ఎండు ద్రాక్షలు (కిస్మిస్) భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ సంప్రదాయమైన ఎండిన పండ్లలో (dry fruits) ఒకటి. ప్రకృతిసిద్ధంగా సూర్యరశ్మిలో ఎండబెట్టిన ద్రాక్షపండ్లే “ఎండు ద్రాక్షలు.” ఎండు ద్రాక్షల్లో రెండు ప్రధాన రకాలున్నాయి, అవే గింజలున్న ఎండుద్రాక్షలు మరియు గింజల్లేని ఎండు ద్రాక్షలు. ఉపయోగించే రకాన్ని బట్టి, ద్రాక్ష పండ్లు ఆకుపచ్చ, ఊదా (పర్పుల్), నలుపు రంగుల్లో ఉంటాయి. .
ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఎండు ద్రాక్షలు ఉత్పత్తి చేయబడుతున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఎండుద్రాక్షల్ని ఉత్పత్తి చేసే అతిపెద్ద ఉత్పత్తిదారు, తర్వాతి పెద్ద ఉత్పత్తిదారుల్లో టర్కీ మరియు దక్షిణ ఆఫ్రికా ఉన్నాయి.
ఎండు ద్రాక్షల్ని అట్లాగే ముడిగా తింటారు లేదా ఇతర ఆహార పదార్ధాలకు మరియు డెజర్ట్లకూ చేర్చవచ్చు. భారతదేశంలో పుడ్డింగ్లు, డిజర్ట్లు మరియు కొన్ని రకాల బియ్యం వంటకాల్లో ఎండు ద్రాక్షలు వాడతారు. ఒక 1/4 కప్ ద్రాక్షపండ్లలో లేదా 60-70 ఎండు ద్రాక్షల్లో అధిక పీచు (ఫైబర్) పదార్థాలు మరియు పొటాషియం ఉంటాయి. వీటిలో ఎలాంటి కొవ్వు ఉండదు. ఎండుద్రాక్షలు శరీరం యొక్క ఆరోగ్యకరమైన పనితీరు కోసం అవసరమైన అనేక ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇవి ప్రతిక్షకారిని (antioxidant) మరియు తక్కువ సోడియం పదార్థాలుండేవిగా ప్రసిద్ధి చెందాయి. ఈ అన్నిగుణాలు కలిసి ఎండు ద్రాక్షని ఒక “సంపూర్ణమైన చిరుతిండి” గా తయారు చేశాయి.
ఎండు ద్రాక్షల (ఎండు ద్రాక్ష ల) గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: విటిస్ విన్ఫెరా (Vitis Vinifera)
- కుటుంబం: గ్రేప్ వైన్ కుటుంబం (విటేసియే)
- సాధారణ పేరు: కిష్మిష్ , సుల్తానాస్, మరియు ఎండు ద్రాక్ష
- సంస్కృత పేరు: ద్రాక్ష
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్టీర్ణం: ద్రాక్షను ఇటలీ, టర్కీ, స్పెయిన్, చైనా, ఫ్రాన్స్, అర్జెంటీనా మరియు USA లో సాగు చేస్తారు. ప్రపంచంలోని మొత్తం ఎండుద్రాక్ష ఉత్పత్తిలో దాదాపు 80% USA మరియు టర్కీల్లోనే ఉత్పత్తి అవుతున్నట్లు లెక్క తేలుతోంది. భారతదేశంలో, 10,00,000 టన్నుల వార్షిక ఉత్పత్తితో 34,000 హెక్టార్ల భూమిలో ద్రాక్ష సాగు చేయబడుతోంది. మహారాష్ట్ర భారతదేశంలో అతిపెద్ద ద్రాక్ష ఉత్పత్తిదారు రాష్ట్రం, ఆ తర్వాత కర్నాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ లు కూడా ద్రాక్ష పండిస్తున్న రాష్ట్రాలుగా గణతికెక్కాయి.