యాంటీఆక్సిడెంట్లు అనేవి ఫ్రీ రాడికల్స్ వల్ల కణాలకు కలిగే నష్టాన్ని నిరోధించే లేదా ఆలస్యం చేసే పదార్థాలు. ఇవి సహజంగా చాలా పండ్లు మరియు కూరగాయలలో కనిపిస్తాయి మరియు సింథటిక్ సప్లిమెంట్లలో కూడా ఉంటాయి. ఇవి సాధారణంగానే సహజ ఆహారాలలో అధిక మొత్తాలలో ఉన్నందున, ఒక ఆహార సప్లీమెంట్ గా చాలా అరుదుగా అవసరం అవుతుంటాయి.

బీటా కెరోటిన్, విటమిన్ ఇ మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు యాంటీఆక్సిడెంట్ల యొక్క ఉత్తమ వనరులు. యాంటీఆక్సిడెంట్ల యొక్క ప్రయోజనాలు, పాత్ర మరియు చర్యలతో పాటు వీటి యొక్క ఆహార వనరుల గురించి మరిన్ని వివరాలు ఈ వ్యాసంలో చర్చించబడ్డాయి.

  1. యాంటీఆక్సిడెంట్లు మరియు ఫ్రీ రాడికల్స్ అంటే ఏమిటి? - What are antioxidants and free radicals in Telugu
  2. యాంటీఆక్సిడెంట్ ఆహారాలు - Antioxidant foods in Telugu
  3. యాంటీఆక్సిడెంట్ల ప్రయోజనాలు - Antioxidants benefits in Telugu
  4. యాంటీఆక్సిడెంట్ టీ - Antioxidant tea in Telugu
  5. యాంటీఆక్సిడెంట్ల దుష్ప్రభావాలు - Side effects of antioxidants in Telugu

ఫ్రీ రాడికల్ అనేది ఒక అణువు, దీనికి అదనపు జతచేలేని (unpaired) ఎలక్ట్రాన్‌ ఉంటుంది, కాబట్టి ఒక జతగా ఏర్పడటానికి ఇది అత్యంత రియాక్టివ్‌గా ఉంటుంది. దీన్ని సాధించడానికి, ఇది శరీర కణాలతో చురుకుగా ప్రతిస్పందించి వాటికి నష్టం కలిగిస్తుంది. దీనిని తరచుగా ఆక్సిడేటివ్ డ్యామేజ్ అని పిలుస్తారు ఈ నష్టం శరీరంలోని వివిధ అవయవాలకు మరియు వ్యవస్థలకు హానికరమైనది మరియు అనేక వ్యాధులకు ఒక ప్రధాన కారణం.

ఫ్రీ రాడికల్స్ శరీరం యొక్క సాధారణ జీవక్రియ ప్రక్రియల (metabolic processes) నుండి లేదా పర్యావరణ కాలుష్య కారకాలు, రసాయనాలు, పురుగుమందుల పొగ లేదా యువి (UV) కిరణాలు, ఎక్స్-రేలు వంటి హానికర కిరణాలు వంటి కొన్ని రకాల కారకాలకు గురికావడం నుండి ఉత్పన్నమవుతాయి. ఇవి అధిక మొత్తంలో జంక్ ఫుడ్స్ తీసుకోవడం వంటి అనారోగ్య ఆహారవిధానాలకు ప్రతిస్పందనగా కూడా ఏర్పడతాయి.

ఇవి శరీర కణాలతో, ముఖ్యంగా చర్మ కణాలతో చురుకుగా ప్రతిస్పందిస్తాయి, చర్మం యొక్క అకాల వృద్ధాప్యా లక్షణాలకు మరియు ముడుతలకు కారణమవుతాయి. ఫ్రీ రాడికల్స్ జుట్టుకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి, అది జుట్టు నెరిసిపోవడం లేదా జుట్టు రాలడం ద్వారా ప్రతిబింబిస్తుంది.

