మర్రి చెట్టు

హిందీలో 'బరగాడ్ కా పేడ్' అని పిలువబడే మర్రి చెట్టు హిందూ పురాణాలలో పవిత్ర వృక్షంగా ప్రస్తావించబడింది. ఈ చెట్టు కింద అనేక దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఆయుర్వేదంలో మర్రి చెట్టు అనేక వ్యాధుల, అంటురోగాల చికిత్స కోసం ఉపయోగపడుతుందని చెప్పబడింది. ఆయుర్వేదంలో  ఈ చెట్టు 'వాత దోషం' కోసం చెట్టు ప్రయోజనకరంగా పేర్కొనబడింది.(శరీరంలో చలనాన్ని మరియు గాలి నియంత్రిస్తుందని)

మర్రి చెట్టు ఒక వృక్షోపజీవి [ఎపిఫైటిక్] (ఒక మొక్క ఇంకొక మొక్క మీద పెరగడడం, హోస్ట్ మొక్క యొక్క పగులు లేదా చిన్న సందులో దాని విత్తనాల మొలకెత్తడం ద్వారా పెరుగుతుంది) మొక్క రకం. ఈ చెట్టు ఫికస్ జాతికి చెందినది. భారతదేశంలో కనిపించే మర్రి చెట్టు ఫైకస్ బెంఘాలెన్సిస్ (Ficus benghalensis), ఇది మన దేశపు జాతీయ వృక్షం. ఈ చెట్లు ప్రపంచంలోని ఉష్ణమండలాలు మరియు వేడి ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాలలో కూడా ఉంటాయి.

మర్రి చెట్టు ఆకులు పెద్దవిగా ఉంటాయి, దీర్ఘచతురస్రాకార ఆకారంలో మరియు నిగనిగలాడే పచ్చ రంగులో ఉంటాయి. బాగా పెరిగిన మర్రి చెట్లు, నేలమీదకు వేలాడుతూ ఉండే ఊడలను కలిగి ఉంటాయి, ఇంగ్లీషులో ప్రాప్ రూట్స్ లేదా ఏరియల్ రూట్స్ అని కూడా పిలుస్తారు.

ఈ ఊడలు బాగా పెరిగిన తర్వాత పెద్ద చెట్టు యొక్క బెరడును ప్రతిబింబించేలా ఉంటాయి, చిన్న చిన్న వేరు వేరు చెట్ల కలిసి గుంపుగా ఎదిగినట్టు కనిపిస్తాయి. కోలకతా బొటానికల్ గార్డెన్ లో ఉండే 'గ్రేట్ బన్యన్ ట్రీ' 250 సంవత్సరాల పూర్వం కంటే ముందుది మరియు అది అనేక ఊడలు కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న అతిపెద్ద చెట్టు ఇదే.

మర్రి చెట్టు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • శాస్త్రీయ నామం: ఫైకస్ బెంఘాలెన్సిస్ (Ficus benghalensis)
  • కుటుంబం: మోరెసీ (Moraceae)
  • సాధారణ పేరు: మర్రి చెట్టు, ఇంగ్లీష్ లో బన్యన్ ట్రీ, హిందీలో బార్గడ్,
  • సంస్కృత పేరు: న్యాయగ్రోద్, వాటా వ్రిఖ్షా
  • ఉపయోగించే భాగాలు: ఆకులు, కొమ్మలు, పండ్లు
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్టీర్ణం: ప్రపంచంలోని ఉష్ణమండల మరియు వేడి ఉష్ణోగ్రతలు కలిగిన ప్రాంతాలు
  1. మర్రి చెట్టు ఉపయోగాలు - Banyan tree uses in Telugu
  2. మర్రి చెట్టు యొక్క ఇతర ప్రయోజనాలు - Other benefits of the banyan tree in Telugu
  3. మర్రి చెట్టు యొక్క దుష్ప్రభావాలు - Side effects of the banyan tree in Telugu

భారతదేశంలో మర్రి ఒక సాధారణంగా కనిపించే చేట్టు. అనేక రకాల అంటువ్యాధులు/సంక్రమణలు మరియు వ్యాధుల చికిత్సలో మర్రి చెట్టు యొక్క సారాలు దాని ఔషధ లక్షణాల వల్ల చాలా ఉపయోగపడతాయి. మర్రి చెట్టు నుండి మనకు లభించే ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఉపయోగాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

  • జీర్ణ వ్యవస్థ కోసం: జీర్ణశయాంతర వ్యవస్థ మీద మర్రి చెట్టు అనేక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది విరేచనాల నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడే యాంటీమైక్రోబయల్ మరియు చికిత్సా లక్షణాలను (హీలింగ్ ప్రాపర్టీస్) కలిగి ఉంటుంది మరియు  మర్రి ఆకులలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ మలబద్దకాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
  • కీళ్ళనొప్పుల లక్షణాలను తగ్గిస్తుంది: మర్రి ఆకులు యాంటీఇన్ఫలమేటరీ  మరియు అనాల్జేసిక్ లక్షణాలను చూపిస్తాయి, ఇది ఆర్థరైటిస్ లక్షణాల నుండి ఉపశమనం కలిగించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది: మర్రి చెట్టు బెరడు సారాలను పారంపర్యంగా దాని రోగనిరోధక శక్తి పెంచే లక్షణాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సారంలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన ఇది జరుగుతుందని పరిశోధన అధ్యయనాలు సూచిస్తున్నాయి. వారు ఆక్సీకరణ నష్టం న్యూట్రలైజ్ చేసి తద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
  • యోని సంక్రమణను నయం చేస్తుంది: వజైనల్ వాష్ (యోనిని శుభ్రపరచేందుకు తయారు చేసే సారం) తయారు చేయడానికి మర్రి ఆకుల పొడిని నీటితో కలుపుతారు. ఇది యాంటీమైక్రోబయాల్ లక్షణాలను కలిగి ఉంటుంది తద్వారా అది వ్యాధికారక సూక్ష్మజీవుల పెరుగుదలను అణిచివేస్తుంది మరియు ల్యూకోరియా వంటి సాధారణ యోని ఇన్ఫెక్షన్ లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
  • చర్మ సంరక్షణ కోసం: మర్రి ఆకుల నుండి తయారుచేసిన సారాలు చర్మాన్ని మృదువుగా చేసే ప్రభావాలాను చూపుతాయి. కలబంద గుజ్జుతో  కలిపి దీనిని సమయోచితంగా ఉపయోగించినప్పుడు ఇది చర్మ అలెర్జీలను నిరోధిస్తుంది. పాలతో కలిపినప్పుడు, ఈ సారం మోటిమలు మరియు దద్దుర్లు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
  • మెదడు కోసం ప్రయోజనకరమైనది: మర్రి చెట్టు పండు ఒత్తిడిని తగ్గించడం మరియు ఆందోళన మరియు కుంగుబాటును నివారించడంలో సహాయం చేస్తుంది. మర్రి చెట్టు యొక్క సారాలు జ్ఞాపకశక్తిని పెంపొందించే మరియు పానిక్ ఎటాక్ సమయంలో మూర్ఛ యొక్క ప్రమాదాన్ని తగ్గించగల బయోలాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి.

జీర్ణ వ్యవస్థ కోసం మర్రి చెట్టు - Banyan tree for the digestive system in Telugu

జీర్ణశయ ప్రేగుల యొక్క అంటువ్యాధుల చికిత్సకు మర్రి చెట్టు సారాలును ఉపయోగం చాలా సాధారణం. మర్రి చెట్టు ఆకులు శక్తివంతమైన వైద్య లక్షణాలు మరియు యాంటీమైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి వీటి ద్వారా విరేచనాలు మరియు దీర్ఘకాలిక అతిసారం వంటి సమస్యలకు చికిత్స చేయవచ్చు. ఫైకస్ బెంఘాలెన్సిస్ ను ఒక ఆహార సప్లిమెంట్ గా  వాడటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఒక అధ్యయనం తెలిపింది. మర్రి చెట్టు యొక్క సారానికి (అది లేటెక్స్ [జిగురు] రూపంలో) ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మలబద్ధకం యొక్క చికిత్సలో ఉపయోగపడుతుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

