మందార పువ్వుని రోజ్మల్లౌ లేదా చైనా గులాబీ అని కూడా అంటారు, ఇది సాధారణంగా రంగురంగులలో పుష్పించే కారణంగా తోటలలో ఒక అలంకారమైన పొద వలే దీనిని సాగుగా చేస్తారు. ఒక అందమైన మొక్క మాత్రమే కాకుండా, మొక్క యొక్క ఉపయోగాలు ఔషధ క్షేత్రంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. మందార మొక్క మాల్వేల్స్ వరుసలో మాల్వేషియా కుటుంబానికి చెందినది. ఇది ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉప-ఉష్ణమండల ప్రాంతాల్లో ఇది స్వదేశీయమైనది అయితే దీని ప్రజాతి మాత్రం విస్తృతంగా పంపిణీ చేయబడింది.

హైబిస్కస్ అనే పేరు గ్రీకు సాహిత్యం నుండి ఉద్భవించింది మరియు ఇది 'హైబిస్కోస్' నుండి తీసుకోబడింది. నిగనిగలాడే ఆకులతో ఉన్న సతత హరిత పొద సాధారణంగా 5 మీటర్ల పొడవు వరకు పెరగడం వల్ల దానిపై పువ్వులు సంక్లిష్టంగా పుడుతుంటాయి. ఔషధ ఉపయోగాల్లో ఎక్కువగా ఉపయోగించిన మొక్క యొక్క భాగం మందార పువ్వు. మందార మొక్క యొక్క పువ్వులు సాధారణంగా పెద్దవిగా ఉంటాయి మరియు అవి ఎరుపు, పసుపు, నారింజ, తెలుపు మరియు ఊదా రంగు వంటి ప్రకాశవంతమైన రంగులను కలిగి ఉంటాయి.

అత్యంత సాధారణ రకం, హైబిస్కస్ రోసా-సైనెన్సిస్, ప్రకాశవంతమైన ఎర్రని పుష్పాలు కలిగిన ఒక పొద. హైబిస్కస్ లేదా చైనా రోస్ అనేది సాధారణంగా తెలిసినదే, అంతర్గతంగా ఉపయోగించినప్పుడు ఇది అనేక ప్రయోజనకరమైన ఉపయోగాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు నిర్దేశాల ప్రకారం అజీర్ణం, ఆవేదన, స్కర్వీ మరియు జ్వరం వంటి వ్యాధులు మరియు వాటి పరిస్థితులను బట్టి దీని పుష్పాలను ఉపయోగించుట ద్వారా చికిత్స చేయబడతాయి.

హైబిస్కస్ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

  • బొటానికల్ పేరు: హైబిస్కస్ రోసా-సైనెన్సిస్
  • కుటుంబం: మాల్వేసియే
  • సాధారణ పేరు: చైనా గులాబీ, రోజ్మెల్లో
  • సంస్కృత పేరు: జావా, రుద్రపుష్ప, జపా, అరుణా, ఒడ్రపుష్ప
  • వాడబడిన భాగాలు: పువ్వులు (పూవు రేకులు)
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: స్థానిక ప్రాంతం నుండి ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలకు.
  1. మందార యొక్క రకాలు మరియు వర్గీకరణ - Classification and varities of Hibiscus in Telugu
  2. మందార పుష్పం నుండి తీసిన సారం యొక్క ప్రయోజనాలు - Hibiscus flower extract benefits in Telugu
  3. మందారను పెంచడం ఎలా - How to grow Hibiscus in Telugu
  4. హైబిస్కస్ యొక్క దుష్ప్రభావాలు - Hibiscus side effects in Telugu

కింగ్­డం: ప్లాంటే

డివిజన్: ఏoజియోస్టెర్మ్స్

తరగతి: యూడికోట్స్

ఆర్డర్: మాల్వెల్స్

కుటుంబం: మాల్వేసియే

జాతి: మందార

మందార రకాలు

మందార పుష్పం యొక్క అనేక రకాలు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మందార యొక్క 100 కి పైగా తెలిసిన రకాలు ఉన్నాయి, వీటిలో ఎక్కువగా ఇలా వాడబడతాయి:

