ట్రిబులుస్ టెర్రెస్ట్రిస్, దీనిని సాధారణంగా గోక్షూర అని పిలిస్తారు,ఇది ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయబడే ఒక వార్షిక మూలిక, గోక్షూర అన్నది ఒక సంస్కృత పేరు మరియు ఆవు డెక్క అని దీని అర్థం. బహుశా పండులో ఉన్న చిన్న చిన్న ముళ్ల కారణంగా దానికి ఆ పేరు ఇవ్వబడింది, మేత మేసే జంతువుల యొక్క గిట్టలు ఇరుక్కుపోవడానికి ఇది ఉపయోగపడుతుంది. తీవ్రమైన పరిస్థితులలో మనుగడ సాగించేందుకు అనువుగా గోక్షూర మొక్క తీసికొనబడింది మరియు ఇతర మొక్కలు జీవించలేని పొడి వాతావరణాల్లో దీనిని పెంచవచ్చు.         

గోక్షూర ఒక శక్తివంతమైన ఔషధ మూలిక మరియు వివిధ చికిత్సా ఉపయోగాలలో ఇది ఉంచబడింది. ఈ మూలిక యొక్క పండు మరియు వేరు రెండూ కూడా భారతీయ ఆయుర్వేదం మరియు సంప్రదాయ చైనీస్ వైద్యాల్లో వాడబడ్డాయి. గోక్షూర పండ్లు మూత్ర విసర్జకం, వాజీకరం మరియు యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల్ని ప్రదర్శిస్తాయి అదే సమయంలో ఈ మూలిక యొక్క వేర్లను ఆస్తమా, దగ్గు, రక్తహీనత, మరియు అంతర్గతంగా కలిగే మంట యొక్క చికిత్సలో ఉపయోగిస్తారు. అలాగే ఈ మొక్క యొక్క బూడిదను రుమటాయిడ్ ఆర్థరైటిస్  చికిత్స కోసం ఉపయోగిస్తారు.       

భారతీయ వైద్య పితామహుడైన చరకుడు ఒక కామోద్దీపనంగా, లైంగిక కోరికలను మరియు మూత్రవిసర్జనను ప్రేరేపించే ఒక ఆహారంగా, మూత్రం ద్వారా విష పదార్థాలను మరియు వ్యర్థాలను విసర్జించేందుకు సహాయపడే ఆహారంగా ఈ మూలికను గుర్తించాడు.     

గోక్షూర గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • వృక్ష శాస్త్రీయ నామం: ట్రిబులుస్ టెర్రెస్ట్రిస్
  • జాతి: జైగోఫైల్లేసియా
  • వ్యవహారిక నామం: గోఖ్రూ, గోక్షూర, చోటాగోఖ్రూ
  • ఉపయోగించే భాగాలు: వేరు మరియు పండ్లు వైద్యంలో ఉపయోగిస్తారు.
  • జన్మించే ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: ఈ ఔషధ మూలిక భారతదేశంలో పుట్టింది. ఇది భారతదేశం మరియు ఆఫ్రికా అంతటా విస్తృతంగా వ్యాపించింది అయితే ఆసియా, మధ్య ప్రాచ్యం మరియు ఐరోపా ప్రాంతాలలో కూడా కనుగొనబడింది.
  1. గోక్షూర పోషక విలువలు - Gokshura nutrition facts in Telugu
  2. గోక్షూర ఆరోగ్య ప్రయోజనాలు - Gokshura health benefits in Telugu
  3. గోక్షూర దుష్ప్రభావాలు - Gokshura side effects in Telugu
  4. ఉపసంహారం - Takeaway in Telugu

మొత్తం ట్రిబులుస్ మొక్క యొక్క విభిన్న భాగాలు అనేక రసాయన అంశాలను కలిగిఉంటాయి, ఇవి రోగ నివారణ విలువలు మరియు పోషక విలువలు రెండింటినీ కలిగిఉంటాయి.

