నోరు ఎండిపోవడం - Dry Mouth in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

November 30, 2018

October 29, 2020

నోరు ఎండిపోవడం
నోరు ఎండిపోవడం

నోరు ఎండిపోవడం అంటే ఏమిటి?

నోరు ఎండిపోవడాన్ని  జిరోస్టోమియా అని కూడా పిలుస్తారు, అది లాలాజల స్రావం తగ్గిపోవడంతో ముడిపడి ఉంటుంది. ఇది చాలా సాధారణ పరిస్థితి మరియు అది వివిధ మందుల యొక్క దుష్ప్రభావాల కారణంగా ఏర్పడవచ్చు.

వ్యక్తి భయానికి లేదా ఒత్తిడికి గురైనప్పుడు కూడా నోరు ఎండిపోవడాన్ని గమనించవచ్చు. ఇది వృద్ధాప్యంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. తీవ్రంగా నోరు ఎండిపోవడం జరిగితే అది మాట్లాడడం, నమలడం, మరియు మ్రింగుటలో ఇబ్బందికి దారితీస్తుంది. నోటి త్య్రాష్ (నోటిలో ఈస్ట్ పెరుగుదల) వంటి దంత అంటురోగాలకి  మరియు దంత క్షయాల వంటి ఇతర సమస్యలకి కూడా నోరు ఎండిపోవడం అనేది దారితీస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నోరు ఎండిపోవడం యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఈ విధంగా ఉంటాయి:

  • మాట్లాడటం, నమలడం, మరియు మ్రింగడంలో ఇబ్బందులు
  • తరచు దాహంగా అనిపించడం
  • పెదవులు పగిలిపోవడం
  • రుచి అనుభూతి  తగ్గిపోవడం
  • గొంతు నొప్పి
  • హాలిటోసిస్ (చెడు శ్వాస)
  • నోటి చివర్లలో ఎండిపోవడం
  • నోటిలో తరచుగా పుండ్లు ఏర్పడడం  
  • కృత్రిమ దంతాలు ధరించడంలో కఠినత
  • పంటి చిగుళ్ల సంక్రమణలు (ఇన్ఫెక్షన్) పెరిగిపోవడం

దాని ప్రధాన కారణాలు ఏమిటి?

అనేక కారణాల వల్ల నోరు ఎండిపోవడం జరుగుతుంది:

  • నీటిని సరిగ్గా తీసుకోకపోవడం లేదా మూత్రపిండాల వ్యాధులు మరియు మధుమేహం వంటి ఆరోగ్య సమస్యల కారణంగా  ద్రవ పదార్దాలను సరిగ్గా తీసుకోకపోవడం వలన సంభవించిన డిహైడ్రాషన్ .
  • నోరు ద్వారా శ్వాస తీసుకోవడం (రాత్రి సమయంలో) కూడా నోరు ఎండిపోవడానికి బాధ్యత వహిస్తుంది. నాసల్ పాలిప్స్, పెరిగిన టాన్సిల్స్, మరియు అలెర్జీ రినైటిస్ అనేవి కూడా నోటి ద్వారా శ్వాసను తీసుకునే పరిస్థితులను బలపరుస్తాయి, ఇవి నోరు ఎండిపోవడానికి దారితీస్తాయి.
  • మధుమేహం కూడా లాలాజల స్రావాన్ని తగ్గిస్తుంది
  • క్యాన్సర్ చికిత్స కోసం రేడియేషన్ థెరపీ ఉపయోగించినప్పుడు
  • ధూమపానం
  • నోరు ఎండిపోవడం స్వయం ప్రతిరక్షక వ్యాధుల (autoimmune disease) యొక్క ఫలితంగా కూడా కలుగవచ్చు (సోగ్రెన్స్ సిండ్రోమ్)
  • మందుల ప్రేరేపించిన పరిస్థితులు

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఇది క్రింది పద్ధతుల ద్వారా అది నిర్ధారించబడుతుంది:

  • సియాలోమెట్రీ (Sialometry) - లాలాజల స్రావాన్ని కొలుస్తుంది  
  • సియాలోగ్రఫీ - లాలాజల వాహిక (salivary duct) లో రేడియోపాక్ డై ను ఉపయోగించడం
  • ఇతర పరీక్షలు- అల్ట్రాసౌండ్ (ultrasound), మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (magnetic resonance imaging), లాలాజల గ్రంధి యొక్క బయాప్సీ, మొదలైనవి.

నోరు ఎండిపోవడంనే సమస్యకు ఒక ప్రామాణిక చికిత్సా విధానం లేదు. అయితే, ఈ క్రింది మార్గాల ద్వారా అసౌకర్యాన్ని తగ్గించవచ్చు:

  • ఉపశమనం కోసం లాలాజలపు మాత్రలు మరియు లాలాజల స్ప్రేలు
  • చూయింగ్ గమ్ములు మరియు ఆర్గానిక్ ఆమ్లాలు వంటి లాలాజల గ్రంధి ఉత్ప్రేరకాలు
  • నోరు పొడిదనాన్ని తగ్గించడానికి ద్రవ పదార్దాలు ఎక్కువగా తీసుకోవడం
  • సిస్టమిక్ మందులు

బేధాదాత్మక నిర్దారణ (Differential diagnosis)

  • సోగ్రెన్స్ సిండ్రోమ్  అనేది నోరు మరియు కళ్లు  పొడిబారేలా చేసే ఒక సమస్య
  • రేడియేషన్ థెరపీ నోరు ఎండిపోయేలా  చేస్తుంది
  • నిద్ర లేమి, ఆందోళన, మరియు భయము వంటి శారీరక సమస్యలు, నోటిని  ఎండిపోయేలా చేస్తాయి
  • హార్మోన్ల రుగ్మతలు



వనరులు

  1. Mohammed Alsakran Altamimi. Update knowledge of dry mouth- A guideline for dentists. Afr Health Sci. 2014 Sep; 14(3): 736–742. PMID: 25352896
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Dry Mouth
  3. National Health Service [Internet]. UK; Dry mouth
  4. National institute of dental and craniofacial research. Dry Mouth. National institute of health. [internet].
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Dry mouth syndrome

నోరు ఎండిపోవడం కొరకు మందులు

Medicines listed below are available for నోరు ఎండిపోవడం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.