  • హైబిస్కస్ రోసా-సైనెన్సిస్
    ఇది సాధారణంగా చైనీస్ మందార అని పిలువబడుతుంది మరియు అత్యంత విస్తృతంగా కనిపించే ఒక పుష్ప జాతి. మొక్క సాధారణంగా ప్రకాశవంతమైన ఎరుపు పువ్వులను కలిగి ఉంటుంది మరియు ఒక పొద లేదా ఒక చిన్న చెట్టుగా పెరుగుతుంది. వివిధ రకాల నిగనిగలాడే ఆకులను కలిగి ఉంటాయి. పువ్వులు తినదగినవి మరియు అందువల్ల, సలాడ్ల అలంకరణలో ఉపయోగిస్తారు. పుష్పం నుండి సారం అనేక జుట్టు సంరక్షణ మరియు చర్మ ఉత్పత్తులలో ఉపయోగించబడుతుంది. ఈ రకం ఆకర్షించే మెరుపును (మెరవడం) అందించడంలో ప్రసిద్ది చెందింది (షైన్), ఈ లక్షణం షూ పాలిష్ తయారు చేయుటలో ఉపయోగించబడుతుంది అని చెప్పబడుతుంది. 
     
  • హైబిస్కస్ సిరియకస్
    హైబిస్కస్ యొక్క రకం చైనాకు చెందినది మరియు ఇది మన దేశంలోని నైరుతి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొక్క ఒక పొదలా పెరుగుతుంది మరియు పువ్వులు సాధారణంగా తెలుపు, నీలం లేదా లేత ఊదా రంగులో ఉంటాయి. దేశవాసుల ద్వారా మూలికా టీలో ఈ మొక్క యొక్క ఆకుల సారం వాడబడుతుంది. హైబిస్కస్ సిరియాకస్ ఆకలిని పెంచడానికి మరియు దగ్గు చికిత్సకు ఉపయోగించబడుతుందని కనుగొనబడింది.

     
  • హైబిస్కస్ టిలిసియాస్
    ఆసియా మరియు ఆఫ్రికాలోని ఉష్ణమండల దేశాల తీర ప్రాంతాల్లో ఈ రకాల హైబిస్కస్ ప్రధానంగా పెరుగుతుంది. ఈ రకమైన పుష్పం సాధారణంగా నారింజ రంగులో ఉంటుంది మరియు పరిపక్వమైనప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. మొక్క సాధారణంగా ఒక చెట్టుగా వృద్ధి చెందుతుంది మరియు ఈ విధంగా విలువైన కలపను ఉత్పత్తి చేస్తుంది, ఇది మన్నికైన తాడులను తయారు చేయడానికి మరియు పడవల్లో పగుళ్లు సమస్య నివారించడానికి ఉపయోగపడుతుంది. వేర్లు మరియు బెరడులు సాధారణంగా జ్వరాలకు చికిత్స చేయడానికి కషాయంగా ఉపయోగించేందుకు ఉడికిoచబడతాయి. 

     
  • హైబిస్కస్ సబ్డరిఫా
    ఈ రకాన్ని సాధారణంగా రోసేల్లె అని అంటారు మరియు పశ్చిమ ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రకం యొక్క ప్రభావాలు అత్యంత విస్తృతంగా అధ్యయనం చేయబడ్డాయి. ఈ రకాల మందార పుష్పాలు హైబిస్కస్ టీ తయారీలో ఉపయోగపడతాయి, వీటిలో విస్తృతమైన ఉపయోగాలు ఉన్నాయి. హైబిస్కస్ సబ్డరిఫా మరియు పుదీనా మిశ్రమం ఇతర రిఫ్రెష్ పానీయాలు తయారీలో ఉపయోగిస్తారు. అనేక సంస్కృతులలో వీటి ఆకులు కూరగాయలుగా ఉపయోగించబడతాయి మొక్క యొక్క కాండం నుంచి వచ్చే ఫైబర్లు మరింత మన్నికైన ఉత్పత్తులను తయారు చేయడానికి జ్యూట్ ఫైబర్స్­తో పాటు ఉపయోగించబడతాయి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