నోటి ఆరోగ్యానికి మర్రి చెట్టు - Banyan tree for oral health in Telugu

మర్రి చెట్టు వేరుల యొక్క సారం దంత క్షయం మరియు చిగుళ్ల రుగ్మతలకు బాధ్యత వహించే అనేక బాక్టీరియాలపై విశిష్టమైన యాంటీబాక్టీరియల్ చర్యలను చూపిస్తుంది. వీటిని కలిగించే రెండు ప్రధాన బాక్టీరియా జాతులు లాక్టోబాసిల్లస్ (Lactobacillus) మరియు స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ (Streptococcus mutans). మర్రి చెట్టు వేరుల సారం టూత్ పేస్టుతో కలిపి జంతువు నమూనాల మీద పరీక్షించినప్పుడు అది సమర్ధవంతమైన జెర్మీసిడల్ (సూక్ష్మజీవులను నాశనం చేసే లేదా చంపే సామర్ధత) చర్య చూపించినట్టు ఒక అధ్యయనం తెలిపింది. కాబట్టి నోటి ఆరోగ్యం మరియు పరిశుభ్రత కోసం మర్రి చెట్టు యొక్క ఉపయోగం ప్రయోజనకరంగా ఉంటుంది.

వాపు మరియు నొప్పి కోసం మర్రి చెట్టు - Banyan tree for inflammation and pain in Telugu

మర్రి చెట్టు పారంపరంగా దాని యాంటీఇన్ఫలమ్మెటరీ (ఇన్ఫలమేషన్ కు వ్యతిరేకంగా ఉంటుంది అంటే, వాపు, నొప్పి మరియు ఎరుదనం) మరియు అనాల్జేసిక్ (నొప్పి నివారణ) లక్షణాల కోసం ఉపయోగించబడుతుంది. ఆర్థరైటిస్ వంటి వ్యాధుల వలన కలిగే వాపుకు వ్యతిరేకంగా మర్రి చెట్టు ఆకు సారం యొక్క ఉపయోగం నిరూపించబడింది. మర్రి చెట్టు యొక్క సజల సారానికి (aqueous extract)  మొర్ఫిన్ వలే నొప్పిని తగ్గించగల సామర్థత ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. అయితే, ఈ విషయంలో మర్రి చెట్టు సారం యొక్క సంపూర్ణ సామర్థతను గుర్తించేందుకు మరిన్ని ఇన్ వివో అధ్యయనాలు అవసరం.

రోగనిరోధక వ్యవస్థ కోసం మర్రి చెట్టు - Banyan tree for the immune system in Telugu

భారతదేశ జానపద వైద్యంలో ఫైకస్ బెంఘాలెన్సిస్ సామాన్యముగా ఉపయోగించబడుతుంది. మర్రి చెట్టు బెరడు నుండి తీసిన సారం రోగనిరోధక వ్యవస్థను పెంచే ఒక మంచి ఏజెంట్. ఈ సారం అనేక బయోఆక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. ఈ బయోఆక్టివ్ సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి మరియు అవి ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చెయ్యగల సామర్థ్యం కలిగి ఉంటాయి (ఫ్రీ రాడికల్స్ శరీర అంతర్గత అవయవాలకు నష్టం కలిగిస్తాయి). అవి రోగనిరోధక వ్యవస్థను మురుగుపరచి తద్వారా వ్యాధులను నిరోధించడానికి సహాయం చేస్తాయి.

(మరింత సమాచారం: రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు)

యోని సంక్రమణ చికిత్స కోసం మర్రి చెట్టు - Banyan tree for vaginal infection treatment in Telugu

యోని సంక్రమణ యొక్క చికిత్సలలో, ప్రత్యేకించి ల్యుకోరియా యొక్క చికిత్సలో మర్రి చెట్టు యొక్క ఆకులు మరియు సారం యొక్క ఉపయోగం గుర్తిచబడింది. యోని ఇన్ఫెక్షన్లు సాధారణంగా యోని యొక్క మైక్రోఫ్లోరా వలన సంభవిస్తుంది. మర్రి చెట్టు సారం యాంటీమైక్రోబయాల్ చర్యను కలిగి ఉంటుంది మరియు యోని అంటువ్యాధుల చికిత్సకు చాలా ఉపయోపడుతుంది. మర్రి చెట్టు బెరడు లేదా ఆకుల పొడిని నీటిలో కలిపి వజైనల్ వాష్ ను తయారు చేయవచ్చు, అది ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగపడుతుంది.

