుమడింపజేసుకునేందుకు గుమ్మడికాయ గింజలతోఫేస్ మాస్క్ వేసుకోండి లేదా జుట్టు సమస్యలను నిర్వహించడానికి గుమ్మడిగింజల (సీడ్ ఆయిల్) నూనెను వాడండి. ఈ విత్తనాల పోషక పదార్ధాలు వ్యాధులతో పోరాడటానికి కూడా అనువైనవి.

కాబట్టి, గుమ్మడికాయ గింజల యొక్క ప్రయోజనాలు మరియు వాటిని ఎలా పొందాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి. దాని మితిమీరిన వినియోగానికి సంబంధించిన కొన్ని దుష్ప్రభావాలు కూడా ఇక్కడే చర్చించబడతాయి. మొదట, గుమ్మడికాయ విత్తనాల పోషక విలువలు మరియు దాని ప్రాథమిక అంశాలను పరిశీలిద్దాం.

గుమ్మడికాయ విత్తనాల గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

గుమ్మడికాయ విత్తనాలు అనేక పోషకాలకు నిలయం. పొటాషియం, మెగ్నీషియం మరియు విటమిన్ ఎ యొక్క గొప్ప మూలం గుమ్మడి గింజలు. గుమ్మడి (పండు) యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మరియు దాన్ని ఇష్టపడి ఆరగించే జనాభా గురించి తెలుసుకోవాలనుకుంటూ  ఉండవచ్చు. ఆ వివరాలివిగో.

  • శాస్త్రీయ నామం: కుకుర్బిటా మోస్చాటా (Cucurbita moschata)
  • కుటుంబం పేరు: కుకుర్బిటేసియా
  • సాధారణ పేరు: కడ్డూ, కడ్డూ కే బీజ్, స్క్వాష్, సఫేద్ కడ్డూ
  • సంస్కృత నామం: కర్కరు, కుర్కరు, కర్లారు, కాఖారు
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: పశ్చిమ దేశాలకు చెందిన గుమ్మడికాయల్ని వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పండిస్తారు. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్, మెక్సికో మరియు చైనా గుమ్మడికాయను ఎక్కువగా పండించే దేశాలు. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన గుమ్మడికాయ రకాలు యునైటెడ్ స్టేట్స్లో  హాలోవీన్ పండుగ కోసం ఉత్పత్తి చేయబడే దిగ్గజం లాంటి, నారింజరకం గుమ్మడికి భిన్నంగా ఉంటాయి. గుమ్మడికాయ గింజలు చిన్నవిగా, సదరంగా (flat) తినదగిన విత్తనాలు. సాధారణంగా గుమ్మడి గింజలు ఊకతో కప్పబడి ఉంటాయి.
  1. గుమ్మడికాయ గింజల పోషక విలువ - Nutritional value of pumpkin seeds in Telugu
  2. గుమ్మడికాయ గింజల ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of pumpkin seeds in Telugu
  3. గుమ్మడికాయ గింజలు చర్మానికి మేలు చేస్తాయి - Pumpkin seeds benefits for the skin in Telugu
  4. జుట్టుకు గుమ్మడికాయ విత్తనం - Pumpkin seed for the hair in Telugu
  5. జీర్ణక్రియ కోసం గుమ్మడికాయ గింజలు - Pumpkin seeds for digestion in Telugu
  6. బరువు తగ్గడానికి గుమ్మడికాయ గింజలు - Pumpkin seeds for weight loss in Telugu
  7. చక్కెరవ్యాధి నియంత్రణకు గుమ్మడికాయ గింజలు - Pumpkin seeds for diabetic control in Telugu
  8. గుండె ఆరోగ్యానికి గుమ్మడికాయ గింజలు - Pumpkin seeds for heart health in Telugu
  9. మెదడుకు గుమ్మడికాయ గింజలు - Pumpkin seeds for the brain in Telugu
  10. పురుషుల ఆరోగ్యానికి గుమ్మడికాయ గింజలు - Pumpkin seeds for men’s health in Telugu
  11. మహిళల ఆరోగ్యానికి గుమ్మడి గింజలు - Pumpkin seeds for women’s health in Telugu
  12. గుమ్మడికాయ విత్తన మోతాదు - Pumpkin seed dosage in Telugu
  13. గుమ్మడికాయ విత్తనాల దుష్ప్రభావాలు - Pumpkin seeds side effects in Telugu