వివిధ రకాల మందార పువ్వులు వివిధ రకాల ఫైటోకెమికల్స్ (ఔషధాల అవసరాలకు ఉపయోగపడే బయో యాక్టివ్ సమ్మేళనాలు) కలిగి ఉంటాయి. మందార పుష్పం యొక్క వివిధ భాగాల నుంచి తీసిన ముఖ్యమైన నూనెలు విస్తృత పరిధి మరియు లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ వివరాలు క్రింది విధంగా చర్చించబడ్డాయి.

  • జుట్టుకు ప్రయోజనకారి: సుదీర్ఘమైన, మెరిసే మరియు ఆరోగ్యవంతమైన జుట్టు పొందాలనుకొనే వ్యక్తులకు మందార పరిపూర్ణ జుట్టు సంరక్షణకు కావలసిన పోషణను అందిస్తుంది. ఇది నూనె, షాంపూ, కండీషనర్ లేదా ఫేస్ ముసుగు రూపంలో మీ తలపై చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది మరియు మీ జుట్టు వెంట్రుకలను బలంగా మరియు మెరిసేలా ఉంచడానికి దేనిని ఉపయోగించవచ్చు.
  • రక్తపోటును తగ్గిస్తుంది: మందార యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడానికి సూచించబడుతుంది. ఇది కొన్ని పాలీఫెనోల్స్ ను కూడా కలిగి ఉంటుంది, ఇది క్లినికల్ అమర్పులలో హైపోటెన్యుయేషన్ (రక్తపోటును తగ్గించుట) చర్యను ప్రదర్శించడం కనుగొనబడింది.
  • గాయాన్ని నయం చేయుటలో ఉపయోగించబడుతుంది: మందార పుష్పం యొక్క సారం గాయానికి సరియైన వైద్య ప్రక్రియ మరియు చర్మం పగిలిపోవటాన్ని తట్టుకొనే బలాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది గాయం జరిగిన చోట బాక్టీరియల్ సంక్రమణను నిరోధిస్తుంది.
  • ఊబకాయం రాకుండా చేస్తుంది: జీవక్రియ మీద మందార ఒక ఉద్దీపన ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఇది, క్రమంగా, ఊబకాయం మరియు అధిక బరువు వంటి సమస్యలు రాకుండా ఉండేలా సహాయపడుతుంది. ఈ పువ్వులో ఉండే వివిధ చురుకైన సమ్మేళనాలు స్వేచ్ఛా రాడికల్స్ నష్టాన్ని తిరిగి పొందడం మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం వంటివి స్థూలకాయానికి దోహదపడే ముఖ్యమైన కారకాలు.
  • శరీరంలో హానికరమైన విష పదార్థాలను అరికట్టడం: మందార మీ శరీరం యొక్క మూత్రవిసర్జన మరియు నిర్విషీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మీ రక్తం నుండి టాక్సిక్ సమ్మేళనాలు మరియు రసాయనాలను మూత్రంతో సహా బయిటికి నెట్టడంలో సహాయపడుతుంది.
  • యాంటీ డయాబెటిక్: ఇన్సులిన్ స్థాయిలు మెరుగుపరచడానికి, ఇన్సులిన్ ఉత్పత్తి కణాలపై , మందార టీ ఒక సానుకూల ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధనా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది డయాబెటిక్ వ్యక్తులలో ఇన్సులిన్ నిరోధకత మరియు ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది, తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

జుట్టు కోసం మందార యొక్క ప్రయోజనాలు - Hibiscus benefits for hair in Telugu

హైబిస్కస్ రోసా-సైనెన్సిస్ పుష్పం మరియు ఆకు నుండి తీసిన సారాన్ని నూనె తయారు చేయుటలో ఉపయోగిస్తారు. రోమ కూపాల యొక్క పొడవు మరియు చక్రీయ దశలు వంటి జుట్టు పెరుగుదల వంటి అంశాలు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం నిర్ణయించబడ్డాయి మరియు పుష్పం నుండి వెలికితీసిన పదార్థాలతో పోలిస్తే మందార ఆకు నుండి తీసిన పదార్ధాలు మెరుగైన ఫలితాలు చూపుతాయని కనుగొనబడింది.

