పోషకాలకు నిలయం ముల్లంగి. ముల్లంగికున్న ప్రత్యేక రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ప్రపంచవ్యాప్తంగా దీన్ని తినడానికి వినియోగిస్తారు. క్యాబేజీ, కాలీఫ్లవర్, కాలే (ఆకు క్యాబేజి) మరియు టర్నిప్ (శలజమ అనే దుంపకూర) లతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది ముల్లంగి. ముల్లంగి తినడానికి కరకరలాడుతుంటుంది మరియు రసంతో కూడుకుని ఉంటుంది. సాధారణంగా దీన్ని సలాడ్ లాగా పచ్చిగానే తింటారు, అలాగే వివిధ వంటకాలను వండడానికి కూడా వాడతారు. కొన్ని మధ్య మరియు తూర్పు-పశ్చిమ దేశాలకు చెందిన ప్రజలు ముల్లంగి రసాన్ని తాగి ఆస్వాదిస్తారు. ఈ ప్రాంతానికి చెందినదే ముల్లంగి. ఆసియా యొక్క పలు చల్లని వాతావరణం కల్గిన ప్రాంతాలు, దేశాలు నుండి, వివిధ పురాతన నాగరికతలకు ముల్లంగి విస్తరించింది. వినిగర్ మరియు తేనెతో కలిపి ముల్లంగిని ఈజిప్ట్ దేశస్థులు, రోమన్ దేశస్థులు మరియు గ్రీకులు తినేవారని చారిత్రిక రికార్డుల సాక్ష్యాలు తెలుపుతున్నాయి. భారతదేశంలో, ముల్లంగిని వైవిధ్యమైన వైద్య మరియు పాక ప్రయోజనాల కోసం ఉపయోగీస్తారు. ముల్లంగి యొక్క వైద్యపర లక్షణాలను ఒక చైనీయుల సామెత సంగ్రహంగా చెబుతుంది, ఆ సామెత ఇలా ఉంది "ఘాటైన ముల్లంగిని తిని వేడి వేడి టీ తాగుతూ ఆకలితో ఉన్న ఆ డాక్టర్లు మోకాళ్లపై నిల్చుకుని అడుక్కోనివ్వండి.”
ముల్లంగి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:
- శాస్త్రీయ నామం: రాఫానస్ రఫానిస్త్రుమ్ సబ్స్ప్. శాటివ్స్ (Raphanus raphanistrum subsp . sativus)
- కుటుంబము: బ్రసీకేసియే (Brassicaceae)
- సాధారణ పేరు: ముల్లంగి, మూలీ లేదా మూలా
- సంస్కృత పేరు: నీల్వర్న్
- ముల్లంగిలో ఉపయోగించే భాగాలు: వేరు (రూట్), విత్తనాలు మరియు ఆకులు
- స్వదేశం మరియు భౌగోళిక విస్తీర్ణం: నేడు వివిధ రకాల ముల్లంగిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండించడం మనం చూస్తున్నాం. దీన్ని ఉత్తర అమెరికా, ఉష్ణమండల ఆసియా, మరియు మధ్యధరా సముద్రతీర ప్రాంతాలలో విరివిగా పండించడం జరుగుతోంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పంజాబ్, అస్సాం రాష్ట్రాలు భారతదేశంలో ప్రధానంగా ముల్లంగిని పండిస్తున్నాయి. .
- ఆసక్తికరమైన నిజాలు: ఈజిప్ట్లోని పిరమిడ్ల నిర్మాణ సమయంలో, కార్మికులకు ముల్లంగి గడ్డల్ని దినబత్తెం (రేషన్) రూపంలో .
మెక్సికోలోని ఓక్సాకా అని పిలువబడే ఒక నగరం డిసెంబరు 23వ తేదీ నాడు వార్షికంగా ముల్లంగి ఉత్సవాన్ని “ముల్లంగి వార్షిక రాత్రి”గా జరుపుకుంటుంది, భారీ భారీ ముల్లంగి గడ్డల్ని చెక్కే విన్యాసాలకు ఈ ఉత్సవం అంకితం.
అమెరికన్లకు పరిచయం చేసిన మొట్టమొదటి యూరోపియన్ పంటల్లో ముల్లంగి కూడా ఒకటి.