ప్రసవం తర్వాత తల్లులు త్వరగా తమ మునుపటి శరీర ఆకృతికి చేరుకోవానుకుంటారు. వారికి పోట్ట చుట్టూ ఏర్పడిన కొవ్వు ఒక ప్రధాన ఆందోళనగా ఉంటుంది.
గర్భధారణలో బరువు పెరగడానికి దారితీసే అనేక శారీరక మరియు హార్మోన్ల మార్పులు ఏర్పడతాయి. పెరుగుతున్న గర్భాశయం కూడా బరువు పెరగడానికి మరొక కారణం. గర్భధారణ సమయంలో పెరుగుతున్న పిండానికి ఆదరువు ఇవ్వడానికి ఇది చాలా అవసరం. కానీ, ప్రసవం తరువాత, ఈ బరువు అవాంఛనీయమైనది.
గర్భధారణ తర్వాత అదనపు పౌండ్లను తొలగించడానికి మరియు పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడానికి ఏమి చేయవచ్చు?
పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడానికి చేయగలిగిన అనేక మార్గాలు ఉన్నాయి; ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. లక్ష్య ఆధారిత (Targeted) వ్యాయామాలు, ఒత్తిడిని తగ్గించడం మరియు ఇంటి చిట్కాలు పాటించడం వంటివి ఇతర మార్గాలు.
కాబట్టి, ఈ ప్రశ్నకు ఉత్తమ సమాధానం తెలుసుకోవడానికి ఈ వ్యాసాన్ని చదవండి.