విటమిన్ బి3 లోపం అంటే ఏమిటి?
విటమిన్ బి3, సాధారణంగా నియాసిన్ అని పిలువబడుతుంది, బి- కాంప్లెక్స్ విటమిన్లలో ఇది ఒకటి. ఇది నీటిలో కరిగే (water-soluble) విటమిన్, అంటే ఇది శరీరంలో నిల్వ చేయబడదు/ఉండదు అందువలన దీనిని రోజూ ఆహారం ద్వారా తీసుకోవడం అవసరం. మానవ శరీరం విటమిన్ బి3ను ఉత్పత్తి చేయని కారణంగా, దీనిని బాహ్య/బయటి వనరుల నుండి తీసుకోవాలి, అనగా ఆహారం లేదా సప్లిమెంట్ల నుండి. ఇది కణాల జీవక్రియ (cell metabolism)కు అవసరం అయ్యే ముఖ్యమైన ఎంజైమ్ల సంశ్లేషణ (synthesis) కు బాధ్యత వహించే ఒక ముఖ్యమైన విటమిన్. చర్మం, జీర్ణ మరియు మానసిక ఆరోగ్యానికి విటమిన్ బి3 చాలా అవసరం.
దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- తేలికపాటి విటమిన్ బి3 లోపం తేలికపాటి లక్షణాలను కలిగిస్తుంది, ఉదా. అజీర్ణం, వాంతులు, నిరాశ మరియు అలసట వంటివి.
- తీవ్రమైన లోపం మానవులలో పెల్లాగ్రా అని పిలువబడే ఒక వ్యాధిగా సూచించబడుతుంది, ఇది 3 డి లను (3 D’s), అంటే.
- డెర్మటైటిస్ (చర్మవాపు): చర్మ దురద మరియు వాపు. ఇది సూర్యరశ్మి మరియు డిఎన్ఏ (DNA) నష్టం వలన ఏర్పడుతుంది.
- డిమెంషియా (చిత్తవైకల్యం): అభిజ్ఞా (మేధాశక్తి) మరియు వ్యక్తిత్వ మార్పులు.
- డైయేరియా (అతిసారం): తీవ్రమైన విరేచనాలు అనేక సార్లు సంభవిస్తాయి
- కొన్ని అధ్యయనాల ప్రకారం, విటమిన్ బి3 లోపం క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
విటమిన్ బి3 ఉండే ఆహారాలు తక్కువగా తీసుకోవడం వల్ల అది నియాసిన్ లోపానికి దారితీస్తుంది. ఐరన్, విటమిన్ బి2 మరియు బి6 లోపం కూడా నయాసిన్ లోపానికి దారి తీస్తుంది. దీర్ఘకాల మద్యపానం అనేది కూడా పెల్లాగ్రాకు ప్రధాన కారణం. నియాసిన్ లోపం కారణంగా, శరీరం ట్రిప్టోఫాన్ (tryptophan) అని పిలువబడే అమైనో యాసిడ్ ను సంశ్లేషణ (synthesis) చేయలేదు మరియు అది దాని సంబంధిత లక్షణాలకు దారితీస్తుంది.
దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?
విటమిన్ బి3 లోపం యొక్క నిర్ధారణ సూటిగా ఉంటుంది మరియు చర్మ మరియు నోటి గాయాలు/పుండ్లు, అలాగే డయేరియా మరియు చిత్తవైకల్యం వంటి సంకేతాలు మరియు లక్షణాల యొక్క సంగ్రహమైన ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం అవసరం. దీర్ఘకాలిక మద్యపానం వంటి అలవాట్లు యొక్క చరిత్రను తెలుకోవడం అనేది సరైన శోషణ లేకపోవడం (malabsorption) వల్ల విటమిన్ బి3 లోపం కలుగడాన్ని గుర్తించటానికి దోహదపడుతుంది. N- మిథైల్ నికోటినమైడ్ (N-methylnicotinamide) స్థాయిలలో తగ్గుదలను అంచనా వేయడానికి మూత్ర పరీక్ష వంటి ప్రయోగశాల ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు.
చికిత్సలో విటమిన్ బి3 ఉండే ఆహారాలు ఇవ్వడం జరుగుతుంది, దీనితో పాటు ఇతర విటమిన్ లోపాలు ఏర్పడడం కూడా సాధారణం కాబట్టి ఇతర బి-కాంప్లెక్స్ విటమిన్ సప్లీమెంట్లు సూచిస్తారు. సాధారణంగా విటమిన్ బి3 లోపం యొక్క చికిత్సతో పాటు విటమిన్ బి2 మరియు బి6 స్ప్లీమెంట్లు కూడా అందించబడతాయి.ఒక రోజుకు సిఫార్సు చేయబడిన విటమిన్ బి3 పురుషులకు 16 mg / రోజుకి మరియు మహిళలకు 14 mg /రోజుకి గా ఉంటుంది. చేపలు, మాంసం, గింజలు (మొక్కజొన్నే కాకుండా వేరేవి), కాయలు మరియు చిక్కుళ్ళు విటమిన్ బి3 యొక్క మంచి వనరులు.