జీలకర్ర అనేది ఒక సాధారణ భారతీయ మసాలాదినుసు , ఇది దాదాపు ప్రతి భారతీయ ఇంటిలో ఉపయోగించబడుతుంది. తాజా జీరా రైస్ ను ఒక మంచి కూరతో పాటుగా తినడానికి ఎవరు ఇష్టపడరు?
కానీ, జీలకర్ర మీ ఆహారంలో రుచిని జోడించడం మాత్రమే కాక ఇంకా అనేక ప్రయోజనాలు అందిస్తుందని మీకు తెలుసా? ఒక ఔషధ మూలికగా దీని ఉపయోగం ఆయుర్వేద మరియు సాంప్రదాయ వైద్యంలో చాలా సాధారణం. అయితే, జీలకర్ర యొక్క ఔషధ ప్రయోజనాలను పొందటానికి మీరు దానిని ఒక నిర్దిష్ట రూపంలో మరియు మోతాదులో తీసుకోవాలి. జీలకర్రను తీసుకోవడానికి మీ రోజువారీ దినచర్యలో ఒక గ్లాసు జీలకర్ర నీరును చేర్చడం అనేది ఒక ఉత్తమ మార్గం. ఆ ప్రయోజనాలు అసలు ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఈ వ్యాసం వాటికి సమాధానం ఇస్తుంది. జీలకర్ర నీటి యొక్క అనేక ప్రయోజనాలు శాస్త్రీయ (సైంటిఫిక్) సాక్ష్యాలు ఆధారంగా వివరించబడ్డాయి. జీలకర్ర నీటి యొక్క రెసిపీ మరియు దాని అధిక వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా చర్చించబడ్డాయి. ముందుగా, జీలకర్ర యొక్క కొన్ని ప్రాథమిక వాస్తవాల గురించి తెలుసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం.
జీలకర్ర గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
జీలకర్ర చరిత్రలోనే తొలిసారిగా పండించిన మూలిక. జీలకర్ర యొక్క సుగంధభరితమైన రుచి వలన దాని ఔషధ లక్షణాలను అధ్యయనాలు చేసేందుకు పరిశోధకులను మరియు శాస్త్రవేత్తలను ఎల్లప్పుడూ ఆకర్షిస్తుంది. జీలకర్ర అనేది పండ్లతో కూడిన పుష్పించే మొక్క మరియు ఆ పండ్లు ఎండిన తర్వాత జీలకర్ర విత్తనాలు వస్తాయి.
- శాస్త్రీయ నామం: క్యుమినం సిమినం (Cuminum cyminum)
- కుటుంబం: ఎపియేసి (Apiaceae)
- సాధారణ పేర్లు: జీలకర్ర, జీరా
- సంస్కృత నామం: జిరాకా
- ఉపయోగించే భాగాలు: విత్తనాలు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: జీలకర్ర తూర్పు మధ్య ప్రాంతం మరియు భారతదేశానికి చెందినది, అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతుంది.