మాంసకృత్తులు (ప్రోటీన్లు) అనేవి మానవ శరీరం యొక్క సరైన కార్యాచరణకు కావలసిన పోషకాలు. మాంసకృత్తులు శక్తి యొక్క ప్రధాన వనరుగా పనిచేస్తాయి మరియు జీవన నిర్మాణానికి సోపానాల్ని (building blocks) ఏర్పరుస్తాయి. నిర్మాణాత్మకంగా, ప్రోటీన్లు అనేవి పెద్దవైన మరియు సంక్లిష్టమైన సేంద్రీయ అణువులు. కణజాలం పెరుగుదల మరియు మరమ్మతు కోసం ఈ అణువులు శరీరానికి అవసరం.
మాంసం, కోడి మాంసం, గుడ్లు, సముద్రాహారం (సీఫుడ్), కాయ గింజలు, ఎండు గింజలు, సోయా ఉత్పత్తులు, పాలు మరియు పాల ఉత్పత్తులు, బీన్స్ మరియు బఠాణీలు మాంసకృత్తులకు అత్యంత శ్రీమంత వనరులు, ఇవన్నీ సహజంగా తినడానికి లభిస్తాయి.
మరోవైపు ప్రోటీన్ పొడులు శరీరం యొక్క ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి మనం తీసుకోగల ఒక అనుబంధకాహారం. ఇవి ప్రధానంగా సోయా, బఠానీలు మరియు పాలవిరుగుడు (మజ్జిగ విరిగిన నీళ్ళు) వంటి అధిక ప్రోటీన్ మూలాల నుండి తయారు చేయబడతాయి. ఆహారపు అలవాట్లను బట్టి, ప్రోటీన్ యొక్క అత్యంత విస్తారమైన వనరులైన మాంసం లేదా సముద్రంలో లభించే చేపలు తదితర సముద్రాహారాల్ని (సీఫుడ్లను) మనుషుల్లో అందరూ తినరు. ఇటువంటి సందర్భాల్లో, ప్రోటీన్లను సరైన మొత్తాల్లో తీసుకోవడం ఒకింత సవాలే అవుతుంది, అలా మాంసాహారాన్ని తిననివారికి ప్రోటీన్ పౌడర్ ఒక వరం అనే నిరూపించవచ్చు.
వీటి ప్రయోజనాల గురించి మరియు ప్రోటీన్ పౌడర్ సేవనం యొక్క అనేక ఇతర ప్రయోజనాలు గురించి తెలుసుకోవడానికి, మరియు మీరు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
(మరింత చదువు: ప్రోటీన్ ప్రయోజనాలు)