మన పొట్ట మీదున్న ‘నాభి’ నే ‘బొడ్డు’ అని కూడా పిలుస్తారు, దీన్నే ఆంగ్లంలో ‘బెల్లీ బటన్’ అంటారు. పొట్టపై లోనికి చొచ్చుకుని పోయినట్లు ఓ రంధ్రం ఆకారంలో ఉంటుంది బొడ్డు, లేదా ఈ బొడ్డు కొందరిలో పొట్టకు సమాంతరంగా చదునైనది గా కూడా ఉండవచ్చు లేదా పొట్ట పైకి పొడుచుకు వచ్చినట్లు కూడా ఉంటుంది. శిశువు పుట్టినపుడు ఈ బొడ్డు స్థానంలోనే ‘బొడ్డు తాడు’ (umbilical cord) ఉంటుంది (బొడ్డు తాడు అనేది పిండానికి తల్లి నుండి మావి ద్వారా పోషకాన్ని అందించే త్రాడు). బిడ్డ పుట్టినప్పుడు ఈ బొడ్డు తాడు అనేది తల్లి-బిడ్డకు జతచేయబడి ఉంటుంది. వైద్యపరంగా, బొడ్డు ఓ ‘మచ్చ’ (scar)గా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, చైనా వారి ‘ఆక్యుపంక్చర్’ వైద్యం మరియు భారతీయ ‘ఆయుర్వేద మందుల వైద్యం’ బొడ్డును ఉపయోగించి పాము కాటు ఆపద మరియు ఏలికపాము (రౌండ్‌వార్మ్స్) వంటి రుగ్మతలతో సహా అనేక వ్యాధులను విజయవంతంగా చికిత్స చేస్తాయి.
సంప్రదాయ భారతీయ యోగాలో బొడ్డును మానవ శరీరంలోని ఏడు ప్రధాన చక్రాలలో లేదా శక్తి బిందువులలో ఒకటిగా పేర్కొనబడింది. వివిధ రుగ్మతలకు చికిత్స చేసి నయం చేయడానికి ఆయుర్వేద వైద్యం బొడ్డులో వివిధ రకాల నూనెలను వేయమని సిఫారసు చేస్తుంది. వివిధ ప్రయోజనాలను పొందటానికి బొడ్డులో వేయదగిన నూనెల రకాలను మరియు వాటిని ఏయే విధానాల్లో బొడ్డులో వేయవచ్చో ఈ వ్యాసం చర్చిస్తుంది.