పీచుపదార్థాలు అనేవి జీర్ణం కాని పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్లు), ఇవి ప్రధానంగా పండ్లు, తృణధాన్యాలు, వారి, గోధుమల వంటి గింజ ధాన్యాలు మరియు కూరగాయలతో సహా వివిధ మొక్కల వనరుల నుండి లభిస్తాయి. ఇవి జీర్ణించుకోలేని సెల్యులోజ్ (జీవకణ నిర్మాణ ద్రవ్యము లేక కర్రనార) మరియు పిండిపదార్థము కాని ‘లిగ్నిన్లు వంటి పదార్థాలతో తయారవుతాయి. చిన్న ప్రేగు నుండి, ఈ పీచుపదార్థాలు నేరుగా పెద్ద ప్రేగులోకి వెళతాయి, ఇక్కడ ఈ పీచుపదార్థాల (ఫైబర్) ఒక భాగం మాత్రమే పేగుల్లోని బ్యాక్టీరియా ద్వారా పులియబెట్టబడుతుంది.
అయితే, ఇంతకూ, మనకు పీచుపదార్థాలు (ఫైబర్) ఎందుకు కావాలి, దేనికి ఉపయోగపడతాయివి?
ఆహారానికి ఎక్కువ గాత్రాన్ని (bulk) అందించడానికి మరియు ప్రేగు కదలికలను నియంత్రించడానికి పీచుపదార్థాలు (ఫైబర్) అవసరం. పీచుపదార్థాలు జీర్ణం కావు, ఇవి మన పేగుల్లో ఎక్కువసేపు నిల్చి మనం కడుపు నిండిన భావం కలిగేలా చేసి ఆకలి బాధ లేని తృప్తికర అనుభూతిని మనకు కలిగిస్తుంది, తద్వారా మన భోజనాల మధ్యకాలం అంతరం పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా సహాయపడుతుంది ఎందుకంటే వాళ్ళు తినే తక్కువ వ్యవధి (తరచు) భోజనాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.
అదనంగా, పీచుపదార్థాల్లో అధికంగా ఉండే ఆహారం మన కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు ఊబకాయం, మలబద్ధకం, పెద్దప్రేగు కాన్సర్, మొలలు (పైల్స్), మరియు గుండె వ్యాధుల వంటి సమస్యలను తగ్గిస్తుంది.
ఆహార పీచుపదార్థాల యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ సెరీయల్ కెమిస్ట్స్ చేత వీటికి “క్రియాత్మక ఆహారం” ("ఫంక్షనల్ ఫుడ్") అనే బిరుదును సంపాదించాయి.