యుఎస్‌డిఎ ప్రకారం, గుమ్మడికాయ గింజలు ఈ క్రింది పోషక విలువలను కలిగి ఉంటాయి:

పోషకం 

100 గ్రాములకు 

నీరు

4.5 g

శక్తి

446 kcal

కార్భోహైడ్రేట్

53.7 g

ప్రోటీన్

18.5 g

ఫ్యాట్

19.4 g

ఫైబర్

18.4 g

కాల్షియం

55 mg

ఐరన్

3.3 mg

మెగ్నీషియం

262 mg

పొటాషియం

919 mg

ఫాస్ఫరస్

92 mg

విటమిన్ ఏ

369 mcg

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

గుమ్మడికాయ విత్తనాలు ఆహార పీచుపదార్థాల (ఫైబర్స్) యొక్క గొప్ప వనరుగా ఉండటం వల్ల వీటి సేవనం జీర్ణక్రియ ప్రక్రియ రుగ్మతలను నివారించడంలో మీకు సహాయపడుతుంది. గుమ్మడికాయ విత్తనాలలో ఉన్న అనేక సూక్ష్మపోషకాలు మీ మొత్తం ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఈ విత్తనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు చర్మం మరియు జుట్టుకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ ప్రయోజనాలు మరియు మరెన్నో ఈ విభాగంలో చర్చించబడతాయి.

  • చర్మం కోసం: గుమ్మడి గింజలు ఎస్సెంషియాల్ ఫ్యాటీ ఆసిడ్లకు  మంచి మూలకాలు ఇవి చర్మ ఆరోగ్యంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఇవి చర్మం పొడిబారకుండా చేసి ముడతలను నివారిస్తాయి అలాగే  అదనపు నూనె ఉత్పత్తిని తగ్గించి మొటిమలను కూడా నివారిస్తాయి. 
  • జుట్టుకు: గుమ్మడి గింజల నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇన్ వివో అధ్యయనాలు అలోపీషియా నిర్వహణలో ఈ నూనె ప్రభావంతంగా ఉన్నట్లు కనుగొన్నాయి.
  • బరువు తగ్గుదలకు: గుమ్మడి గింజల ఫైబర్ కు మంచి వనరులు అంటే అవి వేగంగా కడుపు నిండిన భావనను కలిగించి తక్కువ తినేలా చేస్తాయి తద్వారా బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. అలాగే ఇవి ఫ్యాట్స్ కు ఆరోగ్యకర వనరులు.
  • ముధుమేహం కోసం: గుమ్మడి గింజలకు ప్రభావవంతమైన హైపోగ్లైసిమిక్ చర్యలు ఉన్నట్లు అధ్యయనాలు కనుగొన్నాయి. హైపోగ్లైసిమిక్ చర్యలు అంటే రక్త చక్కర స్థాయిలను తగ్గించే చర్యలు తద్వారా అవి ముధుమేహం నిర్వహణ కు సహాయం చేస్తాయి.
  • గుండె ఆరోగ్యం కోసం: గుమ్మడి గింజలు ఎస్సెంషియాల్  ఫ్యాటీ ఆసిడ్లకు మంచి వనరులు ఇవి రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
  • మెదడుకు: యాంటీయాక్సిడెంట్లకు మంచి వనరులుగా గుమ్మడి గింజలు రెయాక్టీవ్ ఆక్సిజన్ జాతుల సంఖ్యను తగ్గిస్తాయి మరియు వాటి వలన మెదడుకి జరిగే నష్టాన్ని తగ్గిస్తాయి తద్వారా అల్జిమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

గుమ్మడికాయ విత్తనాలు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇవి స్వేచ్ఛారాశుల (ఫ్రీ రాడికల్స్) వల్ల కలిగే ఆక్సీకరణ నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇది మీ చర్మాన్ని మృదువుగా, మెరుస్తూ, యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. స్వేచ్చారాశులు (ఫ్రీ రాడికల్స్) ప్రతిక్రియాత్మక (రియాక్టివ్) ఆక్సిజన్ జాతులను కలిగి ఉంటాయి, ఇవి మానవ అణువులతో చురుకుగా సంకర్షణ చెందుతాయి; స్వేచ్చారాశుల కారణంగా దెబ్బ తినే అత్యంత సాధారణ అవయవం చర్మమే. ఈ నష్టం చర్మంపై ముడతలు, వయస్సుతో పాటుగా వచ్చే మచ్చలు మరియు వయసు పెరగడంతో వచ్చే ఇతర సంకేతాలుగా వ్యక్తమవుతాయి.

