ఎంతో అలంకారప్రాయమైన మరియు ఔషధ విలువలున్న పుష్పభరితమైన మొక్క పారిజాతం. దీని అందమైన తెల్లటి పువ్వుల సువాసన అందరి మనసుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలుగజేస్తుంది. పారిజాతానికున్న వివిధ వైద్యప్రయోజనాల దృష్ట్యా ఆయుర్వేదం ఈ పూలమొక్కకు అగ్రస్థానాన్నే ప్రసాదించింది. సాధారణంగా ‘పారిజాతం’ అని, లేదా ‘రాత్రి పుష్పించే మల్లిక’ (night blooming jasmine) అని దీనిని పిలుస్తారు. ఈ పుష్పభరిత వృక్షం భారత పురాణాల్లో మరియు జానపద కథల్లో ఓ మహత్తు కల్గిన స్థానాన్ని కల్గి ఉంది. భగవద్గీత మరియు హరివంశ పురాణాల్లో ‘పారిజాతం మొక్క మరియు దాని పువ్వుల ప్రస్తావన ఉంది. భారతీయ పురాణ సాహిత్యం ప్రకారం, ‘పారిజాతం’ అనేది ఒకప్పుడు స్వర్గంలో ఉండి, ఆ తర్వాత భువికి దిగి వచ్చిన ఒక పూల చెట్టు. పారిజాతం చెట్టు రాత్రిపూట మాత్రమే పువ్వులు పూసి, ఉదయం పూట తాను పూసిన పూలన్నింటినీ రాల్చివేస్తుందని మీకూ తెలిసే ఉంటుంది. వాస్తవానికి, ఇది "రాత్ కీ రాణి" గా ప్రసిద్ది చెందింది. నిజానికి, పారిజాతం చెట్టు యొక్క ఔషధీశాస్త్ర నామాన్ని అనువదిస్తే "దుఃఖం యొక్క చెట్టు" గా అర్థమవుతుంది.
పారిజాతం చెట్టు ఓ పొదలాగా లేదా చెట్టు గా కూడా పెరుగుతుంది. పారిజాతం చెట్టు 10-11 మీటర్ల ఎత్తువరకూ పెరుగుతుంది మరియు దీని కాండం, కొమ్మలపైనా కఠినమైన పెచ్చులు పెచ్చులుగా ఉండే బెరడు ఉంటుంది. ఈ బెరడు బూడిద రంగులో ఉంటుంది. ఈ మొక్క యొక్క ఆకులు వెంట్రుకల్లాగా పొడవుగా ఉంటాయి. దీని తెల్లటి పుష్పాలు దాని శాఖల ఎగువన గుత్తులు-గుత్తులుగా పెరుగుతాయి. పారిజాతం పండు గుండ్రంగా లేదా హృదయా కారంలో ఉండే గుళికవంటిది. ఇది సాధారణంగా గోధుమ రంగులో ఉంటుంది. ఈ మొక్క పెరగడానికి భాగశః నీడ అవసరం. ఇక ఈ మొక్క యొక్క రోజువారీ సంరక్షణ విషయానికి వస్తే పారిజాతం మరీ అంత ఎక్కువ శ్రద్ధను ఆశించదు.
పారిజాతం గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- ఔషధ శాస్త్రనామం: నైక్తంటెస్ అర్బోర్-ట్రిస్టిస్ (Nyctanthes arbor-tristis)
- కుటుంబం: ఒలేసియే (Oleaceae)
- సంస్కృత పేరులు: పారిజాత్, షెఫాలి, షెఫాలికా
- సాధారణ పేరులు: పారిజాత్, హర్సింగార్, Tree of sorrow, క్వీన్ అఫ్ నైట్, నైట్ జాస్మిన్, కోరల్ జాస్మిన్, షులీ, రాత్ కి రాణి
- ఉపయోగించే భాగాలు: ఆకులు, పువ్వులు, విత్తనాలు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: పారిజాతం పొదరిల్లు దక్షిణ ఆసియాకు చెందినది. ఇది ప్రధానంగా ఉత్తర భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ మరియు థాయ్లాండ్ ప్రాంతాలలో కనిపిస్తుంది.
మీకు తెలుసా?
పారిజాతపుష్పం భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికారిక పుష్పం (state flower). పారిజాత పుష్పాలను హిందూ పండుగలలో దుర్గ మరియు విష్ణుదేవుడికి పూజా పుష్పాలుగా ఉపయోగించబడతాయి.