ఎముకలను బలపరచడంలో సహాయపడే కాల్షియం కార్బొనేట్, ఇనుము, ప్రొటీన్, మొదలగు అంశాలను ఈ మొక్క ఆకులు కలిగిఉంటాయి. గోక్షూర మొక్క యొక్క విత్తనాలలో అధికంగా కొవ్వులు మరియు ప్రొటీన్లు ఉంటాయి. మరియు గోక్షూర పండ్లు ఒలియిక్ ఆమ్లం, స్టియరిక్ ఆమ్లం, మరియు గ్లూకోజ్‌లకు ఒక మంచి వనరుగా ఉంది.   

హోమ్ సై‌న్స్ యొక్క అంతర్జాతీయ జర్నల్ ప్రకారం, గోక్షూర పౌడర్‌ క్రింది పోషకాలను కలిగి ఉంటుంది:   

పోషకం విలువ, 100 గ్రా.లకు
శక్తి 73.48 కి.కేలరీ
కార్బోహైడ్రేట్లు 15.9 గ్రా.
ప్రొటీన్లు 1.3 గ్రా.
కొవ్వులు 0.25 గ్రా.
ఫ్లేవొనాయిడ్స్ 19.92
విటమిన్లు  
విటమిన్ సి 14.2 మి.గ్రా.
ఖనిజాలు  
క్యాల్షియం 59 మి.గ్రా.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

అధిక ఔషధ విలువల కారణంగా, సంప్రదాయ వైద్యంలో వివిధ వ్యాధుల చికిత్స కోసం ఈ మొక్కలు ఉపయోగించబడ్డాయి. గోక్షూర యొక్క సమర్థ ఆరోగ్య ప్రయోజనాలు క్రింద ఇవ్వబడినవి:

  • బాడీబిల్డింగ్ కోసం: గోక్షూరాను కండరాల బలం మరియు శరీరం సమకూర్పు మెరుగుపర్చడం కోసం ఉపయోగిస్తారు మరియు ఇది స్టెరాయిడ్లకు సహజ ప్రత్యామ్నాయంగా ఉంటుంది.  
  • మానసిక ఆరోగ్య వ్యాధుల కోసం: గోక్షూరలోని సాపియోని‌న్స్ ఉనికి కారణంగా ఇది యాంటి-డిప్రస్సంట్ మరియు యాన్‌క్సియోలైటిక్ ప్రభావాలను కలిగిఉంటుంది, అందువల్ల ఆందోళన మరియు ఒత్తిడి నిర్వహణ కోసం దీనిని ఉపయోగించవచ్చు.    
  • గుండె కోసం: గోక్షూర యాంటిఆక్సిడంట్స్‌ తో నిండి ఉంటుంది, ఇది దాని గుండె రక్షణ చర్యలకు బాధ్యత వహిస్తుంది. ఇది రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు ఇది ఎథెరోఎథెరోస్క్లెరోసిస్ మరియు ఇతర గుండె పరిస్థితులకు సంబంధించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది.     
  • మూత్రపిండాల కోసం: గోక్షూర యొక్క మూత్రవిసర్జన చర్యల కారణంగా, గోక్షూరాను తీసుకోవడం వల్ల, అది శరీరం నుండి అదనపు ఖనిజాలను పంపించి వేయడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడంలో అది సహాయపడుతుంది.    
  • స్త్రీల కోసం: అనేక ప్రయోజనాలు కలిగిన గోక్షూర మహిళల ఆరోగ్యానికి అద్భుతమైనది. ఈ మూలిక యొక్క రోజువారీ వినియోగం లిబిడో మరియు లైంగిక కోరికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు మహిళల్లో ఉండే పిసిఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) మరియు యుటిఐలు (మూత్ర వాహిక ఇన్‌ఫెక్షన్లు)కు కూడా వ్యతిరేకంగా సమర్థవంతంగా సహాయపడుతుంది.     
  • ఇతర ప్రయోజనాలు: మొటిమలు, తామర, దురద మరియు చర్మపు వ్యాధులు వంటి అనేక చర్మ సమస్యలకు వ్యతిరేకంగా సమర్థవంతంగా గోక్షూర పనిచేస్తుంది. జుట్టు మరియు చర్మానికి సంబంధించిన వృద్దాప్య గుర్తులు రాకుండా కూడా ఇది ఆలస్యం చేస్తుంది మరియు మైగ్రేన్లు, పైల్స్ మరియు ఫిస్టులాస్ నుండి ఉపశమనానికి ఉపయోగపడుతుంది.     

యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ల (యుటిఐలు) కోసం గోక్షూర - Gokshura for urinary tract infections (UTIs) in Telugu

పరిశోధన ప్రకారం, ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మూత్ర వాహిక ఇన్‌ఫెక్షన్లకు గోక్షూర విజయవంతంగా చికిత్స చేస్తుంది. దాని మూత్రవిసర్జన లక్షణం కారణంగా, మూత్రం యొక్క ప్రవాహాన్ని పెంచడం ద్వారా ఈ ఔషధ మొక్క మూత్రవాహిక నుండి వ్యాధికారక బ్యాక్టీరియాను తొలగిస్తుంది. 

నూతన బలాన్ని అంధించే లక్షణాలను గోక్షూర కలిగిఉందని నమ్ముతున్నారు. గోక్షూరను తీసుకోవడం వల్ల అది శరీరాన్ని తాకే అంటురోగాలను నిర్వీర్యం చేస్తుంది మరియు మూత్రనాళం మరియు మూత్రశయానికి సంబంధించిన అంటువ్యాధులకు వ్యతిరేకంగా రక్షణ కలుగజేస్తుంది. గోక్షూర సురక్షితమైనదిగా పరిగణించబడింది కాబట్టి, యాంటిబయాటిక్స్‌ కు మంచి ప్రత్యామ్నాయంగా ఇది ఉంది.      

పిసిఓఎస్‌ కోసం గోక్షూర - Gokshura for PCOS in Telugu

ఇటీవలి సంవత్సరాలలో, అన్నిరకాల వయస్సులు గల స్త్రీలలో పిసిఓఎస్ చాలా ప్రబలంగా మారింది, ప్రత్యేకంగా పెద్దలు మరియు యవ్వనంలో ఉన్న అమ్మాయిల్లో ఎక్కువగా ఉంది. ఈ ఆరోగ్య రుగ్మత మొటిమలు, క్రమంగా లేని పీరియడ్లు, బరువు పెరుగుట, మానసిక కల్లోలం, జుట్టు రాలిపోవడం మొ.లగు వాటికి కారణమవుతుంది. తర్వాత, గర్భానికి సంబంధించిన జోక్యం ద్వారా స్త్రీ యొక్క సంతానోత్పత్తిని కూడా పిసిఓఎస్ ప్రభావితం చేస్తుంది మరియు గర్భధారణ సమయం‌లో సమస్యలను లేవనెత్తుతుంది.    

గోక్షూర తిత్తుల యొక్క పరిమాణం మరియు సంఖ్యను తగ్గిస్తుంది కాబట్టి, పిసిఓఎస్ వ్యాధితో బాధపడుతున్న స్త్రీలు, గోక్షూర ద్వారా ప్రయోజనం పొందవచ్చని పరిశోధన అధ్యయనం తెలియజేస్తుంది. 

గోక్షూర యొక్క క్రమమైన వినియోగం, శరీరం‌లో ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ స్థాయి పెరుగుదలకు దారితీస్తుందని మరొక అధ్యయనం సూచిస్తున్నది, ఈ హార్మోన్ అండాశయ ఫోలికల్స్ అభివృద్ధికి చాలా అవసరం. యునాని వైద్య‌ం‌లో, అశ్వగంధ మరియు గోక్షూర యొక్క కలయికను పిసిఓఎస్ లక్షణాలు తొలగించేందుకు ఉపయోగిస్తారు.   

పిసిఒఎస్ చేత ప్రభావితం చేయబడిన స్త్రీలు అవాంఛిత బరువు పెరుగుటను అదుపులో ఉంచుటకు కూడా ఇది సహాయపడుతుంది.  

మూత్రపిండాలలో రాళ్ల కోసం గోక్షూర - Gokshura for kidney stones in Telugu

అనేక కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్లు పెరగడం చాలా దేశాల్లో పెరుగుతున్న సమస్యగా మారింది. ప్రపంచం‌లోని జనాభాలో 12% మంది మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతున్నారని ఒక అధ్యయనం తెలియజేసింది మరియు ఈ సమస్య పునరావృతమయ్యే రేటు 50% మరియు 80% మధ్య ఉంటుంది. అనేక రకాల పద్దతుల ద్వారా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని తగ్గించేందుకు గోక్షూర కనుగొనబడింది.    

ఇది రక్తంలో క్యాల్షియం స్థాయిల్ని తగ్గించేందుకు సహాయపడుతుంది, దానివల్ల మీ మూత్రపిండాల్లో క్యాల్షియం చేరి నిల్వ ఉండకుండా గోక్షూర తొలగిస్తుంది.   

ఒక మూత్రవిసర్జకంగా, ఖనిజాలు మీ మూత్రపిండాల్లో చేరి నిల్వ ఉండేందుకు ముందే, రక్తం నుండి అదనపు ఖనిజాల్ని బయటకు పంపించేందుకు సహాయపడుతుంది.    

మరియు గోక్షూర యొక్క యాంటిఆక్సిడంట్ ప్రభావాలు, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంతో పాటు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటాన్ని నిరోధించడంలో సహాయం చేస్తాయి.  

మహిళల్లో తక్కువ లిబిడో కోసం గోక్షూర - Gokshura for low libido in women in Telugu

గోక్షూర సాంప్రదాయకంగా ఒక కామోద్దీపకంగా తెలియజేయబడింది. మహిళల్లో లిబిడోను మెరుగుపరుచుకోవడంలో గోక్షూర యొక్క ప్రభావాలను అంచనా వేసేందుకు విస్తృతమైన అధ్యయనాలు చేయబడ్డాయి. రోజుకు 7.5 మి.గ్రా. గోక్షూర పదార్థాల వినియోగం, 4 వారాల లోపల ఉండే లైంగిక వైఫల్యాన్ని మెరుగుపరచడంతో పాటు మహిళల్లో లైంగిక కోరికలను మెరుగుపరచేందుకు దారి తీస్తుందని క్లినికల్ అధ్యయనాలు నిరూపించాయి.        

గోక్షూర యొక్క సాధారణ వినియోగం లైంగిక సంతృప్తిని పెంచుతాయని మరియు ముందుగా మరియు తర్వాత ఋతుక్రమం ఆగిపోయిన మహిళల్లో ఉద్రేకాన్ని పెంచుతాయని ప్రస్తుత క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి.     

గుండె ఆరోగ్యానికి గోక్షూర - Gokshura for heart health in Telugu

పరిశోధన ప్రకారం, ట్రిబులుస్ టెర్రెస్ట్రిస్  లేదా గోక్షూర అన్నది దానిలో ఉండే యాంటిఆక్సిడంట్ల కారణంగా గుండె సంరక్షణ లక్షణాలను కలిగిఉంది. ఇది ఇన్ప్రాక్ట్ యొక్క పరిమాణాన్ని తగ్గించగలదు (రక్త సరఫరా నిలిచిపోవడం కారణంగా శరీరంలో చనిపోయిన కణజాల ప్రాంతం), ప్రభావిత ప్రాంతానికి తగినంత రక్త సరఫరా లేనప్పుడు ఏర్పడే పరిస్థితి. గోక్షూర, గుండెలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది మరియు శరీరంలో ఎటిపి స్థాయిల్ని పెంచడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.    

ఈ ఔషధ మూలిక యొక్క క్రమమైన వినియోగం, ఎటువంటి దుష్ప్రభావాలు లేనటువంటి ఒక ముఖ్యమైన యాంటిహైపర్‌టెన్సివ్ ప్రభావం కలిగిఉంటుందని ఒక క్లినికల్ అధ్యయనం చూపించింది. వాస్తవంగా, తేలికపాటి రక్తపోటు స్థాయినుండి తీవ్రమైన రక్తపోటు స్థాయి కలిగిన వ్యాధితో బాధపడుతున్న రోగుల చికిత్సకు గోక్షూర ఎక్కువ కాలం ఉపయోగించేందుకు సురక్షితమైనదని అధ్యయనాలు సూచిస్తున్నాయి.    

ఎల్‌డిఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడం ద్వారా శరీరం‌లోని కొలెస్ట్రాల్ స్థాయిల్ని నియత్రించడంలో కూడా ఈ మొక్క సహాయపడుతుంది. తర్వాత, ఇది లిపిడ్ పెరాక్సిడేషన్‌ ను నిరోధిస్తుంది, ఇది ఎథెరోస్క్లెరోసిస్ మరియు ఫలకం ఏర్పడటానికి బాధ్యత వహిస్తుంది.  