గుమ్మడికాయ గింజలు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల మూలం, ఇవి మీ చర్మ ఆరోగ్యానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వైద్యపర (క్లినికల్) సాక్ష్యం ప్రకారం చర్మం పొడిబారకుండా ఉండటానికి మరియు ముడతలు కనబడకుండా దాయడంలో ఇవి సహాయపడతాయి. ఇంకా, గుమ్మడికాయ గింజలసేవనంవల్ల చర్మంలో నూనెల ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా మొటిమలు లేదా మొటిమల రూపాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ చర్య గుమ్మడికాయ గింజలలో ఉండే అధిక జింక్ అంశం కారణంగా సంభవమవుతుంది. 

గాయం/పుండును నయం చేసే ప్రక్రియలో గుమ్మడికాయ విత్తనాల యొక్క గొప్ప సామర్థ్యాన్ని నిరూపించాయని కొన్ని “ఇన్-వివో” జంతు-ఆధారిత అధ్యయనాలు నిరూపించాయి.

గుమ్మడిగింజల ఈ ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన మరియు యవ్వన చర్మాన్ని పొందడానికి, మీరు ఇంట్లోనే “గుమ్మడికాయ సీడ్ ఫేస్ మాస్క్” ముఖానికి  వేసుకోవచ్చు. ఇది అన్ని రకాల చర్మాలకు ఉపయోగకరంగా ఉంటుందని కనుగొనబడింది.

ఈ సాధారణ  గుమ్మడికాయ సీడ్ ఫేస్ మాస్క్ వేసుకోవడానికి, గుమ్మడికాయ గింజలు మరియు రోజ్ వాటర్ సమాన మొత్తాన్ని మిళితం చేసి రాత్రిపూట రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయండి. మరుసటి రోజు, కొన్ని తేనె చుక్కలతోపాటు రెండు పదార్ధాలను కలపండి మీకిపుడు ముఖంపై మాస్క్ వేసుకోవడానికి పేస్టు సిద్ధంగా ఉంది. మీ చర్మంపై ఈ మాస్కును 20 నుండి 30 నిమిషాలపాటు ఉండనిచ్చి, అంటే మాస్కు పూర్తిగా ఆరిపోయేంతవరకూ ఉండి తరువాత,మీరు దానిని కొద్దిగా వెచ్చని నీటితో కడగవచ్చు.

బలమైన మరియు మెరిసే జూలువంటి వెంట్రుకల్ని తల నిండుగా కల్గిఉండేందుకు ఎవరు మాత్రం ఇష్టపడరు? కానీ, జుట్టు రాలడం చాలా మందిలో సమస్య. బహుశా చెడు వాతావరణం, పెరుగుతున్న కాలుష్యం లేదా జన్యుపరాకారణాలవల్ల ఇలా కావచ్చు. కారణం ఏమైనప్పటికీ, పురుషులు మరియు మహిళలు ఇద్దరిలో జుట్టు రాలడం చాలా సాధారణం, దీనివల్ల పురుషులకు బట్టతల వచ్చే ప్రమాదం ఎక్కువ. గుమ్మడికాయ గింజల నూనె సహాయంతో దీనిని నిర్వహించవచ్చు. ఆశ్చర్యపోకండి, దీన్ని నిరూపించేందుకు తగిన పరిశోధన ఆధారాలు ఉన్నాయి.

జుట్టు రాలే సమస్యకు ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, గుమ్మడికాయ గింజల నూనె కూడా అలోపేసియా నిర్వహణలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది, ఇది ఇన్-వివో జంతు అధ్యయనాలు మరియు మానవ అధ్యయనాలు రెండింటి ద్వారా నిర్ధారించబడింది. “ఆండ్రోజెన్ అలోపేసియా,” అనేది పురుషులలో జుట్టు రాలడానికి అత్యంత సాధారణ కారణం మరియు వృద్ధులైన పురుషులలో 70% కంటే ఎక్కువ మందిని దెబ్బ తీస్తుందిది, గుమ్మడికాయ గింజల నుండి పొందిన నూనెను ఉపయోగించడం ద్వారా ఈ జుట్టు సమస్య నిర్వహించబడుతుంది. ప్లేసిబోతో పోల్చినప్పుడు (చికిత్సా ప్రభావాలు లేని మందులు), గుమ్మడికాయ విత్తన నూనెతో చికిత్స పొందిన రోగులు జుట్టు పెరుగుదలలో గణనీయమైన మొత్తాన్ని కలిగి ఉన్నారు. ప్రీ-ట్రీట్మెంట్ మరియు పోస్ట్ ట్రీట్మెంట్ ఛాయాచిత్రాలు, స్వీయ-అంచనా డేటా మరియు వివిధ పరీక్షల పోలికపై ఈ తీర్మానం జరిగింది.

