బ్రాహ్మి ఒక పురాతన భారతీయ మూలిక (హెర్బ్), ఇది నాడీ వ్యవస్థను నయం చేయడంలో మరియు మెదడు పనితీరును మెరుగుపరిచే ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద వైద్య శాస్త్రం దీనిని ‘మేధ్యరసాయణ’ అనే పేరుతో పిలిచింది,, అనగా ఇది నరాల టానిక్ మరియు పునరుజ్జీవనం కల్పించే ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి నుండి ఉపశమనం కల్గించే అడాప్టోజెనిక్ ఏజెంట్‌గా ఇది త్వరగా ప్రధాన స్రవంతిలోకి వచ్చినప్పటికీ, ఇది భారతీయ సంప్రదాయ ఔషధంగా సుమారు 3000 సంవత్సరాలుగా వాడుకలో ఉంది. ఈ మూలిక ప్రస్తావనలు చరక్ సంహిత మరియు సుశ్రుత సంహిత అనే రెండు పురాతన భారతీయ గ్రంథాలలో కనుగొనబడ్డాయి. సుశ్రుత సంహిత బ్రాహ్మి ఘృత మరియు బ్రాహ్మిని అనే వాటిని గురించి కొత్తబలాన్నిచ్చి పునరుజ్జీవనం కల్పించేవిగా తెలిపింది.
‘బ్రాహ్మి’ అనే పదం ‘బ్రాహ్మణ’ పదం నుండి లేదా హిందూ దేవుడు ‘బ్రహ్మ’ పేరు నుండి వచ్చిందని తెలుసుకోవడంతో మీకు ఆసక్తిని రేకెత్తించవచ్చు, ఈ రెండు పదాలు విశ్వ మనస్సు లేదా చైతన్యాన్ని (consciousness) సూచిస్తాయి. కాబట్టి, బ్రాహ్మి అంటే బ్రహ్మ శక్తి అని అర్ధం. ఆసక్తికరంగా, బ్రాహ్మి నాడీ వ్యవస్థపై తన యొక్క టానిక్ ప్రభావాలను చూపిస్తుంది.
రసంతో కూడిన దళసరి ఆకులతో కూడిన బ్రాహ్మి మొక్క తీగ జాతికి చెందినది. ఇది ప్రధానంగా భూమిపైనే అల్లుకుని వ్యాపిస్తుంది మరియు ఇది నీటిని దండిగా తనలో నిలుపుకునే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది సంవత్సరం పొడుగునా ఉండే మూలిక. (దీన్ని మళ్ళీ మళ్ళీ నాటే అవసరం లేదు) మరియు తేమతో కూడిన నేలలు మరియు చిత్తడి ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. బ్రాహ్మి మొక్కల యొక్క దళసరి ఆకులు దానికొమ్మలపై ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. బ్రాహ్మి తెలుపు, నీలం మరియు ఊదారంగు రంగు పూలను మొక్క కొమ్మల చివర్లలో ఒక్కోక్కటి మాత్రమే పూస్తాయి.
బ్రాహ్మి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: బాకోపా మొన్నేరి (Bacopa monnieri)
- కుటుంబం: ప్లాంటజినాసియే (Plantaginaceae)
- సాధారణ పేరు: బ్రాహ్మి , జల్బుటి , వాటర్ హిసోప్, మనీవోర్ట్, ఇండియన్ పెన్నీవోర్ట్
- సంస్కృత నామం: బ్రాహ్మి
- ఉపయోగించే భాగాలు: బ్రాహ్మి ఆకులు, కాండం
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: బ్రాహ్మి ప్రధానంగా ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, చైనా మరియు శ్రీలంకలలో బాగా పెరుగుతుంది. భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, గోవా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు కేరళ రాష్ట్రాల్లో బ్రాహ్మి మొక్కను మనం చూడవచ్చు. యెమెన్, సౌదీ అరేబియా, కువైట్ సహా అనేక అరేబియా దేశాలలో కూడా బ్రాహ్మి పెరుగుతున్నట్లు నివేదించబడింది.
- శక్తి శాస్త్రం (ఎనర్జిటిక్స్): శీతలీకరణ