జుట్టు కోసం మందార మొక్క యొక్క ఉత్పత్తులు

  • మందార నూనె:
    మందార మొక్క యొక్క రెండవ అత్యంత తయారీ ఉత్పత్తి మందార హెయిర్ ఆయిల్. మందార హెయిర్ ఆయిల్ సారం ముఖ్యంగా విటమిన్ సి అధికంగా కలిగి ఉంటాయి, ఇది జుట్టుని బలంగా ఉంచే కొల్లాజెన్ వృద్ధి చేయుటకు బాధ్యతా వహించే అమైనో ఆమ్లాలను అధికంగా ఉండేలా చేస్తుంది. ఈ లక్షణం వెంట్రుకల మూలాన్ని బలపరచడం మరియు జుట్టు పరిమాణం పెరిగేలా చేయడమే కాకుండా జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.
     
  • మందార షాంపూ:
    జుట్టు నాణ్యతను మెరుగుపరచడంలో దాని ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటే, పుష్పం యొక్క సారాల వివిధ నిష్పత్తులు కూడా హైబిస్కస్ షాంపూల తయారీలో ఉపయోగించబడతాయి. సాధారణ షాంపూ బదులుగా మందార కషాయాన్ని కలిపిన షాంపూ వాడకం వలన జుట్టుకు మెరుగైన ప్రకాశాన్ని ఇస్తుంది.
     
  • హైబిస్కస్ కండిషనర్:
    మందార పువ్వులు మరియు ఆకుల నుండి సేకరించిన జెల్ లాంటి పదార్ధం అధిక కండిషనింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. పొడిబారిన, చిక్కుబడే జుట్టు కోసం హైబిస్కస్ కషాయాలను కలిగిన కండీషనర్ల వాడకం జుట్టు సున్నితంగా తయారు అవుతుంది.
     
  • హైబిస్కస్ మాస్క్­లు:
    మందార పువ్వులు, ఆకులు మరియు పెరుగు కలిపి తయారు చేయబడిన మాస్క్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది కూడా జుట్టు యొక్క మూలాలకు లోపల నుండి పోషణనిస్తుంది మరియు జుట్టు నాణ్యతను మెరుగుపరుస్తుంది. అంతేకాక, మందార పువ్వులు మరియు మెంతుల విత్తనాలను కలపడం ద్వారా తయారైన మాస్క్­లు చుండ్రు చికిత్స కోసం సమర్థవంతమైనవిగా పని చేస్తాయి మరియు ఆరోగ్యవంతమైన చర్మం యొక్క పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి. అదే విధంగా, మందార పువ్వు మరియు ఉసిరికాయల మిశ్రమంతో తయారు చేయబడిన హైబిస్కస్ మాస్క్­లు, ఇవి హెయిర్ ఫోలికల్స్ బలంగా తయారు అవటంలో మరియు జుట్టును మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, అల్లం, గుడ్లు, ఉల్లిపాయలు, కలబంద మరియు వేప తదితర భాగాలతో హైబిస్కస్ మిశ్రమం చేయడం ద్వారా జుట్టు వేగంగా పెరగడానికి కారణమవుతుంది.