చర్మ సంరక్షణ కోసం మర్రి చెట్టు - Banyan tree for skin care in Telugu

మర్రి చెట్టు ఆకుల మరియు బెరడు సారం చర్మ సంరక్షణా లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఈ సారానికి అనేక అలెర్జీ కారకాలు కలిగించే విషపూరితమైన ప్రభావాలను నిరోధించే సామర్ధ్యం ఉంటుంది మరియు ఒక ఉపశమన భావనను అందిస్తుంది. దీనిని చర్మ నస్టాన్ని నివారించడానికి కూడా ఉపయోగిస్తారు.

మొటిమలు మరియు దద్దుర్లు వంటి సమస్యలకు చికిత్స చేయడానికి వెచ్చని పాలలో మర్రి చెట్టు యొక్క ఆకు సారాన్ని కలిపి ఒక మూలికా పానీయంగా  తయారు చేసి ఉపయోగించవచ్చు. చర్మవ్యాధి నిపుణులు మర్రి చెట్టు ఆకులు మరియు కలబంద గుజ్జు నుండి తయారు చేసిన మిశ్రమాలను చర్మ ఎలర్జీలకు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు సిఫారసు చేస్తారు. మర్రిచెట్టు యొక్క సజల సారాలకు (aqueous extracts) గాయాలను నయం చేయగల సామర్థ్యం ఉంటుంది మరియు తరచుగా వాటిని చికిత్సలలో ఉపయోగిస్తారు.

మధుమేహం కోసం మర్రి చెట్టు - Banyan tree for diabetes in Telugu

ఆధునిక ప్రపంచంలో చాలామందిని ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య మధుమేహం. మధుమేహ చికిత్స కోసం మర్రి చెట్టు పదార్ధాల ఉపయోగం చాలా కాలం నుండి ఉంది. మధుమేహం మరియు ఇతర దీర్ఘకాలిక రుగ్మతల చికిత్స కోసం తయారు చేసే అనేక మందులలో మర్రి చెట్టు సారాలలో ఉండే బయోఆక్టివ్ సమ్మేళనాలు ఉపయోగించబడుతున్నాయి.

ఈ సమ్మేళనాలు శక్తివంతమైన ఔషధ లక్షణాలను కలిగి ఉన్నాయని మరియు మధుమేహ నిర్వహణ కోసం వీటిని ఉపయోగించి ఔషధాలను అభివృద్ధి చేయవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. ఏదేమైనా, ఈ సమ్మేళనాలను సరిగ్గా బయటకు వెలికి తీయడానికి మరియు ఒక సంభావ్య ఔషధంగా వాటి భద్రతను స్థాపించడానికి మరింత శాస్త్రీయ పరిశోధన అవసరం.

మెదడు కోసం మర్రి చెట్టు - Banyan tree for the brain in Telugu

మర్రి చెట్టు యొక్క వివిధ భాగాలను అనేక నరాల సంభందిత సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. మర్రి చెట్టు పండ్లలో ఉండే సెరోటోనిన్ అనే సమ్మేళనం ఆందోళన మరియు కుంగుబాటుకు  వ్యతిరేకంగా పనిచేస్తుందని కనుగొనబడింది. ఇంకా అధ్యయనాలు మర్రి చెట్టు సారాలు కండర కణాల సడలింపుకు (relaxation of the muscle cells) సహాయపడతాయని  కూడా కనుగొన్నారు. వీటిలోని బయోయాక్టీవ్ సమ్మేళనాలు జ్ఞాపకశక్తిని పెంపొందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు పానిక్ ఎటాక్ సమయంలో మూర్ఛ సంభవించే ప్రమాదాన్ని కూడా నియంత్రిస్తాయి.

కొలెస్ట్రాల్ కోసం మర్రి చెట్టు - Banyan tree for cholesterol in Telugu

మర్రి చెట్టు యొక్క ఆకుల సారం తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా ఎల్.డి.ఎల్ (చెడు కొలెస్ట్రాల్) స్థాయిలను తగ్గించి అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా హెచ్.డి.ఎల్ (మంచి కొలెస్ట్రాల్) స్థాయిలను పెంచుతుందని కనుగొనబడింది. మర్రి చెట్టు యొక్క ఆకుల సారం కలిగి మందుల యొక్క ఉపయోగం ద్వారా రక్తంలోని లిపిడ్ స్థాయిలు గణనీయంగా తగ్గాయని పరిశోధనలలో కనుగొన్నారు.

