పుట్టగొడుగు అనేది ఒక రకమైన బూజు (శిలీంధ్రాలు) రకం, ఇది నేలపైన లేదా చెట్ల బెరడుపై పెరుగుతుంది. 3000 కంటే ఎక్కువ రకాల పుట్టగొడుగులన్నాయి, వాటిలో కొన్ని మాత్రమే తినడానికి పనికొస్తాయి. తినదగిన పుట్టగొడుగులు తరచుగా రంగులేనివి లేదా తెలుపు రంగుతో ఉంటాయి. ఇవి గొడుగు ఆకారంలో ఉంటాయి. తరచుగా, పుట్టగొడుగులను ఒక మొక్కగా భావిస్తారు. మొక్కలలో ‘క్లోరోఫిల్’ అనే ఆకుపచ్చ వర్ణద్రవ్యం ఉంటుంది, ఈ వర్ణద్రవ్యం సూర్యరశ్మితో పాటు, కార్బోహైడ్రేట్ల రూపంలో శక్తిని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. మరోవైపు, పుట్టగొడుగులలో క్లోరోఫిల్ ఉండదు, అందువల్ల అవి శక్తిని ఉత్పత్తి చేయలేవు. పుట్టగొడుగులు తమ పోషకాలను పొందడానికి సేంద్రీయ వ్యర్థాల వంటి ఇతర వనరులపై ఆధారపడతాయి.
తినడానికి ఎక్కువగా ఉపయోగించే పుట్టగొడుగుల రకాల్లో ఒకటి ‘అగారికస్ బిస్పోరస్ (Agaricus bisporus)’ లేదా దీన్నే సాధారణ పుట్టగొడుగు అని వ్యవహరిస్తారు. ఇది ఉత్తర అమెరికా మరియు యూరప్ నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ప్రస్తుతం, ఈ రకమైన పుట్టగొడుగులను 70 కి పైగా దేశాలలో సాగు చేస్తున్నారు.
పుట్టగొడుగులను వివిధ రకాల వంటకాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. వీటిని సూప్ మరియు సలాడ్లలో ఉపయోగిస్తారు, గుడ్లు వంటి ఇతర ఆహార పదార్థాలతో, ఆకలిని ప్రేరేపించడానికి, శాండ్‌విచ్‌లలో ఇతర కూరగాయలతో పాటు కలుపుతారు మరియు పిజ్జాల కోసం పాస్తా సాస్ మరియు టాపింగ్స్‌ను తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. పుట్టగొడుగులకు అధిక పోషక విలువలు ఉన్నాయి. ఇవి 92% నీటిని కలిగి ఉంటాయి మరియు పొటాషియం మరియు సోడియం యొక్క మంచి సమతుల్యతను కలిగి ఉంటాయి. పుట్టగొడుగులలో కూడా అనేక విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.
పుట్టగొడుగుల గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- బొటానికల్ పేరు: అగారికస్ బిస్పోరస్ (Agaricus bisporus)
- కుటుంబం: అగారికేసి, రుసులేసి
- సాధారణ పేరు: సాధారణ పుట్టగొడుగు
- సంస్కృత నామం: छत्राकम् (చత్రకం)
- ఉపయోగించే భాగాలు: పుట్టగొడుగు కండ (flesh), కాండం,పై కప్పు
- స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: పుట్టగొడుగులు సాధారణంగా అడవిలో పెరుగుతాయి. కనీసం 60 దేశాలలో ఇరవై రకాల తినదగిన పుట్టగొడుగులను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. చైనా, ఫ్రాన్స్, పోలాండ్, నెదర్లాండ్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రమాణంలో పుట్టగొడుగులను సాగు చేసే దేశాలు.
- ఆసక్తికరమైన విషయాలు: పుట్టగొడుగులు సూర్యరశ్మికి గురైనప్పుడు మనుషుల మాదిరిగానే విటమిన్ డిని ఉత్పత్తి చేస్తాయి. పుట్టగొడుగులను ఎనిమిది గంటలు సూర్యరశ్మికి గురిచేస్తే, దాని విటమిన్ డి కంటెంట్ 4,600 రెట్లు పెరుగుతుంది.