చక్కెర ఉత్పత్తికి ఉపయోగించే చెరకు గడ్డిజాతికి చెందినది. చెరకు గడలు పొడవుగా ఉండి సంవత్సరం పొడుగునా లభిస్తాయి. మరోవైపు, “చెరకు రసం” అనేది చెరకు గడల్ని యంత్రాల సాయంతో (గానుగలో కావచ్చు) పిప్పిచేసి తీసే చిక్కని పానకం. చెక్కుతీసిన (peeled) లేక ముడి చెఱకు గడలపైన ఉండే పట్ట (hard ply on sugarcane)ను తొలగించిన చెరకు గడల్ని మిల్లులో పెట్టి పిప్పి చేసినపుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టంగా ఆస్వాదించే రుచికరమైన ‘చెఱకు రసం’ పానీయం సృష్టించడం జరుగుతుంది.
దక్షిణ మరియు ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో చెరకు పుట్టింది, ఇక చెరకు గడల నుండి చక్కెర ఉత్పత్తి మొదలైంది ఉత్తర భారతదేశంలోనే అని చెప్పబడుతోంది. అనేక సంస్కృత మరియు పాళీ గ్రంథాల్లో చక్కెర ఉత్పత్తి గురించి సూచించాయి. సంస్కృత పదం ‘శర్కర’ (Sarkara), నుండి చెరకు శాస్త్రీయ పేరు ‘శాచ్చారం’ ను తీసుకున్నారని ఊహించబడుతోంది, తెలుస్తోంది, అంతేగాక పురాతన భారతదేశం నుండి గ్రహించి ఉంటారన్న తిలివిడికి ఇది సాక్ష్యంలా నిలుస్తోంది.
మధ్యప్రాచ్య దేశాల నుండి వ్యాపారులు చక్కెరను మధ్యధరా ప్రాంతానికి పరిచయం చేశారు, అటుపైన ఇది స్పానిష్ మరియు పోర్చుగీసు రైతుల ద్వారా అమెరికాలోకి ప్రవేశించింది. కొలంబస్ తన రెండవ సముద్రయానంలో అమెరికాకు వెళ్ళినపుడు (కనుగొన్నపుడు) అక్కడి నుండి కరీబియన్ ద్వీపాలకు చెరకును తీసుకొచ్చారు, ఆ తర్వాత అది యూరప్కు రవాణా చేయబడినది. ఈ సమయంలో బానిసల వ్యాపారంలో చెరకు సాగు చాలా ముఖ్యమైనది.
దానిలో ఉన్న అనామ్లజనకాలు కారణంగా చెరకు రసం శరీరం మీద అద్భుతాలు చేస్తాయి. ఈ అనామ్లజనకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి మరియు రోగనిరోధకతను పెంచడంలో సహాయపడతాయి. చెరకు ఇనుము, కాల్షియం, మెగ్నీషియం మరియు ఇతర ఎలెక్ట్రోలైట్స్ వంటి ఖనిజాలను కూడా సమృద్ధిగా కల్గి ఉంటుంది, ఇది నిర్జలీకరణానికి ఓ గొప్ప నివారిణిగా పని చేస్తుంది.
చెరకులో కొన్ని పర్యావరణ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రదేశాల్లో, చెరకు నుండి రసాన్ని తీసిన తర్వాత మిగిలివున్న చెరకు పిప్పిని కాగితంలా పరివర్తించబడుతోంది. చెట్ల నుంచి తయారైన కాగితం మాదిరిగా కాకుండా, ఈ చెరకు కాగితం పర్యావరణ అనుకూలమైనది మరియు పునర్వినియోగపరచదగినది (recyclable). కొన్ని సందర్భాల్లో, చెరకును జీవ ఇంధనం (biofuel) వలె కూడా ఉపయోగిస్తారు మరియు ఇథనాల్ ఉత్పత్తిలో కూడా ఉపయోగిస్తారు.
చెరకు గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- వృక్షశాస్త్ర నామం (బొటానికల్ పేరు): సకారమ్ ఆఫీషినరమ్ (Saccharum officinarum)
- కుటుంబ పేరు: పోయేసియె (Poaceae)
- సాధారణ పేరు: చెరకు, ఈఖ్ , కరిమ్బూ, గన్నా
- ఉపయోగించే భాగాలు: చెఱకు మొక్క యొక్క కాండాన్ని చక్కెర ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు.
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్టీర్ణం: చెరకు బ్రెజిల్, భారతదేశం, చైనా, థాయిలాండ్, మరియు ఫ్లోరిడా, లూసియానా, టెక్సాస్ మరియు హవాయి వంటి యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రాంతీయ భాగాలలో సాగు చేస్తారు. పెరూ ప్రపంచంలోనే చెరకు ఉత్పత్తిలో అగ్రగణ్య దేశం, దాని తరువాత జాంబియా అతిపెద్ద చెరకు ఉత్పత్తి చేసే దేశం.
- ఆసక్తికరమైన వాస్తవం: గ్రీకు మరియు పర్షియన్ వ్యాపారులు తమ ప్రయాణంలో భారతదేశానికి వచ్చినపుడు మొట్టమొదట చెరకును చూచారు, అపుడు వాళ్ళు చెరకును ఒక విలాసవంతమైన మరియు ఖరీదైన మసాలాగా పరిగణించారు.