చేపలు 530 మిలియన్ల సంవత్సరాల క్రితం కేంబ్రియన్ పేలుడు సమయంలో ఉనికిలోకి వచ్చాయి, అటుపైన, ఇవి జీవ వైవిధ్యపరంగా బాగా పెరిగినాయి. మొట్టమొదటిగా గుర్తించబడిన చేప ‘అగ్నాథ’ లేదా దవడల్లేని చేప (jawless fish). ఈ అగ్నాథ కారణంగానే ‘దేవొనియన్’ కాలంలో విస్తృత స్థాయిలో చేపల పెరుగుదల కనిపించింది. దేవొనియన్ యుగాన్ని 'చేపల కాలం' అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం, ప్రపంచం లో సుమారు 25,000 చేపల జాతులు ఉన్నాయి. అతిపెద్ద చేప ‘వేల్ షార్క్’ కాగా, చిన్న చేప ‘ఫిలిప్పైన్ గోబీ’ గా గుర్తించబడ్డాయి.
చేపలు చల్లని-రక్తపు జంతువు మరియు పర్యావరణానికి అనుగుణంగా దాని శరీర ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకుంటుంది. చేపలు సహజంగా చాలా శక్తివంతమైనవి, ఇవి వాటికున్న ఎర్రని కండర ఫైబర్లతో అనేక గంటలపాటు నీటిలో ఈదగలవు. ఇవి తమ చిన్న కండరాలను ఉపయోగించి వేగవంతమైన చిన్న చిన్నవిసుర్ల (bursts)ను విసరగలవు. చేపలు సుదీర్ఘకాలంపాటు ఈత కొట్టగలవు, అందుగ్గాను వాటి యొక్క రెడ్ ఫైబర్లకు ప్రాణవాయువు కావలసి ఉంటుంది, దీనివల్ల అవి వేగంతో ఈదగలవు. చేపల్లో మైయోగ్లోబ్బిన్తో కూడిన రక్తసరఫరా చేపల్లో కావలసినంతగా ఉంటుంది కాబట్టీ అవి వేగంగా ఈదగల్గుతాయి.
చేపలు మాంసకృత్తులను సమృద్ధిగా కల్గిన ఒక ముఖ్యమైన సముద్రపు ఆహారం.అంతేగాక చేపలు రుచికరమైన ఆహారంగా ప్రసిద్ధి. వాస్తవానికి, ప్రపంచ ప్రోటీన్లో ఆరింటా ఒక వంతు చేపల నుండే వస్తుంది. పురాతన కాలం నుండి మానవులు చేపల్ని ఆహారంగా ఉపయోగిస్తున్నారు మరియు అనేక నాగరికతల్లో చేపలు ఒక ముఖ్యమైన ఆహారంగా ఉంది. దాని తలతో సహా మొత్తం చేపను తినవచ్చు. అందువల్ల, అనేక రకాల చేప-ఆధారిత వంటకాలను ప్రపంచ వంటల్లో మనం చూడవచ్చు. సుషీ వంటి కొన్ని వంటకాల్లో పచ్చి చేపల్నే తినడానికి వాడుతుండగా, చేపల్ని ఆవిరిమీద ఉడికించి, మంటల్లో కాల్చి (grilled), వివిధ వంటలలో వేయించి తినడం జరుగుతుంది. చేపలు మరియు చిప్స్ బహుశా ఇంగ్లీష్ వంటల్లో అత్యంత సాధారణ వంటలలో ఒకటి.