వయస్సు-సంబంధిత అలోపేసియా (జుట్టు రాలడం వల్ల ఏర్పడిన బట్టతల అతుకులు) కూడా ఆక్సీకరణ ఒత్తిడి నుండి కలిగిన హాని వల్లనే మొదలవుతుంది. అందువలన, వృద్ధాప్య లక్షణాల ప్రక్రియలో ఆక్సీకరణ ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తుందని సరిగ్గా చెప్పబడింది.

(మరింత చదవండి: బట్టతల చికిత్స)

మానవ శరీరంపై ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఇతర ప్రభావాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

ఫ్రీ రాడికల్స్ ఏర్పడటం అనేది ఒక అనివార్యమైన ప్రక్రియ. అయితే, ఆహారంలో యాంటీఆక్సిడెంట్ల పరిమాణాన్ని మెరుగుపరచడం ద్వారా ఫ్రీ రాడికల్స్ పై శరీరం యొక్క ప్రతిస్పందనను సవరించవచ్చు.

కొన్ని ఆహార పదార్ధాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌కు అదనపు ఎలక్ట్రాన్‌ను అందిస్తాయి, ఇది అవి ఒక జతగా ఏర్పడటానికి సహాయపడతాయి, తద్వారా వాటి కెమికల్ ఇన్స్టెబిలిటీను తగ్గిస్తుంది. అందువలన యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ యొక్క చర్యలను తగ్గించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు శరీర కణాలకు కలిగే ఆక్సీకరణ నష్టాన్ని నివారించగలవు, ఈ చర్య వాటిని రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా చేస్తుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹712  ₹799  10% OFF
BUY NOW

యాంటీఆక్సిడెంట్లు కింది ఆహారాలలో తగినంత అధిక మొత్తాలలో ఉంటాయి. వాటిని నుండి గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందటానికి అటువంటి ఆహారాల పరిమాణాన్ని పెంచుకోవచ్చు. అయితే, ఉత్తమమైన ఆహార ఎంపికల గురించి మీకు సూచించడానికి పోషకాహార నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం అవసరం.

  • విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు:
  • విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాలు
    • సాల్మన్
    • గుడ్లు
    • చేప నూనె
    • సీఫుడ్లు
    • మాంసం
    • లీన్ మెట్
    • కాలేయం
  • విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు
    • పసుపు, ఆకుపచ్చ మరియు ఎరుపు రంగు క్యాప్సికమ్, అలాగే క్యారెట్ వంటి పిగ్మెంటెడ్ కూరగాయలు
    • బచ్చలికూర, కాలే మరియు బ్రోకలీ వంటి ఆకుకూరలు
    • బొప్పాయి
    • అప్రికోట్
    • పాలు మరియు పాల ఉత్పత్తులు (మరింత చదవండి: విటమిన్ ఎ మూలాలు)
  • యాంటీఆక్సిడెంట్స్ యొక్క ఇతర వనరులు

మానవ ఆరోగ్యం పై, ముఖ్యంగా చర్మం మీద యాంటీఆక్సిడెంట్లకు విస్తారమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి, అది అనేక రుగ్మతలు మరియు ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది. యాంటీఆక్సిడెంట్ల యొక్క కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింద చర్చించబడ్డాయి:

  • చర్మం కోసం: ముడతలు, గీతలు మరియు వృద్ధాప్యం యొక్క ఇతర సంకేతాలను ఆలస్యం చేయడంలో యాంటీఆక్సిడెంట్లు చర్మం మీద లోతైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అవి ఫోటోప్రొటెక్షన్ (సూర్యుడి నుండి రక్షణ కలిపించడం) మరియు గాయపు మరమ్మత్తు (repair) లో కూడా పాల్గొంటాయి.
  • జుట్టు కోసం: యాంటీఆక్సిడెంట్లు జుట్టు కోసం అపారమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. జుట్టు రాలడాన్ని మరియు అకాలంగా జుట్టు నెరవడాన్ని నివారించడంలో ఇవి సహాయపడతాయి, అవి జుట్టు దెబ్బతినకుండా కాపాడుతాయి.
  • కళ్ళ కోసం: యాంటీఆక్సిడెంట్లు మీ కళ్ళ పై ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగి ఉంటాయి, ఎందుకంటే అవి వయస్సు-సంబంధిత మాక్యులర్ డిజనెరేషన్ ప్రమాదాన్ని దాదాపు 25% తగ్గిస్తాయి. ఇవి కంటిశుక్లం ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి, తద్వారా వృద్ధులలో వచ్చే అంధత్వం ప్రమాదం తగ్గుతుంది.
  • మెదడు కోసం: యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి మరియు నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి, ఈ ఆక్సీకరణ ఒత్తిడి వృద్ధులలో న్యూరోడిజనరేషన్ మరియు జ్ఞాపకశక్తిని కోల్పోవటానికి కారణమవుతుంది. యాంటీఆక్సిడెంట్లు అల్జీమర్స్ యొక్క వ్యాధి సంభావ్యతలో పాల్గొనే బీటా-అమిలాయిడ్ ప్రోటీన్ స్థాయిలను తగ్గిస్తాయని తద్వారా అల్జీమర్స్ ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు తెలిపాయి.
  • బరువు తగ్గడానికి: కొవ్వుల యొక్క జీవక్రియలో సహాయపడటం ద్వారా, ఆహారంలోని యాంటీఆక్సిడెంట్లు బరువు తగ్గే ప్రక్రియకు సహాయపడతాయి.
  • ఇతర ప్రయోజనాలు: అవయవ నష్టాన్ని తగ్గించడం ద్వారా, యాంటీఆక్సిడెంట్లు కొరోనరీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ నివారణలో కూడా యాంటీఆక్సిడెంట్ల పాత్ర నిరూపించబడింది.

చర్మానికి యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు - Antioxidant benefits for skin in Telugu

చర్మ ఆరోగ్యం పై యాంటీఆక్సిడెంట్ల యొక్క ప్రయోజనాలు అపారమైనవి. చర్మంపై గీతలు, ముడతలు మరియు వృద్ధాప్యం యొక్క ఇతర సంకేతాలను తగ్గించడానికి మరియు ఆలస్యం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఏ రకమైన యాంటీఆక్సిడెంట్లు ఈ ప్రభావాలు కలిగిస్తాయో మరియు వాటికీ సంభందించిన మెకానిజం (యంత్రాగాన్ని) గురించి తెలుసుకోవడానికి అనేక అధ్యయనాలు జరిగాయి. వృద్ధాప్య లక్షణాల నుండి చర్మాన్ని రక్షించడానికి పోషకరమైన యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా విటమిన్ ఇ, విటమిన్ సి మరియు కెరోటినాయిడ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని మరియు ఇవి ఫోటోప్రొటెక్టివ్ ప్రభావాన్ని (యువి కిరణాల నుండి రక్షిస్తుంది) కూడా కలిగి ఉంటాయని కనుగొనబడింది .

విటమిన్ ఇ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు చర్మపు చికాకును తగ్గించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇది చర్మంపై ఉపశాంతి (soothing) ప్రభావాలను కలిగి ఉంటుంది మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. కొల్లాజెన్ చర్మం యొక్క ప్రధాన నిర్మాణ ప్రోటీన్, ఇది చర్మపు ఎలాస్టిసిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు పుండ్ల/గాయపు మరమ్మత్తు (repair) మరియు వైద్యంలో కూడా పాల్గొంటుంది. యాంటీఆక్సిడెంట్ ఆహారాలు చర్మ ఆరోగ్యాన్ని విస్తారంగా మెరుగుపరుస్తాయి, అందువల్ల వీటిని ఆహారంలో ముఖ్యమైన భాగంగా చేర్చడం మంచిది.

విటమిన్ సి మరియు విటమిన్ ఇ యొక్క ప్రభావాలు విడివిడిగా కంటే మిశ్రమంగా (కలగలిసినప్పుడు) ఉన్నపుడు అధిక ప్రయోజనకరంగా ఉంటాయని అధ్యయనాలు కనుగొన్నాయి. అందుకే చికిత్సలలో ఈ రెండింటి కలయికను కలిగి ఉన్న చర్మ ఆయింట్మెంట్ ఎక్కువగా సిఫార్సు చేయబడుతుంది.