మధుమేహం కోసం హైబిస్కస్ మొక్క యొక్క సారం - Hibiscus extract for diabetes in Telugu

హైబిస్కస్ రోసా-సైనెన్సిస్ యొక్క రేకల నుండి తీయు ఎథైల్ అసిటేట్­ యొక్క భాగంలో ఉండే ఫ్లావనిడ్ అధికంగా కలిగిన పదార్ధాలు యాంటీ డయాబెటిక్ చికిత్సా లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడినది. డయాబెటీస్ మెల్లిటస్ కలిగిన రోగులలో మందార రేకల నుండి తీసిన సారం ప్యాంక్రియాటిక్ బీటా-కణాల రక్షణలో సహాయపడుతుంది. డయాబెటిక్ కలిగిన వ్యక్తులలో నిర్వహించబడిన ఒక అధ్యయనంలో, హైబిస్కస్ సబ్డిరిఫా అనే పుష్ప కషాయాలతో సుమారు 150 మి.లీ. టీ సేవించడం అనేది మధుమేహాన్ని నియంత్రణ చేయుట ద్వారా ఇన్సులిన్ వైపుగా ఆక్సీకరణ ఒత్తిడిని మరియు ప్రతిఘటనను తగ్గిస్తుంది.

(ఇంకా చదవండి: మధుమేహ లక్షణాలు)

అనాల్జెసిక్ మరియు యాంటీ ఇన్ఫ్లమ్మేటరీగా మందార పువ్వు యొక్క సారం - Hibiscus flower extract as analgesic and anti-inflammatory in Telugu

హైబిస్కస్ రోసా-సైనెన్సిస్ యొక్క వేరు నుండి తీసిన సారం అనాల్జెసిక్ (నొప్పి-ఉపశమనం) మరియు యాంటీ ఇన్ఫ్లమ్మేటారీ చర్యలను కలిగి ఉంటుంది. మందార మొక్క యొక్క వేర్ల నుండి తీసిన సారం, నోటి ద్వారా తీసుకున్నప్పుడు, ఎడెమా (యాంటీ ఇన్ఫ్లమేటరీ) మరియు దాని యొక్క ప్రతిచర్య సమయం (అనాల్జేసిక్) వంటి లక్షణాలను నిరోధించడానికి వంటివి అధికం అయినట్లు కనుగొనబడింది. అయితే, దీని యొక్క ప్రభావాలు ఇచ్చిన మోతాదుపై ఆధారపడి ఉంటాయి.

రక్తపోటు యొక్క చికిత్స కోసం మందార పువ్వు - Hibiscus for blood pressure in Telugu

హైపర్­టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలను ప్రభావితం చేసే ఒక సాధారణ ఆరోగ్య స్థితి. రీసెర్చ్ సూచనలు హైబిస్కస్­లో యాంటీ ఇన్ఫ్లమమ్మేటరీ మరియు యాంటీ-అక్సిడేటివ్ లక్షణాలు కలిగి ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా, మందార పువ్వులు సారం మూత్రవిసర్జన సరిగా అయ్యేలా చేయు లక్షణాలను కూడా కలిగి ఉన్నట్లు గుర్తించబడ్డాయి, అంటే, మూత్ర విసర్జనను అధికం చేయడం ద్వారా ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

రక్తపోటు గల రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, ఈ రోగులకు హైబిస్కస్ సబ్డరిఫా యొక్క పువ్వుల నుండి తీసే పాలీఫెనాల్ సారాన్ని ఇచ్చినప్పుడు, అది వారి జీవక్రియను మెరుగుపరిచింది మరియు వారి రక్తపోటును గణనీయంగా తగ్గించింది అనేది తెలుసుకోవడం జరిగింది.

గాయం యొక్క చికిత్స్ కోసం హైబిస్కస్ - Hibiscus for wound healing in Telugu

మందార పుష్పం నుండి సేకరించబడిన ఇథనాల్­ని పరీక్షించినప్పుడు ఇది యాంటీమైక్రోబయాల్ మరియు గాయాల వైద్యానికి ఉపయోగపడే లక్షణాలు కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. హైబిస్కస్ యొక్క ఇథనాల్ సారంతో చేయు చికిత్స యొక్క నియంత్రణలను పోలిస్తే గాయాన్ని మాన్పే గణనీయమైన అధిక వేగాన్ని (సుమారు 11%) చూపిస్తుంది. హైడ్రాక్సీప్రొలీన్ (చర్మానికి కావలసిన ప్రోటీన్ల ఏర్పడటానికి), చర్మం పగులుట వంటివి, మందార పువ్వు యొక్క సారంతో చికిత్సలో కూడా గణనీయంగా ఎక్కువగా ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.

