మన శరీరం రోజువారీ పనులను నిర్వహించడానికి అనేక పోషకాలు అవసరం అవుతాయి. వీటిలో కొన్నింటిని శరీరమే ఉత్పత్తి చేసుకుంటుంది మరియు కొన్ని పోషకాలను ఆహారంలో లేదా ఆహార వనరుల రూపంలో తీసుకోవలసి ఉంటుంది. కాల్షియం అటువంటి ఒక ఆహారం. ఇది శరీర బరువులో 1-2% కలిగి ఉండే ఒక ముఖ్యమైన పోషకం మరియు ఎముకల, దంతాల అభివృద్ధి మరియు నిర్వహణకు చాలా అవసరం. అంతేకాక, నాడీ (నెర్వస్) మరియు ప్రసరణ (సర్క్యూలేటరీ) వ్యవస్థ యొక్క సరైన పనితీరుకు కూడా ఇది అవసరం. ఈ సాధారణ ఖనిజం ఇంత ముఖ్యమని మీరు ఎప్పుడూ అనుకుని ఉండరు.
దురదృష్టవశాత్తు, భారతదేశం వంటి ఆసియా దేశాలలో ప్రజలు తక్కువ శరీరం కాల్షియంను కలిగి ఉన్నారు. ఈ దేశాలలో ప్రజలు రోజుకు 400 మిల్లీగ్రాముల కాల్షియం తీసుకోవాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఎన్ఐహెచ్ (NIH) ప్రకారం, శరీరం ఎముకల నుండి కాల్షియం తీసుకొని దాని కాల్షియం అవసరాలను తీర్చుకోవడం వలన కాల్షియం లోపం త్వరగా పైకి కనబడదు. కానీ క్రమంగా ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల మరియు సులువుగా ఫ్రాక్చర్స్ బారిన పడతాయి. తీవ్రమైన కాల్షియం లోపం అరిథ్మియా మరియు వేళ్ళ తిమ్మిర్లు మరియు జలదరింపు రూపంగా కూడా కనిపిస్తుంది.
ఇక్కడ మంచి విషయం ఏమిటంటే, చాలా భారతీయ ఆహారాలు సహజంగానే అధికంగా కాల్షియంను కలిగివుంటాయి ఈ ఆహారాలను తగినంత మొత్తంలో తీసుకుంటే, సప్లిమెంట్లపై ఆధారపడవల్సిన అవసరం ఉండకవచ్చు.
కాబట్టి, భారతీయ ఆహారాలలో కాల్షియం సులభంగా లభించే వనరులు ఏమిటి? మరియు వాటిని ఎలా తీసుకోవచ్చు? మరీ ముఖ్యంగా రోజుకు ఎంత కాల్షియం అవసరం?
తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.