ఆందోళన మరియు నిరాశ కోసం గోక్షూర - Gokshura for anxiety and depression in Telugu

ఆందోళన మరియు నిరాశ ఈ రోజుల్లో బాగా ప్రబలంగా మారింది. లింగం‌తో సంబంధం‌ లేకుండా అన్ని వయస్సుల గుంపులను ప్రభావితం చేస్తుంది. తక్కువ దుష్ప్రభావాలతో గోక్షురా ఒక ప్రభావవంతమైన యాంక్సియోలైటిక్ మరియూ యాంటి‌డిప్రసంట్ ఔషధంగా ఉందని ప్రీ క్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి మరియు ఆందోళన  మరియు కుంగుబాటు చికిత్సకు దీనిని విజయవంతంగా ఉపయోగించారు.   

తర్వాతి అధ్యయనాల్లో, గోక్షురలో ఉండే సాఫోని‌న్స్ కారణంగా, గోక్షుర యొక్క యాంటి-డిప్రెస్సివ్ ప్రభావాలు సేరం కార్టిసోల్ స్థాయిలు తగ్గించేందుకు కారణం అయ్యింది.   

బాడీబిల్డింగ్ కోసం గోక్షూర - Gokshura for bodybuilding in Telugu

గోక్షుర ఔషధం కండరాల బలం మరియు శరీర సమకూర్పును పెంచుతుంది కాబట్టి ఇటీవల బాడీ బిల్డర్ల మధ్య ఇది ప్రజాదరణ పొందింది. దీర్ఘకాలంపాటు గోక్షురాను తీసుకోవడం వల్ల మీరు బలాన్ని పెంచుకోవచ్చు మరియు కండరాలను పొందవచ్చు. ట్రిబులుస్ టెర్రెస్ట్రిస్ నైట్రిక్ ఆక్సైడ్ విడుదల ద్వారా లీన్ మాస్ మరియు టెస్టోస్టిరాన్‌ను పెంచుతుంది, ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాల్ని విస్తరించే ఒక వాయువు, ఇది కండరాలకు ఆక్సిజన్‌ను బాగా సరఫరా చేస్తుంది. పురుషులు, ఈ రోజుల్లో ఫిట్‌గా ఉండటం కోసం స్టెరాయిడ్ ఇంజక్షన్లను తీసుకుంటున్నారు, దీర్ఘకాలంగా ఇవి హానికరమైనవిగా నిరూపించబడ్డాయి. గోక్షురా, ఒక సహజమైన మూలికగా, ఈ స్టెరాయిడ్లకు ఒక ఉత్తమమైన మరియు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉంది. అయినప్పటికీ, ఎటువంటి ఆరోగ్య సమస్యల నుండైనా రోగుల్ని బయటకు తీసుకురావడానికి మరియు దీర్ఘకాలంగా ఈ మూలికను వాడడం ద్వారా మూలిక యొక్క భద్రతను నిర్ధారించేందుకు మరిన్ని అధ్యయనాలు ఇప్పటికీ అవసరమవుతాయి.            

గోక్షురా యొక్క ఇతర సమర్థవంతమైన ఆరోగ్య ప్రయోజనాలు - Other potential health benefits of Gokshura in Telugu