ఔషధ ఉపయోగాల్లో మందార పువ్వు యొక్క సారం - Hibiscus flower extract for medicinal uses in Telugu

హైబిస్కస్ సబ్దారిఫా యొక్క పుష్ప సారంలో విటమిన్ సి (ఆస్కార్బిక్ ఆమ్లం) వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. మందార పుష్పం యొక్క పత్ర దళాల నుండి తీసిన సారం విట్రో మరియు వైవో లో బలమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రతిచర్యలు ప్రేరేపించే ఔషధ లక్షణాలను ప్రదర్శిస్తుంది. హైబిస్కస్ సబ్దరిఫా నుండి సేకరించిన ఏoథోసియాన్స్ మరియు ప్రోటోకేటుక్యూక్ ఆమ్లం (ఫైటోకెమికల్స్) లాభదాయకమైన చికిత్సా ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి కూడా ఉపయోగించవచ్చు.

యాంటీ టాక్సిన్ గా మందార పువ్వు యొక్క సారం - Hibiscus flower extract as antitoxin in Telugu

హైబిస్కస్ సబ్దరిఫా మొక్కల యొక్క ఉత్పత్తులు పర్యావరణ కాలుష్యం ఫలితంగా కలిగే విషపూరిత ప్రభావం యొక్క స్థాయిని తగ్గిస్తున్నట్లు కనుగొనబడినవి. మానవులలోని హైబిస్కస్ పువ్వు సారం యొక్క నియంత్రిత మోతాదు యూరిక్ ఆమ్లం, టార్ట్రేట్, కాల్షియం, సోడియం, సిట్రేట్, పొటాషియం, క్రియాటినిన్ మరియు ఫాస్ఫేట్ వంటి విషపూరిత సమ్మేళనాల గాఢత తగ్గిస్తూ మూత్ర విసర్జనను మెరుగుపరుస్తుంది. (మూత్రవిసర్జన).

ఊబకాయం చికిత్స కోసం మందార పుష్పం యొక్క సారం - Hibiscus flower extracts for obesity in Telugu

వివిధ రకాల హైబిస్కస్ సబ్డరిఫా నుండి లభించే పుష్ప సరాలు ఊబకాయం మరియు సంబంధిత రుగ్మతలపై పోరాడటానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మొక్క యొక్క పువ్వుల నుండి సేకరించిన పాలీఫెనోల్స్ అని పిలువబడే బయో యాక్టివ్ సమ్మేళనాలు నిర్దిష్ట జీర్ణ ఎంజైమ్లు మరియు హార్మోన్ల మీద చర్య తీసుకోబడతాయి, ఇది జీవక్రియ యొక్క ప్రక్రియను మరింత సమర్థవంతంగా నియంత్రించడానికి కారణమవుతుంది.

పాలీఫెనోల్స్ యొక్క ఈ లక్షణాలు ఊబకాయాన్ని తగ్గించడానికి మరియు దాని ఫలితంగా ఉత్పన్నమైన రుగ్మతలు కూడా తనిఖీ చేయటానికి ప్రధానంగా దోహదపడతాయి. నిర్వహించబడిన ఒక అధ్యయనంలో, ఊబకాయం మరియు ఇలాంటి రుగ్మతలు కలిగిన రోగులకు హైబిస్కస్ సబ్డరిఫా నుండి సేకరించిన పాలీఫెనోల్స్ యొక్క నియంత్రిత మోతాదు ఇవ్వబడినది. ఈ రోగులలో ఊబకాయంకు కారణమయ్యే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ గుర్తించదగిన స్థాయిలో తగ్గింది అని గమనించబడింది.

