మీకు నీళ్లు తాగే అలవాటు లేకపోతే లేదా మీకు సాధారణంగా చాలా దాహం కలగకపోతే, మీరు తగినంత నీరు త్రాగటం మరచిపోయే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి, మీరు రోజంతా మీ నీటి వినియోగాన్ని విభజించే నీటి తాగుడు షెడ్యూల్‌ను రూపొందించవచ్చు. కిందిది అనువైన షెడ్యూల్. అయితే, మీ శరీర అవసరాలు మరియు రోజువారీ దినచర్యల ప్రకారం మీ నీటి అవసరాలు మరియు సమయాలు మారుతూ ఉంటాయని మీరు గమనించవచ్చు.
ఉదయం 7.00 గంటలకు మొదటి గ్లాసు నీరు
మీ ఉదయపు అల్పాహారం తీసుకునే ముందు నిర్జలీకరణ (డీహైడ్రేషన్) స్థితిని తిప్పికొట్టడానికి మీరు మేల్కొన్న వెంటనే మొదటి గ్లాసు నీరు త్రాగాలి. ఈ సమయంలో, మీరు నీరు తాగడం యొక్క అదనపు ప్రయోజనాల కోసం వెచ్చని నీటిని ఎంచుకోవచ్చు. నీటి రుచిని పెంచడానికి మరియు ఉదయాన్నే నీళ్లు తాగడం, నీటి రుచి మీకు నచ్చకపోతే ఆ నీళ్ల రుచిని మెరుగుపరచడానికి మీరు ఒక నిమ్మకాయ చీలిక (half-cut-lemon) ఆనీళ్లకు పిండుకోవచ్చు, దాల్చినచెక్క లేదా కొంత తేనెను కూడా ఆ నీటికి కలిపి తాగొచ్చు.
(మరింత చదవండి: తేనె మరియు వెచ్చని నీటి సేవనం ప్రయోజనాలు)
ఉదయం 9.00 గంటలకు రెండవ గ్లాస్ నీరు
మీ ఉదయపు అల్పాహారం తర్వాత గంటకు ఒక గ్లాసు నీరు తాగండి, భోజనానికి ముందు తగినంత సమయం ఉండేలా నిర్వహించుకోండి.
మధ్యాహ్నం 12.30 గంటలకు మూడవ గ్లాస్ నీరు
మధ్యాహ్నం భోజనానికి గంట ముందు ఓ పెద్ద గ్లాసు నీరు తాగండి. ఇలా భోజనానికి ముందు నీళ్లు తాగడంవల్ల మీ సంతృప్తిని మెరుగుపరుస్తుంది మరియు వివిధ పరిశోధకులు సూచించినట్లుగా ఊబకాయాన్ని నివారిస్తుంది. భోజన సమయంలో మీకు దాహం అనిపిస్తే మీ ఆహారంతో పాటు కొంచెం నీరు కూడా తీసుకోవచ్చు.
మధ్యాహ్నం 2.00 గంటలకు నాల్గవ గ్లాసు నీరు
మీ మధ్యాహ్నం భోజనం నుండి ఒక గంట గడిచింతర్వాత ఒక గ్లాసు నీరు తాగడంవల్ల రోజులో మీరు ముందుకు సాగడానికి వీలవుతుంది. ఇది మీ ఆహారం నుండి నీటిలో కరిగే పోషకాలను గ్రహించడానికి కూడా వీలవుతుంది.
సాయంత్రం 4.00 గంటలకు ఐదవ గ్లాస్ నీరు
సాధారణ టీకి బదులుగా, మీరు గ్రీన్ టీ లేదా అల్లం టీ వంటి ఆరోగ్యకరమైన ద్రవాహారాల్ని ఎంచుకోవచ్చు, వీటిని నీటిలో కలిపి తాగొచ్చు. మీరు మీ సాధారణ టీ సేవిస్తున్నప్పటికీ, అది సరే, మీ రోజువారీ నీటి సేవనంలో మీరు తాగే అన్ని ద్రవాల గణన మీకుంటుంది.
సాయంత్రం 6.00 గంటలకు ఆరవ గ్లాస్ నీరు
రాత్రి భోజనానికి ఒక గంట ముందు ఒక గ్లాసు నీరు తాగడంవల్ల పొట్టకు మంచి సంతృప్తినిస్తుంది మరియు అతిగా తినకుండా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇతర భోజనాలతో పోల్చితే మితిమీరినవిధంగా రాత్రిపూట భోజనం తినడంవల్లనే బరువు పెరగడానికి ఎక్కువగా కారణమవుతుంది.
రాత్రి 8.00 గంటలకు ఏడవ గ్లాసు నీరు
రాత్రి భోజనానంతరం గ్లాస్ పూర్తిగా నీరు తాగండి, ఇదెందుకంటే మధ్యాహ్నం భోజనానంతరం ఏ ప్రయోజనాల కోసం మనంనీళ్లు తాగుతామో ఇదీ అందుకే.
ఎనిమిదవ గ్లాస్ మరియు చివరి గ్లాస్ నీరు రాత్రి 10.00 గంటలకు
రాత్రిపూట నిర్జలీకరణాన్ని నివారించడానికి, ఆ రోజు ఎదుర్కొన్న ఒత్తిడిని, మీ మనస్సును శాంతపరచడానికి మరియు బాగా నిద్రపోవడానికి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీటిని తాగండి.
సాధారణ నీటి రుచి మీకు నచ్చకపోతే, మీరు ఒక నిమ్మకాయ ముక్క, కిరదోసకాయ ముక్కలు లేదా ఆపిల్, స్ట్రాబెర్రీ వంటి పండ్లు లేదా అల్లం మరియు దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలు కూడా నీటికి కలిపి ‘నిర్విషీకరణ నీటిని’ (detox water) తయారు చేసుకొని తాగవచ్చు. ఇది రోజంతా సాగిన మీ ఉత్త నీటి సేవనానికి ఒక మార్పుగా ఉండేందుకు సహాయపడుతుంది మరియు నిర్విషీకరణ యొక్క అదనపు ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది.
నీటిసేవనాన్నిపెంచే మరో మార్గం ఏమిటంటే, ఒక పెద్ద నీటి బాటిల్‌ను ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకుని, అప్పుడప్పుడు సిప్ చేస్తూ ఉండడం.
మీరు ఇప్పటికీ మీ దినచర్యలో నీటిని పుష్కలంగా తాగడాన్ని చేర్చలేకపోతే, పుచ్చకాయ, దోసకాయ, నారింజ, టమోటాలు, కోరిందకాయ (rasberry), అనాస పండు (పైనాపిల్) మొదలైన కొన్ని ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.