అందువల్ల, గుమ్మడికాయ విత్తన నూనె జుట్టు రాలడానికి సురక్షితమైనదిగా మరియు ప్రభావవంతంగా పరిగణించబడుతుంది, ఇది మీకు ఉపయోగించడానికి సరైన కారణాన్ని ఇస్తుంది.

గుమ్మడికాయ విత్తన నూనె సులభంగా లభిస్తుంది, కానీ, మీరు సరళమైన మూడు-దశల విధానాన్ని అనుసరించి ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు. దాని విత్తనాలను పొందడానికి పెద్ద గుమ్మడికాయను కత్తిరించండి. విత్తనాలను శుభ్రం చేసి ఆరబెట్టి, రంగులో మార్పు వచ్చేవరకు స్టవ్ టాప్‌లో వేయించుకోవాలి. విత్తనాలను మాడ్చకుండా జాగ్రత్త వహించండి. చివరగా, ఈ నూనెను పొందటానికి, మరియు ఈ విత్తనాలను చూర్ణం చేయడానికి ఒక మోర్టార్ మరియు ఒక రోకలిని ఉపయోగించండి.

జుట్టు రాలే సమస్యకు గుమ్మడి గింజల నూనెను ఉపయోగించడానికి, మీరు కొంచం  గ్రీన్ టీ సహాయంతో ఈ నూనెను పలుచన చేయాలి (ఇది ఒక బలమైన ఏజెంట్). ఇప్పుడు కడిగిన జుట్టు మీద ఈ నూనెను పూయండి, ఓ 5 నిమిషాలపాటు ఉండనిచ్చి తర్వాత నీటితో జుట్టును శుభ్రం చేయండి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹546  ₹850  35% OFF
BUY NOW

గుమ్మడికాయ గింజలు పీచు ఆహారపదార్థాల (ఫైబర్) యొక్క గొప్ప వనరు, మరియు ఫైబర్స్, మనందరికీ తెలిసినట్లుగా, జీర్ణక్రియ ప్రక్రియకు ముఖ్యమైనవి. ఈ విత్తనాలలో కరిగే మరియు కరగని పీచుపదార్థాలు ఉంటాయి. సరైన జీర్ణక్రియను నిర్ధారించడంలో ఇవి సహాయపడతాయి మరియు మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. మీ ఆహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చడానికి, మీరు ఈ విత్తనాలను కొన్నింటిని వాటిపై ఉండే కవచం (షెల్) తో పాటు సురక్షితంగా తినవచ్చు లేదా మీరు వాటిని పెనంపై/ఓవెన్లో దోరగా (తేలికగా) వేయించుకోవచ్చు. మంచి రుచి కోసం మీరు కొంచెం నూనె మరియు ఉప్పును గుమ్మడికాయ గింజలకు జోడించవచ్చు.

గుమ్మడికాయ గింజలు పీచుపదార్థాలకు (ఫైబర్స్) గొప్ప వనరులు, అంటే అవి మంచి సంతృప్తి సూచికను అందిస్తాయి, అనగా అవి మీకు కడుపు నిండిన అనుభూతిని ముందుగా కలిగిస్తాయి. ఇది అతిగా తినడం మరియు అనారోగ్యకరమైన చిరుతిండిని నివారిస్తుంది.  మీరు మీ సాయంత్రం అల్పాహారంలో ఒక చిప్స్ ప్యాక్ ను పూర్తిగా తినడానికి బదులుగా కాల్చిన గుమ్మడికాయ గింజల ()ను తిని ఆనందించవచ్చు.