  • యువతలో చాలా ప్రబలంగా ఉండే మొటిమలు సమస్యను ఎదుర్కోవడం‌లో గోక్షురా సహాయపడుతుందని నమ్మడం జరిగింది. దురద, చర్మం వ్యాదులు, చర్మం పగలడం మరియు తామర మొదలగు వంటి వివిధ చర్మ సమస్యల చికిత్సలో కూడా ఇది ఉపయోగపడుతుంది.   
  • ఈ మూలికను క్రమం తప్పకుండా తీసుకోవడం అన్నది ప్రారంభ వృద్దాప్య లక్షణాలను నిరోధించి, మీరు యవ్వనస్తులుగా కనిపించేలా చేస్తుందని నమ్ముతారు. ఇది ముడుతలను నిరోధించేందుకు సహాయపడుతుంది, శరీరంలోని కొవ్వు కంటెంట్‌ను విస్తరింపచేస్తుంది మరియు కండరాల క్షీణత విషయంలో పోరాడుతుంది.  
  • తదుపరి, గోక్షుర యొక్క విత్తనాలను, ఒక పేస్టు రూపంలో అప్లై చేసినప్పుడు అది జుట్టు రాలిపోకుండా నియంత్రిస్తుంది మరియు నివారిస్తుందని నమ్ముతారు.  
  • ఈ ఆయుర్వేద మూలిక తలనొప్పి మరియు మైగ్రేన్ల నుండి ఉపశమనం ఇస్తుందని కూడా నమ్ముతారు.
  • దీని యాంటి-ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల, ఫిస్టులా మరియు ఫైల్స్ చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు.
  • చాలా కాలంగా, కంటి సమస్యల చికిత్సకు మరియు రోగ నిరోధక శక్తి పెంచేందుకు కూడా ప్రజలు గోక్షురాను ఉపయోగిస్తున్నారు.
  • గోక్షురా యొక్క యాంటిఆక్సిడంట్ ప్రభావాలు డయాబెటిస్ లక్షణాలు నిర్వహణలో సహాయపడతాయని కనుగొనబడింది మరియు డయాబెటిస్ సంబంధిత సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.  

గోక్షూర వినియోగించేందుకు సురక్షితమైనదని మరియు ఎటువంటి తీవ్రమైన దుష్ప్రభావాలు ఏర్పడటానికి ఇది కారణం కాదని అనేక అధ్యయనాలు చూపించాయి. గోక్షూర కడుపునొప్పిని ఏర్పరచవచ్చు మరియు ఇది పురుషులలో ప్రొస్టేట్ యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. మీ రోజూవారీ ఆహారం‌లో గోక్షూరను జోడించేందుకు ముందుగా మీ హెల్త్ ప్రాక్టీషనర్‌ ను సంప్రదించవలసిందిగా మీకు సిఫార్సు చేస్తున్నాము మరియు క్రింది సందర్భాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.     

  • గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే స్త్రీలు: పిండం యొక్క అభివృద్ధికి హాని కలిగిస్తుందని నమ్ముతారు కాబట్టి గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు గోక్షూరను తీసుకోవడం మంచిదికాదని సలహా ఇవ్వబడింది.
  • అలెర్జీ ప్రతిస్పందనలకు: కొంతమంది ప్రజలు కడుపులో ఇబ్బంది, దద్దుర్లు వంటి అలెర్జి లక్షణాలతో బాధపడుచుంటారు.  
  • ప్రధాన వైద్య శస్త్ర చికిత్సల చరిత్ర: వైద్య శస్త్ర చికిత్సలు లేదా పరిస్థితులు ఒకవేళ మీరు కలిగిఉంటే సూచించిన మోతాదులో తీసుకోవాలని సూచించడమైనది.
  • కొనసాగుతున్న అనారోగ్యం: మీరు ఇప్పటికే కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు మందులు తీసుకుంటుంటే, జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, గర్భాశయ లేదా రొమ్ము క్యా‌న్సర్లకు సంబంధించిన చరిత్ర కలిగిన స్త్రీలు గోక్షురాను తీసుకోకూడదు.    
  • మధుమేహం: రక్తం‌లో గ్లూకోజును తగ్గించడం ద్వారా గోక్షూర మధుమేహాన్ని నియంత్రిస్తుంది. మీరు ఒకవేళ మందులు వాడుతున్న మధుమేహ రోగి అయితే గోక్షూరను తీసుకోవాల్సిన మోతాదు కోసం మీ డాక్టరును అడగండి.    
  • అధిక రక్తపోటుతో బాధపడే రోగులు: గోక్షూర అన్నది నిరూపితమైన హైపోటె‌న్సివ్ ఏజెంట్ కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న రోగులు వైద్య పర్యవేక్షణలో గోక్షూరను తీసుకోవాలి.    
  • పిల్లలు: పిల్లలు  సున్నితమైనవారు కాబట్టి వైద్యుడిని సంప్రదించకుండా వారికి ఎటువంటి మందులను ఇవ్వరాదు. 
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹546  ₹850  35% OFF
BUY NOW