అతిసారం వ్యాధి చికిత్స కోసం మందార పువ్వు నుండి తీసిన సారం - Hibiscus flower extract for diarrhoea in Telugu

సంప్రదాయబద్ధంగా, జపాన్, హైతీ మరియు మెక్సికోలలో, నీళ్ళ విరేచనాలు మరియు అతిసారం యొక్క చికిత్స కోసం హైబిస్కస్ రోసా-సైనెన్సిస్ యొక్క పువ్వులు మరియు ఆకుల నుంచి సేకరించిన సారం ఉపయోగించబడింది. వివిధ రకాల నుండి సేకరించిన సారం యాంటీ మైక్రోబయాల్­గా పనిచేస్తుంది  మరియు దీనిని అతిసారానికి సమర్థవంతంగా చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. అయితే, ఆయుర్వేద వైద్యునికి సంప్రదించిన తరువాత ఈ సారం తీసుకోవాలి.

(ఇంకా చదవండి - విరేచనాల చికిత్స)

సరైన పెరుగుతున్న పరిస్థితులను అందించినట్లయితే మందార పెంపకం సులభంగా చేయవచ్చు. ఇంట్లో మందారను పెంచడం మరియు దాని వృద్ధిని నిర్వహించడానికి క్రింది దశలను అనుసరించాలి.

  • సాధారణ పరిస్థితులు:
    మందార అనేది ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలకు చెందినది. మందార యొక్క పెరుగుదలకు సరైన పరిస్థితులు కావాలి, అందువలన, సూర్యకాంతి మరియు తేమ పరిస్థితుల యొక్క సరియైన మిశ్రమం అవసరం అవుతుంది. వివిధ రకాలు ఉష్ణోగ్రత, సూర్యకాంతి మరియు తేమ పరిధిలో మార్పులు అవసరమవుతాయి, దీనివల్ల సరైన పెరుగుదల కలుగుతుంది.
     
  • నేల యొక్క నాణ్యత:
    మందార పెరగడం అవసరం మట్టి నాణ్యత బాగా ఏరేటెడ్ చేయబడి మరియు అధిక తేమను కలిగి ఉండాలి. నేల కూడా సేంద్రీయ పోషకాలను అధికంగా కలిగి ఉండాలి.
     
  • బుతువు:
    వేసవి కాలం, వసంతకాలం లేదా ఆకు రాలే సమయంలో మందార పెరగడానికి అనువైన కాలం. వేళ్ళు పెరిగిన తర్వాత కోతలు చేయుట శాఖలు పట్టుకోడానికి మరింతగా గట్టిపడతాయి. పించింగ్ చేయుట వలన వాటి పిల్ల మొక్కలు ప్రారంభమవుతాయి, ఇది మొక్క యొక్క మొగ్గను లెక్కించడానికి మరియు దాని సాంద్రతను నిర్ణయించడానికి ముఖ్యమైనది.
     
  • పెరుగుదల నియంత్రకాలు:
    కావలసిన ఎత్తును మొక్క చేరుకున్న తరువాత కావలసిన మొక్క యొక్క స్వభావం మీద ఆధారపడి, పెరుగుదల నియంత్రకాలు మొక్కకు వర్తింపచేస్తాయి.

మందార మొక్కల సంరక్షణ

నిరంతర తేమతో కూడిన మట్టి మందార మొక్కల పెరుగుదలకు అవసరం అవుతుంది. అలాంటి పరిస్థితి లేకపోవటం వలన మొక్క వాదిపోవడానికి కారణమవుతుంది, మొక్కకు క్రమంగా నీటిని అందించడం ద్వారా ఇలాంటి పరిస్థితిని నిరోధిoచవచ్చు. సేంద్రియ రక్షక కవచంతో పాటు నీటిని కూడా కాపాడవచ్చు, ఇది కలుపు మొక్కలను చంపడం మరియు మొక్క నెమటోడ్లను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మొక్కలు అప్పుడప్పుడు వాటి ఆకారాన్ని నిర్వహించడానికి కత్తిరిస్తూ ఉండాలి. శీతాకాలంలో, మందార మొక్కకు అధిక కత్తిరింపు చేయవలసిన అవసరం ఉంటుంది. కీటకాల వలన తీవ్రమైన ముట్టడి విషయంలో, క్రిమిసంహారక సబ్బులు లేదా హార్టికల్చరల్ సబ్బులు వాడాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹546  ₹850  35% OFF
BUY NOW