గుమ్మడికాయ గింజల్లో కొవ్వులు ఉన్నప్పటికీ, అవి కొవ్వుకు ఆరోగ్యకరమైన మూలం మరియు వాటిని అన్నివేళలా ఆహారంతో బాటు తినమని సూచించబడ్డాయి. బరువు సమస్యలతో పోరాడటానికి అధిక కొవ్వు ఉన్న ఆహారాలకు ప్రత్యామ్నాయంగా గుమ్మడికాయ విత్తనాలను తినమంటూ అనేక ఆరోగ్యకరమైన ఆహారాల్ని తినమంటూ సిఫార్సు చేసే గైడ్లు పేర్కొంటున్నాయి. ఇంగ్లాండులోని NHS (National Health Service) కూడా గుమ్మడి గింజల్ని ఆహారంలో చేర్చాలని సిఫారసు చేసింది.

(మరింత చదవండి: బరువు తగ్గడానికి డైట్ చార్ట్)

చక్కెరవ్యాధి (డయాబెటిస్) అనేది గ్లూకోజ్ జీవక్రియలో పనిచేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  చక్కెరవ్యాధి (మధుమేహం)తో నివసించే వ్యక్తులు తరచుగా దాని నిర్వహణలో సమస్యలు మరియు అసమర్థతను ఎదుర్కొంటూ ఉంటారు.

గుమ్మడికాయ గింజలు గణనీయమైన హైపోగ్లైసీమిక్ (రక్తములో చక్కెర శాతం ప్రమాద స్థాయికి తగ్గుట) ప్రభావాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు నిరూపించారు, అంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించటానికి సహాయపడుతుంది. గుమ్మడికాయ విత్తనాలలో ఉన్న నికోటినిక్ ఆమ్లం, త్రికోణెలైన్ మొదలైన మాక్రోమోలిక్యుల్స్ యొక్క కార్యకలాపాలు గ్లైసెమిక్ నియంత్రణకు కారణమవుతాయి.

చక్కెరవ్యాధి (డయాబెటిస్)తో బాధపడుతున్న రోగులలో ఆ వ్యాధి నియంత్రణను సాధించడానికి గుమ్మడికాయ విత్తనాలు ఓమంచి సహజమైన ఏజెంట్లు అని పరిశోధనలు సూచిస్తున్నాయి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹495  ₹799  38% OFF
BUY NOW

గుమ్మడికాయ గింజలు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాల యొక్క గొప్ప మూలం, అందువల్ల అవి మీ గుండె ఆరోగ్యానికి అవసరం. ఇవి రక్త కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ గింజల యొక్క ఈ పని పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది మరియు గుమ్మడికాయ విత్తన నూనె వాడకంతో మరింత ప్రభావవంతంగా ఉంటుంది. ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌పై దాని నిర్దిష్ట చర్యలే దీనికి కారణం.

యాదృచ్ఛిక నియంత్రణ అధ్యయనం ప్రకారం, గుమ్మడికాయ విత్తన నూనెను సేవించే మహిళల్లో అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (మంచి కొలెస్ట్రాల్) మరియు గోధుమ బీజ నూనెను సేవించే సమూహంతో పోలిస్తే తక్కువ స్థాయి డయాస్టొలిక్ రక్తపోటు ఉంటుంది.

ఇన్-వివో జంతు అధ్యయనాలు సిస్టోలిక్ రక్తపోటును మెరుగుపరచడంలో గుమ్మడికాయ విత్తన నూనె యొక్క పాత్రను అదనంగా చూపించాయి, ఈస్ట్రోజెన్ స్థాయిలను క్రమబద్ధీకరించడం వలన ఇది సంభవిస్తుంది.

జంతువుల అధ్యయనాల యొక్క మరొక సమితి మొత్తం కొలెస్ట్రాల్ మరియు తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (చెడు కొలెస్ట్రాల్) ను తగ్గించడంలో తన పాత్రను ప్రదర్శించింది.

తరువాతి యంత్రాంగాలు పూర్తిగా అర్థం కాలేదు, గుమ్మడికాయ గింజలు కొలెస్ట్రాల్ స్థాయిల నిర్వహణకు సహాయపడతాయని మరియు దాని వినియోగం సిఫార్సు చేయబడింది.

హృదయనాళ చర్యల వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది మరింత సహాయపడుతుంది.