(మరింత చదవండి: మొటిమల చికిత్స)

జుట్టుకు యాంటీఆక్సిడెంట్లు - Antioxidants for the hair in Telugu

అతినీలలోహిత (ultraviolet rays) సూర్యరశ్మి, పర్యావరణ కాలుష్య కారకాలు, రసాయనాలు మరియు పొగ వంటి వివిధ నష్టపరిచే (డెమేజింగ్) ఏజెంట్లకు జుట్టు ఏదోవిధంగా రోజు గురవుతూ ఉంటుంది. UV-A సూర్య కిరణాలు ఫ్రీ రాడికల్స్ స్థాయిని పెంచుతాయి మరియు UV-B సూర్య కిరణాలు జుట్టు యొక్క మెలనిన్ కంటెంట్‌ను తగ్గిస్తాయి. జుట్టు మరియు చర్మం యొక్క రంగుకు బాధ్యత వహించే ఒక పిగ్మెంట్ మెలనిన్. ఈ రెండు ప్రభావాలు జుట్టు నెరవడానికి  దారితీస్తాయి.

అనేక అధ్యయనాల ప్రకారం, యాంటీఆక్సిడెంట్లు సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాల వల్ల కలిగే నష్టాన్ని మరియు జుట్టు నెరవడం లేదా రాలడం వంటి వయస్సు సంబంధిత మార్పులను తగ్గిస్తాయని కనుగొనబడింది. జుట్టు యొక్క మెరుపు మరియు ఆకారాన్ని కూడా ఇవి మెరుగుపరచుతాయని కూడా కనుగొనబడింది. యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాలను మీ ఆహారవిధానంలో చేర్చడం వలన అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.

కంటికి యాంటీఆక్సిడెంట్లు - Antioxidants for the eye in Telugu

ప్రపంచవ్యాప్తంగా అంధత్వ సమస్యకు వయసు-సంబంధిత మాక్యులర్ డిజెనరేషన్ ఒక ప్రధాన కారణం. విటమిన్ ఎ యొక్క లోపం వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్ (age-related macular degeneration, AMD) ప్రమాదాన్ని పెంచుతుంది. విటమిన్లు మరియు ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్ని మరియు దాని సంబంధిత దృష్టి లోపాన్ని కూడా నిరోధించవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చని పరిశోధకులు సూచించారు.

యాంటీఆక్సిడెంట్లు వయస్సు-సంబంధిత మాక్యులార్ డీజెనరేషన్ ప్రమాదాన్ని 25% తగ్గిస్తాయని కనుగొనబడింది. రోజులో పండ్లు మరియు కూరగాయలను కనీసం ఐదు సార్లు అలాగే వాటితో పాటు నట్స్ మరియు విత్తనాలను రెండు సార్లు తీసుకోవడం వలన ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సిఫార్సు చేయబడింది. వృద్ధులలో అంధత్వానికి కారణమయ్యే మరో కారణమైన కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.

మెదడుకు యాంటీఆక్సిడెంట్లు - Antioxidants for the brain in Telugu

శరీరంలో కీలకమైన అవయవమైన మెదడుకు కూడా ఫ్రీ రాడికల్స్ హాని కలిగిస్తాయి. వయస్సుతో పాటు శరీరంలో ఫ్రీ రాడికల్స్ శాతం క్రమంగా పెరగడం వలన మానవ శరీరం యొక్క రక్షణ యంత్రములు పనిచేయడంలో విఫలమవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ మెదడుతో చాలా చురుగ్గా స్పందిస్తాయి మరియు మెదడు పనితీరును ప్రభావితం చేసి జ్ఞాపకశక్తి మరియు మేధాశక్తిని కూడా దెబ్బతీస్తాయి.

