ప్రపంచవ్యాప్తంగా అతి సాధారణంగా తినే మాంసం ఏదంటే అది కోడి మాంసమే (చికెన్). ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల వారు వారి వారి ప్రాంతీయ ప్రాధాన్యతల ప్రకారం కోడి మాంసాన్ని వివిధ రకాల కూరలు, వంటకాల్ని రుచికరంగా వండుకుని తింటారు. ఇతర రకాల మాంసాలతో పోలిస్తే కోడి మాంసం ఎంతో సరసమైనది మరియు సులభంగా లభిస్తుంది. వివిధ ఫాస్ట్ ఫుడ్ల తయారీల్లో కోడి మాంసం ఓ ప్రధానమైన పదార్ధంగా కూడా ఉపయోగించబడుతోంది. కోడి మాంసాన్ని వండే పాత్రను బట్టి మరియు ఏ రకం భోజనంలోకి (ఉదా: వరి అన్నం, గోధుమ రొట్టె, సంకటి) కోడిమాంసం వండాలి అన్నదాన్నిబట్టి వివిధ రకాలైన కోడిమాంసం కూరల్ని, వంటల్ని వండుతారు. వీటిలో ఇంకా, గ్రిల్లింగ్, బేకింగ్, ఫ్రైయింగ్ మరియు బార్బెక్యూయింగ్ (పొయ్యిపై ఓ లోహపు చట్రం ఉంచి దానిపై మాంసాన్ని కాల్చి వండటం) విధానాల్లో కోడిమాంసం వంటకాలు, కూరల్ని వండుకుని తినడం జరుగుతోంది.
అనేక రకాలైన పక్షి మాంసాల్లో కోడి మాంసం కూడా ఒకటి. ఇంకా, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో కోడి మాంసం ఉత్పత్తి కోసం ఆధునిక పద్ధతులను ఉపయోగించి కోళ్ల పెంపకం (పౌల్ట్రీ పెంపకం) వ్యసాయాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మరోవైపు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో కోళ్ల పెంపకానికి ఇంకా సంప్రదాయ పద్ధతులనే ఆశ్రయిస్తున్నారు. కోడి మాంసం తినడమనేది క్రీస్తుపూర్వం 600 నాటిది. చరిత్ర మధ్యకాలం (క్రీ.శ 1000 నుండి 1400)లో కోడిమాంసం సాధారణంగా లభించే ఓ మాంసం రకం. భారతదేశంలో కూడా కోడి మాంసం అన్ని వయసులవారు ఎక్కువగా ఇష్టపడే మాంసం. ఆయుర్వేద గ్రంథాలు "వాతం " మరియు "పిత్తం” దోషాల కోసం కోడి మాంసం తినడంవల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొన్నాయి.