కలబంద గురించిన విషయాల్ని ప్రపంచానికంతా చాటిచెప్పింది ఋగ్వేదమేనని మీకిప్పటికే తెలిసి ఉండచ్చు. “అలోవెరా” గా పిలువబడే కలబంద గొప్ప ఔషధగుణాలు గల్గిన మొక్క లేక మూలిక. దీన్నే “మంచి కలబంద”గా కూడా వ్యవహరిస్తారు.
ప్రపంచంలోని ప్రతి ఇంటా కనిపించే ఈ కలబంద మొక్క అంతటి ప్రసిద్ధిని పొందడానికి ఇదో గొప్ప ఆహారపదార్థం కావడమే కారణం. అనేకమందికి సౌందర్య రహస్యంగా ఉపయోగపడుతున్న "మిస్టరీ ప్లాంట్" లేక “అద్భుత మొక్క” కలబంద. వాస్తవానికి, ఇది భారతదేశంలో “ఘ్రిత్కుమారి” అని కూడా ప్రసిద్ది చెందింది. ఆయుర్వేద పరిశోధకుల ప్రకారం, సంస్కృతంలో దీనిని "కుమారి" అని పిలుస్తారు, ఎందుకంటే స్త్రీలకు ఇది వారి ఋతుచక్ర క్రమబద్దీకరణకు మరియు దోషరహిత చర్మం పొందడానికి ఎంతో ఉపకరిస్తుంది గనుక. మీరు గమనించే ఉంటారు కలబంద ఆకులు ఎప్పుడూ తాజాగానేగోచరిస్తుంది. అందుకే దోషరహితమైన చర్మానికిదో కానుక అని ఆయుర్వేద పరిశోధకులంటారు. అది ఆయుర్వేదం కావచ్చు లేదా మరేదైనా పాశ్చాత్య వైద్యపధ్ధతి అయినా కావచ్చు, ఆయా సంప్రదాయిక ఔషధ-వైద్య పద్ధతుల్లో కలబందకు విశిష్ఠ స్థానం ఉంది.
రసం, కండపుష్టి దండిగా కల్గిన మొక్క కలబంద. చాలా దళసరిగా, గుజ్జును కల్గి ఉండే తన ఆకులను మరియు కాండాన్ని కలబంద నీటిని నిల్వ చేసుకునేటందుకు ఉపయోగిస్తుంది. కలబంద ఒక ఆసక్తికరమైన మొక్క. లేతగా రసపుష్టిని (టెండర్, జ్యుసి) కల్గి ఉంటుందిది. ఆయుర్వేదంలో, ముఖ్యముగా పేగులు మరియు కాలేయ ఆరోగ్యానికి సంబంధించి, కలబంద యొక్క ప్రయోజనకర ప్రభావాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ప్రముఖ ప్రకృతి శాస్త్రవేత్త మరియు రచయిత “ప్లిని ది ఎల్డర్” ప్రకారం, కలబందను కుష్టు వ్యాధికి వ్రణాలచికిత్సలో ఉపయోగించవచ్చు అని చెప్పాడు. కలబంద మూలిక కేవలం భారత ఉపఖండంలో మాత్రమే గాక పురాతన ఈజిప్టు దేశ పత్రాల్లో కూడా ప్రస్తావన ఉందని పరిశోధకులు కనుగొన్నారు. అంటే కలబందకు అంతటి ప్రజాదరణ ప్రపంచమంతటా ఉందన్నమాట. వాస్తవానికి, ఈజిప్టు దేశవాసులు కలబందను "అమరత్వం యొక్క మొక్క" అని పిలిచేవారు. ప్రసిద్ధ ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన సౌందర్య పాలనలో కలబండను ఉపయోగించినట్లు నమ్ముతారు!
మీకు తెలుసా?
కలబంద యొక్క ప్రఖ్యాత నామమైన “అలోవెరా” అరబిక్ శబ్దం, “అల్లొహ్” నుండి వచ్చింది. అల్లొహ్ అంటే “మెరిసే చేదు పదార్ధం” అని అర్థం. “వెరా” అనేది లాటిన్ పదం. “వెరా” కు అర్థం ‘నిజం’ అని.
కలబంద గురించిన కొన్ని వాస్తవాలు:
- వృక్తశాస్త్రం (బొటానికల్) పేరు: అలోయి బార్బడెన్సిస్ మిల్లర్
- కుటుంబం: అస్సోడొలాసియే (లిలియాసియా)
- సాధారణ పేరు: అలో వేరా, బర్న్ ప్లాంట్, ఘీ కుమారి, కుమారి.
- సంస్కృతనామం: ఘ్రిత్కుమారి
- ఉపయోగించే భాగాలు: ఆకులు
- కలబంద యొక్క స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక పంపిణీ: కలబంద (అలో వెరా) ఆఫ్రికాకు చెందినది. కానీ కాలక్రమంలో కలబంద తన స్థానిక భూభాగాన్నొదిలి మధ్య తూర్పు దేశాలు, భారతదేశంతో పాటు ప్రపంచంలోని అత్యంత పొడివాతావరణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. భారతదేశంలో ఇది రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర మరియు గుజరాత్లలో విరివిగా కనబడుతుంది.
- శక్తిశాస్త్రము: శీతలీకరణం (చల్లబరిచే స్వభావం)