యాంటీఆక్సిడెంట్, ముఖ్యంగా విటమిన్ ఇ ఆహారాల లోపం, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతుంది, ఇది వృద్ధులలో జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో  సంబంధం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. యాంటీఆక్సిడెంట్లు ఈ రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల యొక్క  ప్రభావాలను ఎదుర్కోగలవు మరియు మెదడుపై వాటి హానికరమైన ప్రభావాలను కూడా తిప్పికొట్టగలవు. ఇది వ్యక్తులలో జ్ఞాపకశక్తి లోపం తగ్గడానికి సహాయపడవచ్చు.

కొన్ని యాంటీఆక్సిడెంట్లు అల్జీమర్స్ వ్యాధికి కారణమయ్యే బీటా-అమిలాయిడ్ అనే సమ్మేళనం యొక్క స్థాయిలను తగ్గిస్తాయి. కాబట్టి, ముఖ్యంగా వయస్సు పెరుగుతున్నప్పుడు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల స్థాయిని పెంచమని సిఫార్సు చేయబడుతుంది.

గుండెకు యాంటీఆక్సిడెంట్లు - Antioxidants for the heart in Telugu

అథెరోస్క్లెరోసిస్ మరియు ఇతర హృదయ రుగ్మతలకు ఆక్సీకరణ ఒత్తిడి ఒక ప్రధాన కారణం. యాంటీఆక్సిడెంట్స్ తగినంతగా తీసుకోకపోవడం ఈ ఒత్తిడికి ఒక కారణమని తేలింది, ఇది గుండెకు హాని జరగడానికి కారణమవుతుంది. కరోనరీ గుండె జబ్బులను నివారించడంతో  విటమిన్ ఇ మరియు సిల యొక్క చర్య కనుగొనబడింది. అయితే, ఈ పరిశోధనలను నిర్దారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.

వృద్ధులకు యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు - Antioxidant benefits for the elderly in Telugu

ఫ్రీ రాడికల్స్ సెల్యులార్ (కణలా) స్థాయిలో నష్టాన్ని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు డీఎన్ఏ మార్పులకు కూడా కారణమవుతాయి. అయితే, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే అధిక నష్టానికి వ్యతిరేకంగా పోరాడటానికి శరీరంలో యాంటీఆక్సిడెంట్ ఎంజైములు ఉన్నప్పటికీ, వృద్ధుల శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది.

వయస్సు పెరగడంతో పాటు ప్రొటెక్టీవ్ ఎంజైమ్‌లు మరియు రక్షణ యంత్రాంగాలు తగ్గడం దీనికి కారణం కావచ్చు. దీనిని ఎదుర్కోవటానికి, ఆహారంలో యాంటీఆక్సిడెంట్ల స్థాయిని పెంచాలని సిఫార్సు చేయబడింది, ఇది ముడుతలు వంటి వయస్సు-సంబంధిత మార్పులను తగ్గించడం ద్వారా సానుకూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను తగ్గిస్తాయి - Antioxidants reduce cancer in Telugu

యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్ నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్ వంటి రియాక్టివ్ ఆక్సిజన్ జాతులు చర్మ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్, కాలేయ క్యాన్సర్, నోటి క్యాన్సర్ మరియు లుకేమియా వంటి అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదంతో ముడిపడి ఉన్నాయి. ఈ రకమైన క్యాన్సర్ల  యొక్క సంభావ్యత భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ, ఒక సాధారణ కణాన్ని కణితి (ట్యూమర్) కణంగా ఆక్సీకరణ ఒత్తిడి వేగంగా మార్చగలదు.

యాంటీఆక్సిడెంట్లు రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల స్థాయిలను తగ్గిస్తాయి కాబట్టి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా వాటికి పాత్ర ఉంటుంది. విటమిన్ సి మరియు విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్ల యొక్క  క్యాన్సర్-రక్షిత ప్రభావాలకు కొన్ని పరిశోధనలు కూడా మద్దతునిచ్చాయి. ఏదేమైనా, కొన్ని పరిశోధనలు మిశ్రమ ఫలితాలు అందించాయి మరియు ఖచ్చితమైన అన్వేషణను స్థాపించలేము. అయినప్పటికీ, ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలను తీసుకోవడం మంచిది, ఎందుకంటే అవి సాధారణంగానే క్యాన్సర్ నివారణ చర్యలను కలిగి ఉంటాయి.