ప్రోటీన్ యొక్క గొప్ప వనరుగానే కాకుండా, చేపలు ఒమేగా 3-కొవ్వు ఆమ్లం మరియు విటమిన్ డి యొక్క అద్భుతమైన మూలం. కొన్ని రకాల చేపలలో కనిపించే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరుకు మరియు మానసిక అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చేపల్లో కొవ్వు పదార్ధం సాధారణంగా చేపయొక్క రకం మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమయినప్పటికీ, చేపల్ని సాధారణంగా తినడంవల్ల జుట్టు, మెదడు మరియు శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
చేప చమురు (fish oil) దాని ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేకంగా సేవించబడుతుంది మరియు చేపలను ఆక్వేరియంలు, కొలనులు, చెరువులు మరియు సరస్సుల్లో వాటిని చూచి ఆనందించేందుకు, అంటే సౌందర్య ప్రయోజనాల కోసం, పెంచబడతాయి. చేపలవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రధాన ఉపయోగం మాత్రం కమ్మదనంతో కూడిన వీటి రుచి, కనుక చేపల ఆహారప్రియులు వాటిని తిని ఆనందించడం కొనసాగుతోంది.
మీకు తెలుసా?
ఈ జలచర జంతువులైన చేపలు పురాతనమైనవే కావు, ఇవి అనేక మతాలలో ముఖ్యమైన పౌరాణిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నా యి. ‘ఎంకి’ పేరిట సుమేరియన్లు చెప్పాను తమ వరుణ దేవుడిగా (god of water) కొలుస్తారు, చేప దేహాన్ని కల్గిన సిరియా దేవత, ‘అతార్గటి’ ని సిరియన్లు పవిత్రంగా కొలుస్తారు. చేపను సూచించే గ్రీకు పదం యేసుక్రీస్తుకు సంబంధించిన ఒక సంక్షిప్తపదం (acronym), అందువల్ల ప్రాచీన క్రైస్తవులు యేసుక్రీస్తును సూచించడానికి చేప చిహ్నాన్ని ఉపయోగిస్తారు. హవాయి మరియు ముస్లిం సంస్కృతులలో చేపలకు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మెసొపొటేమియన్లు మరియు హిందూ సంస్కృతిలో కొన్ని జాతుల ప్రజలు తమ పండుగలు, దేవుని జాతర్ల వంటి సంబరాలలో చేపలను దేవునికి నైవేద్యంగా సమర్పించి ప్రార్థిస్తారు.
చేప గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- ప్రాణిజాతి (Kingdom) : యానిమాలియా (Animaalia)
- ప్రజాతి (phylum): చొర్డేటా (chordata)
- చేపల తరగతులు లేక వర్గాలు: గట్టి నరమయమైన, మెత్తని నరముతో కూడిన (cartilaginous) మరియు ఎముకలతో కూడినది (bony)
- చేపల సాధారణ రకాలు: సాల్మోన్, సార్డైన్, కాడ్, పెర్చ్, హాలిబుట్, ట్రౌట్, టిలాపియా, కార్ప్, టెట్రా, బిల్ఫిష్ మొదలైనవి.
- చేపల ఉపయోగాలు: ఆహారంగా తినడానికి, మసాజ్ చికిత్సలో, ఆక్వేరియమ్స్ లో అలంకారప్రాయంగా చేపల్ని ఉపయోగిస్తారు
- చేపల పరిణామం: చేపలు సుమారు 530 మిలియన్ సంవత్సరాల క్రితం ఉద్భవించాయి. మొట్టమొదటిగా సిలూరియన్లచేత చేపల యొక్క రెండు గ్రూపుల్ని సూచిస్తూ శిలాజ రికార్డులో ప్రాతినిధ్యం వహించాయి: ఆ రెండు గ్రూపులు: సాయుధ చేప మరియు అకాంతోడీ రకం చేప .
- ఆసక్తికరమైన నిజం: కొన్ని చేపలు ఉప్పునీటిలో నివసిస్తాయి, హాలిబట్ మరియు కాడ్ చేపలు అలాంటివే. అవి హాసముద్రాలు మరియు సముద్రాలలో నివసిస్తాయి. ట్రౌట్ చేపలు మరియు క్యాట్చేపలు సరస్సులు మరియు నదుల వంటి మంచినీళ్లలో (freshwaters) నివసిస్తాయి.