బ్రోకలీ క్యాబేజీ కుటుంబానికి చెందిన ఒక మొక్క, దీని అద్భుతమైన ప్రయోజనాల దృష్ట్యా పూవురూపంలో ఉన్న ఈ కూరగాయ విస్తృతంగా ప్రశంసించబడింది. ఇది వివిధ రకాలైన పోషకాలు, ఖనిజాలు, మరియు విటమిన్ల యొక్క గొప్ప మూలం. ఆరోగ్యకరమైన ఆహారం కోసం బ్రోకలీని మనం తీసుకునే ఆహారంలో ఓ భాగంగా చేసుకొమ్మని పౌష్టికాహార నిపుణులు సిఫారసు చేస్తారు. బ్రోకలీ ఆకుపచ్చ రంగులో పెద్ద పెద్ద పువ్వు తలల్ని కల్గి ఉంటుంది. దీని నిర్మాణం ఎలా ఉంటుందంటే ఒక దట్టమైన కొమ్మ నుండి ఓ చెట్టును పోలి, పూవుతో కూడిన తలను కల్గి ఉంటుంది, మరి దీన్ని మనం తినొచ్చు. పెద్ద పెద్ద బ్రోకలీ పూల తలల చుట్టూ ఆకులుంటాయి.
ఈ మొక్క బ్రస్సికా కుటుంబానికి చెందిన వృక్ష సమూహంలో చేర్చబడింది. కల్టివర్స్ గా పిలువబడే ఇవి సంప్రదాయిక మొక్కల సంతానోత్పత్తి ప్రక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడే మొక్కల రకాలు. సహజంగా సంభవించే మొక్కల సముదాయం నుండి ఈ మొక్కలను ఎంపిక చేస్తారు, అప్పుడు అవి కావలసిన లక్షణాల సమూహాన్ని ఉత్పత్తి చేయగలవు లేదా వాటిని అప్పటికే ఉన్న లక్షణాలను పెంచుతాయి. బ్రోకలీకి కోసుపువ్వు (కాలీఫ్లవర్కు) కీ అద్భుతమైన పోలిక ఉంది, కోసుపువ్వు కూడా అదే జాతులకు చెందిన మరో వృక్ష సమూహపు (కూరగాయ) మొక్క.
రోమన్ సామ్రాజ్యం కాలంనాటి నుండి బ్రోకలీ విలువైన ఆహార పదార్థంగా పరిగణించబడింది. బ్రోకలీ మొక్క ఉనికి క్రీస్తుకు పూర్వం 6 వ శతాబ్దం నుండి ఉన్నట్లు తెలుస్తోంది మరియు మధ్యధరా ప్రాంతాలలో ప్రస్తుత బ్రాసాకా పంటల్ని జాగ్రత్తగా పెంచిన ఫలితంగా ఉత్పత్తి చేయబడిందని చెప్పబడుతోంది. 'బ్రోకలీ' అనే పదాన్ని 'బ్రోక్కోలో' అనే పదం నుండి తీసుకోబడింది, ఇది 'క్యాబేజీ పుష్పం' అని సూచిస్తుంది.
బ్రోకలీ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు
- వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: బ్రాసియా ఒలెరాసియా వర్. ఇటాలికా (Brassica oleracea var. Italica)
- సాధారణ పేరు: బ్రోకలీ
- ఉపయోగించే భాగాలు: పువ్వులు, ఆకులు, తొడిమ, కాడలు
- స్థానిక ప్రాంతాలు మరియు భౌగోళిక విస్తీర్ణం: ప్రపంచంలోని మధ్యధరా ప్రాంతాలు. ఎక్కువగా మితమైన మరియు ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో బ్రోకలీని సాగు చేస్తారు.