(మరింత సమాచారం: అధిక కొలెస్ట్రాల్ నిర్వహణ)

ఆరోగ్య విషయంలో అనేక ఉపయోగాలను కలిగి ఉండడమే కాక, ఇతర విషయాలలో కూడా మర్రి చెట్టు ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొనబడింది. మర్రి చెట్టు యొక్క వేర్వేరు భాగాల వలన కలిగే ఇతర ప్రయోజనాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

  • మర్రి చెట్టు ఆకు సారాలకి లార్విసిడల్ లక్షణాలు (లార్వాలను చంపగల) ఉంటాయి తద్వారా ఇవి దోమలకు వ్యతిరేకంగా పోరాడగలవు మరియు మలేరియా మరియు ఎన్సెఫాలిటిస్ వంటి దోమల వలన సంభవించే వ్యాధులను నిర్ములించగలవు.
  • మర్రి చెట్టు యొక్క ఊడల సారాలు అనేక బయోయాక్టీవ్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి ఇవి బాక్టీరియా మరియు ఫంగస్ కు వ్యతిరేకంగా పోరాడడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి.అందువలన వీటిని వ్యాధుల వ్యాప్తిని నియంత్రిచడానికి ఉపయోగించవచ్చు.
  • మర్రి చెట్టు వాయు కాలుష్యం కలిగించే కారకాలకు వ్యతిరేకంగా పని చేసి వాయు కాలుష్యం అధికముగా ఉండే ప్రాంతాలలో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.

దోమల వలన కలిగే వ్యాధులకు వ్యతిరేకంగా మర్రి చెట్టు - Banyan tree against mosquito-borne diseases in Telugu

మర్రి చెట్టు యొక్క ఆకు సారానికి కులెక్స్ ట్రైటినియోరిహింకస్ (Culex tritaeniorhynchus) మరియు అనోఫెల్స్ సబ్పిక్టస్ (Anopheles subpictus) వంటి దోమల జాతులకు వ్యతిరేకంగా లార్విసిడల్ లక్షణాలు (లార్వాలను చంపగల) ఉంటాయి. ఈ దోమలు ఎన్సెఫాలైటిస్ మరియు మలేరియా వంటి వ్యాధుల వాహకాలుగా పనిచేస్తాయి. మర్రి చెట్టు ఆకులు యొక్క మిథనాలిక్ సారం దోమల జాతుల నియంత్రణకు సమర్థవంతమైనదిగా గుర్తించబడింది, ఇది దోమల వలన కలిగే వ్యాధులను నిరోధించడానికి మరియు నియంత్రించడానికి సహాయపడుతుంది.

యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గా మర్రి చెట్టు - Banyan tree as anti-bacterial and anti-fungal in Telugu

మర్రి చెట్టు యొక్క ఊడలు లేదా ప్రాప్ రూట్స్ నుండి సేకరించిన సారాలు, యాంటీ-బాక్టీరియా మరియు యాంటీ-ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఊడల సారాలలో అనేక బయోయాక్టీవ్ సమ్మేళనాలు ఉంటాయి, అవి అనేక రకాల ఫంగస్ మరియు బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. మర్రి చెట్టు ఊడల యొక్క ఈ లక్షణం అనేక వ్యాధుల వ్యాప్తిని నియంత్రిచడంలో మరియు ఆహార సంరక్షణలో బయోకంట్రోల్ ఎజెంట్గా ఉపయోగించటానికి ఒక సమర్ధవంతమైన చర్యను కలిగి ఉంటుంది.

(మరింత సమాచారం: సంక్రమణ చికిత్స)

కాలుష్య నియంత్రణ కోసం మర్రి చెట్టు - Banyan tree for pollution control in Telugu

కాలుష్య నియంత్రణా ఎజెంట్గా కూడా మర్రి చెట్టును ఉపయోగించవచ్చు. వాయు కాలుష్యం కలిగించే కారకాలకు  వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యం మర్రి చెట్టుకు ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. మర్రి చెట్టు యొక్క ఈ లక్షణం, వాయు కాలుష్యం అధిక స్థాయిలో ఉండే ప్రాంతాలలో గాలి నాణ్యతను కాపాడటానికి మంచి ఏజెంట్గా పనిచేస్తుంది. అటువంటి ప్రాంతంలో కలిగే శ్వాస రుగ్మతలు మరియు రోగాల నివారణకు ఇది సహాయపడుతుంది.