బరువు తగ్గడానికి యాంటీఆక్సిడెంట్లు - Antioxidants for weight loss in Telugu

ఇది భారత జనాభాలో దాదాపు 5% మందిని ప్రభావితం చేసిన ఊబకాయం, ఒక ప్రధాన ఆందోళనకరమైన సమస్య. ఊబకాయం యొక్క ప్రధాన ప్రమాద కారకాలు అనారోగ్యకరమైన ఆహారం మరియు శారీరక శ్రమ లేకపోవడం అని నిర్ధారించబడింది. ఊబకాయమే ఒక పెద్ద సమస్య అయితే, ఇది వివిధ హృదయ సంబంధ రుగ్మతలు మరియు మధుమేహా సమస్యలకు కూడా ఒక బాగా తెలిసిన ప్రమాద కారకం.

విటమిన్ సి అధికంగా ఉండే కొన్ని యాంటీఆక్సిడెంట్ ఆహారాలు, కొవ్వుల యొక్క జీవక్రియకు సహాయపడడం వలన అవి బరువు నిర్వహణలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది. ఈ ఆహారాలు జీవక్రియను పెంచడంలో కూడా సహాయపడతాయి, ఇది బరువు తగ్గే ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది.

విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు కాకుండా, విటమిన్ ఇ, గ్రీన్ టీ, దాల్చినచెక్క వంటి అనేక ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఆహారంలో ఈ  పదార్దాలను చేర్చి ఒక సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం మరియు సరైన స్థాయిలో  శారీరక శ్రమ చేయడం ద్వారా కావలసిన బరువు తగ్గుదల లక్ష్యాలను సాధించవచ్చు.

(మరింత చదవండి: బరువు తగ్గుదల కోసం ఆహార విధాన పట్టిక)

కొన్ని రకాల టీలలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి విస్తారమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ టీలను క్రమంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఫ్రీ రాడికల్స్ వలన కలిగే ఆక్సీకరణ నష్టం తగ్గుతుంది. వైట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ మరియు ఊలాంగ్ టీ అనే నాలుగు రకాల టీలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

వైట్ టీ లేత టీ ఆకుల నుండి తాజా తయారు చేస్తారు, ఊలాంగ్ మరియు బ్లాక్ టీ కోసం తేయాకులను కొద్దిగా ప్రాసెస్ చేసి ఎండా  మరియు వేడికి గురిచేస్తారు. గ్రీన్ టీలో ప్రో-ఆక్సిడెంట్లు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి మరియు అవి ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా రక్షిత పాత్ర కలిగి ఉంటాయి.

గ్రీన్ టీ తయారు చేయడానికి, కేటకిన్స్ (catechins) యొక్క ఆక్సీకరణ జరగడానికి ముందుగానే ఆకులను వడిగా ఉడకబెట్టట్టాలి లేదా వేడి చెయ్యాలి (గ్రీన్ టీ ఆకులను ఎక్కువగా సమయం బాగా మరిగిన నీటిలో వేడి చేయకూడదు) . వేడి నీటిలో 1 టీస్పూన్ టీ ఆకులను వేసి రెండు నుంచి మూడు నిముషాలు ఉంచి తరువాత దానిని  వడపోసి త్రాగవచ్చు.

యాంటీఆక్సిడెంట్లకు పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అధిక మొత్తంలో లేదా కృత్రిమ సప్లీమెంట్ల ద్వారా తీసుకున్నప్పుడు అవి చాలా హానికరమవుతాయి. ఏదైనా ఆహారంలో మార్పులు లేదా ఏవైనా సప్లిమెంట్లను జోడించే ముందు ఎల్లపుడు వైద్యుడిని సంప్రదించమని సిఫార్సు చేయబడుతుంది.