మందార పువ్వు యొక్క సారం రోజువారీ జీవితంలో అనేక ఉపయోగాలు కలిగి వున్న అనేక విలువైన లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే, కొంతమంది వ్యక్తులు క్రింద నీయబడిన కొన్ని దుష్ప్రభావాలు కలుగుటను చూడవచ్చు.

  • హైపోటెన్షన్ (తక్కువ రక్తపోటు) కలిగి ఉన్న రోగులు హైబిస్కస్­ను సేవించడం ద్వారా అది వారి ఆరోగ్యంపై అనేక హానికరమైన ప్రభావాలను చూపవచ్చు. కొందరు వ్యక్తులలో గుండె దడతో పాటు  మైకము, వికారం వంటివి కలుగవచ్చు. మీరు పైన ఇచ్చిన వాటిలో ఏదైనా అనుభవించినట్లయితే, హైబిస్కస్ వాడకాన్ని ఆపివేసి, గుండె దడ ఇంకా ఉంటే ఒక వైద్యుడిని సంప్రదించాలి.
     
  • మందార పువ్వులలో అధిక స్థాయిలో అల్యూమినియం కంటెంట్ కలిగి ఉన్నట్లు గుర్తించబడ్డాయి. మూత్రపిండ సమస్య గల రోగులు అధిక అల్యూమినియం తీసుకోవడం వలన ముఖ్యంగా నిక్షేపానికి దారితీస్తుంది. అల్యూమినియం గర్భధారణ సమయంలో పిండ అభివృద్ధి మరియు అనేక నాడీ సంబంధిత రుగ్మతలపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది.
     
  •  కొందరు వ్యక్తులలో, హైబిస్కస్ యొక్క వినియోగం కొన్ని అలెర్జీలను కలిగిస్తుంది. అలెర్జీ సంభవించినట్లయితే, హైబిస్కస్ టీ తీసుకోవడం తక్షణమే నిలిపివేయబడాలి మరియు అలెర్జీ యొక్క తీవ్రతరాన్ని నివారించడానికి ఒక వైద్యుని సంప్రదించాలి.

Medicines / Products that contain Hibiscus

వనరులు

  1. María Herranz-López et al. Multi-Targeted Molecular Effects of Hibiscus sabdariffa Polyphenols: An Opportunity for a Global Approach to Obesity. Nutrients. 2017 Aug; 9(8): 907. PMID: 28825642
  2. McKay DL, Chen CY, Saltzman E, Blumberg JB. Hibiscus sabdariffa L. tea (tisane) lowers blood pressure in prehypertensive and mildly hypertensive adults. J Nutr. 2010 Feb;140(2):298-303. PMID: 20018807
  3. Frankova A et al. In Vitro Digestibility of Aluminum from Hibiscus sabdariffa Hot Watery Infusion and Its Concentration in Urine of Healthy Individuals.. Biol Trace Elem Res. 2016 Dec;174(2):267-273. Epub 2016 Apr 23. PMID: 27107884
  4. Shivananda Nayak B, Sivachandra Raju S, Orette FA, Chalapathi Rao AV. Effects of Hibiscus rosa sinensis L (Malvaceae) on wound healing activity: a preclinical study in a Sprague Dawley rat. Int J Low Extrem Wounds. 2007 Jun;6(2):76-81. PMID: 17558005
  5. Adhirajan N, Ravi Kumar T, Shanmugasundaram N, Babu M. In vivo and in vitro evaluation of hair growth potential of Hibiscus rosa-sinensis Linn. J Ethnopharmacol. 2003 Oct;88(2-3):235-9. PMID: 12963149
Read on app