సున్నపురాయిని సాధారణంగా హిందీలో ‘చునా’ అని పిలుస్తారు, ఇది ఒక రకమైన అవక్షేపణ రాయి (నీటిలో అడుగున చేరి బురదకట్టడం ద్వారా సున్నపురాయిగా ఏర్పడడం). నిర్మాణ వస్తువుగా సున్నపురాయిని విస్తారంగా ఉపయోగీస్తారు. సున్నపురాయిని రసాయన పరిశ్రమలో కూడా సున్నం తయారు చేయడానికి ఒక ముఖ్యమైన వస్తువుగా వాసికెక్కింది.
సున్నపురాయి ఏర్పడటానికి ప్రధాన మార్గాలు భాష్పీభవనం (ఆవిరికావటం) ద్వారా చేసే ప్రక్రియ ఒకటి కాగా సూక్ష్మజీవుల సహాయంతో చేసే మార్గం మరొకటి. సున్నపురాయి యొక్క ముఖ్య భాగాలు సముద్రపు జీవులు-నత్తలు (molluscs), ఫోరామ్లు (forams) మరియు పగడాలు (corals). ఖటికాయితము లేదా కాల్సైట్ మరియు అరగొనైట్ వంటి సమ్మేళనం కాల్షియం కార్బోనేట్ యొక్క స్పటిక రూపాలు సున్నపురాయిగా ఏర్పడే ప్రధాన ఖనిజాలు.
సున్నపురాయి దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆయుర్వేదంలో ప్రస్తావించబడింది. తన గ్రంథం 'అష్టాంగ హృదయం' (Ashtanga Hrudayam) లో మహర్షి భగభత (Bhagbata) సున్నపురాయి గురించి చెబుతూ మానవుల్లో సుమారు డెబ్భై వ్యాధుల్ని నయం చేయడానికి వాడదగిన మందు వస్తువుగా సున్నపురాయిని పేర్కొన్నారు.
అనేక చికిత్సలు కూడా సున్నపురాయిలో సమృద్ధిగా ఉన్న ఖనిజాల కారణంగా దాన్ని చికిత్సల్లో ఉపయోగించాలని సిఫార్సు చేస్తాయి. సున్నం (కాల్షియం) యొక్క గొప్ప ఒనరు, సున్నపురాయి. ఈ వ్యాసంలో సున్నపురాయి గురించిన అనేక ప్రయోజనాలను వివరించడం జరిగింది.
సున్నపురాయి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- రసాయనిక పేరు: కాల్షియం కార్బొనేట్
- రసాయనిక ఫార్ములా: CaCO3
- సాధారణ పేరు: చునా, సున్నపురాయి
- ఎక్కువగా కనబడే ప్రదేశాలు: తీరప్రాంతాలలో, సముద్ర తీరం సమీపంలో