తీసుకున్న యాంటీఆక్సిడెంట్ల రకాన్ని బట్టి దుష్ప్రభావాలు కూడా భిన్నంగా ఉంటాయి. కింది దుష్ప్రభావాలు ఏవైనా కలిగితే వెంటనే వైద్యుడిని సంప్రదించమని సూచించబడుతుంది:


Medicines / Products that contain Antioxidants

వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Antioxidants
  2. Ralph M Trüeb. Oxidative Stress in Ageing of Hair. Int J Trichology. 2009 Jan-Jun; 1(1): 6–14. PMID: 20805969
  3. V. Lobo, A. Patil, A. Phatak, N. Chandra. Free radicals, antioxidants and functional foods: Impact on human health. Pharmacogn Rev. 2010 Jul-Dec; 4(8): 118–126. PMID: 22228951
  4. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Antioxidants
  5. Masaki H. Role of antioxidants in the skin: anti-aging effects.. J Dermatol Sci. 2010 May;58(2):85-90. PMID: 20399614
  6. Ruta Ganceviciene et al. Skin anti-aging strategies. Dermatoendocrinol. 2012 Jul 1; 4(3): 308–319. PMID: 23467476
  7. Silke K. Schagen, Vasiliki A. Zampeli, Evgenia Makrantonaki, Christos C. Zouboulis. Discovering the link between nutrition and skin aging. Dermatoendocrinol. 2012 Jul 1; 4(3): 298–307. PMID: 23467449
  8. Ralph M Trüeb. Pharmacologic interventions in aging hair. Clin Interv Aging. 2006 Jun; 1(2): 121–129. PMID: 18044109
  9. Fernández E, Martínez-Teipel B, Armengol R, Barba C, Coderch L. Efficacy of antioxidants in human hair. J Photochem Photobiol B. 2012 Dec 5;117:146-56. PMID: 23123594
  10. BE Prie et al. Oxidative stress in androgenetic alopecia. J Med Life. 2016 Jan-Mar; 9(1): 79–83. PMID: 27974920
  11. American Optometric Association, St. Louis. [Internet] Antioxidants & Age-Related Eye Disease
  12. Christen WG Jr. Antioxidants and eye disease. Am J Med. 1994 Sep 26;97(3A):14S-17S; discussion 22S-28S. PMID: 8085581
  13. Fernando Gómez-Pinilla. Brain foods: the effects of nutrients on brain function. Nat Rev Neurosci. 2008 Jul; 9(7): 568–578. PMID: 18568016
  14. Jane A. Leopold. Antioxidants and Coronary Artery Disease: From Pathophysiology to Preventive Therapy. Coron Artery Dis. 2015 Mar; 26(2): 176–183. PMID: 25369999
  15. Am Fam Physician. 1999 Sep 1;60(3):895-902. Antioxidant Vitamins and the Prevention of Coronary Heart Disease. American Academy of Family Physicians. [Internet]
  16. Simone Reuter, Subash C. Gupta, Madan M. Chaturvedi, Bharat B. Aggarwal. Oxidative stress, inflammation, and cancer: How are they linked? Free Radic Biol Med. 2010 Dec 1; 49(11): 1603–1616. PMID: 20840865
  17. Terry D. Oberley. Oxidative Damage and Cancer. Am J Pathol. 2002 Feb; 160(2): 403–408. PMID: 11839558
  18. Patterson RE, White E, Kristal AR, Neuhouser ML, Potter JD. Vitamin supplements and cancer risk: the epidemiologic evidence. Cancer Causes Control. 1997 Sep;8(5):786-802. PMID: 9328202
  19. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Antioxidants and Cancer Prevention
  20. Abdali D, Samson SE, Grover AK. How effective are antioxidant supplements in obesity and diabetes? Med Princ Pract. 2015;24(3):201-15. PMID: 25791371
  21. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Tea leaves and health
  22. SARAH C. FORESTER, JOSHUA D. LAMBERT. Antioxidant effects of green tea. Mol Nutr Food Res. 2011 Jun; 55(6): 844–854. PMID: 21538850
Read on app