కమలాపండు అనేది తక్కువ కేలరీలు ఉండే ఒక సిట్రస్ పండు, ఇది నిమ్మకాయ మరియు నారింజలతో పాటుగా రూటేసియే కుటుంబానికి చెందుతుంది. నిమ్మకాయలు మరియు నారింజల కాకుండా, కమలాపండు సహజంగానే తీయ్యగా ఉంటుంది, కాబట్టి దీనిని నేరుగా సులభంగా తినవచ్చు. దీనికి మంచి ఇంపైనటువంటి రిఫ్రెషింగ్ సిట్రస్ సువాసన ఉంటుంది. కమలాపండు రంగు కూడా చాలా ప్రకాశవంతముగా మరియు ఆహ్లదకరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉదయంవేళా అల్పాహారంలో కమలాపళ్ళు ఒక ప్రత్యేకమైన మరియు ముఖ్యమైన స్థలమును తీసుకున్నాయి. కమలాపళ్ళు చాలా ప్రాచుర్యం పొందిన పళ్ళు, మరియు ఇవి వివిధ రకాలుగా అందుబాటులో ఉంటాయి మరియు ఆ రకాలు కొద్దిగా భిన్నమైన రుచితో ఉంటాయి. మన రోజువారీ జీవిత కార్యకలాపాల్లో కమలపళ్లతో అనేక ఉపయోగాలు ఉన్నాయి, కానీ దానిలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది కమలా రసం (ఆరంజ్ జ్యూస్). వాటి యొక్క అల్పాహార మరియు రసం ప్రయోజనాలు మాత్రమే కాకుండా, కమలాలకు చాలా ఇతర ఉపయోగాలు కూడా ఉన్నాయి.
10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే చెట్టు మీద కమలాపళ్ళు నారింజ రంగులో కాయవు. పచ్చి కమలాపళ్ళు ఆకుపచ్చ రంగులో ఉంటాయి అయితే, ముగ్గిన లేదా పండిన కమలాపళ్ళు నారింజ నుండి ఎరుపు-నారింజ ఉంటాయి. కమలాపళ్ళు ఉష్ణమండల వాతావరణంలో బాగా పెరుగుతాయి మరియు మొట్టమొదటిగా అవి దక్షిణ మరియు తూర్పు ఆసియా ప్రాంతాల్లో పెరిగాయి. కానీ ఇప్పుడు అవి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. సరైన పెరుగుదల కొరకు, వాటికీ పుష్కలమైన నీరు మరియు సూర్యరశ్మి అవసరమవుతుంది. నారింజ యొక్క రుచి దాని రకాన్ని బట్టి ఉంటుంది. కొన్ని రకాలైన నారింజలు పుల్లని రుచిని కలిగి ఉంటాయి కానీ చాలా రకాలు తీపి రుచిని కలిగి ఉంటాయి. నాగపూర్ కమలా, ఎరుపు కమలా, టెంజెరీన్, క్లెమెంటైన్ మరియు మాండరిన్ ఆరెంజ్ వంటివి కొన్ని కమలా పళ్ళ రకాలు. కమలా పండు యొక్క తోలు మందముగా మరియు మెరుస్తూ ఉంటుంది. సాధారణంగా, ఒక కమలా పండులో పది తొనలు ఉంటాయి, కానీ సంఖ్య మారవచ్చు. ప్రతీ తొనలో అనేక గింజలు ఉంటాయి, వీటిని "పిప్స్" అని అంటారు.
ఆహారంలో చేర్చవలసిన ఆరోగ్యవంతమైన పండ్లలో కమలా ఒకటి. ఇవి విటమిన్లు, ముఖ్యంగా ఆస్కార్బిక్ ఆసిడ్ లేదా విటమిన్ సి కు చాలా మంచి మూలకాలు. విటమిన్ సి చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను నిరోధిస్తుంది మరియు అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. కమలాలలో ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. ఈ విధంగా " ప్రతిరోజూ ఒక నారింజ శరీరాన్ని ఆరోగ్యకరముగా ఉంచుతుంది" అనేది సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు.
కమలాలను సాధారణంగా ఒలిచి తాజాగా తినవచ్చు లేదా వాటిని పిండి రసం చేసుకుని కూడా తాగవచ్చు. కమలా పండు యొక్క వాసనను పరిమళ ద్రవాలు (సెంట్లు) లేదా ఆరంజ్ ఎస్సెన్స్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు, దీనిని కేకులు మరియు ఇతర బేక్డ్ (baked) పదార్ధాలలో ఫ్లేవర్ కోసం ఉపయోగించవచ్చు.
నారింజ గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: సిట్రస్ ఎక్స్ సినెన్సిస్ (Citrus X sinensis)
- కుటుంబం: రూటేసియే
- సాధారణ నామం: హిందీలో సాంత్ర, ఆరెంజ్,
- సంస్కృత నామం: నారంగ (नारङ्ग)
- ఉపయోగించే భాగాలు: ఆకులు, తోలు, పండు మరియు బెరడు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: కమలా పళ్ళు దక్షిణ మరియు తూర్పు ఆసియాలో మొట్టమొదటిసారిగా పెరిగాయి. అవి మొదటగా దక్షిణ చైనాలో మరియు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పట్టాయని భావిస్తారు. వీటిని ప్రధానంగా దక్షిణ యునైటెడ్ స్టేట్స్, మధ్యధరా ప్రాంతాలు మరియు సౌత్ ఈస్ట్ ఆసియాలలో పెంచుతారు.
- ఆసక్తికరమైన వాస్తవం: కొన్ని కమలాలకు కింద భాగం నాభి ఆకారం మాదిరి ఉన్నందున వాటిని నావెల్ ఆరంజ్స్ అని పిలుస్తారు.ఇంగ్లండ్లో, క్వీన్ విక్టోరియా రోజున క్రిస్మస్ రోజు బహుమతులుగా కమలాలు ఇవ్వబడతాయి.