(మరింత చదవండి: గుండె జబ్బు చికిత్స)

అల్జీమర్స్ లేక మతి మరుపు వ్యాధి అనబడే జ్ఞాపకశక్తిని పూర్తిగా కోల్పోయే (alzheimers) వ్యాధి, వయస్సు పెరగడంవల్ల సంభవించే ఒక సాధారణమైన మెదడునరాలను దెబ్బతీసే (న్యూరోడెజెనరేటివ్) రుగ్మత ఇది. ఇది రోజువారీ కార్యకలాపాలను చేయడంలో జ్ఞాపకశక్తి కోల్పోవడం మరియు క్షీణించిన సామర్ధ్యాలను బట్టి వర్గీకరించబడుతుంది, ఈ వ్యాధికి గురైన వారి జీవన నాణ్యతను ఇది తగ్గిస్తుంది. అమిలాయిడ్ బీటా నిక్షేపణ ఈ వ్యాధి యొక్క వ్యాధికారక ఉత్పత్తికి ప్రధాన కారణం. ఇది న్యూరోనల్ మరణానికి దారితీసే రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల ఉత్పత్తిని పెంచుతుంది.

రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల జనాభాను తగ్గించడంలో గుమ్మడికాయ విత్తనాలు సహాయపడతాయి, తద్వారా మెదడుకు కలిగే నష్టాన్ని తిప్పికొట్టవచ్చు. కాబట్టి, మీ ఆహారంలో గుమ్మడికాయ గింజలను ఓ భాగంగా జోడించడం మీ మెదడుకు ఆరోగ్యకరమైన ఆహార సేవనం కావచ్చు.

నిరపాయమైన ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా లేదా ప్రోస్టేట్ గ్రంథి యొక్క విస్తరణ అనేది వృద్ధాప్యంలో చాలా మంది పురుషులు ఎదుర్కొంటున్న సాధారణ సమస్య. ఇది తరచుగా మూత్రవిసర్జన ద్వారా వ్యక్తమవుతుంది మరియు అలాంటి పురుషులు కూడా మూత్రవిసర్జనలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నిరపాయమైనప్పటికీ (క్యాన్సర్ ప్రమాదంతో సంబంధం లేదు దీనికి), ఈ పరిస్థితి మూత్రపిండాల్లో రాళ్ళు మరియు మూత్రాశయ సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది, కాబట్టి, దీనిని త్వరగా నిర్వహించుకుని నయం చేసుకోవాలి.

గుమ్మడికాయ విత్తనాల నూనె ఈ రుగ్మత యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ప్రభావితమైన వారి జీవన నాణ్యతను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ నూనె వాడకం పరిస్థితికి సంప్రదాయ చికిత్సకు పరిపూరకరమైన లేదా ప్రత్యామ్నాయ ఔషధంగా సురక్షితంగా సిఫార్సు చేయబడింది.

మహిళల్లో రక్త కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో గుమ్మడికాయ గింజలు ఎలా సహాయపడతాయో పైన చర్చించాము. రుతుక్రమం ఆగిపోయిన మహిళలు గుమ్మడికాయ గింజల్ని తింటే రుతువిరతి తర్వాత సాధారణంగా వచ్చే తలనొప్పి, కీళ్ల నొప్పులు మరియు వేడి ఆవిర్లు(hot flushes) వంటి రుగ్మతల్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి, గుమ్మడికాయ గింజలు రుతువిరతి అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని చెప్పవచ్చు. ఇంకా, గుమ్మడికాయ విత్తనాల నూనె నిరాశను తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది, కావున గుమ్మడివిత్తనాల నూనెను సేవిస్తే ఆనందాన్ని మెరుగుపరుస్తుంది.

మరి, రుతుక్రమం ఆగిపోయిన మహిళలకు గుమ్మడిగింజలు ఇప్పటి నుండి ఓ కొత్త బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు!

గుమ్మడికాయ గింజల్ని మౌఖికంగా తిన్నపుడే సురక్షితం. కొన్ని గుమ్మడి గింజల్ని మాత్రం పచ్చిగా లేదా వేయించుకుని అయినా తినవచ్చు. ప్రత్యామ్నాయంగా, ప్రతిరోజూ 1 నుండి 2 టీస్పూన్ల గుమ్మడికాయ గింజల పొడిని తీసుకోవచ్చు. గుమ్మడి గింజల పొడిని ఉదయం మరియు సాయంత్రం మోతాదులను తీసుకోవచ్చు. 

