తమ శరీరంలో ఏర్పడ్డ అదనపు కొవ్వును కోల్పోవడం అనేది అందం మరియు ఆరోగ్యం గురించి ఆందోళన పడే ప్రతి ఒక్కరినీ కలవరపరిచే విషయమే. కొన్నిసార్లు, మీ ఎగువ శరీరంలో చేతులు లేదా ఉదరం వంటి భాగాల్లో అదనపు కొవ్వు లేదా సెల్యులైట్ అనే కొవ్వు పేరుకుని ఉండవచ్చు మరియు కొన్నిసార్లు, మీ దిగువ శరీరంలో తొడలు, తుంటిభాగం లేదా పిక్కల భాగంలో కొవ్వు ఉండవచ్చు. ఈ కొవ్వును వదిలించుకోవడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తారు, వ్యాయామం, ఆహారంలో మార్పులు మరియు ఇంకా ఏమి కాదు? ఎన్నో చేస్తుంటారు.
తొడల్లో కొవ్వు జమవడమనేది 80 నుంచి 90 శాతం మంది మహిళల్లో సంభవిస్తుంది మరియు పురుషులలో ఈ తొందర చాలా తక్కువ. ఆడవారిలో తొడలు, తుంటిభాగం మరియు వక్షోజాలలో కొవ్వు నిల్వ చేసే ఎంజైమ్ లిపోప్రొటీన్ లిపేస్ యొక్క అధిక సాంద్రత కలిగి ఉండటమే దీనికి కారణం, పురుషుల్లో అయితే సాధారణంగా ఈ ఎంజైమ్ యొక్క సాంద్రత పొత్తికడుపు మరియు వెనుకభాగంలో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోవడంపై ఎవ్వరైనా సరే శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది, కేవలం అందం దృష్ట్యానే కాకుండా లోపల దాగుండే కొన్న్ని ఆరోగ్య సమస్యల స్మరణ కోసం ఇది అగత్యం.
తొడ ప్రాంతంలో కొవ్వు పేరుకుపోవడానికి జన్యు లేదా హార్మోన్ల కారణాలు, పేలవమైన ప్రసరణ, జీవనశైలి, ఆహారం, వ్యాయామాలు లేకపోవడం లేదా శరీర జీవక్రియ కావచ్చు, ఈ కారణాలన్నీ తొడ ప్రాంతంలో కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రేరేపించే అంశాలు.
తొడభాగంలో కొవ్వును వదిలించుకోవడానికి చాలామంది తరచూ శస్త్రచికిత్సను ఒక ఎంపికగా చూస్తారు. ఈ వైద్య శస్త్రచికిత్సలు, ఇంజెక్షన్లు, విద్యుత్ ప్రవాహాలు (ఎలక్ట్రిక్ కర్రెంట్స్) మొదలైన వాటి కోసం మహిళలు అంతులేని డబ్బు ఖర్చు చేస్తారు. అయితే తొడ కొవ్వు తగ్గడానికి సాధారణమైన గృహచిట్కాలు మనకు తెలిస్తే? వాటిని ఉపయోగించుకోకుండా ఉంటామా మనం?
ఇక్కడ ఈ వ్యాసంలో, మీ తొడల నుండి అదనపు కొవ్వును కోల్పోవటానికి సహాయపడే సాధారణ ఇంటి చిట్కాలను మరియు కొన్ని వ్యాయామాలను మేము చర్చిస్తాము.