(మరింత సమాచారం: క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి చికిత్స)

మర్రి చెట్టు ఆకు సారాలు ఉపయోగించి తయారుచేసిన మందులు మరియు మిశ్రమాలు ఇప్పటి వరకు ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించినట్లు కనుగొనబడలేదు. ఈ చెట్టు యొక్క సారాలను కలిగి ఉన్న ఔషధ ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు దుష్ప్రభావాలు కలిగినట్లు ఎటువంటి నివేదికలు లేవు.

అయినప్పటికీ, గర్భిణీలు మరియు చనుబాలిచ్చే మహిళలపై మర్రి చెట్టు సారాల ప్రభావం గురించి అధ్యయనాలు పెద్దగా నిర్వహించబడలేదు. కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా, చనుబాలిచ్చే మహిళలు లేదా గర్భిణీ స్త్రీలు ఏవైనా దుష్ప్రభావాల యొక్క అవకాశాలను నివారించడానికి మర్రి చెట్టు సారం యొక్క ఉపయోగాన్ని నివారించాలని సూచించబడింది.


Medicines / Products that contain Banyan tree

వనరులు

  1. Manikandan V et al. Green synthesis of silver oxide nanoparticles and its antibacterial activity against dental pathogens. 3 Biotech. 2017 May;7(1):72. PMID: 28452017
  2. Shi Y et al. The genus Ficus (Moraceae) used in diet: Its plant diversity, distribution, traditional uses and ethnopharmacological importance. J Ethnopharmacol. 2018 Nov 15;226:185-196. PMID: 30055253
  3. Rajdev K et al. Antinociceptive Effect of Ficus bengalensis Bark Extract in Experimental Models of Pain. Cureus. 2018 Mar 2;10(3):e2259. PMID: 29725562
  4. Bhanwase AS, Alagawadi KR. Antioxidant and Immunomodulatory Activity of Hydroalcoholic Extract and its Fractions of Leaves of Ficus benghalensis Linn. Pharmacognosy Res. 2016 Jan-Mar;8(1):50-5. PMID: 26941536
  5. Govindarajan M, Sivakumar R, Amsath A, Niraimathi S. Mosquito larvicidal properties of Ficus benghalensis L. (Family: Moraceae) against Culex tritaeniorhynchus Giles and Anopheles subpictus Grassi (Diptera: Culicidae). Asian Pac J Trop Med. 2011 Jul;4(7):505-9. PMID: 21803298
  6. Pathak KV, Keharia H. Characterization of fungal antagonistic bacilli isolated from aerial roots of banyan (Ficus benghalensis) using intact-cell MALDI-TOF mass spectrometry (ICMS). J Appl Microbiol. 2013 May;114(5):1300-10. PMID: 23387377
  7. Waheed M et al. Dermatoprotective effects of some plant extracts (genus Ficus) against experimentally induced toxicological insults in rabbits. Toxicol Ind Health. 2015 Nov;31(11):982-9. PMID: 23589405
  8. Deepa P, Sowndhararajan K, Kim S, Park SJ. A role of Ficus species in the management of diabetes mellitus: A review. J Ethnopharmacol. 2018 Apr 6;215:210-232. PMID: 29305899
  9. Panday DR, Rauniar GP. link] BMC Complement Altern Med. 2016 Nov 3;16(1):429. PMID: 27809820
  10. De B, Bhandari K, Katakam P, Mitra A. In Vivo Hypoglycemic Studies of Polyherbal Phytoceuticals, Their Pharmacokinetic Studies and Dose Extrapolation by Allometric Scaling. Curr Drug Discov Technol. 2017;14(4):277-292. PMID: 28359233
  11. Mukherjee A, Agrawal M. Pollution Response Score of Tree Species in Relation to Ambient Air Quality in an Urban Area. Bull Environ Contam Toxicol. 2016 Feb;96(2):197-202. PMID: 26508430
  12. Vipin Kumar Garg, Sarvesh Kumar Paliwal. Wound-healing activity of ethanolic and aqueous extracts of Ficus benghalensis. J Adv Pharm Technol Res. 2011 Apr-Jun; 2(2): 110–114. PMID: 22171302
Read on app