గోక్షుర లేదా ట్రిబులుస్ టెర్రెస్ట్రిస్  అన్నది చిన్న ఆకులు గల ఒక మొక్క, ఆయుర్వేదం మరియు సంప్రదాయ వైద్యంలో దీనిని యుగాలగా వాడుతున్నారు. తక్కువ దుష్ప్రభావాలతో పొడవాటి ప్రయోజనాల జాబితాను ఇది కలిగిఉంది. మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, మరియు రక్తపోటుతో బాధపడుతున్నప్రజలకు ఇది చాలా మంచిది మరియు లిబిడోను పెంచడం‌ కోసం ఉపయోగకరమైనది. మీరు ఏదైనా సప్లిమెంట్లతో ప్రారంభించే ముందు, ఆరోగ్య ప్రయోజనాలు మరియు ప్రమాదాలు రెండింటినీ ఎల్లప్పుడూ పరిగణనలోకి తీసుకోవడం మంచిది మరియు ఈ అంశం ట్రిబులుస్ టెర్రెస్ట్రిస్  విషయం‌లో కూడా నిజమైంది.        


Medicines / Products that contain Gokshura

వనరులు

  1. Saurabh Chhatre et al. Phytopharmacological overview of Tribulus terrestris. Pharmacogn Rev. 2014 Jan-Jun; 8(15): 45–51. PMID: 24600195
  2. R Jain, S Kosta, A Tiwari. Ayurveda and Urinary Tract Infections. J Young Pharm. 2010 Jul-Sep; 2(3): 337. PMID: 21042497
  3. Susan Arentz, Jason Anthony Abbott, Caroline Anne Smith, Alan Bensoussan. Herbal medicine for the management of polycystic ovary syndrome (PCOS) and associated oligo/amenorrhoea and hyperandrogenism; a review of the laboratory evidence for effects with corroborative clinical findings. BMC Complement Altern Med. 2014; 14: 511. PMID: 25524718
  4. Amol L. Shirfule, Venkatesh Racharla, S. S. Y. H. Qadri, Arjun L. Khandare. Exploring Antiurolithic Effects of Gokshuradi Polyherbal Ayurvedic Formulation in Ethylene-Glycol-Induced Urolithic Rats. Evid Based Complement Alternat Med. 2013; 2013: 763720. PMID: 23554833
  5. Elham Akhtari et al. Tribulus terrestris for treatment of sexual dysfunction in women: randomized double-blind placebo - controlled study. Daru. 2014; 22(1): 40. PMID: 24773615
  6. Shashi Alok, Sanjay Kumar Jain, Amita Verma, Mayank Kumar, Monika Sabharwal. Pathophysiology of kidney, gallbladder and urinary stones treatment with herbal and allopathic medicine: A review. Asian Pac J Trop Dis. 2013 Dec; 3(6): 496–504. PMC4027340
  7. MURTHY A.R et al. Anti-hypertensive effect of Gokshura (Tribulus terrestris Linn.) A clinical study . Ancient Science of Life Vol. No XIX (3&4) January, February, March, April 2000
  8. Amin A, Lotfy M, Shafiullah M, Adeghate E. The protective effect of Tribulus terrestris in diabetes Ann N Y Acad Sci. 2006 Nov;1084:391-401. PMID: 17151317
  9. Seok Yong Kang et al. Effects of the Fruit Extract of Tribulus terrestris on Skin Inflammation in Mice with Oxazolone-Induced Atopic Dermatitis through Regulation of Calcium Channels, Orai-1 and TRPV3, and Mast Cell Activation. Evid Based Complement Alternat Med. 2017; 2017: 8312946. PMID: 29348776
  10. Mitra Tadayon et al.The effect of hydro-alcohol extract of Tribulus terrestris on sexual satisfaction in postmenopause women: A double-blind randomized placebo-controlled trial. J Family Med Prim Care. 2018 Sep-Oct; 7(5): 888–892. PMID: 30598928
  11. Wang Z, Zhang D, Hui S, Zhang Y, Hu S. Effect of tribulus terrestris saponins on behavior and neuroendocrine in chronic mild stress depression rats J Tradit Chin Med. 2013 Apr;33(2):228-32. PMID: 23789222
Read on app