ఆరోగ్యవంతులైన వ్యక్తులకు గుమ్మడివిత్తనాల రోజువారీ మోతాదు 10 మి.గ్రా మించకూడదు. అయినప్పటికీ, ఏదైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే, తీసుకోవలసిన గుమ్మడికాయ గింజల మోతాదు మరియు వాటిని ఏరూపంలో తీసుకోవాలన్నదాని గురించి మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

సాధారణంగా గుమ్మడికాయ విత్తనాలు తినడం సురక్షితమే అయినప్పటికీ, గుమ్మడికాయ విత్తనాల మితిమీరిన సేవనం కింది దుష్ప్రభావాలను కల్గిస్తుంది:

  • ఉబ్బరం మరియు గ్యాస్- గుమ్మడికాయ విత్తనాలు పీచుపదార్థం (ఫైబర్) యొక్క గొప్ప వనరు, అయితే నీరు తగినంతగా తాగకపోతే కడుపుబ్బరం-కడుపులో వాయువును కల్గించే దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది.  
  • మలబద్ధకం- మలబద్దకం యొక్క లక్షణాలను తగ్గించడంలో గుమ్మడివిత్తనాలు  ప్రభావశాలి ఆయనప్పటికీ, అధిక మోతాదు ప్రతికూలంగా ఉంటుంది.
  • బరువు పెరుగుట- గుమ్మడికాయ విత్తనాలు అవసరమైన కొవ్వు ఆమ్లాలు మరియు కొవ్వులకు ఓ గొప్ప వనరు, వీటిని మితిమీరి సేవించడంవల్ల బరువు పెరగడానికి దారితీస్తుంది
  • గుమ్మడికాయ విత్తనాలను అధికంగా తినడంవల్ల జీర్ణవ్యవస్థలో జీర్ణంకాని పదార్థాలు (bezoar) పేరుకుపోవడం కారణంగా రోగికి విపరీతమైన అసౌకర్యం కలుగుతుందని ఒక అధ్యయనం నివేదించింది.

Medicines / Products that contain Pumpkin Seed

వనరులు

  1. Janaki R. Manne et al. A Crunching Colon: Rectal Bezoar Caused by Pumpkin Seed Consumption. Clin Med Res. 2012 May; 10(2): 75–77. PMID: 22031478
  2. Heeok Hong et al. Effects of pumpkin seed oil and saw palmetto oil in Korean men with symptomatic benign prostatic hyperplasia. Nutr Res Pract. 2009 Winter; 3(4): 323–327. PMID: 20098586
  3. Yoshinori Okada, Mizue Okada. Protective effects of plant seed extracts against amyloid β-induced neurotoxicity in cultured hippocampal neurons. J Pharm Bioallied Sci. 2013 Apr-Jun; 5(2): 141–147. PMID: 23833520
  4. El-Mosallamy AE et al. Antihypertensive and cardioprotective effects of pumpkin seed oil. J Med Food. 2012 Feb;15(2):180-9. PMID: 22082068
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Nuts and seeds
  6. healthdirect Australia. How to lower cholesterol. Australian government: Department of Health
  7. Gossell-Williams M et al. Supplementation with pumpkin seed oil improves plasma lipid profile and cardiovascular outcomes of female non-ovariectomized and ovariectomized Sprague-Dawley rats. Phytother Res. 2008 Jul;22(7):873-7. PMID: 18567058
  8. Gossell-Williams M et al. Improvement in HDL cholesterol in postmenopausal women supplemented with pumpkin seed oil: pilot study. Climacteric. 2011 Oct;14(5):558-64. PMID: 21545273
  9. Patrick J. Skerrett, Walter C. Willett. Essentials of Healthy Eating: A Guide. J Midwifery Womens Health. 2010 Nov-Dec; 55(6): 492–501. PMID: 20974411
  10. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Eating Hints: Before, during, and after Cancer Treatment
  11. Young Hye Cho et al. Effect of Pumpkin Seed Oil on Hair Growth in Men with Androgenetic Alopecia: A Randomized, Double-Blind, Placebo-Controlled Trial. Evid Based Complement Alternat Med. 2014; 2014: 549721. PMID: 24864154
  12. Sana Bardaa et al. Oil from pumpkin (Cucurbita pepo L.) seeds: evaluation of its functional properties on wound healing in rats. Lipids Health Dis. 2016; 15: 73. PMID: 27068642
  13. Silke K. Schagen, Vasiliki A. Zampeli, Evgenia Makrantonaki, Christos C. Zouboulis. Discovering the link between nutrition and skin aging. Dermatoendocrinol. 2012 Jul 1; 4(3): 298–307. PMID: 23467449
  14. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 12163, Seeds, pumpkin and squash seeds, whole, roasted, without salt. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
Read on app