సారాంశం
రొమ్ము చర్మంపై చికాకు కలగడాన్ని రొమ్ము దురద అని పిలుస్తారు. చర్మం పై ధూళి/దుమ్ము ఉండటం దురదకు కారణం కావచ్చు మరియు చర్మాన్ని పూర్తిగా శుభ్రపరచడం వలన అది దురద నుండి బయటపడడంలో సహాయపడుతుంది. అయినప్పటికీ, రొమ్ము దురదకు ఇతర కారణాలు కూడా ఉండవచ్చు, వాటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, దుస్తుల రాపిడి, హార్మోన్ల మార్పులు మరియు అరుదైన సందర్భాల్లో క్యాన్సర్ వంటివి ఉంటాయి. దురదతో పాటు వాపు మరియు చర్మం ఎర్రగా మారడం వంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. క్లినికల్ పరీక్ష ద్వారా తగిన నిర్ధారణ జరిగిన తరువాత, క్రీములు, జెల్ మరియు యాంటిహిస్టామైన్లు వంటి మందులను దురద చికిత్సకు ఉపయోగిస్తారు. అదనంగా, గృహ నివారణ చిట్కాలు దురదను వదిలించుకోవడంలో ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేయబడింది. వీటి ఫలితాలు సాధారణంగా సానుకూలంగా ఉంటాయి మరియు సమస్యలు కలుగడడం చాలా అరుదు. సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం, చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మరియు బాగా హైడ్రేటెడ్ గా ఉండడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా చెమట మరియు ఇన్ఫెక్షన్లను నియంత్రించడం వంటి నివారణ చర్యలు పాటించవచ్చు.